మెమోరీస్ 7

“వనజ
అగ్రహారం”
అని రాసుంది. “చెప్పలా . . . వాడు దీన్నే పట్టాడని. . . .” అన్నాడు గర్వంగా. రాజు మెచ్చుకోలుగా నవ్వాడు సూరివైపు చూసి. యెంగటమ్మ ఇంట్లో నుంచి బయటికి వస్తొన్న అలికిడి అవ్వగానే ఫోటోలు చాప కింద దాచేశాడు.
పొద్దున్నే నీళ్ల బోరింగు కాడ కాపు కాశారు. వారానికి రెండు రోజులు రామలింగా రెడ్డి ట్రస్ట్ నుండి వూరికి రెండు మంచి నీళ్ల ట్యాంకర్లు వస్తాయి. అప్పుడే సరిపోయినన్ని నీళ్లు పట్టుకుంటారు. మిగిలిన అవసరాలకి బోరింగు నీళ్లే దిక్కు. వనజా, దాని పెద్దక్క బిదులెత్తుకుని నీళ్లకోసమని వచ్చారు.

“చూసినావాన్నా నా లంజకి ఎంత అందమైన కూతురుందో” అన్నాడు మొఖం మీద చిరునవ్వుని వలికిస్తూ అన్నాడు సూరిగాడు. వాడికి ప్రౌడలు నచ్చినంతగా కన్యలు నచ్చరు.రాజు కన్యను తప్ప మరో ఆడదాన్ని మోహించడు.

నడుము వొంపులో బిందె పెట్టుకుని వచ్చింది వనజ. ఆమెను చూడగానే విరిసిన ముద్దబంతి గుర్తుకు వచ్చింది. నలగని పూవు ఆమె. ఆమె నవ్వినప్పుడు పెదాలు విచ్చుకుని గులాభిలా అనిపిస్తుంది. ఆమె దగ్గరకు వెళితే మల్లెల వాసన వచ్చింది. ఆ వాసన దెబ్బకు రాజు శరీరం వశం తప్పింది. ఆమె దగ్గరకు వెళ్లి ఎదో మాట్లాడదామను కునే లోపే బిందె సంకన పెట్టుకుని వెళ్లిపోయింది. ఎంతసేపు ఎదురు చూసినా ఆమె తిరిగి రాలేదు.

ఆమె కోసమని బోరింగు దగ్గర కాపు కాసినప్పుడు రాజుకి శేషుగాడు గుర్తుకు వచ్చాడు. వాడూ అంతే నిహారికి కోసం బోరింగు కాడ కాపుకాసే వాడు. వాణ్ని గురించి తలుచుకోగానే వాన్ని చూడాలనిపించింది. అట్లనే సంద్యతో మట్లాడి ఒక సెల్ ఫోన్ సంపాదించాలని పించింది. ఆ వెంటనే తన దగ్గరున్న పోటోలలో వున్న అమ్మాయిలకి కాపలాగా తన ఫ్రెండ్స్ ని పంపితే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది.

ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ” రేయ్ సూరి వూరికి పోయొద్దామా” అన్నాడు.
“ఎందుకన్నా” అనడిగాడు.
“శేషుగానికి ఎట్లుందో కనుక్కుందామనిపిస్తాంది” అన్నాడు.
“అవును స్వప్నని చూసి చానా రోజులయ్యిందన్నా” అన్నాడు.

అనుకున్న వన్నీ అనుకున్నట్టు జరిగి పోయాయి. శేషుగానికి తోడుగా రమేష్ గాన్నిచ్చి శివుని సముద్రానికి పంపాడు. ఎవరికీ తెలీకుండా మిగతా ఆరు వూర్లలో పూజారి సాయంతో ఆ అమ్మాలకి కాపలాగా కొంతమందిని పెట్టాడు.

ఆ రోజు సాయంకాలం గుడి పక్కనే వున్న ఒక కట్టడం మీదకెక్కి కూర్చున్నాడు. కాసేపటికి పూజారి వచ్చాడు. “స్వామీ. . . మీరు పెట్టిన వాళ్లు ఆడపిల్లలు కదా. వాళ్లకేమ్ ప్రమాదం రాదు కదా” అన్నాడు.
“వాళ్లు శారదాంభ స్వరూపులు నా బిడ్డలు లాంటి వాళ్లు వాళకేమ్ కాదు” అన్నాడాయన.
“నాయనా నోకో విషయం చెబుదామని వచ్చాను”
“చెప్పండి”
“అమావస్య నాడు నువ్వు చూసింది పూజా మందిరం. అగ్రహారం కోనలలో ఇలాంటి మందిరమే ఇంకొకటి వుంది. అది మంత్ర సంబందమైనదని, దానిని మంత్ర శక్తితో చూస్తే కనపడదని, మానవ ప్రయత్నమే దానిని కనిపెట్టడానికి మార్గమని నాకు శిక్షణ ఇచ్చిన గురువు చెప్పే వాడు. దానిని కనిపెట్టడానికి ఎంతో మంది ప్రయత్నంచి విఫలయం అయ్యారు. కానిలో వారిలో ఒకడు తను చూసినంత వరకు ఒక చిత్రపటాన్ని తయారు చేశాడు” అని రాజు చేతిలో ఒక మ్యాపు పెట్టాడు. అది ఎదో చర్మపు తోలు మీద గీశారు.

దానిని చూడగానే కొంత పసిగట్టాడు. చూడ్డానికి అగ్రహారం గ్రామం విహంగ వీక్షణంగా వుంది. ఇప్పుడా అగ్రహార రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కానీ రాజుకి అర్థం కాని విషయం రంగనాథ స్వామి ఆలయానికి ఎదురుగా కొంత దూరంలో ఒక భవనాన్ని గీశాడు.దానికి రంగ భవనం అనే పేరు రాశాడు. ఆ భవనం సరిగ్గా గుట్ట మీదున్న రంగనాథాయానికి ఎదురుగ్గా రంగనాయక కుంట చెరువు పక్కగా చిత్రించబడి వుంది.

అటువంటిదే మరో భవనాన్ని రంగనాథాలయానికి వెనకగా గీయబడి వుంది. సరిగ్గా గుట్ట కిందనే వుందా భవనం. దానికి చంద్ర భవనం అనే పేరు రాసుంది.

మూడు రోజులు రాజు అగ్రహారంలో వున్నాడు. ఎప్పుడు కూడా ఆ భవనాన్ని చూసింది లేదు. వినింది కూడా లేదు. “పూజారి స్వామీ ఈ మ్యాపు ఎప్పుడు గీసుంటారు” అనడిగాడు.
దానికాయన నవ్వుతూ “నూరు యేళ్లకి పైనే అయ్యింటుంది నాయనా. దానిని మా గురువుగారు కాలం చేస్తూ నాకందించారు. నా హయాంలో ఆ పూజా మందిరాన్ని కనిపెట్టలేక పోతే నా తరవాత యోగ్యుడైన శిష్యునికి అందించమని చెప్పాడు” అన్నాడు.
“మరి నాకెందుకు ఇచ్చారు” అన్నాడు రాజు.

వారి సంభాషణ ముగియకనే పెద్దగా పక్షి అరుపు వినిపించింది. మొదట అది గద్ద అరుపులా అనిపించింది. కానీ ఆ అరుపు దగ్గరయ్యే కొద్ది చెవులు దద్దరిల్లిపోయాయి. పూజారి చెవులు మూసుకున్నాడు. ఆ పక్షి తన పెద్ద రెక్కలను ఆడిస్తూ ఆ కట్టడం మీద వాలింది. దాని రెక్కల వూపడం వల్ల రేగిన గాలికి ఆ కట్టడం మీద పేరుకు పోయిన దుమ్ము పైకి లేచింది.

అది సెక్రెటరీ పక్షి. వెన్నెల భాగ నదీ తీరాన అప్సానా, రాజులకి కనపడిన పక్షి పిల్ల. అది సరాసరి రాజు ముందుకి వచ్చింది. మూడడుగుల ఎత్తుందా విహంగం. దాని వంటి మీద ఎన్నో రంగులు కలిసిన ఈకలున్నాయి. చూడ్డానికి నెమలిలా కనిపించినా, దాని తల భాగం మాత్రం గద్దను తలపిస్తుంది.

రాజు మోకాల్లపై నిలబడి దాని తల మీద చేయి వేసి నిమిరాడు. అది గుర్రు మని శబ్దం చేసి తన కన్నులని మూసింది. కాసేపు దాన్ని ముద్దు చేశాక రాజు ఒక విషయాన్ని పసిగట్టాడు. దాని రెక్క మొదటి భాగంలో చిన్న దారాన్ని గమనించాడు. ఆ దారాన్ని తెంపగానే దానికి కట్టిన ఒక వుంగరం బయట పడింది. ఆ వుంగరాన్ని సంగ్రహించిన తరవాత దానికి కొన్ని మేడి పండ్లను తినిపించాడు. ఆ పక్షి ఆనందంతో ఆకాశంలోకి ఎగిరిపోయింది.

ఆ వుంగరాన్ని చూస్తున్న రాజుతో పూజారి” ఇందుకే నాయన నీకి చిత్రం ఇచ్చింది. నీకు పెద రామరాజు సాయం కూడా అందింది. నీకు విజయం థద్యం. నాలుగు వందల యేళ్ల నా పూర్వీకుల పగ యీ సారైనా తీరాలని ఆ శారదాంభకు పూజలు చేస్తాను. విజయోస్తు” అని దివించి ఆత్రంగా గుళ్లోకి వెళ్లాడు. ఆయనకి సంతోషంలో అడుగులు కూడా సరిగా పడటం లేదు. ఆ సంతోషం వేణుగోపాల స్వామికి వుత్సవాలని ప్రకటించాడు.

4 Comments

  1. Sir miru evaro thelidhu Naku kani stories mataram verey rastunnaru opika techukoni mari madhyalo matram apakandi story ni evaru support chesina cheykapoina story continue chyndi plzz

  2. Continue chei bro

  3. Bro indhulo sagam sagam stories rasi apeykandi bro memu chala disappoint avuthnam

  4. Since four days there is no continuation stories.

Comments are closed.