త్వరగా కాలేజ్కి వెళితే నాన్న అడగక ముందే కాలేజ్ కి చేరుకోవచ్చూ అనుకోని బాగ్ తీసుకొని, బాక్స్ తీసుకొని బయలు దేరాను.
కాలేజ్ లో, లచుమమ్మని అవాయిడ్ చేసి ప్రేయర్ లైన్ లో నిలబడ్డాను. అస్సెంబుల్ గురించి ప్రిన్సిపల్ క్లాస్ తీసుకుంటున్నారు.
అప్పుడే ఫట ఫట మని సౌండ్, construction కోసం కట్టిన structure విరిగిపోయింది. Structure ఊగులాడుతోంది. పడితే పక్కనే ఉన్న హోర్డింగ్ మీద పడుతుంది.
నేనూ, రమణ కదిలామ్ మాతో పాటూ మన బాహుబలి రమ్య కూడా కదిలింది. ఎలా పట్టుకున్నామో మాకు తెలియదు కానీ కష్టపడి కదలనీయకుండా ఆపగలిగాం. అప్పటికే హోర్డింగ్ మీద వాలింది.
తాళ్ళు అంటూ గట్టిగా అరిచాం.
స్టూడెంట్స్ అందరూ తాళ్ళు తీసుకు వచ్చారు. గట్టిగా కట్టేశామ్. అందరూ ఒక టీమ్ వర్క్ తో ఆ construction ఆపాము. అది నిజానికి రెండు రోజుల క్రితమే పోసిన శ్లాబ్., ఒక్కసారిగా కూలిపొయ్యేది.
ప్రిన్సిపల్ vacate చేయించింది ఆ ప్లేస్ ని. మా ముగ్గురకూ ఎక్కడలేని పేరు వచ్చిపడింది. అందరినీ రక్షించాం కదా..
రమ్యని మాత్రం మగరాయుడిని చేశారు. కానీ తను దాన్నే గొప్పగా ఫీల్ అవుతోంది. తనని ఆటపట్టిస్తున్నారని అర్ధం కావట్లేదు. కండలు చూపిస్తూ మాతో పాటూ ఫోటోలు దిగింది.
ఆ రోజు కుమారీ టీచర్, లచుమమ్మాని పట్టుకోవడం నా వల్ల కాలేదు.
శాలినీ టీచర్ కొట్టడమొకటే చెయ్యలేదు. కన్నీళ్లు పెట్టేసుకుంది. రిస్క్ తీసుకుంటావా?! అంటూ….
కాంట్రాక్ట్ తీసుకున్నవాడు మళ్ళీ ఏదో తల నొప్పి చేస్తాడని అనిపించింది. అందుకే రమణ వాళ్ళ డాడీని కలిసి, మా ఫాదర్ ఎలాగూ CPWD కదా ఆయన ద్వారా రమణ వాళ్ళ డాడ్కి కాంట్రాక్ట్ ఇప్పించామ్.
దాంతో మా మీద ప్రిన్సిపల్ కి ఇంకా గురి పెరిగింది.
సాయంత్రం 4 గంటలు అయ్యింది బెల్ కొట్టారు. బైక్ తీసుకుని బయలు దేరాను.
9th పద్మ తనను తీసుకెళ్తానేమో అన్నట్లు చూసింది. కానీ తనని మా ఫ్రెండ్ గాడు try చేస్తున్నాడు. మనక్కూడా నీతి ఉండాలి కదా……..?! తనని అవాయిడ్ చేశాను.
కాలేజ్ బస్ లు వరుసగా ఆగాయి కడుపుతో భారాన్ని మోస్తున్న గర్భిణిలా ….
రాధీ బస్ ఎక్కాలి……ఎక్కట్లేదు అక్కడే నిలబడి ఎదురు చూస్తోంది.
రాధీ వాళ్ళ అమ్మ కార్ తీసుకుని రావట్లేదు కదా……….బస్ లోనే వెళ్ళేది….అలాంటిది బస్ ఎక్కలేదు. చూస్తుండగానే……
సంధ్య ఆంటీ కార్ ఆగింది.
కార్ దిగింది సంధ్య;
ఎమరాల్డ్ గ్రీన్ షిఫ్ఫాన్ సారీలో పొందికయిన అందాలు ప్రోగు చేసి ఒక రూపం ఇస్తే……. ఆ రూపం నడిచి వస్తోంది.
రాధీని చూడగానే……….ఆగింది. కానీ చూపు మాత్రం నా వైపు ఉంది.
“రావా ఇంటికి; ఎప్పుడు వస్తున్నావ్ ఇంటికి?” అంటూ రాష్ గా అడిగింది. అడిగింది రాధీనే అయినా అది నన్నే అన్నట్లుంది ఉంది.
కార్ ఎక్కింది రాధిక. ఆంటీ కార్ మాత్రం కదల్లేదు. రెండు సార్లు హార్న్ కొట్టింది.
నేను నా బైక్ దగ్గరకు వెళ్ళి హార్న్ కొట్టాను. నాకు బైక్ ఉంది అన్నట్లు.
మళ్ళీ హార్న్ కొట్టింది నా వైపు చూస్తూ….
ఇంక తప్పేలా లేదు. దాంతో బైక్ కిక్ కొట్టి కార్ వైపు పోనిచ్చాను.
తను కార్ స్టార్ట్ చేసింది. కార్ వెనుకే వాళ్ళ villaకి బయలు దేరాను.
లోపలకు వచ్చేవరకూ నన్ను అనుసరించారు.
లోపలకు వెళ్ళాం. లోపల ఒక్క మాట మాట్లాడలేదు తల్లీ కూతుళ్ళు.
సంధ్య నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. వంట మనిషి వసంతకు ఏదో ఆర్డర్ చేసింది.
తాగు అంటూ పాలు ఇచ్చి ఎదురుగా కూర్చుంది.
కొట్లాడటానికి రెడీ అయ్యిందని అర్ధమయ్యింది.
కానీ ఏమీ మాట్లాడలేదు. స్నానానికి వెళ్ళి; రాధీకి ఏదో చెప్పింది.