పరిమళం Part 2 139

నేను చిన్నగా ప్రభు అని పిలిచాను
అతను లేచి స్తంభం గోడకు చతికిల బడుతూ
నాకు అభిముఖంగా ముఖం చేసి కూర్చున్నాడు
ఏడ్చి ఏడ్చి అతని ముఖం వాపు వచ్చినట్లుంది

ప్రభు నన్ను చూసి శరత్ అంటూ ఏడుస్తూ విలవిల్లాడుతూ నా కాళ్ళ మీద పడ్డాడు

శరత్….. గట్టిగా ఏడుస్తూ ఆ మురికి నేలమీద పడి నా కాళ్లు పట్టుకుని ఎంతో దుఃఖంతో కళ్ళ నీళ్ళతో
నా వైపు చూస్తూ అన్ని తెలిసి కూడా ఆ బాధను మీరు ఎలా భరించగలిగే గారు

ఓ దేవుడా ఆ చండాలపు పని మీ కళ్ళతో చూశారా ఒకవేళ నేను నీకు సొంత సోదరుడిని అయినా ఇలాంటి పని చేసినందుకు నన్ను చంపి పారేస్తున్నారే

శరత్ ఈ బాధ నేను భరించలేను నన్ను చంపేయండి నన్ను చంపేయండి శరత్ నన్ను చంపేయండి నాకు ఈ భూమ్మీద జీవించడానికి అర్హత లేదు మీరు నా కుటుంబం మంచిని ఆలోచించారు కానీ నేను కామానికి లోనే జంతువుల ప్రవర్తించాను

నా పాదాలు పట్టుకొని ఏడుస్తూ నా స్నేహితుని నిస్సహాయంగా చూసి నేను అతని భుజాలు పట్టుకొని పైకి లేపి పక్కన కూర్చో బెట్టుకున్నా

ప్రభు ఈ విషయంలో నీ తప్పు ఇంకామీరా తప్పు మాత్రమే లేదు కొంత వరకు నాకు బాగం ఉంది

ప్రభు గట్టిగా అరుస్తూ లేదు శరత్ నీ తప్పు లేదు మీరా తప్పు అసలే లేదు ఆమె అలా అంత సులభంగా లొంగిపోయే వ్యక్తి కాదు

మీరా అందం చూసి నా నైతిక విలువలు విడిచి గుడ్డివాని చేసి ప్రతిరోజు ఆమెను వెన్నంటి వెంటాడి ఆమె ఒంటరితనాన్ని మంచితనాన్ని దుర్బలత్వంని ఆసరా చేసుకుని ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ నేను ఆమెను లొంగదీసుకున్నా

అలా చేసినందుకు మళ్లీ ప్రభు బిగ్గరగా ఏడుస్తూ
నా తండ్రి నా పుట్టుకనే అవమానించి తిడుతూ కొడుతూ మీ అమ్మ నావల్ల నిన్ను కనలేదు నువ్వు ఎవరికి పుట్టావో

నాకే గనుక పుట్టి ఉంటే నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేయవు అన్నాడు
ఓ దేవుడా ఆ మాటలు విని ఇంకా నేనెందుకు బ్రతికే ఉన్నాను అనిపిస్తుంది అని ప్రభు ఏడుస్తూ బిగ్గరగా అరిచాడు

నేను మౌనం గా అతని వైపు చూస్తూ ఉన్నా
నాకే ఇప్పుడు ఒకరి ఓదార్పు అవసరం
నేను ఇప్పుడు అతన్ని ఎలా ఓదార్చ గలను
ప్రభు తన బాధను కొనసాగిస్తూ

శరత్ నేను రేపు మా మామయ్య కూతురిని వివాహం చేసుకోబోతున్నాను
నా ముసలి తల్లిదండ్రులు చివరి రోజులు వారితో గడపాలని నిర్ణయించుకుని ఇక్కడే ఉన్నా

కానీ నేను నీకు చేసిన ద్రోహానికి నేను తిరిగి ఇక్కడ మళ్ళీ కాలు పెట్టాను ఒకవేళ నా తల్లిదండ్రి చనిపోయిన కూడా చూడ్డానికి రాను ఇదే నాకు నేను వేసుకుంటుంన్నా శిక్ష

నేను తిరిగి మళ్లీ విదేశాలకు వెళ్తున్న నేను నీకు వాగ్దానం చేస్తున్నా నా శవాన్ని కూడా ఇక్కడికి రానివ్వను

అతను ఒక క్షణం నా వైపు చూసి దయచేసి మీరు ఎప్పుడునన్ను క్షమించకండి అని అనకండి అది కలలోనైనా నాలాంటి పనికిరాని నిజమైన జంతువుకి మీలాంటి మంచి వ్యక్తి యొక్క క్షమాపణలు కూడా అర్హుడు కాదు

జీవితంలో క్షమించరాని బాధను నా తల్లిదండ్రులకు కలిగించాను నా తండ్రి అతడు చనిపోయాక అతని దేహాన్ని చూడటానికి కూడా నాకు అనుమతి ఇవ్వలేదు అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి కూడా నిషేధించాడు నన్ను చివరికి కొడుకుగా ధర్మమైన తలకొరివి పెట్టడం కూడా తనకు ఇష్టం లేదన్నాడు

శరత్ ఇంకా నేను వెలుతున్న కానీ ఒక్కమాట
ఇంకా నుండి మీరా ఇలా ప్రవర్తించాదు
ఇంకా నుండి మీకు ద్రోహం చేయదు
ఆమె నిన్ను ఎంతో ప్రేమిస్తుంది
నాకు తెలుసు ఆమె చేసిన ఈ పనికి మీరా ఎంతో అపరాధ భావంతో బాధపడుతూ ఉండేది
దయచేసి తనని అవమానించిన వద్దు అంతే ………………………………
అతను లేచి తొందరగా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు

రెండు వారాల తరువాత ఒక రోజు మీరా నన్ను అడిగింది మీ స్నేహితుడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడటా అని

ఎవరికి తెలుసు అతనికి ఏ విధమైన కష్టాలు ఉన్నాయో అన్నాను మీరా నన్నే చూస్తూ నిలబడింది నిస్తేజంకంగా

ఒక శుక్రవారపు రోజు మీరాతో పిల్లలను తయారు చేయండి అలాగే మీరు కూడా సిద్ధంగా ఉండండి
మనం గుడికి వెళ్లిన తర్వాత బయట ఎక్కడైనా విందు చేద్దాం నేను మీరా తో అలా చెప్పి నా బట్టలు మార్చుకోవడానికి గది లో కి వెళ్లాను

పూలమ్మే ఆవిడ అరుపులతో ఆ వీధిలో ఆమె వచ్చినట్లు గ్రహించాను ఆమె నా ఇంట్లో వాకిలి దగ్గరికి వచ్చి అమ్మా పూలు తెచ్చాను మీకు ఎంతో ఇష్టమైన గులాబీ పూలు కూడా తెచ్చాను ఇవ్వమంటారా ఆ తర్వాత నా భార్య గొంతు

లేదు ఇప్పటి నుండి నాకు మల్లె పూలు మాత్రమే ఇవ్వండి గులాబీ పూలు చిరాకు ఇంకా తలనొప్పి కలిగిస్తున్నాయి ఇకనుండి అవి వద్దు అంది…. అ………………………..ఒక ముగింపు