ఇక ఇంటి విషయానికొస్తే, అది చాలా పెద్దగా ఉండేది. మొత్తం రెండస్తులుండేవి. కింద భాగంలో విశాలమైన హాల్, రెండు బెడ్ రూములు, ఒక స్టడీ రూం, కిచెన్ ఉండేవి. బెడ్ రూంస్ లో ఒక దానికి అటాచ్డ్ బాత్ రూం ఉండేది. అది అమ్మా నాన్నల మాస్టర్ బెడ్ రూం. రెండో బెడ్ రూం ని గెస్ట్ ల కోసం వాడేవాళ్లం. స్టడీ రూం నా రూం కింద లెక్క. గెస్ట్ ల కోసం విడిగా ఒక బాత్ రూం ఇంటి వెనుక ఉండేది. పై అంతస్తు పెంట్ హౌస్ లాగా ఉండేది. అందులో ఒక కిచెన్, ఒక పెద్ద హాల్, దానికి అటాచ్ చేసి ఒక బాత్ రూం ఉండేవి. ఇంటికి కుడివైపు నుండి పైకి మెట్లుండేవి.
నాన్న రాజస్థాన్ వెళ్లాక వారం తిరిగేలోపు దిలీప్ మామయ్య మా ఇంటి పైనున్న పెంట్ హౌస్ లో చేరిపోయాడు. అతనొచ్చిన తరువాత అమ్మ దిగులు క్రమంగా తగ్గిపోయింది. దిలీప్ మామయ్య కూడా అమ్మ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో పి. జి. చేస్తున్నాడు. దాంతో ఇద్దరూ ఖాళీ దొరికినప్పుడల్లా రక రకాల ఇంగ్లీష్ పుస్తకాలు చదివి వాటి గురించి తెగ డిస్కస్ చేస్తుండే వాళ్లు. నేను మరీ చిన్న పిల్లాడిని కావటం వల్ల నాకు వాళ్ల గోల అసలు అర్ధమయ్యేది కాదు. నాకర్ధమయిందల్లా, అమ్మ ఇప్పుడు ఇంతకు ముందులా పెద్దగా దిగులు పడటం లేదని.
దిలీప్ మామయ్య అమ్మకి ఇంటి పనుల్లో చాలా సహాయం చేస్తుండే వాడు. ఆయనకో మోటార్ బైక్ ఉండేది. దాని మీద నన్ను కాలేజ్ కు తీసుకెళ్లి వదిలి పెట్టటం, ఇంటికి తీసుకు రావటం చేస్తుండే వాడు. అప్పట్లో నా క్లాస్ మేట్స్ అంతా కాలేజ్ కి నడిచో, వాళ్ల నాన్నల సైకిళ్ల మీదనో వచ్చేవాళ్లు. నేను అలా మోటార్ బైక్ మీద రావటం చూసి వాళ్లు కుళ్లుకునేవాళ్లు. అది నాకు కాస్త గర్వంగా ఉండేది. ఆ కారణంగా దిలీప్ మామయ్యంటే నాక్కూడా ఇష్టం ఏర్పడింది.
మామయ్య మొదట్లో మెస్ లో భోజనం చేసేవాడు. మా ఇంట్లోనే తినమని అమ్మ ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. మా ఇంటికొచ్చిన నెల రోజులకనుకుంటా, ఆయనకి ఫుడ్ పాయిజనింగై వారం పాటు మంచాన పడ్డాడు. దాంతో అమ్మ బాగా కోప్పడి అతనితో మెస్ మాన్పించేసింది. అప్పటి నుండి తను కూడా మా ఇంట్లోనే భోజనం చేసేవాడు.
అమ్మా, మామయ్యా ఇంగ్లీష్ లిటరేచర్ గురించి తెగ డిస్కస్ చేసుకుంటుండేవాళ్లని చెప్పానుగదా. అమ్మ ఆయన దగ్గర నుండి చాలా పుస్తకాలు తెచ్చుకుని ఖాళీగా ఉన్నప్పుడు చదువుతూ ఉండేది. వాటిలో ఒకట్రెండు నేను కూడా చదవబోతే నాకొక్క ముక్కా అర్ధం కాలేదు. చాలా లావుగా ఉన్నాయా పుస్తకాలు. ఇంత పెద్ద పుస్తకాలెలా చదువుతారని అమ్మనడిగితే ఆమె నవ్వి నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ‘పుస్తకాలు చదవటం చాలా మంచి అలవాటు నాన్నా. ఇప్పుడలాగే అనిపిస్తుంది కానీ నాలుగేళ్లు పోతే నీకూ అర్ధమవుతాయిలే’ అనేది.
నాలుగు నెలలు గడిచేసరికి అమ్మకి పుస్తకాల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంతకు ముందు ఖాళీ సమయంలో మాత్రమే చదివేదా, ఇప్పుడే పొద్దస్తమానం అదే ధ్యాస. రోజూ మామయ్య ఏదో ఒకటి తెచ్చివ్వటం, ఈమె చదవటం. ఒక్కోసారి ఆయనింట్లో లేకపోయినా తనే ఆయనింట్లోకెళ్లి తెచ్చుకునేది. పైభాగం తాళాలు ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండేవి. మామయ్య బయటికెళ్లేటప్పుడు వాటిని అమ్మకిచ్చి వెళ్లేవాడు. నా క్లాసు పుస్తకాలు చదవాలంటేనే నాకు విసుగు. అలాంటిది అమ్మ అన్నన్ని పుస్తకాలెలా చదువుతుందో నాకసలు అర్ధమయ్యేది కాదు. మొదట్లోలా కాకుండా ఇవి చిన్నగా ఉండేవి. ఇంతకు ముందు పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ వదిలేశేది, ఈ మధ్య వాటిని నాక్కూడా భద్రంగా బీరువాలో పెట్టటం మొదలెట్టింది. ఒక సారి నేను దేని కోసమో బీరువా తెరవబోతే కోప్పడింది. అప్పటి నుండి బీరువా తాళాలు తనతో పాటే ఉంచుకోవటం మొదలెట్టింది. పుస్తకాలు బీరువాలో పెట్టి తాళమేస్తున్నావెందుకు అని ఒక సారడిగితే, ‘అవి మామయ్యవి కద నాన్నా. జాగ్రత్తగా తిరిగిచ్చేయాలి కదా. ఇంతకు ముందు ఒకట్రెండు పుస్తకాలు పోయాయి. అందుకే జాగ్రత్త చేస్తున్నా’ అంది. అవును కాబోలనుకున్నా నేను. ఇంకో సారి ఆమె చదువునుకునేటప్పుడు నే వెళ్లి నీతో పాటు నేనూ చదువుతా అనడిగితే చప్పున పుస్తకం మూసేసింది. ఆనక ముసి ముసిగా నవ్వుతూ, ‘ నాన్నా, నీకిప్పుడే ఈ పుస్తకాలర్ధం కావులే. నువ్వు పెద్దాడివయ్యాక చదువుదువు కానీ ‘ అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. అప్పుడెందుకో అమ్మ సిగ్గు పడినట్లనిపించింది నాకు. కానీ ఆ మాట చెప్పటానికి సిగ్గు పడటమెందుకో అర్ధం కాలేదు నాకు. అప్పటి నుండీ అమ్మ నా ఎదురుగా చదవటం తగ్గించేసింది. ఎక్కువగా బెడ్ రూం లో తలుపు వేసుకుని చదువుకుంటుండేది.
మామయ్య మా ఇంట్లో చేరాక ఐదు నెలలకనుకుంటా, నాకు వేసవి కాలం సెలవలు నడుస్తున్నాయప్పుడు. నాన్న సెలవు మీద వచ్చి తిరిగి వెళ్లిపోయి వారమవుతుంది. ఏమయిందో ఏమో కానీ అమ్మ మామయ్యతో మాట్లాడటం మానేసింది. ఆయన పేరెత్తితే కసురుకుంది ఒకట్రెండు సార్లు. మామయ్య కూడా భోజనానికి రావటం మానేశాడు. కానీ అమ్మని ఎలాగోలా మాట్లాడించటానికి ప్రయత్నించేవాడు. ఆమె మాత్రం ముక్తసరిగా సమాధానమివ్వటమో, మౌనంగా ఉండటమో చేసేది. వీళ్లకేమయిందో నాకర్ధం కాలేదు. సుమారు పదిరోజుల పాటు సాగిందా తంతు. మొదట్లో నాకిది వింతగా అనిపించినా తరువాత పట్టించుకోవటం మానేశాను. వేసవి సెలవలు కదా. పగలంతా ఆడుకోటానికే తీరికుండేది కాదు నాకు. ఇక వీళ్ల గురించి ఆలోచించే టైమేదీ?
Super story update next part fast