పని ఉంది సంజూ,అత్త రమ్మంటోంది అర్జెంట్ గా..
సరే అని ఫ్రెషప్ అయ్యి అత్త ఇంటికి వెళ్ళేసరికి అత్త దిగాలుగా ఉండటం గమనించా..
ఏమైంది అత్తా అలా ఉన్నావ్ అన్నా..
నీకు తెలీదా?? ఎందుకో అని..
ఏంటో చెప్పు అత్తా నాకేమి తెలుసు అన్నా..
మమ్మల్ని వదిలేసి,మీ అమ్మమ్మ దగ్గరికి పంపిస్తున్నారంట నిన్ను అంది.
అదేంటీ?నాకు తెలియదు ఈ విషయం అన్నా.
హ్మ్మ్ అందరూ డిసైడ్ అయ్యారు రా,నువ్వు ఒక 15 రోజులు ఊర్లో ఉండకూడదు అంట ఏదో దోషం ఉందని నిన్ను బయటికి పంపిస్తున్నారు అని బాధతో చెప్పేసరికి,15 రోజులే గా అత్తా తర్వాత మీ దగ్గరే ఉంటాను బాధపడకు అన్నా..
మా బాధ నువ్వు వెళ్తున్నావని కాదు రా అల్లుడూ,నీకు ఏదో గండం అని భయపెట్టిస్తున్నారు వీళ్ళు అందుకే బాధగా ఉంది ..
నాకేమీ కాదులే అత్తా ,అనవసరంగా నువ్వు భయపడకు, ఇంతకీ మామ ఎక్కడ ??
అడవికి పోయాడు ఏదో పని ఉందని..
అవునా?? అయితే ఓకే లే ఏమీ కాదు ధైర్యంగా ఉండండి.
అంటే మామ కి కూడా తెలిసిపోయిందా,ఆ సాధ్వి వాళ్ళ ప్రాబ్లమ్ ?అందుకే వెళ్లుంటాడా??ఇలా రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి..
అంతలోపు మామ కాల్ చేసాడు,లిఫ్ట్ చేసిన అత్త ఏదో మాట్లాడుతూ హా అలాగే అండి అంటూ ఫోన్ కట్ చేసింది.
ఏంటి అత్తా,మామ ఏమి మాట్లాడాడు అన్నా..
మామ సాధ్వి వాళ్ళ దగ్గరికి వెళ్లి,ఏదో పూజ చేయాలంట, ఈ అమావాస్య అయిపోయేవరకూ ఆ పూజ జరుగుతుంది అంట, అంత వరకూ నువ్వు మాత్రం ఈ ఊరిలో ఉండకూడదు అని ఆర్డర్ వేసాడు అంది.
హ్మ్మ్ సరే అత్తా అలాగే చేద్దాం లే ..
కాసేపు వాళ్ళతో మాట్లాడేసి ఇంటికి వచ్చా..
కానీ వాళ్ళందరి మొహాల్లో మాత్రం విపరీతమైన ఆందోళన కనిపిస్తోంది,కానీ నాకు చెప్పడం లేదు అన్న విషయం నాకు అర్థం అయ్యింది..
అలాగే ఆలోచనలో పడి రాత్రయ్యింది,స్నానం చేసి మంచం ఎక్కా..
సింధూ కాలింగ్, ఏరా ఏమి చేస్తున్నావ్??
ఏమీ లేదు సింధూ,పడుకొని ఉన్నా.
సరే ఇంట్లో నీ గురించి అందరూ టెన్షన్ పడుతున్నారు కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ కట్ చేసింది కాస్త బాధతో..
అదేంటి సాధ్వి వాళ్లకు ప్రాబ్లమ్ అని పుస్తకం లో ఉంటే, నాకు ప్రాబ్లమ్ అని వీళ్లు అంటున్నారు అని పుస్తకాన్ని తెరిచా..
మళ్లీ ముగ్ధ మనోహర “సువర్ణా” రూపం కళ్ళ ముందు కనిపించేసరికి అంత వరకూ ఉన్న బాధ ఒక్కసారిగా ఎగిరిపోయింది..
తన మనోహర రూపాన్ని మనసులో పదిలంగా ఉంచుకొని,ఒక్కొక్క పేజీ ని తిప్పుతూ వెళ్ళా..
అలా తిప్పుతున్న నాకు ఒక్క పేజీ లో కనిపించిన దృశ్యం ఆశ్చర్యానికి గురి చేసింది..
“అందులో ఒక ఆడ మనిషి ,సాధ్వి వాళ్ళ నివాసం నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వస్తోంది”..
ఒక ముసుగు మనిషి ఆమె కి రక్షణగా ఆమెతో పాటు పరిగెత్తుతూ వస్తున్నాడు”.
అదేంటో అర్థం కాని నేను,విసుగ్గా ఆ పుస్తకాన్ని మూసేసి నిద్రకు ఉపక్రమించా..
ఆలోచనలతో సతమతమవుతున్న నాకు ఎప్పుడో నిద్ర పట్టేసరికి నిద్రలోకి జారుకున్నా…
తెల్లారేసరికి మా ఇంట్లో అందరూ హడావుడి చేస్తున్నారు, హాల్ లోకి వచ్చేసరికి ఓల్ రెడ్డి మామ త్వరగా రెడీ అవ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని అనేసరికి త్వరగా రెడీ అయ్యి వచ్చా.
టిఫిన్ చేస్తున్న నాకు,అందరూ ఏవేవో జాగ్రత్తలు చెప్తున్నారు..
మొత్తానికి నన్ను సాగనంపారు బస్ స్టాండ్ వరకూ..ఓల్ రెడ్డి నా దగ్గరకు వచ్చి ఒక ఇత్తడి బిళ్ళ ని చేతిలో పెట్టి ఏదైనా ఇబ్బంది వస్తే ఇది ఉపయోగపడుతుంది కాస్త ధైర్యంగా ఉండు అని వీడ్కోలు తీసుకున్నాడు..
బస్ బయల్దేరింది,మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి 2 గంటల ప్రయాణం..
ఏదో స్టాప్ లో బస్ ఆగింది.కొందరు ఎక్కారు..
నా పక్కన ఖాళీగా ఉండటంతో ఒక ప్రౌఢ స్త్రీ కూర్చుంది..
ఆమె ని చూసిన నాకు కళ్ళల్లో ఆరాధనా భావం కురిసింది..చూస్తుంటే దేవకన్య లా ఉంది ఒంటి గుండా సువాసనలు వస్తూ.
.
నా చూపులు కనిపెట్టిన ఆమె నన్ను చూసి నవ్వుతూ, ఏమి పేరు బాబూ అంది..
“సంజయ్ ” అండి..
నా పేరు ని విన్నాక,ఆమె మొహంలో వచ్చిన విపరీతమైన మార్పు ని దాచేసి ఏమి చదువుతున్నావ్ అంది.
టెన్త్ క్లాస్ అండి అన్నా..
హో వెరీ నైస్, నేను “ఇంద్రాణి” , పక్క టౌన్ లో జూనియర్ లెక్చరర్ అంటూ పరిచయం చేసుకుంది..
కాలేజ్ కా మేడమ్ అన్నా..
లేదు బాబూ ఈరోజు హాలిడే ఇచ్చారు,ఇంటికి వెళ్తున్నా అంది..
ఆమె మొహంలో రాజసం ఉట్టిపడుతోంది,ఇక అందం గురించి చెప్పక్కర్లేదు అంత మనోహరంగా ఉంది.
ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె తెల్లని పలువరస ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది..
కాసేపు మా మధ్య మాటల్లేవు,నేను పుస్తకాన్ని తెరిచి గమనిస్తూ ఉండగా,ఏమి బుక్ బాబూ అది??
అబ్బే ఏమీ లేదండి ఏదో నవల లే అని కవర్ చేసా.