రొమాంటిక్ చర్చ్నింగ్ 14 125

నవలా?ఏదీ ఇలా ఇవ్వవా??

ఇది ఎవ్వరికీ ఇవ్వకూడదండి ,అర్థం చేసుకోండి అన్నా కాస్త మర్యాదగా..

హబ్బా ఏమీ కాదు అని నా నుండి లాక్కొని తీక్షణంగా ఆ బుక్ ని గమనిస్తోంది..

గమనించిన కొద్దీ ఆమె మొహంలో విపరీతమైన మార్పులు రావడం స్పష్టంగా తెలుస్తోంది..

అంత కన్నా ఆశ్చర్యం ఏంటంటే, ఆ బుక్ ఎవ్వరికీ ఓపెన్ అవ్వదు అన్న ఓల్ రెడ్డి మాట గుర్తొచ్చి,ఏంటండీ ఏమి కనిపిస్తోంది అందులో అన్నా..

కనిపిస్తోంది,నాకు కనిపించని పుస్తకమా ఇది అంటూ నా వైపు చూసింది కాస్త ఆశ్చర్యం గా..

నాకు కరెంట్ షాక్ కొట్టింది ఆమె అన్న మాటకి,ఏంటీ మీకు కనిపించిందా అన్నా ఆశ్చర్యం తో.

హ్మ్మ్ అవును అంది సింపుల్ గా..

నాకు టెన్షన్ ఎక్కువైంది ,ఈమె కి ఎలా కనిపిస్తుంది ఈ బుక్ అని.

అంతలో ఏదో స్టాప్ లో బస్ ఆగి కదలడంతో, నా చూపు కింద ఉన్న ఒక మనిషి పైన పడింది.

తను ఎవరో కాదు,ఆ “ముసుగు మనిషి”..