రొమాంటిక్ చర్చ్నింగ్ 16 67

సెలవివ్వండి దండసేనా..

మన నివాసానికి వచ్చి మన బిడ్డ ని తీసుకెళ్లే ధైర్యం ఆ “రాజన్న”గాడికే ఉంది.ముందు వాళ్ళ కుటుంబాన్ని అంతం చేసి ఆ కన్య అయిన ఇంద్రాణీ ని హతమార్చాలి ఇదే మన కర్తవ్యం..

సరే దండసేనా,మన బిడ్డ సంగతి ఎలా సెలవివ్వండి..

అది చచ్చిపోయింది,దానితో పని లేదు మనకు..ముందు ఆ రాజన్న,సివంగి ని హతమార్చి సాధ్వి ల నివాసం లోకి జొరబడి ఆ ఇంద్రాణీ ని హతమార్చడమే ఇక.

దండసేనా,వాళ్ళ నివాసంలో హోమం జరుగుతోంది ఇది మనకు సరైన సమయమేనా??

విజయ భట్టా,ఇంద్రాణీ కి ఎటువంటి రక్షణా లేదు.ఆ రాజన్న ఒక్కడే రక్షణ..ఆ ఇంద్రాణీ ఇంకా దేనికీ సిద్ధం కాలేదు మనం త్వరపడితే అంతా సవ్యంగా జరుగుతుంది లేకుంటే పెను నష్టం..

సరే దండసేనా,ఆ రాజన్న ని హతమార్చి ఆ ఇంద్రాణీ ని హతమార్చి విజయుడను అయ్యి తిరిగొస్తా ఆదేశించండి.

విజయోస్తు,నీ కసి ఇప్పుడు తీర్చుకునే సమయం వచ్చింది,మన సైన్యం లోని ఒక 15 మంది మెరికలను తీసుకొని వెళ్లి దొంగ దెబ్బ కొట్టి తిరిగి రా..

అలాగే సేనా అంటూ 15 మంది క్రూరులతో బయలు దేరాడు సరిగ్గా సంజయ్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సమయానికి.
___________________________________________________________________________
ఇక్కడ నేనూ,సివంగి ఆనంద లోకాల్లో తేలియాడి సేద తీరుతున్న సమయం లో హఠాత్తుగా సివంగి లేచి తన దుస్తులు వేసుకొని తన ఆయుధాల్ని సిద్ధం చేసుకుంది…

సమయం తెల్లవారుజాము,మెల్లగా తెలవారుతోంది..

సివంగి ని చూసిన నేను,ఏమైంది సివంగి అన్నా.

మహారాజా శత్రువులు ముందున్నారు,మీరు సిద్ధం కండి.ఎటువంటి పరిస్థితుల్లో అయినా నా వెనకే ఉండాలి అని హెచ్చరించింది.

మారు మాట్లాడకుండా తన వెనకాలే నిలబడి ఎదురుచూస్తున్నాము శత్రువులు కోసం..

సరిగ్గా అదే సమయానికి గుర్రాల పైన కొందరు మనుషులు మా వైపే రావడం లీలగా కనిపిస్తోంది..

కాస్త చెట్టు చాటున దాక్కున్న మేము వాళ్ళకి కనిపించలేదు..మాకు కొద్ది దూరంలో అందరూ నిలబడి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నారు..

మా వైపే గుర్రాలు అదిలించిన ఒక శత్రువు కళ్ళు మూసి తెరిచే లోపే మొండెం కోల్పోయి విగత జీవుడయ్యాడు…

మేము ఇద్దరమూ ఆశ్చర్యం తో నోరెళ్ళబెట్టాము..

ఎక్కడ నుండి వచ్చాడో తెలీదు,రాజన్న ఆ శత్రువులు ముందు ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యాడు ఖడ్గం చేత పట్టి..

ఇంకో క్షణంలో ఇంకో ఇద్దరి తలలు గాల్లో ఎగిరాయి..

రాజన్న ని చూసిన సివంగి ఒక్క ఉదుటున ముందుకు ఉరికింది నన్ను వదిలేసి..

ఇద్దరూ వాళ్ళతో వీరావేశంగా తలపడ్డారు..

రాజన్న దెబ్బకి ఇంకో నలుగురు విగతజీవులు అవ్వగా ,సివంగి మరో ఇద్దరికి చావు ని కల్పించింది..

విజయభట్టు ఆవేశంగా సివంగి వైపు కదిలాడు..సివంగి మాత్రం వాడిని గమనించలేదు..అది చూసిన నాకు టెన్షన్ ఎక్కువై నా చేతిలో ఉన్న ఇత్తడి బిళ్ళ సహాయం కోరి సరాసరి సివంగి ముందు నిలబడ్డా..

వంట్లో ఏదో తెలియని ఉత్సాహం,సివంగి ఆశ్చర్యపోయి నా చేతికి తన ఒర లోని ఖడ్గాన్ని ఇవ్వగా అంతులేని బలంతో విజయభట్టు పైకి ఉరికాను.

నేను హఠాత్తుగా వాడి పైకి ఉరికేసరికి,కాస్తా కంగారు పడి రెప్పపాటులో తేరుకొని వెనుతిరిగి మళ్లీ సివంగి పైకి వాడి ఖడ్గాన్ని విసిరాడు..

అది గమనించిన నేను క్షణ కాలంలో సివంగి ని కిందకి తోసేసి ఈసారి ముఖాముఖీ గా తలపడ్డాను వాడి పైకి ఖడ్గాన్ని దూసి..

ఆ గుర్రం పైన నా దెబ్బకి తప్పించుకొని,సరాసరి గాల్లో కి ఎగిరి నా పైన పడ్డాడు వాడు…

వాడు బలంగా పడేసరికి దూరంగా పడిపోయాను..నాలో ఆవేశం అధికమై మళ్లీ వాడి పైకి ఉరికాను..

నేను వాడిని చేరుకునే లోపే వాడి వెనకాల నుండి సివంగి ని బలంగా ఒక్క తన్ను తన్నాడు,దెబ్బకి సివంగి అల్లంత దూరంలో పడిపోయింది వాడి బలమైన దెబ్బకి స్పృహ కోల్పోయి…

అది చూసిన నేను బెబ్బులిలా గర్జించి గాల్లోనే ఎగిరి వాడిని బలంగా ఒక్క తన్ను తన్నాను..

వాడికి ఆవేశం ఎక్కువై తేరుకొని నా పైకి దుంకి నాతో మల్ల యుద్దానికి దిగాడు…

అసలే సివంగి కి దెబ్బ తగిలింది అన్న కోపంలో ఉన్న నేను,ఉరుము లా ఉరిమి వాడి రెండు చేతులు పట్టేసి దొక్కలో ఒక్క తన్ను తన్నాను..

దెబ్బకి వాడికి నొప్పి ఏంటో తెలిసింది …అదే కోపంలో ఇంకోసారి తన్నగా కాస్తా వంగిపోయాడు వాడి బలాన్ని కోల్పోయి..

ఆలస్యం చేయకుండా నా చేతులతో వాడి మెడ ని పట్టేసి గట్టిగా తిప్పేసా వాడి మెడపంపులు విరిగిపోయేలా..

బాధతో విలవిలలాడిపోయాడు…ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఖడ్గాన్ని తీసుకొని వాడి తల ని వేరు చేసా .
.
అప్పటికి రాజన్న అందరినీ మట్టుబెట్టాడు..నేను చేసిన పనికి నాకు కళ్ళతోనే ధన్యవాదాలు తెలిపి సివంగి ని ఎత్తుకొని వాళ్ళ గూడెం వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు..

అంతా టెన్షన్ గా ఉంది సివంగి కి ఏమయిందో అని..

కాసేపటికి ఆ వైద్యుడు,ఇబ్బంది ఏమీ లేదు అంతా సవ్యంగా ఉంది ,మెలకువ లోకి వచ్చింది రాజన్నా వెళ్లి చూడండి అని చెప్పేసరికి లోపలికి వెళ్ళాము..

నన్ను చూసిన సివంగి ఆనందంతో,మహారాజా మీకేమీ కాలేదు చాలా సంతోషం అంది.

వెంటనే రాజన్న, మహారాజు ని ఎదిరించే మగాడు లేడు సివంగి,అయినా అప్రమత్తంగా ఉండేది మరిచావా??మహారాజు లేకుంటే నీ పని అయిపోయేది ,వాటంగా వాడిని మట్టుబెట్టాడు..

ధన్యవాదాలు మహారాజా అంటూ దండం పెట్టింది సివంగి.

చాల్లే సివంగి ఈ మాత్రానికేనా,నన్ను కంటి రెప్పలా కాపాడి పూజ కి వెళ్లేలా చేసావు అని అనేసరికి మాకు ఒక పెద్ద శబ్దం వినిపించింది..