రొమాంటిక్ చర్చ్నింగ్ 17 98

అదే సమయంలో నాలో నుండి ఒక మెరుపు కురిసి నా రూపు ఒక్కసారిగా మారిపోయింది ఒక వీరుడిలాగా..

జై మహారాజా ,జై జై మహారాజా ఇదే మీ పునః దర్శనం వీరుడి కి మరో జన్మ అంటూ జయ జయ ద్వానాలు పలికారు ముగ్గురూ ఒక్కసారిగా..

ఇంద్రాణీ వాళ్ళ అమ్మ తన్ను కి అంత దూరం పడిన ప్రసన్న జిత్తు దెబ్బతిన్న బెబ్బులిలా ఆమె పైకి ఉరికాడు..

వాడి కన్నా వేగంగా వాడి ఛాతీ విరిగేలా తన్నాను గాల్లోకి ఎగిరి..

ఇంద్రాణీ వాళ్ళ అమ్మ కళ్ళల్లో కసి కనిపించింది.

మహారాజా అదీ మీ వీరత్వం అంటే ,ఆలస్యం చేయకుండా ఈ జిత్తులమారి ప్రసన్నజిత్తు ని హతమార్చు..మీ వైభవాన్ని మళ్లీ ప్రతిష్టించండి అంటూ జయజయద్వానాలు పలికింది ఆమె..

నేను మంత్రముగ్దుడిలా ఆమె మాట ని వింటూ వాడి పైకి ఉరికాను కాలితో పైకి ఎగిరేలా తన్నుతూ..

ఏరా మా మహారాజు మేల్కొనేలా తెగ అరిచావ్,ఇప్పుడొచ్చాడు చూడు మగాడివైతే ఎదిరించు నీకు దమ్ముంటే అంటూ ఆనందంతో నా వైపు చూసింది…

నాకు ఆశ్చర్యం గా వున్నా ఇందులో ఏదో మతలబు ఉందన్న ఊహతో ఒక్క ఉదుటున ఆ ప్రసన్నజిత్తు ని గాల్లోకి ఎగరేసి వాడి మక్కెలు విరగ్గొట్టా..

వాడిని కొట్టేకొద్దీ నాలో రాజసం ఎక్కువ అవుతోంది…

ఏదో గుర్తొస్తోంది మగతగా…

వాడిని ఇంకా ఇంకా కొట్టా..

నాకు ఇంకా ఇంకా గుర్తొస్తోంది నా గతం…

ఒక్క దెబ్బకి వాడి మొహంలో చావు కళ ని పరిచయం చేసాను..

చస్తూ చస్తూ ఒరేయ్ “జ్యోతిరాదిత్యా” నేను చస్తున్నా అని చంకలు గుద్దుకోకు, నీ యముడు “రుద్రదామనుడు” ముందున్నాడు మృత్యు రూపంలో…నీ గతాన్ని గుర్తు చేసేలా నేను చేసిన ప్రయత్నం సఫలమైంది..ఇక నీ అంతమే అని కూసాడు…

హ హ్హా ప్రసన్నజిత్తూ నాకు గతం గుర్తు లేదా???ఉంది రా సమయం కోసం వేచి చూసాను…

నా గతం అంతా కళ్ళ ముందు కదలాడింది నాకు ,నేనేంటో తెలిసింది ఆ క్షణం.

ఈ “జ్యోతిరాదిత్య సంజయుడు ” తిరిగొచ్చాడు మధనం ని పూర్తి చేయడానికి,విశ్వ కళ్యాణం పూర్తి చేయడానికి…నాకు అంతమే లేదు హ హ్హా ఎదురే లేదు ఇక చావు అంటూ చివరి దెబ్బతో వాడికి చావు ని పరిచయం చేసాను.

విజయ గర్వంతో నేను ముందుకు కదలగా నా భామలు ముగ్గురూ నా వెంట నడిచారు జై జ్యోతిరాదిత్యా అంటూ…

నా సామ్రాజ్యం ప్రాణం పోసుకుంది నా పునఃస్వాగతం తో…

రాజ దర్బార్ మళ్లీ వెలసింది…

నా “మట్లి” సామ్రాజ్యం మళ్లీ ప్రత్యక్షం అయ్యింది సకల ఐశ్వర్యాలతో…

“రాజాధిరాజ మహావీర జ్యోదిరాదిత్య సంజయుడు కి స్వాగతం” అంటూ నా రాజదర్బార్ ప్రజల కరతాళధ్వనులతో మారుమ్రోగింది…

“సంపూర్ణా” అని కేకేసాను(ఇంద్రాణీ, సువర్ణా వాళ్ళ అమ్మ)..

సెలవివ్వండి మహారాజా..

ఇదిగో ఈ ఆరు వస్తువులు తీసుకొని మన ఆరు మంది సైన్యాధ్యక్షులకి ప్రాణం పోయి అని ఆదేశించాను..
(సరిత, పల్లవీ,సివంగి,పద్మలత,సువర్ణ, ఇంద్రాణీ ల వస్తువులు ఇచ్చి)..

చిత్తం మహారాజా,మిగతా ముగ్గురి సైన్యాధ్యక్షులకి ప్రాణం పోయడానికి మీ ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి అని చెప్పింది సంపూర్ణ..

అదే పని పైన ఉంటాను సంపూర్ణ…

మా మహామంత్రి జీనవల్లభుడు సహాయం తో ఆరుగురికి ప్రాణం పోసారు..

మా ముందు ఆ ఆరు మంది మహావీరులు ప్రత్యక్షం అయ్యి జ్యోతిరాదిత్య మహారాజుకి వందనాలు అని పలికారు..

మహావీరులారా సుస్వాగతం మీ అందరికీ,మన ముగ్గురు సహోదరుల పునర్జన్మ విషయమై నేను మధనానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.. నా పని పైన నేనుంటాను..మన రాజ్యాన్ని మీరే కాపాడాలి..ఆ రుద్రదామనుడు మేల్కొన్నాడు..

చిత్తం జ్యోతిరాదిత్యా మా కంఠం లో ప్రాణం ఉండగా వాడు ఏమీ చేయలేడు మన రాజ్యాన్ని మేము అదే పని పైనే ఉంటాము..

సంతోషం వీరులారా మీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది ఇక నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాను..

నా ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాను మా ఊరి వైపు మునుపటి సంజయ్ లాగా…

కాసేపటికి సివంగి,రాజన్న లు నాకు స్వాగతం పలికారు వాళ్ళ గూడెం దగ్గర..

జ్యోతిరాదిత్యా సుస్వాగతం మీకు..

ధన్యవాదాలు భేతాళా(రాజన్న),అహల్యా(సివంగి).

మహారాజా,మీరు త్వరపడ్డారేమో అన్న సందేహం నన్ను తొలిచేస్తోంది .

భేతాళా ఇది సరైన సమయం అన్నింటికీ, మీ సందేహం ఏంటో సెలవివ్వండి..

ఈ అమావాస్య అయిపోయేవరకూ మీరిక్కడ ఉండటం సమంజసం, అదీ గాక ఇంద్రాణీ తో మూడు రాత్రులు కూడా గడపలేదు..

మట్లి రాజ్యపు సకల సర్వ సైన్యాదక్షా, మీ సందేహం అర్థం ఐంది.. మధనం ఒక్కసారి జరిగినా జరిగినట్లేగా అది మరిచారు తమరు..

నిజమే మహారాజా,కానీ ఆ ఇంద్రాణీ గారు మీ పైన మోహాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండి పెట్టుకొని ఉన్నారు అది ఆలోచించండి.ఇక అమావాస్య గండం గడిచిపోయింది మీ మధనం,ఆ హోమం వల్ల..ఈ సమయంలో ఆ రుద్రదామనుడు మన ఛాయల కి కూడా వచ్చే ధైర్యం చేయడు.

వాడి వల్ల ఇప్పుడు మనకు ఏ ఇబ్బందీ రాదు,మన ఆరు మంది సైన్యాదక్షులూ సిద్ధంగా ఉన్నారు..ఇక ఇంద్రాణీ కి అన్నీ చెప్పి బయలుదేరాను మీరు చింత పెట్టుకోకండి..

అలాగే మహారాజా నేనూ మీ వెంట వస్తాను ఆదేశించండి..

వద్దు భేతాళా,మీ అవసరం ఈ రాజ్యానికి ఇప్పుడు ఎంతో అవసరం…నాకు ఇబ్బంది ఏమీ అక్కడ కలగకపోవచ్చు..

అది కాదు మహారాజా,మీకున్న శాప ప్రభావం వల్ల మీ గతాన్ని మళ్లీ మర్చిపోతారు ఈ సరిహద్దు దాటాక ,అదీ నా భయం.
.