అబ్బో గురుడు కి ఇలాంటివి కూడా తెలుసా అంది బుంగమూతి పెట్టి..
ఏదోలే మేడమ్ మీ అంత కాదు,లవర్స్ ని పట్టేసే టాలెంట్ లేదులే అన్నా నవ్వుతూ..
హ హ్హా ఇరికించావ్ లే,ఏమో రా బాబూ అదొక పిచ్చి నాకు,ఎవరినైనా చూస్తే చాలు ఇట్టే పట్టేయడం అలవాటు అయిపోయింది.
హ హ్హా అంతేలే పెద్ద కోతి ముందు పిల్ల కోతుల ఆటలు సాగుతాయా అన్నా.
చాల్లే ఏడిచావ్ గానీ,నేనేమీ ఆ టైప్ కాదు రో ఏమంటే అదొక ఆనందం అంతే..
అబ్బా నేనన్నానా నువ్వు ఆ టైప్ అని,దేవుడా ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరులే అని ఊరికే అనలేదు పెద్దోళ్ళు..
చాల్లే రా దేవుడూ,నీ సామెతలు…ఇంతకీ నీకూ,సింధూ కి ఎలా దోస్తీ కుదిరింది రా అంది.
అబ్బో ఏంటో మేడమ్ కి అంత కుతూహలం కొత్తగా??
అబ్బా చెప్పు రా నాయనా, ఏమీ అరిగిపోవు గానీ..
నాది అంత లేదులే మేడమ్,నీ ముచ్చట్లు చెప్పు.. ఇంతకీ కాలేజ్ టైం లో పెద్ద ఫ్యాన్స్ ఉన్నింటారే తమరికి అన్నా..
తను సిగ్గుపడుతూ, పోరా ఇప్పుడు అవన్నీ ఎందుకు అంది నవ్వుతూ.
ఓయబ్బో,మేడమ్ కి ఈ సిగ్గు కూడా వుందే, ఇన్ని రోజులు దాచేసారు మరి..అబ్బా చెప్పొచ్చుగా నాకూ హెల్ప్ చేసిన దానివి అవుతావు అన్నా..
ఏందిరో ఎక్కువ అవుతున్నావ్,అబ్బో మేడమ్ దగ్గరే నేర్చుకొని లైన్ వేస్తావా,ఆశ కీ ఒక హద్దుంటుంది గుర్తు పెట్టుకో..
అబ్బో నిజమే,నువ్వు మేడమ్ కన్నా ముందు ఒక ఆడ మనిషివే గా మేడమ్ అన్నా ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.
ఊ పెద్ద పాయింట్ నే పట్టావు లే ఇరుక్కుపోయేలా,సరే చెప్తా విను నా కాలేజ్ కబుర్లు అంటూ మొదలెట్టింది..
నాకు కాలేజ్ లో పెద్ద ఫ్యాన్స్ ఉండేవాళ్ళు రా,నేను లవ్ చేసాను అని చెప్పానే వాడు ప్రకాష్,వాడు మా కాలేజ్ కాదు.అయినా వాడి గురించి చెప్పకపోవడమే బెస్ట్…
ఇంకోడు ఉండేవాడు రా రవి అని,పాపం వాడు ఎంత సిన్సియర్ గా తిరిగేవాడో నా వెనక..కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు రా వాడు,కానీ చాలా మంచి బిహేవియర్ ఎప్పుడూ ఒక్క మాట అనేవాడు కాదు..ప్రతి రోజూ నా హాస్టల్ వరకు వచ్చి నవ్వుతూ తిరిగి వెళ్లిపోయేవాడు..
అంతే ఆ వయసు లో నిజమైన రవి గాడి ప్రేమ కనిపించలేదు నాకు,ఆ ప్రకాష్ గాడు మాత్రం నన్ను అబద్దాలతో పడగొట్టి నన్ను వాడుకున్నాడు… ఇప్పటికీ ఆ రవి గాడు గుర్తొస్తే బాధగా అనిపిస్తుంది అని ముగిస్తూ, ఇవే రా బాబూ నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అని కామ్ అయింది..
అయ్యో పాపం ఆ రవి అన్నయ్య, ఇప్పుడు కాంటాక్ట్ లో లేడా మేడమ్ అన్నా..
ఏ వద్దు రా అలా,ఆ ప్రకాష్ గాడి చేతిలో మోసపోయాక మగాళ్లంటేనే అసహ్యం పుట్టింది..ఆ అసహ్యం లోనే ప్రేమ కూడా సమాధి అయ్యింది..
హబ్బా అలా అనుకుంటే ఎలా మేడమ్,అందరూ అలా ఉండరు గా ,ఇంతకీ రవి అన్నయ్య ఏమి చేస్తున్నాడు ఇప్పుడు..
వాడు ఒక IAS రా జార్ఖండ్ లో వర్క్ చేస్తున్నాడట,మా క్లాస్మేట్ నే పెళ్లి చేసుకున్నాడు రవళి అని. అది ఈ మధ్యే కాల్ చేసి మాట్లాడింది..
ఓరినీ,నిన్ను లవ్ చేసి నీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడా ,పెద్ద పోటుగాడే నే మొత్తానికి అన్నా దెప్పిపొడుస్తూ..
అబ్బా అందులో వాడి తప్పేముంది రా,నేను ప్రకాష్ గాడికి పడిపోయాను అని తెలిసి పాపం సైడ్ అయ్యాడు.తర్వాత రవళి ని లవ్ చేసి సెటిల్ అయిపోయాడు..
హ్మ్మ్ పోనీలే,మీరు మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తూ కూర్చున్నారు అన్నా..
ఏమి చేయాలి రా ఏడవకుండా, అన్నీ దెబ్బలే జీవితంలో, ఈ మధ్య నువ్వు ఉన్నావ్ కాబట్టి ఏదో సంతోషంగా పోతోంది కాలం లేకుంటే నరకమే.
అబ్బా ఇంత ధైర్యంగా వుండే నువ్వు,జీవితంలో మాత్రం పిరికిదానివి మంజులా,కష్టాలు ని ఇష్టం గా మార్చుకునే శక్తి నీకు లేదా అన్నా సూటిగా..
ఆ ప్రయత్నాలు చేసాను రా నా మొగుడిని మార్చుకుందామని, కానీ ఫలితం లేదు అని నిట్టూర్చింది.
అయ్యో సారీ మంజులా దేవీ,అనవసరంగా నీకు అన్నీ గుర్తు చేసి బాధపెట్టాను అని భుజాన్ని తట్టాను జాలిగా..
అబ్బా పర్లేదులే రా బాబూ,నువ్వైనా కనీసం నాకు ఓదార్పు అయినా ఇస్తున్నావ్ అదే సంతోషం…ఇక పద నీ బజ్జీలు రెడీ హాల్ లో కూర్చో కాస్తా స్నానం చేసొస్తా ఇద్దరమూ కూర్చున్నాం అంది.
సరేలే మేడమ్ తొందరగా తెమలండి అస్సలే మీ స్నానం గంటలు గంటలు ఉంటుంది, ఏమి చేస్తారో ఏమో అన్నా.
నీ యబ్బా నీకెందుకు రా మా స్నానంతో అని మొటిక్కాయ వేసి బాత్రూమ్ వెళ్ళింది..
నేను హాల్ లో కూర్చొని టీవీ చూస్తూ ఆలోచించసాగాను ఆమె గురించి..
పాపం జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలు తగిలినా ధైర్యంగా ముందుకు సాగుతోంది ఫ్యామిలీ ని విడిచిపెట్టి, ఆ క్షణం నాకు ఆమె పైన ఉన్న కామ కోరిక ని తుంచేసి ఒక అచంచలమైన అభిమానాన్ని కలిగించింది ఆమె పైన..
Bro chala Baga rastunnavu evaru em anna pattinchukoku nuv entha raddham anukunvao antha raseyi madhyalo matram apaku broo keep going