రొమాంటిక్ చర్చ్నింగ్ 19 67

అదేదో చెప్పేయ్యొచ్చు గా మరదలా..

హబ్బా ఆశ,నీ మరదలు అంత ఈజీ గా దొరికేది కాదు..నా బావ కి నా వల్ల ఒక తియ్యటి ఫీల్ కలగాలి అప్పుడే సంతోషం..

సరేలే చూద్దాం.

ఓకే గుడ్ మార్నింగ్,బై టేక్ కేర్.

ఓకే మార్నింగ్,టేక్ కేర్.

ఆలోచించడం మొదలుపెట్టాను, తనది పక్కా మా ఊరు కాదు,ఎందుకంటే మీ ఊరి చెరువు గట్టు పైకి రమ్మని చెప్పింది సో పక్కా పక్క ఊరే.

పక్క ఊర్లల్లో నాకు తెలిసినది ఒక్క సింధు నే,ఇంకెవరు ఉన్నారబ్బా??ఎంత ఆలోచించినా నాకు అస్సలు స్ట్రైక్ కాలేదు,అలాగే ఆలోచనలో ఉంటూ నిద్రపోయాను..

పొద్దున్నే నిద్ర లేచేసరికి లేట్ అయ్యింది, త్వరత్వరగా రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్ళాను..

యధావిధిగా నాని గాడితో మాటలు,క్లాస్ లతో గడిచిపోయింది.

రమణి అస్సలు మా వైపు చూడటమే మానేసింది..

నీకే అంత ఉంటే మాకెంత ఉండాలి అన్న టైప్ లో మేమూ చూడటం మానేసాము…

సాయంత్రం ఇంటికి వెళ్తున్నాము నాని గాడు,నేనూ..

కాసేపు నడిచాక, మా ముందర ఒక ఆడ గుంపు వెళ్తోంది..

వాళ్ళల్లో ఒక అమ్మాయి దేవతలా ఉంది తెల్ల పంజాబీ డ్రెస్ లో.

చూడగానే కళ్ళు జిగేల్ మన్నాయి…

ఆ అందాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం అని చెప్పాలి.

ఆమెని చూడగానే వొళ్ళంతా ఆనందపు భావనతో మురిసిపోయింది..సంతోషం అవధులు దాటింది..

తను మాత్రం తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ నవ్వుతోంది అందంగా.

ఆ నవ్వు ని చూస్తుంటే,కడుపు నిండిపోతోంది మధురమైన రుచి తో.

నా మనసుకు ఇళయరాజా సంగీత మహత్యం అప్పుడు తెలిసింది కొట్టులో నుండి వస్తున్న రిథం తో.

“కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే,
ప్రియతమా నీవచట కుశలమా,నేనిచట కుశలమే.
ఊహాలన్ని పాటలే కనుల తోటలో, ఓహో కమ్మనీ”

ఆ క్షణం నాకోసమే ఇళయరాజా ఆ పాటని కంపోజ్ చేసినట్లు అనిపించింది…

ఇళయరాజా సంగీత మహత్యం నాకు ఒక మధురమైన భావనని ఆమె పైన కలిగేలా చేసింది.

నా చూపులు గమనించిన నాని గాడు ఒరేయ్ మామా ఏంటి రా మొదటి చూపులోనే లవ్వా???

వాడి మాటలు అస్సలు వినిపించలేదు నాకు,ఆమె నే చూస్తుండిపోయాను అలాగే.

నాని గాడిని అస్సలు పట్టించుకోలేదు,తీరా నా కళ్ళకి నాని అడ్డం వచ్చాడు తన దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడుతూ..
వీడేంటీ ఆమె తో మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి దగ్గరగా వెళ్ళాను..

నాని : అక్కా మీ పేరేంటి??

తను : నా పేరుతో నీకేంటి తమ్ముడూ పని(అందంగా నవ్వుతూ).

నాని : అక్కా చెప్పొచ్చు గా ప్లీజ్.

తను : నవ్వు చెదరకుండా ,వద్దమ్మా తమ్ముడూ లైట్ తీసుకో..

నాని : ఓకే అక్కా,ఇంతకీ ఏ ఊరు మీది??ఇక్కడ ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు..

తను : నేను నా గురించి ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు తమ్ముడూ,నాది ఈ ఊరు కాదు ఇక్కడికి దగ్గర్లో ఒక కోట ఉంది అంట గా అందరమూ ఎగ్జిబిషన్ కి వచ్చాము అంతే బై అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిపోతోంది…

ఉసూరుమంటూ నా దగ్గరికి వచ్చిన నాని గాడు,విన్నావా భలే కష్టం మామా,ఆశలు పెట్టుకోకు.

కష్టపడకపోతే ఫలితం ఉండదు మామా,సాగర మధనం జరిగాకే అమృతం పుట్టింది,తన కోసం ఆ మాత్రం చేయలేనా??

అబ్బో సంజయ్ గాడికి కవిత్వం పుట్టుకొస్తోంది,సరే గానీ ప్లాన్ ఏంటి??

ఏముంది ఫాలో అవ్వడమే నాని గా..

తప్పుతుందా కానివ్వు మరి..

ఇంటికి వెళ్లి త్వరగా ఫ్రెషప్ అయ్యి చెరువు గట్టు కి కింద ఉన్న కోట పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసాము.

ఒరేయ్ నాని గా,నాకొక కాల్ వచ్చింది రా నైట్ ,నీకు చెప్పడమే మరిచిపోయాను..

ఎవరు రా మామా.

ఎవరో రా పేరు మాత్రం చెప్పలేదు,ఈరోజు మన చెరువు గట్టు పైకి వస్తాను బావా అని చెప్పింది..

కొంపదీసి ఈ అమ్మాయే ఏమో రా ,నాకు డౌట్ వస్తోంది..

నీ యబ్బా నువ్వు మొద్దు నాయాలివి రా,అది బావా అంది నన్ను,అంటే తనకి నేనెవరో తెలుసు..ఈ అమ్మాయి ని చూస్తుంటే అస్సలు నాకు తెలిసిన దానిలా లేదు.మరి ఆ అమ్మాయే అని ఎలా అంటావ్ రా.