రొమాంటిక్ చర్చ్నింగ్ 21 77

నీకు ఇంకో ముఖ్యమైన విషయం తెలియాలి సంజయా ఆ సువర్ణ గురించి..

సువర్ణ గురించా??చెప్పండి బ్రాహ్మణా..

ఆ జ్యోతిరాదిత్య ఒక ముఖ్యమైన పని కోసం తనని నీ కంటికి కనిపించేలా చేసాడు..కానీ వాస్తవం తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేలోపు ఆమె ని బంధించి అక్కడ ఖైదు చేసాడు..ముందుగా ఆ విషయమూ తెలుసుకోవాలి మనం..

అవునా అయితే నాకు కనిపించిన ఆ అపురూప లావణ్యవతి సువర్ణా నే నా??సంతోషం ఎక్కువైంది..

అవును తనతో పాటు ఆ ఇంద్రాణీ కూడా వచ్చింది,నిన్ను కాపాడటానికి..నీకు ఫోన్స్ చేస్తూ నీ మధనం ని పూర్తి చేయడానికి సహకరించింది..కానీ ఆ మాయావి ఆమె ప్రయత్నం నీ అడ్డుకున్నాడు..

ఇప్పుడు అర్థం అయ్యింది బ్రాహ్మణా,ఆ మాయావి వాళ్ళని ఇక్కడికి ఏదో ముఖ్యమైన పని కోసం పంపాడు..కానీ వాళ్ళకి నిజం తెలిసే సరికి వాళ్ళని బలవంతంగా ఖైదు చేసాడు.

అవును సంజయా,అక్షరాలా నిజం…

అంతలోపు నాని గాడు వచ్చాడు…ఏరా సంజయ్ ఎలా ఉంది ఇప్పుడు అంటూ.

అంతా బాగుంది రా నాని,నువ్వెలా ఉన్నావ్..

నాకేమి ఇబ్బంది లేదు,ఇదిగో మా తాత నన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నాడు అనేసరికి ఆశ్చర్యం ఎక్కువైంది.

ఏంటి ఈ బ్రాహ్మణుడు మీ తాతయ్య నా??

అవును రా నిజమే,ప్రతి మధనుడికి సహాయంగా మా వంశస్తుడు ఒకడు ఉంటాడు..కానీ దురదృష్టవశాత్తు అన్నీ విఫలం అయ్యాయి..అదేంటో నీ విషయం కి వచ్చేసరికి వాడి శక్తులు పనిచేయడం లేదు..అందుకే నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు మా వాళ్ళు..

నిజంగా ఆ క్షణం చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ మాటలకి..

హ్మ్మ్ అయితే దండసేనుడు, రుద్రదామనుడు ల విషయం ఏంటి???

వాళ్ళు మంచివాళ్ళు,నీకు సహాయంగా ఉన్నవాళ్లు..వాళ్ళనీ తెలివిగా మోసం చేసి చంపాడు ఆ దుర్మార్గుడు..

అవునా ఘోరం జరిగింది… ఆ మూషిక పర్వతం దగ్గరికి వెళ్ళాలి అనేవాడు ఎందుకు బ్రాహ్మణా??

అక్కడే వాడి శక్తులు అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి..వాటిని వాడికి దక్కనివ్వకుండా రుద్రదామనుడు కాపలాగా ఉన్నాడు ఇన్ని రోజులూ..కానీ ఏడు మంది కి నీ మధనం వల్ల శక్తి వచ్చి అవలీలగా ఆ రుద్రదామనుడు ని హతమార్చి ఆ శక్తులని చేజిక్కించుకొని మహా బలవంతుడు అయ్యాడు ఆ మాయావి..

హ్మ్మ్ అయితే వాడు నా శరీరంలోకి ప్రవేశించలేక నాకు నిజాలను కనిపించకుండా మాత్రం చేసాడు అన్నమాట..

హా అవును అలాగే చేసాడు..ఇక వాడి మాయలు నీ దగ్గర పని చేయకుండా ఈ మణిహారం ని ధరించు అంటూ ఒక హారాన్ని నా మెడలో వేసాడు..

సరే నానీ,ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి??

మనం పూర్తి చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి..

1. మిగతా ఇద్దరితో మధనం జరగకుండా వాడు చేస్తున్న ప్రయత్నం యొక్క ఉద్దేశ్యం తెలుసుకోవడం..అందుకు గానూ ఆ సాధువు ని కలవాలి..

2. సాధ్విలు, సివంగి,రాజన్న లను విడిపించాలి..వాళ్ళకీ ఈ విషయం తెలిసి ఉండొచ్చు..

ఈ రెండింటినీ తెలుసుకోవాలంటే ముందుగా వాడి ప్రయత్నం ని దెబ్బ కొట్టేందుకు నువ్వు మిగతా ఇద్దరు కన్యలతో మధనం జరపాలి ఆలస్యం చేయకుండా..అలాంటప్పుడు మాత్రమే వాడి ఉద్దేశ్యం బయటపడొచ్చు..

నిజమే ఇక ఆ పనిలోనే వుందాము నానీ,ఇక వాడి దాడి నుండి తప్పించుకోవడానికి మనం ఏమి చేయాలో ఆలోచిద్దాం..

సంజయా,వాడికి ఇక మీ ఇద్దరి పైన దాడి చేసే దమ్ము లేదు,ఎందుకంటే మీ దగ్గర ఉన్న మణిహారాలు వాడి శరీర భాగాలతో చేసినవి..వాడిని వాడే నాశనం చేసుకొనే ప్రయత్నం అయితే చేయడు..

నిజమే మీరన్నది బ్రాహ్మణా.

అంతలోపు అమ్మ,నాన్న అత్తా వదినలు ఇంకా అందరు బంధువులు వచ్చారు..

అంతలోపు అమ్మ,నాన్న అత్తా వదినలు ఇంకా అందరు బంధువులు వచ్చారు

ఇక నేను సెలవు తీసుకుంటా అని పుష్యమిత్ర బ్రాహ్మణుడు బయలు దేరి వెల్తూ కార్యాన్ని ఆలస్యం చేయకుండా పూర్తి చేయి సంజయా అంటూ వెళ్ళిపోయాడు..

కాసేపు మా వాళ్లంతా కుశల ప్రశ్నలు వేసి కాస్తా ఊపిరి పీల్చుకున్నారు ముందు మనిషి లాగా తయారయ్యానని..

వాళ్ళందరూ వెళ్ళాక, నాని గాడు నేను అలా బయటికి వెళ్ళాము..

ఒరేయ్ నాని ఇప్పుడు చెప్పు రా,అసలు ఏమైంది??ఏమి జరిగింది నాకు??

ఒరేయ్ నువ్వు విన్న ప్రతి అక్షరం నీ గతంలో జరిగినదే, మా తాతయ్య లేకుంటే నువ్వొక చేతకానివాడు లా మిగిలిపోయేవాడివి…ఇప్పుడు నీ గతం అంతా గుర్తుకు వచ్చింది గా పక్కా గా??

అవును రా అంతా గుర్తుంది,ఆ మహానుభావుడు పెద్ద మేలు చేసాడు…నాకు ఇప్పుడు ఆశ్చర్యం గా ఉంది రా మామా నేను ఇలా పూజ,ఇంకా అన్ని విషయాలు చేసానని..

ఒరేయ్ ఇప్పుడు నీకు కొత్తగానే ఉంటుంది అంతా కానీ నువ్వు ఒక చరిత్ర సృష్టించావు అన్నది మాత్రం నిజం..నీ గురించి అన్నీ తెలిసినవాడిని నువ్వు చేసిన ప్రతి పనీ నాకు తెలుసు,ఏమంటే అంత త్వరగా ఈ విషయాలన్నీ ఆకళింపు చేసుకోవడానికి నీకు కాస్తా సమయం పడుతుంది అంతే.

హ్మ్మ్ అలాగే రా,నువ్వు నా ప్రాణం స్నేహితుడివి అని మాత్రమే అనుకున్నా రా ఇన్ని రోజులు,కానీ మా కుటుంబం అంతా బాగుండాలి అని మీ వంశస్థులు చేసిన మేలు మరువలేనిది రా..