మిగతా ఇద్దరి కన్యల వల్ల వాడి శక్తులు నాశనం అవుతాయి,అందుకే వాడు ఈ మధనం ని ఆపు చేయాలని చూస్తున్నాడు…ఇప్పుడు మనం వాడిని సరిగ్గా దెబ్బ కొట్టాము.. వాడు తేరుకునేలోపు మనం ఆ సాధ్వి లను విడిపిస్తే మనకు ఏ ఆటంకమూ రాదు.
అవునా అలాగైతే వెళ్దాం పద అంటూ పరుగు పరుగున నడక సాగించాము..ఎందుకో ఇంతకుముందు పద్మలత దగ్గర నుండి ఒక్క క్షణంలో సాధ్వి ల నివాసానికి చేరుకున్న విషయం గుర్తొచ్చి,ఒరేయ్ నాని గా నన్ను పట్టుకో అన్నా..
వాడు నన్ను పట్టుకునేసరికి,మనసులో గమ్యాన్ని చేర్చమని ఇత్తడి బిళ్ళని అర చేతిలో పట్టుకోగా ఒక్కసారిగా మేము సాధ్వి ల నివాసంలో తేలాము..
మా ఆత్రం ఎక్కువైంది,సాధ్వి ల నివాసం అంతా గాలించాము, ఎక్కడా వాళ్ల జాడ లేదు..
ఒరేయ్ నాని గా ఇప్పుడెలా??వాడు ఏదో మంత్రం వేసి వాళ్ళని బంధించేసాడు మనకి కనిపించకుండా అని టెన్షన్ పడుతూ అన్నాను..
సంజయ్ భయపడకు, వాడి అంతరంగం అంతా గమనించాను నేను,ఇక్కడే ఉన్నారు అని కళ్ళు మూసుకొని కాసేపు మననం చేసుకున్నాడు..
కాసేపటికి కళ్ళు తెరిచి అటు వైపు అని సైగ చేయగా,త్వరగా వెళ్ళాము.
ఒక సొరంగ మార్గం కనిపించింది,త్వర త్వరగా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక గంట పట్టింది మాకు..
ఎట్టకేలకు వాళ్ల జాడ తెలిసింది మాకు..
త్వరగా వాళ్ళందరినీ విడిపించి బయటకు తీసుకొచ్చాము ఇద్దరమూ.
సువర్ణ, ఇంద్రాణి, పద్మలత,సివంగి, సంపూర్ణ,రాజన్న అందరూ మట్టి కొట్టుకొని దీనంగా ఉన్నారు..
త్వరపడండి అంటూ నేను అనేసరికి,సంపూర్ణ మాత్రం మధనా ఒక పని చేయాలి మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలంటే అంది..
ఏంటో చెప్పండి సంపూర్ణ గారు త్వరగా…
మా వంశ దేవతకు ప్రాణం పోయాలి ,అలాంటప్పుడే మనం తప్పించుకోగలం లేకుంటే మనం బయట పడటం అసాధ్యం.
సరే ఆ మార్గం ఏంటో సెలవివ్వండి ఆ మాయావి వచ్చే లోపే.
మధనం వల్ల ప్రాణం పొందిన ఆ ఏడు మంది సైన్యాధ్యక్షులు ని బలి ఇవ్వాలి అది ఒక్కటే మార్గం..
అవునా ఎక్కడ ఉన్నారు వాళ్ళు???అయినా వాళ్లంతా మీ వంశస్తులే గా సంపూర్ణ గారు??
నిజమే ,కానీ వాళ్ళ శరీరం మాత్రమే మా వంశస్తులది మనస్సు మాత్రం ఆ మాయావి ది.. వాళ్ళని నాశనం చేస్తే ఆ మాయావి శక్తులు దాదాపు నశిస్తాయి..వాళ్ళందరూ ఇక్కడే వున్నారు అంటూ వాళ్ల వైపు బయలుదేరింది..
సంపూర్ణ గారు,మధనం కి సంబంధించిన ఇంకొక వస్తువు ని సంపాదించాను అన్నాను..
అయితే మరీ మంచిది మనకు,ఆ వస్తువు తో మన సైన్యాధ్యక్షుడికి ప్రాణం పోయొచ్చు.మిగిలిన ఇద్దరు సైన్యాధ్యక్షులు లేస్తే వాడికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.. ఎందుకంటే మిగిలిన ఇద్దరికి వాడి శరీర భాగాలను నాశనం చేసే శక్తి ఉంది..
అవునా ఇప్పటికి ఒకరికి ప్రాణం పోయండి మిగిలిన ఇంకొకరి గురించి తర్వాత ఆలోచిద్దాం అంటూ కమలా ఇచ్చిన ఉంగరంని తన చేతికి ఇచ్చాను..
తను వెంటనే ఏదో జపించి కాసేపు ఆగేసరికి మా ముందు ఒక యోధుడు ప్రత్యక్షం అయ్యాడు సంపూర్ణ కి వందనం చేస్తూ.
సంపూర్ణ వెంటనే సైగలు చేసేసరికి,ఆ యోధుడు వాయు వేగంతో వెళ్లి ఆ ఏడు మందిని ఈడ్చుకొచ్చాడు…
కపిలా, వీళ్ళ మనసుల్ని ,శరీరాల్ని మన వంశ దేవతకి బలి ఇవ్వు త్వరగా అని ఆదేశించింది..
ఆ కపిలుడు ఆలస్యం చేయకుండా ఆ వంశ దేవత ముందు ఒక్క వేటుకి అందరి తలలని తెగ నరికాడు..
ఆశ్చర్యం గా ఆ మాయావి ఏడుపులతో దద్దరిల్లింది ఆ నివాసం అంతా,అదే సమయంలో ఒక అపూర్వ సుందరి ఆ నగ్న నర్తకి శిల నుండి బయటికి వచ్చింది తేజోమయమైన కాంతితో.
వస్తూనే నా పాదాలకు నమస్కరించి,మధనా నీ వీరత్వం కి జోహార్లు ఇక వేగిర పడాలి ఇక్కడ నుండి బయటపడి అంటూ సంపూర్ణ ని ఏదో వస్తువుల కోసం వెళ్ళమని ఆదేశించింది..
ఒక్క క్షణంలో వాళ్ళ రూపాలు వేరయ్యాయి ఆమె స్పర్శ వల్ల…అందరూ వజ్ర కాంతితో మెరిసిపోయారు..
సంపూర్ణ మాత్రం వాళ్ల వస్తువులతో తిరిగి వచ్చేసరికి ఒక్కసారిగా ఆ వంశ దేవత, దిగ్బంధన మంత్రం జపించి వాళ్ల నివాసంలోకి ఎవ్వరినీ రానివ్వకుండా మంత్రం వేసి ఇక పదండి అని సెలవిచ్చింది..
నేను నా ఇత్తడి బిళ్ళ సహాయంతో అందరినీ మా ఊరిలోకి తీసుకొచ్చాను విజయవంతంగా..
ఆ వంశ దేవత మళ్లీ ఏదో జపించేసరికి మా ఊరి శివారులో ఒక పెద్ద భవంతి వెలిసింది ధగ ధగా మెరుస్తూ..
అందరమూ ఆ భవంతిలోకి ప్రవేశించాము.. అచ్చు ఆ అడవిలోని భవంతి లో లాగే ఉంది ఈ నివాసం కూడా…
కాసేపు అందరూ సేద తీరారు…అందరి మొహంలోనూ సంతోషం వెల్లివిరిసింది ఒక గండం తప్పినందుకు…
నన్ను ఎంతగానో పొగిడారు వాళ్ళందరూ..
నిజానికి నాని గాడు లేకుంటే ఇదంతా జరిగేది కాదు అని నేను సెలవివ్వగా,వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు నువ్వు లేనిదే నానీ లేడు అని..
నాకేమీ అర్థం అవ్వలేదు వాళ్ళ మాటలు,ప్రశ్నార్థకంగా మొహం పెట్టేసరికి, ఒరేయ్ సంజయ్ ఇదంతా నా కర్తవ్యం తప్ప ఇంకేమీ లేదు.మెల్లమెల్లగా నీకే అర్థం అవుతాయి అన్నీ అంటూ సముదాయించాడు..
నా కలల రాణి సువర్ణా మొహం సంతోషంతో మెరుస్తోంది,నా వైపే ఆరాధనగా చూస్తోంది ఇంద్రాణి, పద్మలత, సివంగి లతో సహా…
మనసు సంతోషంతో వెల్లివిరిసింది అపూర్వమైన ఫీలింగ్ తో..
వెంటనే రాజన్న,మహా రాణి శ్రీదేవీ ఇక మా ముందు గల కర్తవ్యం ఏంటో సెలవివ్వండి అన్నాడు..
భేతాళా, దురదృష్టవశాత్తు మన మంత్రి జీనావల్లభుడి ని మనం పోగొట్టుకోవాల్సి వచ్చింది…ఇక ఎటువంటి ప్రాణ నష్టం మనకు జరగకూడదు.మీ అహల్య(సివంగి) ని తీసుకెళ్లి మన ఈ కొత్త నివాసానికి కొత్త వారెవ్వరూ రాకుండా అష్ట దిగ్బంధన చేయండి అంటూ ఆదేశించింది..
మహారాణి శ్రీదేవి గారు,ఇక ఆ మాయావి నుండి మనకేమీ ఇబ్బంది లేదు కదా అన్నా..
పొరపాటు మధనా,ఇప్పటికి వాడిలో కొంత శక్తి మాత్రమే నశించింది..ఏడుగురు సైన్యాధ్యక్షుల శరీరంలో వాడి శరీర భాగాలని మాత్రమే మనం నాశనం చేసాము.ఇక మిగిలిన రెండు శరీర భాగాలు మిగిలిన ఇద్దరి సైన్యాధ్యక్షుల శరీరాల్లో పెట్టానని పొరపాటు పడ్డాడు వాడు,కానీ ఆ రెండు శరీర భాగాలు మీ ఇద్దరి మెడలో ఉన్న మణిహారాల్లో ఉన్నాయి..వాటిని నాశనం చేయాలంటే మన ఇంకొక సైన్యాధ్యక్షుడికి ప్రాణం పోయాలి…ఇప్పుడున్న కపిలుడు,ఇంకొక సైన్యాధ్యక్షుడు అపీలకుడు మాత్రమే ఈ రెండు మణిహారాలని నాశనం చేయగలరు…మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే మన ఇంకొక సైన్యాధ్యక్షుడు అపీలకుడికి ప్రాణం పోయడమే.. అందుకు గానూ నువ్వు మరొక కన్నె తో రమించాలి అని చెప్పింది..
నేను వెంటనే,ఇక నుండి అదే పనిలో ఉంటాను మహారాణీ అన్నాను వినయంగా..
నా దగ్గరికి వచ్చి ప్రేమగా నా నుదుటన ముద్దు పెడుతూ,మధనా మేమందరమూ నీకు రుణపడి ఉంటాము అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది..
ఊరుకోండి మహారాణీ ఇదంతా నా బాధ్యత అంటూ ఓదార్చాను..