రొమాంటిక్ చర్చ్నింగ్ 27 60

ఈ యుద్ధంలో రాజసింహుడి ప్రతిభకు ముచ్చటపడిన రాజ్యవర్ధనుడు తన రాజ్యపు సైన్యాధ్యక్షుడు గా నియమించాడు…

అంత చిన్న వయసులోనే రాజ్యపు సైన్యాధ్యక్షుడు గా నియమితం అయ్యేసరికి అందరూ ఆనందంతో మురిసిపోయారు.. భేతాళుడు ఆనందానికి హద్దులే లేవు..రాజసింహుడు ని మాటలతో పొగిడేసాడు..

దివిటీ ల మహారాజు చంద్రశేఖరుడు ప్రాణ భిక్ష కలగడంతో తన రాజ్యానికి వెళ్లి తీవ్రమైన అవమానంతో మరింత కక్ష ని పెంచుకున్నాడు కర్ణుడు,రాజ్యవర్ధనుడు పైన..10 మంది రాజులము వెళ్తే ఆ కుర్రకుంకల దగ్గర అపజయమా అని తీవ్రంగా అవమానం పొంది ఎలాగైనా ఆ రేనాటి చోళ అంతం చూడాలని అరివీర భయంకరుడైన అజీవిక రాజు పద్మనాభుడు దగ్గరికి వెళ్ళాడు..ఈ పద్మనాభుడు జ్యోతిరాదిత్యుడు యొక్క తండ్రి..

పద్మనాభుడు చంద్రశేఖరుడు చెప్పిన విషయం అంతా విని, చంద్రశేఖరా నేనూ ఆ రాజ్యాన్ని జయించాలి అని నాలుగు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాను..వాళ్ళకి రక్షణగా యోధ వంశం వాళ్ళు ఇంకా వీరుడైన మట్లి మహారాజు ధనుంజయుడు ఉన్నారు… రేనాటి చోళుల అంతం చూడాలంటే ముందు ఆ ఇద్దరి అంతం చూస్తే సరి లేకుంటే లేదు అని నిక్కచ్చిగా చెప్పాడు..

అంతలో అటువైపు యువరాజు జ్యోతిరాదిత్యుడు రావడం ఈ విషయాలన్నీ వాడికి చెప్పడం జరిగాయి.. జ్యోతిరాదిత్యుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యి వెంటనే ఆ రేనాటి చోళ సామ్రాజ్యం పైన దండయాత్ర ని ప్రకటించండి వాళ్ళ అంతం నేను చూస్తాను అంటూ ఘీంకరించాడు..

దండయాత్ర విషయం తెలుసుకున్న రాజ్యవర్ధనుడు భేతాళుడు కి కబురు పంపాడు..

భేతాళుడు ,సుధాముడు ఇద్దరూ కలిసి వచ్చి రాజమందిరంలో సమావేశం అయ్యారు…

భేతాళా,ఆ చంద్రశేఖరుడు పెద్ద మోసమే చేసాడు.ఈసారి 18 మంది మహారాజులతో జత కట్టి మన పైకి దండయాత్ర ని ప్రకటించాడు.మన ముందున్న మార్గం ఏంటి సెలవివ్వు…

మహారాజా,ముందుగా మీ బావ అయిన మట్లి మహారాజు ధనుంజయుడు కి అలాగే మీ అక్క వీర వనిత అయిన శ్రీదేవి కి కబురు పెట్టండి ఈ దండయాత్ర విషయం..మిగతాది నేను చూసుకుంటాను..

అలాగే భేతాళా,నేను ఆ పని ని పూర్తి చేస్తాను…గురువర్యా సుధామా మీ ఉపాయం చెప్పండి..

రాజ్యవర్ధనా,ఈ యుద్ధం మిగతవాటిలాగా తేలికగా తీసేయడం మంచిది కాదు,మిగతా రాజుల గురించి పక్కన పెడితే ఇప్పుడు అజీవిక యువరాజు జ్యోతిరాదిత్యుడు బరిలో ఉన్నాడు. అతడు మహా ప్రమాదకారి..తనకి విద్యలు నేర్పిన అనుభవంతో చెప్తున్నాను వాడొక మాయావి,ఏ మాత్రం రెప్పపాటు వేస్తే మన రాజ్యం కకావికలం అవ్వక తప్పదు…

నిజమే రాజగురువా,కానీ మన సైన్యాధ్యక్షుడు రాజసింహుడు అతడిని ఎదిరించే సామర్థ్యం ఉన్నవాడని తెలిసింది,నిజమేనా??

నిజమే కానీ ఈ యుద్ధంలో ఇద్దరిలో ఎవరు తెలివైన వారో వారినే విజయం వరిస్తుంది అన్నది సత్యం..మన రాజసింహుడు మంచితనానికి ప్రతీక అయితే ఆ జ్యోతిరాదిత్యుడు దుష్ట మాయావి…ఇక్కడే మన రాజసింహుడు పొరపాటు పడతాడేమో అన్న సందేహం నన్ను కలిచివేస్తోంది..

గురువర్యా మీరు మదనపడకండి నేను రాజసింహుడు కి కర్తవ్య నిర్దేశనం చేస్తాను అంటూ భేతాళుడు ధైర్యం చెప్పాడు..

అంతలోపు వర్తమానం అందుకున్న కర్ణుడు,రాజసింహుడు, సూర్యకీర్తి సమావేశ మందిరంలోకి వచ్చారు..

భేతాళుడు లేచి రాజసింహా ఎలా ఉన్నావ్ అని ఆలింగనం చేసుకొని,ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి మీ ముగ్గురూ అంటూ మొదలెట్టాడు.

ఆ జ్యోతిరాదిత్యుడు కి ఏ మాత్రం తీసిపోని విద్యలు మీ ముగ్గురిలోనూ ఉన్నాయి..వాడికున్న ఒక్క అదనపు బలం ఏంటంటే కర్ణపిశాచిని విద్య…కర్ణా,సూర్యకీర్తి మీ ఇద్దరూ వాడిని నియంత్రించడం వరకు చేయండి ఇక మిగతా పనిని కర్ణపిశాచిని విద్యలు తెలిసిన రాజసింహుడు చూసుకుంటాడు అని స్పష్టంగా చెప్పాడు..

గురువర్యా నాదొక సందేహం అని రాజసింహుడు అడగగా,ఏంటి రాజసింహా అని భేతాళుడు ప్రశ్నించాడు.

గురువర్యా,ఈ కర్ణపిశాచిని విద్యలు అన్నీ నాకు తెలుసు మరి వాడికి భయపడటం ఎందుకు??

రాజసింహా అక్కడే పొరపాటు పడుతున్నావ్,ఈ విద్య దుష్టుల చేతిలో ఉంటే దానికున్న శక్తి అమోఘం.. నీ మనసు వెన్నతో సమానం..నువ్వు ఆ దుష్టుడి దుష్ట బుద్దిని కలిగిలేవు.ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అయినా దుష్ట ఆలోచన మనసులోకి రానివ్వకు..వాడి కపట నాటకాలని ఒడుపుగా గమనించి ఎదిరించు అది చాలు…

అలాగే గురువర్యా..

సంతోషం…మట్లి రాజుల వారు వచ్చాక మీ సన్నాహాలు మొదలుపెట్టండి అంటూ భేతాళుడు ధైర్యం చెప్పాడు..

కర్ణుడు,రాజసింహుడు,సూర్యకీర్తి వెళ్ళిపోయాక సుధాముడు భేతాళుడు ని వారించాడు ఎందుకు భేతాళా రాజసింహుడు కి అలా అబద్దాలు చెప్పావ్ అని.

గురువర్యా, ఇదొక మహా విపత్తు అని నాకూ తెలుసు అలాగని పోరాడకుండా వదిలేస్తామా చెప్పండి..

నిజమే భేతాళా మన రాజసింహుడు కి ప్రాణాపాయం కదా ఇలా చేస్తే..

నిజమే కానీ మన కర్ణుడు,సూర్యకీర్తి ల బలం తోడైతే విజయాన్ని పొందుతాడన్న నమ్మకం ఉంది గురువర్యా..
అది కాదు భేతాళా,వాళ్ళిద్దరికీ ఆ దుష్టుడి “రాక్షస విద్యలు” తెలియవు గా..