గురువర్యా మీ అంతరంగం తెలియని వాడిని కాదు,మీరు అనుకున్నట్లు ఏమీ జరగదు..ఎప్పటికైనా నేను నీ దాసుడను అన్న విషయం మీరు మరవకండి..
కళ్లనీళ్లతో భేతాళుడు రాజసింహుడు ని ఆలింగనం చేసుకొని,రాజసింహా నీ మాటలు నాకు బహు ధైర్యాన్ని ఇస్తున్నవి,కానీ నువ్వు ఒక మహారాజ వంశస్థుడివి,నేను నిన్ను అహల్య ని పెళ్లి చేసుకోమని ఒక పెద్ద బాధ్యత రుద్దాను..ఇందులో నీ ఇష్టాఇష్టాలకి నేను పూర్తిగా ఆదేశం ఇస్తున్నాను,నువ్వు మట్లి రాజ్యపు యువరాణులలో ఒకరిని పెళ్లాడు, అంతా శుభం జరుగుతుంది అని ఆవేదనగా చెప్పాడు..
గురువర్యా అది జరగదు,నేనిచ్చిన మాట ప్రకారం అహల్య నే పెళ్లి చేసుకుంటాను ఇందులో ఎలాంటి మార్పూ లేదు అని నిక్కచ్చిగా చెప్పాడు రాజసింహుడు..
అది కాదు సింహా,నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను..నీ అవసరం మట్లి రాజ్యానికి ఎంతో ఉంది నా మాట కాస్తా విను..
క్షమించాలి గురువర్యా, నేను క్షత్రియ పుత్రుడనే అయితే మీరు నేర్పించిన రాజనీతి ప్రకారం ఇచ్చిన మాటని తప్పేది లేదు,ఇందులో మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ సున్నితంగా వారించాడు..
ఏమో సింహా,నా మనసుకి నచ్చినది చెప్పాను ఆపైన నీ ఇష్టం అంటూ అభిమానంగా కౌగిలించుకొని, ఇంతకీ ఆ అభీరక రాజు శిశుపాలుడు గురించి తెలుసా???
లేదు గురువర్యా సెలవివ్వండి..
వాడొక మహావీరుడు సింహా,మీ మామ రాజ్యాన్ని మూడు సార్లు జయించినవాడు..యుద్ధ విద్యలలో ఇద్దరూ సమవుజ్జీలుగా ఉన్ననూ వాడికి కర్ణపిశాచిని విద్యలు బాగా తెలుసు.జ్యోతిరాదిత్యుడు అంత క్రూరుడు కాకపోయిననూ వాడొక దుష్టుడు అన్నది నిజం..మట్లి రాజ్యపు సిరులు అన్నీ వాడి వశం అయ్యాయి..ఈ దుష్ట పాలన అంతం చేసే బాధ్యత నీ పైన ఉంది అన్నది మరవకు..
గురువర్యా నాదొక సందేహం ఉంది అంటూ మీకు ఈ విద్యలన్నీ తెలుసు మరి శత్రు రాజ్యాల పైన ప్రయోగించి వారిని ఓడించొచ్చు గా ఎందుకు ఆగుతున్నారు??
నీ సందేహం సబబైనది సింహా,కానీ నేను క్షత్రియ వంశస్థుడను కాదు..ఆ విద్యలన్నీ రణభూమిలో ప్రయోగించే అర్హత నాకు లేదు అందుకే నేను ఆ పని ని చేయలేకపోతున్నాను..
మరి అలాంటప్పుడు ఈ మన మహారాజులకే మీ విద్యలు నేర్పించి వాళ్ళని శక్తివంతులుగా తీర్చిదిద్ది విజయులని చేయొచ్చు గా.
అది అసాధ్యం,ప్రతి క్షత్రియుడికి ఒక నియమావళి ఉంటుంది..ఆ నియమావళి ని మొత్తం పాటించే క్షత్రియుడికే ఈ విద్యలు నేర్పించే బాధ్యత మన రాజగురువు అయిన సుధాముడు కి అప్పగించబడుతుంది అది నేను చేసే పని కాదు..
అలాగైతే నాకు మీరు నేర్పించారు గా గురువర్యా, ఇది ఎలా సాధ్యం..
నువ్వొక క్షత్రియుడివి అన్న విషయం నాకు తెలియదు,మా అంతరింగికులు అయిన ఒక్కరికి ఈ విద్యలు నేర్పే బాధ్యత మా వంశస్థులకి తరతరాల నుండి వస్తున్నది అందుకే నేను మా అహల్యకి నేర్పిద్దాం అని నిర్ణయించుకున్న సమయానికి మన సుధాముడు నీకు నేర్పించమని ఆదేశించడంతో నీకు నేర్పించాను..
మరి నేను మీ అంతరింగికులు కి సంబంధించిన వ్యక్తి ని కాదు గా గురువర్యా..
నిజమే సింహా,కానీ మా ఆచారం ప్రకారం నిన్ను మా వంశం లోకి చేర్చుకున్న తర్వాత ఈ పనిని చేసాను..
అర్థమైంది గురువర్యా,ఇక నా ముందున్న కర్తవ్యాన్ని పూర్తి చేస్తాను..
సంతోషం సింహా,తెలిసో తెలియక నీకు ఈ విద్యలు నేర్పించే అవకాశం నాకు కలిగింది..ఈ మహా విపత్తు నుండి మన రాజ్యాలని కాపాడే బాధ్యత నీ పైన ఉంది ఇది నెరవేర్చు..ఇంకో విషయం నీవు ఒక్కసారి ఆ రాక్షస విద్యలని కూడా మననం చేసుకో అవసరం రావొచ్చు..
తప్పకుండా గురువర్యా…
ఇంకొక సందేహం గురువర్యా, మన సూర్యకీర్తి క్షత్రియ పుత్రుడు కాదు కదా,కానీ సుధామ గురువు అతడికి కర్ణపిశాచిని విద్య తాలూకు విషయాలు నేర్పించడానికి గల కారణం ఏమై ఉంటుంది..
మన రాజగురువు అవసరం లేనిదే ఏ కార్యం చేయడు,నీకు సూర్యకీర్తి సుధాముడు యొక్క దత్తపుత్రుడు అన్న విషయం తెలుసు కదా,ఒకవేళ అతడూ క్షత్రియుడే అయ్యి ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం.. అందుకే అతడికి నేర్పించి ఉండొచ్చు..
అలాగే గురువర్యా, చూద్దాం దాని సంగతి వెనక గల కారణం..
మరుసటి రెండు రోజుల తర్వాత యుద్ధ శంఖం పూరించాడు కర్ణుడు…
రాజసింహుడు సకల సైన్యాధిపతి గా తన సైన్యాన్ని మోహరించాడు ముందుండి..
కర్ణుడు,నక్షత్రుడు,రాజ్యవర్ధనుడు, ధనుంజయుడు,భేతాళుడు,అహల్య,శ్రీదేవి ,సూర్యకీర్తి లతో కూడిన దళం సర్వసన్నద్దం అయ్యింది…అప్పుడే ఇద్దరు మహిళలు అటువైపు వేగంగా తమ అశ్వాల పైన వచ్చారు ముసుగులతో..
ధనుంజయ మహారాజు,పుత్రికల్లారా మీరూ వచ్చేసారా?అక్కడ మన రాజ్యపు సంరక్షణ ఎవరు చూసుకుంటారు అని వారించగా అక్కడ ఎలాంటి ఇబ్బందీ లేదు తండ్రీ మన సైన్యాధ్యక్షుడు సకలం చూసుకుంటాడు అని జవాబు చెప్పి తమ ముసుగులని తీసారు.
(ఆశ్చర్యం గా ఆ ఇద్దరూ సువర్ణ,ఇంద్రాణి లు..వాళ్ళ మొహాల్లో వీరత్వం స్పష్టంగా కనిపిస్తోంది.. ఒక్కసారిగా నాకు ఆనందం ఎక్కువైంది ఇద్దరు అందాల రాశులని చూసేసరికి..ఈ ఆశ్చర్యం నుండి తేరుకునే లోపే మరొక షాక్ తగిలింది నాకు పద్మలత రూపంలో)
పద్మలత కూడా తన అశ్వం పై వస్తూ తన తండ్రి రుద్రదామనుడు ని వెంటేసుకొని వచ్చింది.
పినతండ్రీ నమస్కారం అంటూ ధనుంజయుడికి అభివాదం చేసింది..
అమ్మా పద్మలతా,మీ ఇంకొక పినతండ్రి రుద్రపతి ఎక్కడ??
ఆయన మన రాజ్యం లోనే ఉన్నారు పినతండ్రీ అంటూ అందంగా జవాబిచ్చింది.
(అప్పుడు అర్థం అయ్యింది రుద్రపతి కూడా మట్లి రాజ్యపు వారసుడే అని..కానీ ధనుంజయుడు కి తోబుట్టువులు లేరు కదా మరి వీళ్ళు ఎవరు అని మాత్రం అర్ధం కాలేదు.బహుశా దాయాదులు అయ్యుండొచ్చు అనుకుంటూ లీనమయ్యాను)..
అప్పుడు వచ్చింది ఉమామహేశ్వరి యుద్ధభూమి లోకి సర్వసన్నద్దం అయ్యి .మన నక్షత్రుడు మాత్రం తనని రెప్పవేయకుండా చూడటం కనపడుతోంది..
(శ్రీదేవి గారు ఉమామహేశ్వరి తో మధనం ని చేయొద్దు అంది.కానీ తను వాళ్ల వంశం కాదు కదా?ఎందుకు వద్దు అన్నదో అర్థం అవ్వడం లేదు.బహుశా తను రాజసింహుడు అయిన నాకు వరస అవ్వదు అన్న నెపంతో అలా చెప్పిందేమో అనుకున్నాను.).
శత్రు రాజ్యం తరపున జ్యోతిరాదిత్యుడు సకల సైన్యాధ్యక్షుడు గా బాధ్యత తీసుకున్నాడు రాజసింహుడి ని అవహేళనగా చూస్తూ..
శిశుపాలుడు,పద్మనాభుడు,చంద్రశేఖరుడు లతో సహా మరియొక 15 మంది రాజులు ముందువరుసలో ఉన్నారు సిద్ధంగా..
రాజనీతి ప్రకారం ఇరు ప్రక్కల నుండి ఒక్క మహారాజు రాజగురువు సుధాముడు సమక్షంలో ప్రతిజ్ఞ చేసారు రాజనీతి తో యుద్ధం చేస్తామని..
ధనుంజయ మహారాజు,శిశుపాలుడు ఇద్దరూ ప్రమాణం చేసిన తర్వాత,ఏరా ధనుంజయా ఇంకా నీకు సిగ్గు లేదా మళ్లీ యుద్ధానికి వచ్చావ్ అంటూ శిశుపాలుడు హేళన చేసాడు..