అవును రా శిశుపాలా,ఈరోజు నీ అంతం చూడటానికే వచ్చాను అన్నది మరవకు..
హ హ్హా భలే చిత్రంగా మాట్లాడుతున్నావ్ ధనుంజయా,అదీ చూద్దాం ఇంతకీ నువ్వేనా నన్ను హతమార్చేది అంటూ మళ్లీ గేలి చేసాడు శిశుపాలుడు..
లేదురా నీకు మొగుడు వచ్చాడు,ఏ చేతులతో అయితే నా సోదరి మహాదేవి ని చంపావో అదే మహాదేవి యొక్క వీరపుత్రుడు బరిలో ఉన్నాడు, సిద్ధం అవ్వు చావడానికి అంటూ రొమ్ము విరిచి ప్రతిసవాల్ విసిరాడు ధనుంజయ మహారాజు..
హ హ్హా దాని మూలాలు లేకుండా చేసిన వాడిని,దాని కొడుకు వచ్చాడా?భలే విచిత్రంగా వుందే, ఇంతకీ ఎక్కడ వాడు??ఒకవేళ దాని వారసుడే అయితే వాడిని కూడా ఈరోజు చంపి నా పగని చల్లార్చుకుంటాను అని కోపంగా అన్నాడు..
అదిగో చూడు రా అంటూ రాజసింహుడు వైపు చూపించడం,రాజసింహుడు తన కిరీటాన్ని తీసి శిశుపాలుడు వైపు కోపంగా చూడటం జరిగాయి..
శిశుపాలుడు కొంచెం ఆందోళన చెంది,ఓహో వీడే నా ఈ రేనాటి చోళ వంశపు సైన్యాధ్యక్షుడు ,బాగు బాగు నువ్వూ సిద్ధంగా ఉండు రా కుర్రకుంకా అంటూ అవతలకి వెళ్ళిపోయాడు..
ఈసారి సైన్యాధ్యక్షుల వంతు వచ్చింది…జ్యోతిరాదిత్యుడు, రాజసింహుడు ఇద్దరూ ప్రమాణం చేసారు రాజనీతి ని దుర్వినియోగం చేయమని..ఆ ప్రమాణం చేసే సమయంలోనే జ్యోతిరాదిత్యుడు తన మాయా బలం ప్రయోగించాడు రాజసింహుడు పైన..కంటి చూపుతోనే దాన్ని తిప్పికొట్టిన రాజసింహుడు దెబ్బకి ఆశ్చర్యం పొందాడు జ్యోతిరాదిత్యుడు..
రాజగురువా సుధామా, ఇంతకీ ఇతడు క్షత్రియుడే నా అని కొత్త వివాదం తెరపైకి తీసుకొచ్చాడు జ్యోతిరాదిత్యుడు కాస్తా ఆందోళన చెంది..
జ్యోతిరాదిత్యా,అందులో ఎటువంటి సందేహం లేదు…అతడు క్షత్రియుడే కాకపోతే నా తల వేయి ముక్కలు అవుగాక అంటూ ప్రతినబూనాడు..
అప్పుడు నమ్మిన జ్యోతిరాదిత్యుడు, ఇంతకీ తమరి పుత్రుడు సూర్యకీర్తి విషయం ఏంటి మరి?తను బ్రాహ్మణుడే గా అలాంటప్పుడు యుద్ధంలో ఎలా పాల్గొంటాడు??
అతడు నా దత్తపుత్రుడు జ్యోతిరాదిత్యా,అతడు ఒక క్షత్రియుడు మీ తండ్రి చేతిలో అంతరించిన “గోపాలపురం” రాజ్య యువరాజు అంటూ నిజం చెప్పాడు..
ఆ విషయం సూర్యకీర్తి ని అమితానందంలో ముంచెత్తింది..తానొక క్షత్రియుడే అన్న విషయం తెలుసుకున్న సూర్యకీర్తి కసితో రగిలిపోయాడు తన కుటుంబం ని అంతం చేసిన పద్మనాభుడు పైన…
వాదసంవాదాల తర్వాత యుద్ధం మొదలైంది…
రాజసింహుడు మునుపెప్పుడూ యుద్ధంలో ప్రయోగించని అష్టదిక్కుల వ్యూహం తో తన సైన్యాన్ని ఉరికించాడు ముందుకి…ఆ సైన్యం కి తోడుగా సువర్ణ,ఇంద్రాణి, పద్మలత లు బయలుదేరగా ఉమామహేశ్వరి చంద్రశేఖరుడు పైకి ఉరికింది..కర్ణుడు ,సూర్యకీర్తి లు జ్యోతిరాదిత్యుడు పైకి ఉరకగా,నక్షత్రుడు,రాజ్యవర్ధనుడు, ధనుంజయుడు,శ్రీదేవీ,అహల్య,భేతాళుడు మిగిలిన రాజుల వైపు కత్తి దూసారు…రుద్రదామనుడు కూడా వాళ్ళకి జత కలిసాడు.
యోధ వంశపు యోధులు రెచ్చిపోయారు శతృమూకల పైకి విరుచుకుపడి..సువర్ణ,ఇంద్రాణి,పద్మలత ల వీరత్వం ఒక్కసారిగా చూపించేసరికి శత్రు మూకలు చెల్లాచెదురుగా భీతిళ్ళడం మొదలైంది.
రాజసింహుడు మాత్రం తన సైన్యానికి దారి చూపించి తన అశ్వాన్ని శిశుపాలుడు వైపు ఉరికించాడు…ఒక్క ఉదుటున తన ఖడ్గం ని తీసి శిశుపాలుడు పైకి లంఘించాడు….
ఆసక్తి గా యుద్ధంలో లీనమైన నాకు సంజయ్ సంజయ్ అన్న పిలుపు చికాకు తెప్పించింది బయటనుండి వస్తూ…
బుక్ మూసేసి చికాకుగా బయటికి వెళ్లిన నాకు కొండారెడ్డి కూతురు “ప్రసన్న”, మన ప్రియాంక లు కనిపించారు…
ఏంటి ఇటు వైపు వచ్చారు అని ఆరాతీయగా,నీకొక ముఖ్య విషయం చెప్పాలి తోట వైపు వస్తావా అని ప్రియాంక అడగడంతో ఓకే ఒక్క నిమిషం అంటూ ఇంట్లోకి వెళ్లి షర్ట్ వేసుకొని ఇత్తడి బిళ్ళని అరచేతిలో పెట్టుకుని బయలుదేరాను..
ఊరి పొలిమేర వరకూ ఎవ్వరూ మాట్లాడలేదు…
తర్వాత ప్రియాంక మాత్రం థాంక్స్ సంజయ్ అని అనేసరికి ఎందుకు థాంక్స్ అని ప్రశ్న వేసాను..
అదే నన్ను కాపాడావు కదా ఏదో దుష్ట శక్తి బారి నుండి అందుకే అంది…
ఫర్వాలేదు ప్రియాంకా, ఇంతకీ ప్రసన్న ని ఎందుకు తీసుకొచ్చావ్ అంటూ ప్రశ్న వేసాను..
ఇది నాకు మంచి ఫ్రెండ్ నాలాగే దీనికీ ఏవో పీడకలలు వస్తున్నాయని అంటేనూ తీసుకొచ్చా అంది..
అవునా?ఏమోస్తున్నాయ్ ప్రసన్న గారూ అంటూ ప్రశ్నించగా ఏవో పీడకలలు సంజయ్,ఏదో రాజ్యంలో నన్ను బలి ఇస్తున్నట్లు,ఎవరో నన్ను ఆవహించినట్లు ఇలా రకరకాలుగా వస్తున్నాయి అంది…
అంతేకాదు సంజయ్,నాలాగే దీనికి కూడా ఆ గ్రద్ద గుర్తు ఉంది నడుము భాగంలో అంది ప్రియాంకా..
అవునా అంటూ కాస్తా భయంగా ప్రసన్న వైపు చూసి ఒక్క నిమిషం మీరు వెళ్ళండి అని వాళ్ళు ముందుకు వెళ్లగా అత్తకి ఫోన్ కొట్టాను..
తను లిఫ్ట్ చేసేసరికి విషయం అంతా చెప్పి,ఏంటి అత్తా తనకీ ఆ గుర్తు ఉంటే నా పైన దాడి చేయక నా దగ్గరకే ఎందుకు వచ్చింది అని ప్రశ్నించాను..
అందులో ఏమీలేదు రా మరిదీ అని వదిన మాట్లాడుతూ, ప్రసన్న బహిష్టు సమయంలో ఉంటుంది ఆ సమయంలో వాడి మాయలు పనిచేయవు,ఎలాగో ప్రియాంక కి ఆ విషయం చెప్పినట్లుంది ప్రసన్న అందుకే నీ దగ్గరకు తీసుకొచ్చి ఉంటుంది అంతే..
అవునా మరి ఏమి చేయాలి ఇప్పుడు చెప్పండి..
ఏమీలేదు ముందు చేసినట్లే ప్రసన్న కి కూడా చెయ్ వాడి శక్తి ఇంకా బలహీనం అవుతుంది అంతే.