సరే అని తలూపి ఆ పుస్తకం పైన ఉన్న తాళం చెవి లాంటి గుర్తు పైన చేయి వేసా,అంతే ఒక్కసారిగా నా కళ్ళు మబ్బులు కట్టాయి ఆ పుస్తకం లో నుండి వచ్చిన మెరుపు కి..
ఓబుల్ రెడ్డి గాభరా పడుతూ,ఇక్కడ ఓపెన్ చేయకు నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అనేసరికి ఆ పుస్తకాన్ని క్లోజ్ చేసేసా…
ఇంకో ముఖ్యమైన విషయం ఈ పూజ కి ఇప్పటికి వెయ్యి సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇది బాగా జరిగితే వాళ్ళకి ఏదో శాప విమోచనం కలుగుతుంది అనేది ఒక వాదన.. నువ్వు ఏ మాత్రం తప్పిదం చేయకుండా ఈ పనిని పూర్తి జేయాల అని చెప్పాడు..
నేను అలాగే అని తలూపి, ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పేసరికి ఉత్సాహంగా విన్నా..
ఇక పద అబ్బీ నిన్ను మీ ఊర్లో దిగబెడతాను అంటూ తన బైక్ లో ఎక్కించుకొని మా పల్లె వైపు బయల్దేరాడు..
సింధు కళ్ళలో ఏదో తెలియని ఆనందం నేను వచ్చేటప్పుడు..
మా ఇంటి దగ్గర ఆపి పద ఇంట్లోకి అని వెళ్తూ మా నాన్న ని చూసి ఒరేయ్ వెంకర్రెడ్డి గా ఎట్లున్నావ్ అని అడిగేసరికి నాకు షాక్…
ఏరా ఓల్ రెడ్డి గా బాగుండా, నువ్వేట్లుండవ్ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు.. పిల్లోళ్ళు ఎట్లుండార్ర అనేసరికి ,
ఇంట్లోకి వెళ్లి కూర్చొని వెంకర్రెడ్డి గా నాకు ఇద్దరు కూతుర్లు రా,పెద్దాయిమ్మి కి పెళ్లి జేసింటి ఈ మధ్యనే, అవును ప్రసాద రెడ్డి గాడు ఎట్లుండాడు రా పద వాడిని జూసొద్దాం అన్నాడు..
ఉండు రా ఓల్ రెడ్డీ పోదాం ,అంతలో అమ్మ వచ్చి అన్నయ్యా ఎట్లున్నావ్? ఏంది శానా దినాలకు వచ్చిన్రు అని అనేసరికి నాకు షాక్ లు మీద షాక్ లు తగిలాయి..
ఒకటి మేము రెడ్డి కులస్తులమా??ఓల్ రెడ్డి కి మాకూ బంధుత్వం ఉందా?? రెండు ప్రసాద్ రెడ్డి ఎవరు?? మా వాళ్ళు కులాన్ని దాచే అంత అవసరం ఏమొచ్చింది???ఏ రోజు మా కులం గురించి మా అమ్మా నాన్న చెప్పలేదు నాకు!!!
కాఫీ తాగి ప్రసాద్ రెడ్డి ఇంటి కాడికి బయల్దేరింర్రు నన్ను కూడా రా రా అల్లుడూ అని ఓల్ రెడ్డి తీసుకెళ్తు..
ఆశ్చర్యంగా మా నాన, ఓల్ రెడ్డి ఇద్దరూ ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లి, ప్రసాదు అని పిలిచారు గట్టిగా..
మళ్ళీ షాక్… ప్రెసిడెంట్ గారు కూడా మా కులపోల్లా అని..
అంతలో పంకజం అత్త బయటికి వచ్చి ఓల్ రెడ్డి బావా ఎప్పుడు వచ్చింటివి? మా ఇమ్మి బాగుండాదా అని కుశల ప్రశ్నలు వేసింది నన్ను ఓరగా చూస్తూ…
వచ్చి నాలుగు దినాలు అయింది అమ్మీ, వాడు ఎక్కడ??
ఆయన పూజ పనులకు అడివికి వెళ్లిండు బావా రా కూర్చోండి అట్ల అన్నయ్యా అని మా నాన కి చెప్పింది…
షాక్ లకు దిమ్మ హీట్ అయ్యింది నాకు…
పంకజం అత్త నాకు నిజంగా బంధువా??ఎందుకు నాతో చెప్పలేదు?? అని ఆలోచిస్తుండగా ఇంకో పెద్ద షాక్ నాకు…
డోర్ లో అర్చనా ఆంటీ ఓల్ రెడ్డి కి దండం పెడుతూ, చిన్నయ్యా యెప్పుడు వచ్చింటివి ,చిన్నమ్మ,పిల్లోళ్ళు బాగుండ్రా అని…
ఏంది అమ్మీ ఆ పవన్ గాడు ఎక్కడికి పోయిండు, ఫోన్ చేస్తే ఎత్తడు ఏమైంది ఆడికి అనేసరికి నాకు ఏంటి ఇదంతా అని షాక్ లోకి వెళ్లిపోయా..
చిన్నయ్యా, పవన్ అదే పనిలో వుండాడు మీరు చెప్పింది పూర్తి జేసిండు భయపడకు కాలేజి లో పని ఎక్కువ ఇచ్చింర్రు అందుకే అలా వున్నాడు..
అట్లైతే ఇబ్బంది లేదులే అమ్మీ, ఎట్లుండవ్ తల్లీ అంటూ ప్రేమగా నుదురు ని నిమిరాడు..
నాకేంది చిన్నయ్యా అంతా బాగుంది,ఒక వైపు సంజయ్ గాడు ఇంకో వైపు పంకజం పిన్ని అందరూ సాయం చేస్తూ ఏ లోటు రానివ్వలేదు అంటూ ఆనందంగా చెప్పింది…
పంకజం అత్త, అర్చనా ఆంటీ ఇద్దరూ నాకు బంధువులు నా?నాకెందుకు చెప్పలేదు వీళ్లు??ఏమి జరుగుతుందో అర్థం అవ్వట్లా..
అదే టైమ్ లో నాకు కోపం అలివి కాలేదు,తీక్షణంగా ఆంటీ అత్త ల వైపు చూసా…
వెంకర్రెడ్డి అన్నయ్యా, ఇన్నాళ్లకు మనకి విముక్తి కలగబోతోంది,మనకు జరిగిన అన్యాయాన్ని ఈడే తీర్చాల అందుకే ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డాం ఎవ్వరికీ తెలియకుండా,ఇక ఆగేది లేదు ప్రసాదు వచ్చాక మన ప్లాన్ ప్రకారం ఆ కొండా రెడ్డి గాన్ని మూసేద్దాం పూజ అయ్యేవరకు అంది పంకజం అత్త..
అది పెద్ద విషయం కాదు అమ్మీ, ఎవరో రంగి అంట దానికి సుఫారీ ఇచ్చిండు ఆ గలీజ్ నాయాలు వీడిని చంపమని అన్నాడు..
ఆ రంగి దొంగదా?నాకు అప్పుడే డౌట్ వచ్చింది బావా ,దాని పని నేను జూసుకుంటా భయపడకండి…ముందే దాని పైన అనుమానం వచ్చింది అడిగి మరీ ఇక్కడ ఎందుకు పనికి కుదిరిందా అని…
అట్లాగైతే ఇబ్బంది ఏమీ లేదమ్మి , నేను వెళ్లి ఆ కొండా రెడ్డి గాడ్ని కదలకుండా జేసేస్తా వీడిని జర జాగ్రత్తగా జూసుకోండి, ఆ ప్రసాద్ గాడు వచ్చినాక కలవమని చెప్పు ఆడికి ,ఇక నేను పోయొస్తా అంటూ అందరికి సెలవు చెప్పి వెళ్లిపోయిండు…
మా నాయన కూడా ఓల్ రెడ్డి తో పాటే వెళ్లిపోయేసరికి నేను ఆంటీ,అత్త మిగిలాము..

Ee sari ayyana total storie complete cheyandhi sir…
Super Story Continue
Super Story Continue bro