సింధూ మొహం లో కూడా అదే భయం..
ఏమైంది అని నేను అడిగేసరికి, వీడు దుర్మార్గుడు ఇంకో మనిషిని చంపేస్తాడంట,మా నాన ని ఇలాగే భయపెట్టి మమ్మల్ని ఊరిలో లేకుండా చేసాడు అంది కోపంగా…
ఇంతకీ వాళ్ళు ఎవరిని చంపాలి అనుకుంటున్నారో నీకు తెలుసా అన్నా..
లేదు తెలియదు ఎవరో పాపం..
అది నన్నే అన్నా కొంచెం భయం నిండిన ఫేస్ తో..
నిన్నా??రేయ్ నువ్వేనా ఆ పూజ కి వెళ్ళేది అంటూ నన్ను వడి వడిగా లాక్కొని వెళ్లి పద మా ఇంటికి అంటూ తెగ ఆందోళన తో నడుస్తోంది..
ఏయ్ సింధూ ఏమైంది అన్న నా మాటని పట్టించుకోకుండా కామ్ గా రా అంటూ కాసేపు నడిచాక ఆమె చేతిని వదిలేసి , మా ఇంట్లో నీ గురించి పెద్ద టాక్ మర్యాదగా వాళ్ళు చెప్పింది విని వెళ్ళు, నీకు తప్పక హెల్ప్ అవుతుంది అంది..
ఏంటో అర్థం కాక వాళ్ళ ఇంటికి చేరుకున్నాం కాస్త ఆందోళన తో…
ఇల్లు లంకంత ఉంది, ఇంట్లోకి అడుగు పెట్టిన నన్ను అందరూ కొత్తగా చూస్తూ ఎవరమ్మా సింధూ ఇతను అని ఒక పెద్దమ్మ అడిగేసరికి ,అవ్వా ఇతడు సంజయ్ పక్క ఊరిలో ఉంటాడు,నాన్న ఎక్కడ??అంటూ నాన్నా అని కేక వేసింది…
ఇంతలో ఒక ఆజానుభాహుడు,ఆయన చుట్టూ ఇద్దరు ఆజానుభాహులు వచ్చారు…
సింధు, నాన్న ఇతను సంజయ్,నాకు ఫ్రెండ్ కాస్త ఇంట్లోకి పద మాట్లాడాలి అంటూ ఇంట్లోకి తీసుకెళ్లింది నన్ను.
నేను అందరికీ నమస్కారం చేసి ఏమి జరుగుతుందో అర్థం కాక వాళ్ల పక్కన కూర్చున్నా..
ఇంతలో సింధూ ,నాన్నా సంజయ్ నే ఆ పూజ కి వెళ్ళేది అంది ఉత్సాహంగా..
వాళ్ళు అందరూ ప్రేమతో నిండిన కళ్ళతో నా దగ్గరికి వచ్చి నేనేదో వాళ్ళకి దగ్గరి చుట్టం అన్నట్లుగా ఏమబ్బి బాగుండావా అంటూ కుశల ప్రశ్నలు వేసి తెగఇబ్బంది పెట్టారు ప్రేమతో..
నాకు ఏంటో కొత్తగా ఉంది,కాసేపు నిశ్శబ్దం తర్వాత సింధు వాళ్ల నాన్న నా పేరు ఓబుల్ రెడ్డి అబ్బీ, వీళ్ళు ఇద్దరూ నా తమ్ముండ్లు నీకోసమే మేము ఈ ఊరు వచ్చినం అన్నాడు..
నేను ఆశ్చర్యం తో నాకోసమా అంకుల్??నాకోసం ఎందుకు వచ్చారు??
అదీ చెప్తా అబ్బీ, ఈ పూజ చాలా ఇంపార్టెంట్ నీకు చాలా విషయాలు తెలియాలి అంటూ దేవుడి గది లోకి తీసుకెళ్లి ఆ ప్రతిమ దగ్గర కూర్చో అని ఒక దేదీప్యమానంగా వెలుగుతున్న విగ్రహం ముందు నిలబెట్టారు.
బెరుకుగా కూర్చొని ఏంటి అంకుల్ ఇదంతా అన్నా కాస్త గాభరా పడుతూ..
అంతలో సింధూ కొండా రెడ్డి ప్లాన్ అంతా వివరించింది..
ఓబుల్ రెడ్డి గారు నువ్వేమీ భయపడకు అబ్బీ,మేము అంతా వుండంగా నీకేమి గాదు అని చెప్పాడు…
నేను ఇంతలో ఇంతకీ ఆ కొండా రెడ్డి కి నన్ను చంపాల్సిన అవసరం ఏంటి అన్నా..
ఓబుల్ రెడ్డి ,ఈ పూజ జరిగితే వాడికి చాలా నష్టం జరుగుతాది అందుకే .
నష్టమా??అదేంటి అంకుల్?
అవును అబ్బీ వాడి ఆస్థిలో 99 భాగాలు సాధ్వి లకు చెందుతుంది ఈ పూజ జరిగితే,అందుకే వాడు ఇట్ల జేస్తుండు..
అర్థం కాలా అంకుల్! వాడికి పోవడం ఏంటి?
అది ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు,తరతరాల నుండి ఈ కట్టుబాట్లు జరుగుతున్నాయి అవి దెబ్బ కొట్టాలి అన్న ప్రయత్నం వాడి ఆలోచన…
సరే ఒకటి గుర్తు పెట్టుకో, ఆ దేవతా మూర్తిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆమె పాదాల దగ్గర ఉన్న ఆ పుస్తకం తీసుకో అది నీకు చాలా ఉపయోగపడుతుంది అనేసరికి నేను ఆమె ని తలుచుకొని ఆ పుస్తకం ని తీసుకున్న.
ఈ పుస్తకం సాధ్వి వాళ్ళ చరిత్ర,ఇది ఇంత వరకు ఎవ్వరూ ఓపెన్ చేయలేదు ,ఎవ్వరికి అంటే వాళ్లకి ఓపెన్ అవ్వదు ఆ పూజ కి వెళ్ళేవాళ్ళకి తప్ప,ఇది అంతా ఔపోసన పట్టి వాళ్ళ మహత్యం తెలుసుకో అన్నాడు..

Ee sari ayyana total storie complete cheyandhi sir…
Super Story Continue
Super Story Continue bro