ఆర్గనైజర్స్ వచ్చి సర్ ను ప్రత్యేకంగా అభినందించి అక్కడికక్కడే చెక్ అందించారు .
సర్ మిగతాసార్లను కౌగిలించుకుని ఫస్ట్ బిగ్ ఈవెంట్ సక్సెస్ అని ఆనందాన్ని పంచుకున్నారు . అతిథులందరూ డైనింగ్ వైపు వెళుతుంటే ఫ్రెండ్స్ ఇక డిన్నర్ ఏర్పాట్లుకూడా సక్సెస్ చేసామంటే మనగురించి వైజాగ్ మొత్తం తెలుస్తుంది లెట్స్ గో అని హైఫై కొట్టుకుని మహేష్ కృష్ణ ……… రండి అని బయట arange చేసిన దగ్గరకు పిలుచుకొనివెళ్లారు .
మహేష్ కృష్ణ ……….. విజయం సాధించాము , ఇందులో మీ వంతు కూడా ఉంది , ఆకలివేస్తే వెళ్లి తినండి అంతా మనం ఏర్పాటుచేసినదే అనిచెప్పారు . అక్కడ వంటలను చూసి మాకు నోరూరిపోయింది . ఎలా రా మామా మన శరణాలయంలోని పిల్లలు లేకుండా తినడం అని బాధపడ్డాము .
10 గంటలకల్లా ……… గెస్ట్స్ అందరూ తినేసి లవ్లీ ఫుడ్ – tasty ఫుడ్ అనిచెప్పేసి వెళ్లిపోయారు . మేము తిన్నామేమో అనుకుని సర్ వాళ్ళుకూడా వెళ్లి తిన్నారు . ఎక్కువైన పర్లేదు ఒక్క వంటా మిస్ అవ్వకూడదు అని చాలా వంటలు చేయించడంతో మిగిలిపోవడం చూసాము .
నాదేవత కూడా ఇక్కడికే వచ్చి తింటారా అని ఆశతో చూసి చూసి రాకపోవడంతో నిరాశ చెందాను .
రేయ్ ………. మిస్ వైజాగ్ కూడా మన వంటలను తృప్తిగా ఆస్వాదించారట అని ఆ ఏర్పాట్లు చూసుకున్న ఒక సర్ వచ్చి సర్ వాళ్లకు చెప్పడంతో అందరూ ఆనందించారు. అంటే నాదేవత లోపల తిన్నారన్నమాట మళ్లీ చూస్తానో లేదోనని మనసులో అనుకున్నాను .
మహేష్ ……… రండి అని పిలిచి done a good job ఇదిగోండి అని పర్సులోనుండి నలుగురికీ కలసి పదివేలు అందించి , రేపు కూడా ఈరోజు వచ్చిన సమయానికి వచ్చెయ్యండి అనిచెప్పారు .
సర్ ………. మాకు డబ్బు వద్దు . ఎలాగో చాలా వంటలు స్వీట్స్ మిగిలిపోయాయి వాటిలో కొన్ని మాకు ఇస్తే శరణాలయంలో షేర్ చేసుకుని తింటాము . తప్పుగా మాట్లాడితే క్షమించండి .
సర్ : తింటారా ? మహేష్ ……… అయితే మీరు ఇంకా తినలేదా ? , తిన్నారు అనుకుని మేము పిలవనైనా పిలవలేదు అని సర్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు . రేయ్ రేయ్ ఫ్రెండ్స్ అందరమూ తప్పుచేసాము . ఇద్దరు వెళ్లి నాలుగు ప్లేట్లలో వడ్డించుకునివచ్చారు .
సర్ ……….. మా అన్నయ్యలు తమ్ముళ్లను వదిలి ఇంత costly ఫుడ్ తినలేము . ఏది తిన్నా మేము కలిసే తింటాము లేకున్నా కలిసే పస్తులుంటాము .
సర్ : ఫ్రెండ్స్ మొత్తం మిగిలినవన్నింటినీ ఫైవ్ స్టార్ పార్సిల్లా ప్యాక్ చేయించండి . అలాగేరా అంటూ సర్ వాళ్ళు వెళ్లారు . తమ్ముళ్లూ ……… షేర్ చేసుకోవడం కాదు తృప్తిగా తినండి .
నలుగురమూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో చేతులెత్తి నమస్కరించాము .
సర్ : తమ్ముళ్లూ ………. ఆపండి ఆపండి , ఈ డబ్బు మీ కష్టానికి ఫలితం అని 2500 మా జేబులలో ఉంచారు .
రేయ్ రెడీ రా అని సర్వర్లు తీసుకొచ్చిన పెద్ద పెద్ద పార్సిళ్లను చూయించారు . మహేష్ ………. ఆలస్యం అయ్యింది మా కారులో వదులుతాము రండి అన్నారు .
సర్ ………. ఇప్పటికే మాకోసం చాలా చేశారు . మేము నడుచుకుంటూ వెళ్లిపోతాము మీరు సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాము .
సర్ : మహేష్ చాలా బరువున్నాయి చాలా ఉన్నాయి . కనీసం ఆటోలోనైనా వెళ్ళండి అని పార్సిళ్లను పట్టుకుని బయటకు నడిచాము . రెండు ఆటోలను ఆపి సర్దారు . మహేష్ ………. మీరెక్కడ కూర్చుంటారు ఆటోలు నిండిపోయాయి , అందుకే మేము వదులుతాము అన్నది .
సర్ ………. ఇక్కడ అని ఆటో డ్రైవర్ కు ఇరువైపులా కూర్చున్నాము .
ఆటోలకు డబ్బులు కూడా సర్ ఇచ్చారు .
సర్ ……… మాజీవితంలో ఇప్పటివరకూ చూడనంత డబ్బు ఇచ్చారు మేము ఇస్తాము లేండి .
సర్ వాళ్ళు నవ్వుకుని మహేష్ కృష్ణ జాగ్రత్త రేపు కలుద్దాము గుడ్ నైట్ ………
గుడ్ నైట్ సర్ అని కేకలువేసి బయలుదేరాము . అర్ధరాత్రి అవుతుండటంతో సిటీ మొత్తం ప్రాసాంతంగా ఉంది .
రేయ్ మామా మనవాళ్ల పెదాలపై చిరునవ్వులు చూడబోతున్నాము .
కృష్ణ : అవునురా మామా ……….. అన్నయ్యా అన్నయ్యా …….. ఇటువైపు ఇటువైపు అనిచెబుతున్నా , మరొకవైపుకు పోనిచ్చి నాకు తెలియదా అటువైపు రోడ్ బాలేదు అని ఏకంగా సిటీ దాటి పొలాల్లోకి పోనిచ్చారు . వెనుక ఆటో మమ్మల్నే ఫాలో అయ్యింది .
మెయిన్ రోడ్ నుండి టర్న్ చేసి కొద్దిగా లోపలికి తీసుకెళ్లాడు . ఎదురుగా ఇద్దరు నిలబడిన దగ్గర ఆపి కిందకు దిగమని దిగి వాళ్ళతో చేతులుకలిపి , రేయ్ పిల్లనాయాల్లారా ………..జీవితంలో చూడనంత డబ్బా …….. అదికూడా ఫైవ్ స్టార్ హోటల్ నుండి బయటకువచ్చారు . మర్యాదగా డబ్బు ఇచ్చేసి పరిగెత్తి వెళ్లిపోండి .
వెనుక ఆటో డ్రైవర్ వచ్చి హలో బ్రదర్ వైజాగ్ లో ఆటోవాలాకు ఒక గుర్తింపు ఉంది పాపం కష్టపడి సంపాదించినట్లున్నారు – ఆ డ్రెస్ చూస్తే తెలుస్తోంది . బ్రదర్ పాపం అనాధలు అని చెబుతుండగానే రేయ్ నీ సోధి ఆపరా ……… లేకపోతే నీకు ఆటో లేకుండా చేస్తాము అనిచెప్పడంతో సైలెంట్ అయిపోయాడు .
అన్నయ్యలూ ……….. ఈ డబ్బు బుజ్జాయిల బుక్స్ కోసం please మమ్మల్ని పోనివ్వండి అని ఎంత బ్రతిమాలినా వినకుండా మా జేబులలోని డబ్బుని తీసుకుని చూసి మా జేబులన్నీ వెతికి ఇంతేనా ఏదో లక్షలు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు కదరా అని నెత్తిపై కొట్టి వెళ్లండ్రా వెళ్ళండి కనీసం మందు బాటిల్ కైనా ఇచ్చారు .
థాంక్స్ అన్నయ్యలూ అని ఆటోలోని పార్సిళ్లను అందుకోవడం చూసి కొంపదీసి అందులో ఉన్నాయా అని మాచేతులలోనుండి అందుకొని చూసి ఫుడ్ రా అని కింద పడెయ్యబోయారు .
అన్నయ్యా ……… డబ్బు తీసుకున్నారు ok – కొట్టారు ok ……… అది ఎంతోమంది పిల్లల ఆకలి తీరుస్తుంది వద్దు వద్దు అనిచెబుతున్నా కూడా పోండిరా పోండి అని తోసేసి , రేయ్ స్వీట్స్ మనమేమిచేసుకుంటామురా అని రెండు పార్సిళ్లను కిందకుపడేసి కాళ్లతో తొక్కి మళ్లీ ఆటోలోనుండి అందుకోబోయారు . చూసి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసి కోపంగా మారి రేయ్ అంటూ నలుగురమూ చేతులుకలిపి మైకంలో ఉన్న వాళ్ళమీదకు ఎక్కేసి వెంట్రుకలు లాగి ఆకలి గురించి మీకేమీ తెలుసురా అని తలపై పిడిగుద్దులు గుద్దడంతో ముగ్గురూ కుప్పకూలారు . కన్నీళ్ళతో కిందపడిన స్వీట్స్ ను కవర్లలో ఎత్తుకుని ఆటోలోనివి తీసుకున్నాము .
తమ్ముళ్ళూ ………. భయంతో ఎలాగో మీకు హెల్ప్ చెయ్యలేకపోయాను . డ్రాప్ చేస్తాను రండి అని అన్నింటినీ ఎలాగోలా వెనుక ఆటోలో సర్దాము . ఒక్కనిమిషం అని భయపడుతూనేవెళ్లి వాళ్ళ జేబులోని డబ్బుని తీసుకొచ్చి అందించారు . మా 10 వేలు మాత్రమే తీసుకుని అన్నయ్యా ……… మీకే అని జేబులో ఉంచేసి , నలుగురికీ సమానంగా పంచి , ఆటోని పట్టుకుని బయట నిలబడి శరణాలయం చేరుకున్నాము . లోపలకు అన్నయ్య కూడా తీసుకొచ్చారు . థాంక్స్ చెప్పడంతో నేనే థాంక్స్ చెప్పాలి అని వెళ్లిపోయారు .
వరండాలో చెక్క మంచం పై పడుకున్న వార్డెన్ దగ్గరికివెళ్లి వార్డెన్ వార్డెన్ …….. అని నెమ్మదిగా లేపాము .
వార్డెన్ : మహేష్ కృష్ణ ………. వచ్చారా అని లేచి లైట్ న్ చేసి మాదెబ్బలను చూసి ఏమైంది అని కంగారుపడ్డారు .
అదేమీ లేదు వార్డెన్ అని జరిగింది వివరించాము .
వెంటనే లోపలికివెళ్లి డెటాల్ కాటన్ తీసుకొచ్చి అందించారు .
వార్డెన్ ఈరోజు సంపాదన అని నా 2500 /- వార్డెన్ చేతికి అందించాను . ముగ్గురూ కూడా ఇచ్చేసారు .
వార్డెన్ : బుజ్జాయిలకు మీరే ……..
వార్డెన్ అవన్నీ మాకెలా తెలుసు మాకు అన్నీ మీరే , ఆకలేస్తోంది మన అందరికోసం సర్ వాళ్ళు భోజనం పంపించారు . అన్నయ్యలూ – తమ్ముళ్లూ ……… తిన్నారా ?
వార్డెన్ : ఉద్వేగంతో మా నలుగురినీ హత్తుకుని , భోజనంలో బల్లి పడటం వలన అందరూ నీళ్లు తాగి పడుకున్నారు .
అవునా అంటూ పరుగున అందరిదగ్గరికీ వెళ్ళాము . ఆకలివలన అమ్మా అమ్మా …… అంటూ నిద్రపట్టక కడుపులపై చేతులను పట్టుకుని అటూ ఇటూ కదులుతున్నారు .
చూసి చలించి నలుగురమూ కన్నీళ్లను కారుస్తూ వెళ్లి అన్నయ్యలూ – తమ్ముళ్లూ ……. వార్డెన్ మనకోసం ఫుడ్ తీసుకొచ్చారు లేవండి అని లేపి బుజ్జాయిలను ఎత్తుకొనివెల్లి అందరి ప్లేట్లలో వడ్డించాము .
ఒకరినొకరు వెలిగిపోతున్న కళ్ళతో చూసుకుని , వార్డెన్ ……… ఇలాంటి భోజనం తినడం ఫస్ట్ టైం అని నాన్ వెజ్ స్వీట్స్ fruits ……… మ్మ్మ్…..మ్మ్మ్…… అని ఆకలికి మించి తిన్నారు . వార్డెన్ ఈరోజుని ఎప్పటికీ మరిచిపోము లవ్ యు అని హత్తుకుని పాదాలను తాకి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారు .
వార్డెన్ : మహేష్ ……… నేనని ఎందుకు చెప్పారు .
వార్డెన్ ………. మీరుకాక ఇంకెవరు రండి ముందు తిందాము అని మిగిలినవి ఆవురావురుమంటూ కళ్ళల్లో చెమ్మతో తిన్నాము .
వార్డెన్ : మాకోసం మీరుకూడా తినలేదు కదూ ……… మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు .
మనపై ఆ దేవుడికి కరుణ లేదు వార్డెన్ , ఈరోజు జరిగిన సంఘటనలను బట్టి మన కోరికలను మనమే కష్టపడి తీర్చుకోవాలని అర్థమైంది . ఇన్ని సంవత్సరాలూ ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాము అని మా ప్లేట్లను కడిగేసి అలసిపోయాము వార్డెన్ ఉదయమే లేచి చదువుకోవాలి అనివెల్లి అందరితోపాటు వాలిపోయాము . ఇంతమంది ఆకలి తీర్చినందుకు చాలా ఆనందం వేస్తోంది ఒక కిక్కు ఉంది అని పెదాలపై చిరునవ్వుతో దోమలను కొట్టుకుంటూ హాయిగా హ హ ……. పడుకున్నాము .
రాత్రంతా నాదేవత గురించే మధురమైన కలలు . తెల్లవారకముందే లేచి బుక్ తీసుకుని శరణాలయం బయటకువెళ్లి స్ట్రీట్ లైట్ కింద చదువుతూ , ఆ రోజు న్యూస్ పేపర్ రాగానే అందుకుని ఆతృతతో పేపర్ మొత్తం తిరగేసి డిస్ట్రిక్ట్ హెడ్లైన్స్ లో మిస్ వైజాగ్ అని కిరీటం తో ఉన్న నాదేవత ఫోటోచూసి పెదాలపై చిరునవ్వుతో పరవశించి , ఎవ్వరూ లేకపోవడం చూసి ఫోటో కట్ చేసుకుని , పేపర్ ను రోజూ ఉంచే స్థానంలో ఉంచేసి లోపల వరండాలో చదువుతూ కూర్చున్నాను .
కొద్దిసేపటి తరువాత నా ఫ్రెండ్స్ లేచివచ్చి , చదువుకోవడానికైతే రోజూ లేపేవాడు కదా ఈరోజు ఏంటి ఒక్కడే చదువుతున్నాడు అని దూరంగా గాలికి కదులుతున్న పేపర్ ను చూసి వెళ్లి పేపర్ కట్ చేసి ఉండటం చూసి ,
రేయ్ కృష్ణా ……… నిన్న నువ్వు చెప్పినది నిజమేరోయ్ , మనోడి బండి కదిలింది అని సూరి చెప్పాడు .
కృష్ణ : ష్ ష్ ష్ …………. రాత్రికి సర్ప్రైజ్ తో వాడిని ఆటపట్టిద్దాము అని ముసిముసినవ్వులు నవ్వుకుని , నాదగ్గరికి వచ్చి వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ చదువుతున్నారు .
నేనైతే దించిన తల ఎత్తనేలేదు .
లైట్ గా ఉప్మా తినేసి కాలేజ్ కు వెళ్ళాము . నిన్న రాత్రి పడుకోవడం ఆలస్యమైనా నిన్న అలసిపోయినా కాలేజ్లో మరింత ఉత్సాహంతో క్లాస్సెస్ విన్నాము – ప్రతి క్లాస్ పూర్తవగానే నా దేవత ఫోటోని చూసి ఆనందించేవాడిని – ఇరువైపులా ముసిముసినవ్వులు వినిపించేవి చూస్తే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు . 4 గంటలకు శరణాలయం కు వచ్చి ఫ్రెష్ అయ్యి నా దేవత ఫోటోని ట్రంక్ లో జాగ్రత్తగా ఉంచేసి , వార్డెన్ కు చెప్పి కంపెనీకి చేరుకున్నాము . నేరుగా సర్ వాళ్ళ ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళాము . వెంకట్ అన్నయ్యా ……… సర్ వాళ్ళను కలవచ్చా అని అడిగాను .
ఒక్కనిమిషం అని లోపలికివెళ్లివచ్చి వెళ్ళండి అని పంపించారు .
Hi మహేష్ , కృష్ణ ………. ఈరోజు ఇక్కడే పని .
OK సర్ ………. నిన్నదానిగురించి మీకు థాంక్స్ చెబుదామని వచ్చాము అని రాత్రి అందరూ తృప్తిగా తిని హాయిగా నిద్రపోవడం గురించి చెప్పాను .
మహేష్ ………. మాకు కూడా కాస్త పుణ్యం దక్కిందన్నమాట అని నవ్వుకున్నారు .
వెళ్లి వర్క్స్ అలాట్ చేసే సర్ దగ్గరికివెళ్లాము .
మహేష్ నిన్నట్లానే నువ్వు మీ సర్ దగ్గరే ఉండు – కృష్ణ , రవి , సూరి …….. మీరు లోపల నిన్నటి షో ఎడిటింగ్ జరుగుతోంది వాళ్లకు కావాల్సినవి అందించండి .
కృష్ణ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ మాకు కావాల్సింది కూడా అదేనని మురిసిపోయారు .
సర్ : తమ్ముళ్లూ ……… ఇక నుండి మీకు నెలనెలా జీతం ఇస్తారు సర్ . ఒక్కరోజులోనే మీరు పర్మనెంట్ అయిపోయారు . మధ్యలో డబ్బు అవసరమైతే అడగండి మరియు మనం చేసే ప్రతి ఈవెంట్ కు స్థాయిని తగ్గట్లు బోనస్ కూడా వస్తుంది .
సర్ మాటలకు సంతోషంలో షాక్ కొట్టినట్లు అలా నిలబడిపోయాము .
సర్ : మహేష్ , కృష్ణా ……… అని భుజాలను కదపడంతో స్పృహలోకొచ్చి నలుగురమూ కౌగిలించుకుని ఎవరి పని దగ్గరకు వాళ్ళము వెళ్లిపోయాము .
ఆరోజు 9 గంటలకే పనులు పూర్తవ్వడంతో సర్ వాళ్ళు వెళ్ళమని చెప్పారు .
గుడ్ నైట్ చెప్పేసి బయలుదేరాము . రేయ్ కృష్ణా ……… ఏంటిరా ఆ కవర్ .
కృష్ణ : వేస్ట్ వైట్ పేపర్స్ లేరా , సర్ ఇచ్చారు అని ఉత్సాహంతో చిందులేస్తూ శరణాలయం చేరుకుని , నా దేవతను గుండెలపై హత్తుకుని మళ్లీ దాచేసి , అన్నం పప్పు తిని అందరి పిల్లలతోపాటు చదువుకోవడానికి కూర్చున్నాము .
అన్నయ్యలు తమ్ముళ్ళంతా ఒక్కొక్కరే వెళ్లి నిద్రపొయారు . చివరగా మేము నలుగురము మిగిలాము .
కృష్ణ : రేయ్ మామా ……… పాస్ అనిచెప్పి ముగ్గురూ వెళ్లి 15 నిమిషాలకు వచ్చారు.
చదువుకుంటున్న నా పుస్తకం పై గిఫ్ట్ ఉంచారు .
ఫ్రెండ్స్ ……….
