పెద్దమ్మ

రేయ్ రేయ్ మామా ………..
సడెన్ గా లేచి కూర్చుని నాదేవత ఫోటోని కళ్ళుతెరిచి చూసి పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ goddess ఈరోజు మన బ్యూటిఫుల్ వైజాగ్ లో అడుగుపెట్టబోతున్నారు – మరింత అందాన్ని తీసుకురాబోతున్నారు అని సిగ్గుతో మురిసిపోతున్నాను .
మూడువైపులా ముగ్గురూ తియ్యని కోపంతో కన్నార్పకుండా నావైపే చూస్తుండటం చూసి నవ్వుకుని , గుడ్ మార్నింగ్ రా ……… సమయం ఎంత అని అడిగాను .
సూరి : 4 గంటలు రా …………
రేయ్ మామా గంటలో సర్ ముందు ఉండాలిరా అని నాదేవతను గుండెలపై హత్తుకుని , ఫోటోలన్నింటినీ బాక్స్ లో ఉంచేసి , ఒక్కనిమిషం లో వస్తానురా అని లోపలికి పరిగెత్తి నా ట్రంక్ లో ఉంచేసి లాక్ చేసాను . బట్టలన్నీ విప్పేసి టవల్ చుట్టుకొని బావిదగ్గరకు చేరి నలుగురమూ below టెంపరేచర్ లో ఉన్న నీటితోనే వణుకుతూ హుషారుగా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి , అమ్మవారిదగ్గరకువెళ్లి ప్రార్థించి , వార్డెన్ కు మధ్యాహ్నం పెళ్లి బోజనంతో వస్తామనిచెప్పి హుషారుగా బయలుదేరాము .

మాటిచ్చినట్లుగానే అందరికంటే ముందు ఆఫీస్ చేరుకున్నాము . మేము చేరుకున్న 15 నిమిషాలకు మా తోటి వర్కర్స్ వచ్చి యూనిఫార్మ్ లోకి మారి ఏమేమి అవసరమో అన్నింటినీ వెహికల్లోకి మారుస్తున్నారు . మేము కూడా మారిపోయి సహాయం చేసాము .
కొద్దిసేపటితరువాత సర్ వాళ్ళువచ్చి మహేష్ ……… ఫస్ట్ మీరే వచ్చారట – ఇక ఈరోజు లాక్కంతా మనవైపే – ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ …………. నీ సర్ప్రైజ్ ను కలవబోతున్నావు కాబట్టి మీ నలుగురూ యూనిఫార్మ్ వేసుకునే అవసరం లేదు . మీకోసం కొత్తబట్టలు తీసుకొచ్చాము లోపలికివెళ్లి వేసుకుని రెడీ అవ్వండి అని అందించారు .

సర్ ………. జీవితంలో ఫస్ట్ టైం కొత్తబట్టలు వేసుకోబోతున్నాము అని కళ్ళల్లో చెమ్మతో థాంక్స్ చెప్పబోతే ఆపి ,
సర్ : మహేష్ – కృష్ణ ………. అక్కడితో ఆగిపోండి . ఈ బట్టలు ఇచ్చినది మేము కాదు. మనం ఎవరి మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఈవెంట్ చేస్తున్నాము ఆ పెళ్లికూతురుగారు ఇచ్చారు . మీ నలుగురికే కాదు మీ శరణాలయంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చారు . లంచ్ తోపాటు తీసుకువెళ్లండి అనిచెప్పారు .
సర్ ………. అని ఆశ్చర్యపోయాము .
సర్ : మిమ్మల్ని ఎంత హడావిడి ఉన్నా ఒకసారి ఆ మేడం దగ్గరకు తీసుకెళతాను అక్కడ థాంక్స్ చెప్పండి . కమాన్ కమాన్ ………. గంటలో మనం అక్కడ ఉండాలి అనిచెప్పడంతో బట్టలు అందుకొని లోపలికి పరుగునవెళ్ళాము .
కృష్ణ : రేయ్ మామా ………. వైజాగ్ లో మరొక దేవత కూడా ఉందిరా ……….
అవును అని కొత్తబట్టలను చూసి మురిసిపోయి ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ వేసుకుని రెడీ అయ్యి పెద్ద వెహికల్లో కూర్చోబోతే , తమ్ముళ్లూ ………. అందులో కూర్చుంటే బట్టలకు దుమ్ము అంటుకుంటుంది – మేడం చూస్తే బాధపడొచ్చు. ఈరోజు మన కార్లలో వెళదాము రండి అనిచెప్పడంతో ,
సర్ వాళ్ళ మాటను కాదనలేక వెళ్లి కూర్చున్నాము . ఫస్ట్ టైం కొత్తబట్టలు – ఫస్ట్ టైం కారులో ప్రయాణం ………. నాదేవత అడుగుపెట్టబోతున్నారోజు ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు ఆస్వాదించబోతున్నామో అని నాలోనేనే ఆనందించాను .

6 :30 కల్లా ……… ఏకంగా స్టేడియం నే పెళ్ళిమండపంలా మార్చేసిన దగ్గరకు చేరుకున్నాము . విద్యుత్ కాంతులు పూలతో అలంకరణ స్వాగతం పలకడం చూసి మరింత ఆనందించాము .
సర్ : మహేష్ , కృష్ణ ………. ఈరోజు మీరు ఏమీ పనిచేయడానికి వీలు లేదు మా ప్రక్కనే మా అదృష్టంలా ఎంజాయ్ చెయ్యండి చాలు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని తమ వెంటనే ఉంచుకున్నారు . ఈ ఆనందంలో మరియు నాదేవత అడుగుపెట్టబోతుందన్న సంతోషంలో పెళ్లి ఎవరిది అనికూడా పట్టించుకోకుండా లోపలికివెళ్లి సర్ వాళ్ళతోపాటు తిరుగుతున్నాము .
10 -11 గంటల మధ్యన ముహూర్తం – ఫ్యామిలీలు గిఫ్ట్స్ తోపాటు వస్తూనే ఉన్నారు. ముందు పెళ్లికి ఇంతపెద్ద స్టేడియం ఎందుకు అనుకున్నాము . కానీ 9 గంటలకల్లా నిండిపోయింది . అన్నిరకాల టిఫిన్లు ఏర్పాటుచేశారు – సర్ వాళ్ళతోపాటు తృప్తిగా తిన్నాము . అన్నీ సర్ వాళ్ళు అనుకున్నట్లుగానే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు .

ముహూర్తం సమయానికి పంతులుగారు పెళ్ళిమంత్రాలు మొదలెట్టగానే మహేష్ ……… మరికిద్దిసేపట్లో నీ సర్ప్రైజ్ నలుగురూ పెళ్ళిమండపం దగ్గరే ఉండమని చెప్పారు , పెళ్ళికొడుకుని పిలవడంతో వచ్చి కూర్చున్నారు .
కృష్ణ : రేయ్ మామా ……… పెళ్ళికొడుకు తిరుపతిలో సెక్యూరిటీ అధికారి అనిచెప్పాడు .
పెళ్ళికొడుకు వచ్చిన కొద్దిసేపటికి పెళ్లికూతుర్ని తీసుకునిరమ్మని చెప్పడంతో వచ్చారు.

సంతోషంతో నవ్వుతూ పెళ్లికూతురుగా నాదేవత నడుచుకుంటూ రావడం చూసి కొన్ని క్షణాలపాటు చుట్టూ ఏమిజరుగుతుందో తెలియడం లేదు .
కృష్ణ : నా చేతిని అందుకొని రేయ్ మామా ………. అని బాధతో పిలువగానే ,కళ్ళల్లో ధారలా కన్నీళ్లు వచ్చేసాయి .
సర్ : మహేష్ మహేష్ ………. ఎక్కడ ఉన్నావు రా ముందుకు అని పిలవడంతో ,
కన్నీళ్లను తుడుచుకుని సర్ అని ముందుకువెళ్లాను .
సర్ : మహేష్ ……… షాక్ అయ్యావుకదా , నువ్వు నీ లక్కీ నోటితో మిస్ వైజాగ్ కిరీటాన్ని దక్కేలా చేసిన కావ్య గారి పెళ్లి . మీ డ్రెస్ లు – భోజనం ఆమెనే arrange చేసినది . మీరెవరో తెలియకపోయినా అనాధలు అని ఇష్టంతో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు . ఫోటోలు దిగేటప్పుడు కలిసేలా చేస్తాను అన్నారు .
అవును సర్ నిజంగా షాక్ అయ్యాను.ఇలాంటి సర్ప్రైజ్ అని ఊహించలేదు అని క్షణక్షణానికి కన్నీళ్లు వాటంతట కారిపోతుంటే తుడుచుకుంటూ మాట్లాడాను .

పెళ్లికూతురు పీఠలపై కూర్చోగానే బంధువులంతా చుట్టుముట్టడంతో నాదేవత కనుమరుగైపోయింది . అవును నిజమే నా హృదయాన్ని బాధకు గురిచేసి వెళ్లిపోతోంది అని అక్కడ నుండి వెళ్లిపోవాలని ఉన్నా ……… , సర్ కు మాట రాకూడదు అని గుండెలనుండి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుని అక్కడ నుండి చివరికువచ్చేసాను .
కృష్ణ : సర్ పాస్ అని వేలు చూపించాడు .
సర్ : తొందరగా వచ్చెయ్యండి .
అలాగే సర్ అని బాధతో నాదగ్గరికివచ్చి , ఆ వయసులో ఏమిమాట్లాడాలో ఎలా ఓదార్చాలో తెలియక ప్రక్కనే బాధపడుతూ నిలబడ్డారు .
క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి . కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . ఒక గంట తరువాత మహేష్ , కృష్ణ …….. అంటూ వెంకట్ అన్న వచ్చారు . వెంటనే అందరమూ కన్నీళ్లను తుడుచుకున్నాము .
వెంకట్ : మహేష్ ……… సర్ పిలుస్తున్నారు . ఇంత జనంలో కూడా మిమ్మల్ని కలవడానికి కావ్య మేడం ఒప్పుకున్నారు రండి త్వరగా ………

సర్ : రండి అని స్టేజీమీదకు పిలుచుకొనివెళ్లి , మేడం ……… మీరు సహాయం చేసినది ఈ పిల్లలకే అని పరిచయం చేసారు .
నాదేవత …….. ఈ క్షణంతో నా హృదయాన్ని గాయపరిచిన కావ్య మేడం : hi hi అని చేతులు అందించారు .
నేను మాత్రమే తాకాను . నా ఫ్రెండ్స్ ముగ్గురూ ………. రెండుచేతులతో నమస్కరించి ఫోటో కోసం నిలబడ్డారు .
మేడం నన్ను ప్రక్కనే రమ్మని బాబూ ……… నన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని నా భుజం చుట్టూ చేతినివేశారు .
నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు , అలాగే ఫోటోలు దిగి భారమైన అడుగులువేస్తూ కిందకువచ్చాము .

సర్ : మహేష్ ……… కావ్య మేడం తన పెళ్లికి వచ్చిన అతిథులకంటే మీకే ఫస్ట్ పెళ్ళిభోజనం పంపించమన్నారు . ఎన్నిరకాల వంటలు చేశారో అన్నీరకాలనూ మరియు మీ శరణాలయంలోని పిల్లలందరకూ కొత్తబట్టలను పెద్ద వెహికల్లో ఉంచాము . వెళ్లి అందరికీ పంచి తృప్తిగా భోజనం చేసి ఈరోజు సంతోషంగా గడపండి అని పర్సులోని డబ్బుని మా జేబులలో ఉంచి బయటవరకూ వచ్చి వదిలారు .
థాంక్స్ సర్ అనిచెప్పి వెహికల్లో కూర్చున్నాము . 20 నిమిషాలలో చేరుకుని కిందకుదిగి అన్నీ లోపలకు మార్చడంలో సహాయం చేసి , పిల్లలందరి ఆనందాన్ని చూసి నవ్వుకుని లోపలకువెళ్లి బట్టలను మార్చి విసిరేసి నా బట్టలు వేసుకుని అందరికీ దూరంగా వెళ్లి కూర్చున్నాను .

కృష్ణ : రేయ్ మామా ……….

బాధపడుతూనే ఇందులో నీతప్పు – మీ అమ్మవారి తప్పు లేదు లేరా ……….. నేను కోరినది ఒకసారి కలవాలని – తాకాలని ఆ రెండు కోరికలూ తీరిపోయాయి అని ఏడుస్తూ – నవ్వుతూ – బాధపడుతూ చెప్పాను .
ముగ్గురూ : రేయ్ మామా …………
లేదురా ……… ఇక జీవితంలో అమ్మాయిలను ఇష్టపడను . ఇక కష్టం పైననే ఆధారపడతాను . ఎవరో వచ్చి ఏదో వరాలిస్తారన్నది అపద్దo . ఇక నా జీవితంలో చదువు కష్టానికి తప్ప అమ్మాయిలకు చోటులేదు అని అప్పటి వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఏడుస్తున్నాను .
కృష్ణ : రేయ్ మామా ………. అమ్మాయిలకు చోటులేదు అంటున్నావంటే , అంటీలతో ఆ ఆ ……….. అని ఆటపట్టించారు .
వాడిమాటలకు సూరి , రవిలతోపాటు ఒక్కసారిగా నేనుకూడా నవ్వేసాను .
కృష్ణ : హమ్మయ్యా ……… నవ్వావా అని ముగ్గురూ హత్తుకుని , అంటీలు ఫసక్ అన్నమాట అని నవ్వించారు . రేయ్ మామా ఆకలేస్తోంది తిందాము రారా ……
రేయ్ ………. ఈ ఒక్కరోజైనా కాస్త బాధపడనివ్వండి . మీరువెళ్లి తినండి .
ముగ్గురూ : నాప్రక్కనే కూర్చుని , నువ్వు బాధపడుతుంటే వెళ్లి ఎలా తింటామురా , తింటే కలిసి తిందాము లేకపోతే పస్తులుందాము అంతే . నేను ఒకటి చెబుతాను ఆవేశం బాధతో కాకుండా వివేకంతో ఆలోచించు . రేయ్ మామా ……… నీదేవత తప్పు ఏమాత్రం లేదురా – తప్పంతా మనది . నువ్వు వెళ్లి ఆరాధిస్తున్నాను అని చెప్పాక పెళ్లిచేసుకుని ఉంటే అప్పుడు నువ్వు బాధపడాలి . నీదేవత ఊటీలో ఉందన్నప్పుడు మనం ఎలాగైనా చివరికి నడుచుకుంటూ అయినా వెళ్లి నీ హృదయంలో ఎంత పూజిస్తున్నావో చెప్పి ఉంటే బాగుండేది . అయినా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారురా ……….. , నీదేవత నిజంగా దేవతేరా …….. అతిథులకంటే ముందు మనకు భోజనం పంపించారు .
రేయ్ నువ్వెన్ని చెప్పినా ఇక నా జీవితంలో ఇక అమ్మాయిలు అనేమాట లేదురా …….
కృష్ణ : మరి మన క్లాస్ లో నిన్ను ఒరకంటితో చూసే అమ్మాయిల సంగతి .
రేయ్ నీయబ్బా ……… అమ్మాయిలు లేరు అంతే .
సూరి : రేయ్ కృష్ణ ………. నువ్వుచెప్పినట్లు స్త్రీలు అనట్లేదు కేవలం అమ్మాయిలు అంటున్నాడు అంటే అంటీలు ……… అని రాగం తీసాడు .
కృష్ణ : నవ్వుకుని , వద్దులేరా ఇక అమ్మాయిలే వద్దు . రాత్రివరకూ మనం బ్రతికి ఉండాలంటే తినాలికదరా ………. కావాలంటే తిన్నాక నీఇష్టం ఎంతసేపయినా బాధపడు .
మీకోసం తింటానురా ………… మనకు బాధలు కష్టాలు కొత్తవేమీ కాదుకదా , కానీ ఇది మరింత బాధిస్తోంది అంతే అని లేచివెళ్లి తిన్నాము .

ఆరోజు నుండి కావ్య మేడం ఫోటోలు తాకింది లేదు ఇంటిదగ్గరకువెళ్లింది లేదు – కావ్య మేడం ఆరోజే తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు . నెక్స్ట్ రోజు ఉదయం పేపర్లో మ్యారేజ్ గురించి రావడంతో ఆరోజు నుండి పేపర్ చదవడం మానేసాను – లోపల వార్డెన్ రూంలో న్యూస్ లో కూడా మిస్ వైజాగ్ మ్యారేజ్ అని వస్తుండటం తెలిసి న్యూస్ చూడటం కూడా మానేసాను . ఆరోజు నుండి నుండి ఉదయం స్టడీస్ ఆ వెంటనే కాలేజ్ సాయంత్రం రాగానే వర్క్ తొ రోజులు గడిచిపోయాయి . ప్రతిరోజూ కావ్య మేడం గుర్తుకువచ్చి ముగ్గురికీ తెలియనివ్వకుండా బాధపడేవాడిని – హృదయమంతా నింపుకున్నాను కదా ………. అంత త్వరగా మరోచిపోవడం కుదరదు .

ఇక సర్ వాళ్ళు రోజురోజుకూ కొత్త కొత్త ఈవెంట్లతో మంచి పేరుని సంపాదిస్తున్నారు.
10th క్లాస్ లో నలుగురమూ స్టేట్ ర్యాంక్ లతో పాస్ అయ్యాము .
వార్డెన్ – సర్ వాళ్ళు అభినందించారు . ప్రతిభ అవార్డ్స్ కూడా వచ్చాయి .
నెక్స్ట్ ఇంటర్లో కూడా నలుగురమూ govt కాలేజ్ లో MPC తీసుకున్నాము . చుట్టూ అందమైన అమ్మాయిలు ఉన్నా – ముగ్గురూ జోళ్ళుకారుస్తూ అమ్మాయిల వెంట పడినా నేనుమాత్రం పట్టించుకునేవాడిని కాదు .
ముగ్గురూ : రేయ్ మామా ………. క్లాస్ లో అంతమంది నీకు లైన్ వేస్తున్నా పట్టించుకోవెంటి రా , తెలిసీ తెలియని వయసులో ఏదో జరిగిపోయింది మరిచిపోరా ఎంజాయ్ చెయ్యరా ………. అన్నా , నేను పట్టించుకునేవాడిని కాదు .
ఇంటర్ కూడా టాప్ లో నిలిచాము . సంవత్సరానికోకసారిమా స్థాయిలు – మా సాలరీ లు పెరుగుతూనేలకు 15 వేల వరకూ తీసుకుంటున్నాము . ఆఫీస్ ను ఒకసారి మీడియం నెక్స్ట్ బిగ్గెస్ట్ బిల్డింగ్ లోకి మార్చడం జరిగింది . సిటీలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతోంది . డబ్బుని వెళ్లి వార్డెన్ కు ఇచ్చేవాళ్ళము అలా ఆరోజు ,

వార్డెన్ : మహేష్ ………. ఎక్కడెక్కడి నుండో సెక్యూరిటీ ఆఫీసర్లు అనాధలైన బుజ్జాయిలను వదిలి వెళుతున్నారు కాబట్టి ……..
అర్థమైంది వార్డెన్ వారం రోజుల్లో ఇల్లు చూసుకుని వెళ్లిపోతాము అని ఉద్వేగానికి లోనౌతుంటే ,
వార్డెన్ కౌగిలించుకుని కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించండి – మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాను అని మాడబ్బు వెనక్కు ఇవ్వబోయారు .
వార్డెన్ ………. ఇప్పటి నుండి మేము జీవితంలో ఏమి సంపాదించినా మా ప్రాణమైన ఈ శరణాలయం కు 50% ఇస్తాము అని సగం మాత్రమే తీసుకున్నాము .

ఇంటర్ హాలిడేస్ కాబట్టి ఉదయమే ఆఫీస్ కు వెళ్ళాము .
సర్ : మహేష్ ………. వార్డెన్ కాల్ చేశారు . శరణాలయం నుండి బయటకు వచ్చే సమయం అయ్యింది అనిచెప్పారు . ఎక్కడో ఎందుకు మన బిల్డింగ్ పైననే రూమ్ ఉందికదా అక్కడ ఉండొచ్చు . మీరు ok అంటే కావాల్సినవన్నీ arrange చేయిస్తాము .
సర్ ……… అడగకముందే వరం ఇస్తే కాదనగలమా అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాము .
సర్ : మహేష్ ఇందులో మా స్వార్థ్యం కూడా ఉంది . మీరు 24/7 ఆఫీస్ లోనే ఉంటే మరింత లక్కీ మాకు , వెళ్ళండి వర్క్ చూసుకోండి సాయంత్రం లోపు నేను క్లీన్ చేయిస్తాను , వెంకట్ అన్నయ్యను పిలిచి కనీస అవసరాలు ఉండేలా మార్చేయ్యాలి అని డబ్బుని ఇచ్చారు .
అధిచూసి చాలా ఆనందించాము .

నెక్స్ట్ రోజు ఉద్వేగవాతావరణంలో తమ్ముళ్లను బుజ్జాయిలను కౌగిలించుకుని మనం అప్పుడప్పుడూ కలుద్దాము అనిచెప్పి ట్రంక్ లతోపాటు ఆఫీస్ బిల్డింగ్ పైకి షిఫ్ట్ అయ్యాము . ఇంటికి అవసరమైనవన్నీ ఉండటం చూసి ఆనందించి రేయ్ సర్ వాళ్లకు మనం ఋణపడిపోయామురా అని సంతోషంతో మాట్లాడుకున్నాము . ఇంటర్ తరువాత ఏమిచెయ్యాలో చర్చలు మొదలయ్యాయి .

కృష్ణ : బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలిరా ……… అదేకదా మన డ్రీమ్ అని వాడు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు .
అవునురా ……….. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైజాగ్ వదిలి వెళ్లిపోవాలి .
కృష్ణ : 4 ఇయర్స్ పడుతుందిరా ………, ఏరా ఇప్పటికీ మరిచిపోలేదా ………
జీవితాంతం మరిచిపోలేనోమో రా ……….. , అధివదిలెయ్యి ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్రణాళిక చెయ్యాలి . ఎంసెట్ లో govt కాలేజ్ లో సీట్ సంపాదించాలి .nights Hardwork చెయ్యాలి అని హైఫై కొట్టుకుని కిందకువచ్చాము .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *