చిన్న సర్ వాళ్ళు ముగ్గురినీ ప్లానింగ్ రూంలోకి పిలిచారు . వెంకట్ అన్నయ్య నన్ను పెద్ద సర్ దగ్గరికి తీసుకెళ్లాడు .
సర్ : మహేష్ ………. ఇందాకే అంతా ok కదా అని తెలుసుకోవడానికి పైకివచ్చాను . మీ డ్రీమ్స్ విన్నాను .
అవును సర్ కృష్ణ వాళ్లకు బెంగళూరులో జాబ్ చెయ్యాలని పేపర్లో – టీవీల్లో వాళ్ళ lifestyle తెలుసుకున్నప్పటి నుండి ఇష్టం అది మా 15 వ ఏడు అనుకుంటాను . నాకు కూడా వాళ్ళతోపాటు వెళ్లాలని అందరమూ ఒక్కదగ్గరే ఉండాలని ఉంది సర్ .
సర్ : all the best మహేష్ , కానీ నాకూ ఒక మాట ఇస్తావా మహేష్ ……… ,
సర్ ……… ఆర్డర్ వెయ్యండి సర్ మీ వలన ఎన్నో సంతోషాలను పొందాము , మీకోసం ఏమైనా చేస్తాము .
సర్ : మీరు మన ఆఫీస్ లో అడుగుపెట్టేంతవరకూ మా పరిస్థితి వేరు , పనిచేసేవాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి , మీరు అడుగుపెట్టబోతున్నారని తెలిసే మిస్ వైజాగ్ ఈవెంట్ మనకు లభించింది అనిమాత్రం 100% చెప్పగలను . మీరు ఈ కంపెనీకె లక్ , వేలల్లో రాబడి నుండి లక్షలకు చేరుకున్నాము – మావలన ఎన్నో కుటుంబాలు సంతోషన్గా ఉన్నాయి . మీరు మాతో ఉంటే కోట్లకు చేరుకుంటాము అని నేను విశ్వసిస్తున్నాను . మీరు వెళ్ళిపోతే మళ్లీ మొదటికి చేరుకుంటామెమో అని భయమేస్తోంది .
సర్ ……….. అలా ఎప్పటికీ జరగకూడదు . ఇప్పుడెలా ముగ్గురూ బెంగళూరు డ్రీమ్ లో జీవిస్తున్నారు . నేను నా జీవితంలో ఆశించినది ఎలాగో పొందలేకపోయాను – ఇప్పుడు నా ప్రాణమైన మిత్రులు ……….. అని సతమతమవుతున్నాను .
సర్ : మహేష్ ………. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అర్థమౌతోంది . నలుగురూ ఉండాల్సిన అవసరం లేదు – మీలో ఒక్కరు ఉన్నా మా కాన్ఫిడెంట్ ఇప్పుడెలా ఉందో అలా ఉంటుంది please please please ……….. నా కొడుకు స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాడు – నా కూతురికి పెద్దింటి సంబంధం చూసాను వాళ్లకూ పెద్దమొత్తంలో ఇవ్వాలి . ఎంత ఖర్చు అవుతుందో తెలియదు అని బాధపడుతూ చెప్పారు .
ఏమాత్రం ఆలోచించకుండా నేను ok నా సర్ అని అడిగాను .
సర్ : పెదాలపై చిరునవ్వుతో మహేష్ నువ్వు అయితే డబల్ ok డబల్ ok అని దేవుణ్ణి ప్రార్థించారు .
సర్ ………… దేవుళ్లను ప్రార్థించడం వలన ఎటువంటి ప్రతిఫలం ఉండదు . మనం కష్టాన్ని నమ్ముకుందాము . సర్ ………. ఈ విషయాన్ని మనమధ్యనే ఉంచుదాము . కృష్ణ గాడికి బెంగళూరులో జాబ్ చెయ్యడం డ్రీమ్ – డ్రీమ్ కాదు ప్రాణం . ఈ విషయం తెలిస్తే నాకోసం కోరికను అనుచుకుంటారు . వాళ్ళు వాళ్ళ గోల్ ను రీచ్ అయ్యి హ్యాపీగా ఉండాలి అనిచెప్పాను .
సర్ : ప్రామిస్ మహేష్ ………. , మహేష్ ………. నా కొడుకు ఎంతో మీరూ అంతే , మీ నలుగురికి ఇంజనీరింగ్ అయ్యే ఖర్చు నేనే చూసుకుంటాను . ఏలోటూ లేకుండా చూసుకుంటాను థాంక్స్ థాంక్స్ థాంక్యూ soooooo మచ్ మహేష్ అని కౌగిలించుకున్నారు .
చాలా సంతోషం సర్ ……… , నా ఫ్రెండ్స్ ముగ్గురిని మాత్రమే ఇంజనీరింగ్ చదివించండి . నేను ఇక్కడే ఉండాలి కాబట్టి govt కాలేజ్ లో డిగ్రీ అలా అలా పూర్తిచేసేస్తాను . ఈరోజు నుండి నాకు ఈవెంట్స్ గురించి స్టడీ చేయడమే ముఖ్యం .
సర్ : నీ ఇష్టమే మా ఇష్టం మహేష్ ………. మరి నీ ఫ్రెండ్స్ ను ఎలా కన్విన్స్ చేస్తావు .
అదినాకు వదిలెయ్యండి సర్ నేను చూసుకుంటాను . నా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదవబోతున్నారు మీవలన ఆ సంతోషం చాలు నాకు అని ఆరోజు ఒక ఈవెంట్ సక్సెస్ చేసి అక్కడే భోజనం చేసి అలసిపోయి ఆఫీస్ చేరి పైకి వెళ్ళాము . సర్ మాటిచ్చినట్లుగానే మొత్తం ఇంటిని లగ్జరీగా మార్చేశారు . టీవీ ఫ్రిడ్జ్ బెడ్స్ AC ……….. చూసి మా ఆనందానికి అవధులు లేవు .
సర్ కు బిగ్ బిగ్ థాంక్స్ చెప్పాలిరా ………..
కృష్ణ : అవునవును ……… అని కళ్లపై చేతిని అడ్డుపెట్టుకుని బాత్రూమ్ రా అంటూ బయటకువెళ్ళాడు .
రేయ్ సూరి , రవి ………. ఎంసెట్ కు నెల మాత్రమే ఉంది . మరొక గంటైనా చదివి పడుకుందాము అని బుక్స్ అందించాను . నేనుకూడా చదువుతున్నట్లు నటించాను .
కృష్ణ :ఫ్రెష్ అయ్యివచ్చి లవ్ యు రా మామా అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .
రేయ్ ఏమయ్యిందిరా ………..
ఏమీ లేదు ఏమీ లేదు అని బుక్ తీసుకున్నాడు .
ఎంసెట్ రోజున సర్……… వారి కారులో సెంటర్స్ కు తీసుకెళ్లారు . సర్ కు థాంక్స్ చెప్పి , సర్ అక్కడే ఉంటానంటే మేము వస్తాము సర్ అనిచెప్పి పంపించాము . ఒకరికొకరం all the best చెప్పుకుని దగ్గర దగ్గరలోని కాలేజస్ లోపలికివెళ్లాము .
పూర్తయిన తరువాత ఒకదగ్గర కలిసి సూపర్ గా రాశాను – ఈజి – కుమ్మేసాను అని ముగ్గురూ నన్ను కౌగిలించుకున్నారు .
కృష్ణ : రేయ్ నువ్వెలా రాసావో చెప్పలేదు .
రేయ్ మామా ……… మళ్లీ చెప్పాలారా అని బాధను లోలోపలే దాచేసుకొని సంతోషంతో ముగ్గురినీ కౌగిలించుకున్నాను .
కృష్ణ : వాడు నావైపు డౌట్ గా చూస్తూనే ఉన్నాడు .
రేయ్ మామా ………. ఆకలేస్తోంది పదండి . బయటే తిని వెళదామా లేక ఇంటికివెళ్లి వండుకుందామా లేక లేక లేక లేక అని అందరూ ఒకేసారి పెదాలపై చిరునవ్వుతో మనకిష్టమైన ప్రాణమైన ప్రపంచంలోనే రుచికరమైన పసందైన మన శరణాలయం భోజనం తిందామా ……….. అని హైఫై కొట్టుకుని ఉత్సాహంతో చేరుకున్నాము .
వార్డెన్ : మహేష్ కృష్ణ సూరి రవి ……….. అనిపిలవడంతో , బుజ్జాయిలు అన్నయ్యలూ ………. అని పరుగునవచ్చారు . చుట్టూ హత్తుకుని అన్నయ్యలూ ……. మీరు పంపిన కొత్తబట్టలలో ఎలాఉన్నాము అని అడిగారు .
వార్డెన్ వైపు చూసాము .
వార్డెన్ : నిన్న మీరు అకౌంట్లోకి డబ్బులు వెయ్యగానే , మీరు పంపించారని అందరికీ బట్టలు బ్యాగ్స్ బుక్స్ తీసుకొచ్చాను .
థాంక్స్ వార్డెన్ ……….. అయినా మా పేరు చెప్పాల్సిన అవసరం లేదు . మేము సాయం చెయ్యడం లేదు . మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మా ప్రాణమైన శరణాలయాన్ని చూసుకోవడం మా బాధ్యత . వార్డెన్ ఆకలేస్తోంది భోజనం చెయ్యొచ్చా ………..
వార్డెన్ : ఇదిగో మహేష్ ……… మీరుకూడా ఈ మాట ఎప్పుడూ అనకూడదు . ఈ శరణాలయం ఎప్పటికీ మీదే , బుజ్జాయిలూ ……… మీ అన్నయ్యలను తీసుకెళ్లి వడ్డించండి అనిచెప్పడంతో వెళ్లి తిని , రేయ్ మామా – రేయ్ మామా ……… ఎన్ని స్టార్ హోటళ్లలో ఎన్ని ఈవెంట్స్ లలో తిన్నాము . ఫైనల్ గా చెబుతున్నాను బెస్ట్ ఫుడ్ బెస్ట్ బూడ్ మనదే మనదే అని నవ్వుకుని ఆవురావురుమంటూ తిన్నాము .
15 రోజులకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి . సర్ ఇచ్చిన లాప్టాప్ ఓపెన్ చేసి ఫస్ట్ సూరి నెంబర్ ఎంటర్ చేస్తే 25th ర్యాంక్ ……….. కంగ్రాట్స్ రా మామా కంగ్రాట్స్ అని కౌగిలించుకున్నాము .
నెక్స్ట్ రవి నెంబర్ ఎంటర్ చేస్తే 50th ర్యాంక్ ………. వాడు గట్టిగా యాహూ అని డాన్స్ లు వేస్తుంటే చూసి ఆనందించాము .
నెక్స్ట్ కృష్ణగాడి నెంబర్ ఎంటర్ చేస్తే 75th ర్యాంక్ ………. వాడి ఆనందానికి అవధులు లేనట్లు రెండు చేతులూ పైకెత్తి yes yes yes అని ఎంజాయ్ చెయ్యడం చూసి ముగ్గురమూ మూడువైపులా హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాము .
సూరి : నాకు 25th – వీడికి 50th – వాడికి – 75th ……….. మిగిలినది ఫస్ట్ ర్యాంక్ అది మనవాడిదేరా కంఫర్మ్ , రేయ్ కృష్ణా ……… త్వరగా ఎంటర్ చెయ్యరా……..
కృష్ణ : ok ok గయ్స్ అని నావైపు చూసి ఏరా ……….. నీకు నీ రిజల్ట్స్ ముందే తెలిసినట్లు అలా ఉన్నావు . మా రిజల్ట్స్ మాత్రం ఉత్కంఠతో చూసి ఎంజాయ్ చేసావు కౌగిలించుకుని ముద్దులుపెట్టావు .
రవి : ఎవరిది వాళ్ళది అంటే టెన్షన్ ఉంటుంది లేరా నువ్వు ఎంటర్ చెయ్యి అనిచెప్పాడు .
కృష్ణ : నావైపు అనుమానంతో చూస్తూనే ఎంటర్ చేసాడు . ముగ్గురూ ఆతృతతో కమాన్ కమాన్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు .
రవి : నోట్ క్వాలిఫైడ్ అని రావడం చూసి , రేయ్ మామా ………. నెంబర్ తప్పుకొట్టావా అని నెత్తిపై మొట్టికాయ వేసాడు .
సూరి : ఏమైందిరా అని కళ్ళుతెరిచిచూశారు .
కృష్ణ : నా పేరు డీటెయిల్స్ చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళుకార్చి , తలదించుకున్న నా కాలర్ పట్టుకున్నాడు .
సూరి : రేయ్………. సరిగ్గా నెంబర్ కొట్టరా , ఉండు నేను కొడతాను రేయ్ నెట్ సరిగ్గా లేదా ఏంటి నాట్ క్వాలిఫైడ్ వస్తోంది అని బాధపడుతూ మావైపు చూసాడు .
కృష్ణ : రేయ్ మామా ఎందుకు చేశావురా , అంత తొందరగా ఎందుకు చేసావు అని చెంపలపై ప్రేమతో కొట్టాడు .
రేయ్ కృష్ణ కృష్ణ ఆపరా ఆపరా ……… అని వచ్చారు .
కృష్ణ : మనకోసమే వీడు క్వాలిఫై కాలేదురా ……….
సూరి – రవి : ఏమంటున్నావురా ………
కృష్ణ : అవునురా ఇది నిజం . రేయ్ మహేష్ ……… ఆరోజు సర్ మాట్లాడిన మాటలు నేను విన్నానురా ……….. , చిన్న సర్ ……… పెద్ద సర్ సంతకం తీసుకురమ్మంటే అక్కడికి వచ్చాను . ఇంజనీరింగ్ అయ్యాక మనం డిస్కస్ చేద్దాము మనలో ఎవరో ఒకరము ఎవరో ఏంటి నేనే ఇక్కడ ఉండిపోవాలనుకున్నాను . ఇంత త్వరగా ఎందుకు చేశావురా ………… మేమంటే ఎందుకురా అంత ప్రాణం . మాకు ఎందుకురా చెప్పలేదు .
ప్రాణం అని నువ్వే అన్నావు కదరా అందుకే చేసాను . అయినా మీరు చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి మనం నలుగురమూ ఒక్కటిరా ………. , ప్రాణంలా కోరుకున్న డ్రీమ్ నెరవేరకపోతే కలిగే బాధ నాకు తెలుసురా ……… మీరు హ్యాపీ అయితే నేను డబల్ హ్యాపీ ……….
రేయ్ మామా మామా ……… అని ఉద్వేగపు కన్నీళ్ళతో కౌగిలించుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు రా మామా ………… , మేముకూడా ఇంజనీరింగ్ చెయ్యము కష్టమో నష్టమో నలుగురమూ పడదాము .
నా ప్రాణమైన మిత్రులారా ……….. ఇలా చేస్తారనే చెప్పలేదు . మీరు బెంగళూరులో మీరు కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించాలి అంతే నా మీద ఒట్టు .
రేయ్ రేయ్ రేయ్ ………. ఆపేంతలో ఒట్టు వేసేసాను .
కృష్ణ : రేయ్ మామా ……….. నీకు వైజాగ్ లో ఉండటం ఇష్టం లేదు కదరా అని బాధతో అడిగాడు .
రేయ్ ……….. అని ట్రంక్ వైపు చూసి , నా దే …….. కావ్య తిరుపతి వెళ్ళిపోయింది కాబట్టి హాయిగా ఉంటాను , మీరు మాత్రం ఇంజనీరింగ్ కష్టపడి చదివి క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వాలి అదే ఈ మిత్రుడి కోరిక .
లవ్ యు రా మామా ………. అని ముగ్గురూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకున్నారు .
అంతా సర్ చూసుకుంటారని మాటిచ్చారురా ………
సర్ : నా ప్రాణం పోయినా మాటతప్పను మహేష్ ……….. ముందుగా కంగ్రాట్స్ కృష్ణ , సూరి , రవి . తప్పంతా నాది నన్ను మన్నించండి .
ముగ్గురూ : సర్ ………. అంతటి మాట అని ముందుకువెళ్లి , మీకోసం మా నలుగురమూ ఉండమన్నా ఉండేవాళ్ళము . మీరంటే మాకు అంత గౌరవం .
సర్ : థాంక్స్ కృష్ణా అని నావైపు చూసి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , మీ అవసరాలు మొత్తం నేనే తీరుస్తాను . మీకు ఎక్కడ చదవాలి అని ఉంటే అక్కడ చదవండి .
