బుజ్జాయిలు : డాడీ డాడీ ………. అంటూ వెనుక నుండి నా గుండెలపైకి చేరి , డాడీ డాడీ ……… కేవలం ఈ విషయం లో ఈ విషయంలో మాత్రమే మమ్మీకి సపోర్ట్ అని బుజ్జిబుజ్జి నవ్వులు నవ్వుతూనే నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
దేవత : యాహూ యాహూ ………. యే యే యే ……… ఇక్కడ కూడా 3 to 1 తో విజయం సాధించాము కాబట్టి అమ్మకూడా మాకే సపోర్ట్ మా కోరికనే తీరుస్తారు – శ్రీవారూ ……… ఇప్పటికైనా తెలుసుకోండి పెద్దమ్మను మనదగ్గరికి పంపించింది అమ్మకాబట్టి పెద్దమ్మ ఏమిచెప్పినా అది అమ్మ నిర్ణయమే ……….. – నా శ్రీవారి హృదయంలో మరొక దేవత ఫిక్స్ ఫిక్స్ అని బుజ్జాయిలతో హైఫై కొట్టుకుని సంతోషంతో కేకలు ………..
ఆనందించండి ఆనందించండి శ్రీమతీ ………. వ్రతం మొదలయ్యింది జస్ట్ ఇప్పుడే , అమ్మవారితోపాటు చాలామంది దేవుళ్ళు ఉన్నారు – నేను ఆ దేవుళ్ళ సపోర్ట్ తో గెలుస్తాను అని దేవత నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను – ఈ ముద్దులన్నీ జీవితాంతం నా దేవత – పెద్దమ్మకు మాత్రమే అని నిరూపిస్తాను .
దేవత : All the best అని నా బుగ్గపై మధురమైన ముద్దు .
బుజ్జాయిలు : yes డాడీ all the best – all the best ………… అని బుగ్గలపై ముద్దులు .
మళ్లీ ” ధగా …….. ధగా ……… మోసం మోసం ” అని వినిపించడంతో దేవత – బుజ్జాయిలతోపాటు నవ్వుకుని పోనిచ్చాను .
బుజ్జాయిలు – దేవతతోపాటు గోవా స్ట్రీట్స్ ఆస్వాదిస్తూ నెక్స్ట్ టెంపుల్ దగ్గర ఆపాను .
బుజ్జితల్లి : శ్రీ మహాలస నరాయని టెంపుల్ ………..
మీరు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందితే నేను ఈ మహాలస అమ్మవారి అనుగ్రహం పొందుతాను . ఈ అమ్మవారు కూడా మీ అమ్మవారి లానే చాలా పవర్ఫుల్ ………..
దేవత : తియ్యనికోపంతో చూసి , బుజ్జాయిలూ ……….. అని హైఫై కొట్టుకుని లెట్స్ గో విత్ your డాడీ అని కాన్ఫిడెంట్ గా కారు దిగారు .
అమ్మా అమ్మా ……… వాళ్ళు ముగ్గురున్నారు – నేను ఒక్కడినే , కరుణించి జాలిపడి నన్నే అనుగ్రహించాలి – మొక్కులో భాగంగా దేవత కౌగిలింత – ముద్దులు లేకుండా క్షణం ఉండలేనివాడిని రోజంతా ఎంత కంట్రోల్ చేసుకుని వ్రతమాచరిస్తున్నాను కాబట్టి కేవలం కేవలం నన్ను మాత్రమే అనుగ్రహించాలి అమ్మా ……….. అని మొక్కి కిందకు దిగాను .
దేవత : ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు . ఇప్పటికిప్పుడు కౌగిలింత – కిస్సెస్ ఇవ్వడానికి నేను సిద్ధం – మా అమ్మల కోరిక కూడా అదే ………. , అమ్మా ………. మీ భక్తుడు ఆవేశంతో ఉండటం వలన మహాలక్ష్మి – మహాలస ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకోలేకపోతున్నారు , మీరు ఒక్కటని నిరూపించి మా ముగ్గురినే అనుగ్రహించాలి .
అమ్మా అమ్మా ………. ఈ మొక్కు నా దేవత – బుజ్జాయిల కోసమే కాబట్టి నన్నే అనుగ్రహించాలి అని పూజ సామాగ్రిని కొని బుజ్జాయిలను ఎత్తుకుని దేవత ప్రక్కనే నిలబడ్డాను .
దేవత : నా శ్రీవారు బంగారం అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టి , చేతిని చుట్టేసి చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము .
ఆశ్చర్యం , బుజ్జాయిలూ ……… ఈ అమ్మవారు కూడా ఆ అమ్మవారిలానే దర్శనమిస్తున్నారు .
దేవత : నా శ్రీవారికి ఇప్పటికి తెలిసిందన్నమాట , అమ్మా అమ్మా ……… శ్రీవారి అమాయకత్వాన్ని మన్నించండి అని ముసిముసినవ్వులతో లెంపలేసుకుంది . పూజారి గారు రావడంతో పూలు – టెంకాయ అందించి పూజలన్నీ జరిపించండి టికెట్స్ మావారు తీసుకొస్తారు అనిచెప్పింది .
అమ్మా ……….. మీరుకూడా మీ తల్లీ – బుజ్జాయిలకే సపోర్ట్ ఇస్తారా నన్ను అనుగ్రహించరా అని దీనంగా ముఖం పెట్టి వెళ్లి టికెట్స్ తీసుకిచ్చాను .
పూజారి గారు మా పేర్లపై పూజలు జరిపించి అనుగ్రహ ప్రాప్తిరస్థు అని తీర్థప్రసాదాలు అందించారు .
పూజారి గారూ ………. ఒక డౌట్ ? .
పూజారి గారు : అడుగు నాయనా ……….
పూజారి గారూ ……….. అమ్మవారు సింగల్ గా ఉన్న నాకోరిక తీరుస్తారా ? – లేక తల్లీ బిడ్డలు ముగ్గురు కోరిన కోరిక తీరుస్తారా ? . మేము పూర్తి అపోజిట్ గా కోరుకున్నాము .
పూజారి గారు : ఎక్కువమంది కోరుకున్నంత మాత్రాన వారినే అనుగ్రహిస్తారనుకోవడం పొరబాటు .
వినండి శ్రీమతీ ……….. యాహూ అమ్మా అమ్మా థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని భక్తితో మొక్కుకున్నాను .
దేవత బుంగమూతి పెట్టుకుంది .
పూజారిగారు : ఎవరి కోరిక వలన అయితే ” లోక కళ్యాణం ” జరుగుతుందో అంటే ఆ కోరిక వలన ఒక్కరికైనా మంచి జరుగుతుందో వారినే అనుగ్రహిస్తుంది ఈ అమ్మ.
దేవత : మా కోరిక ” కళ్యాణం – లోక కళ్యాణం ” కోసమే పూజారి గారు .
బుజ్జాయిలు : మా మమ్మీ చెప్పినది కరెక్ట్ .
పూజారి గారు : అయితే మీ కోరికనే మాన్నిస్తారు . పిల్లలూ ……… మీరు డాడీ వైపా ? మమ్మీ వైపా ? .
బుజ్జాయిలు : మాకు మమ్మీ కంటే డాడీ నే ప్రాణం .
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ………. అని మురిసిపోతున్నాను – మోకాళ్లపై కూర్చుని ముద్దులతో ముంచెత్తాను .
బుజ్జాయిలు : లవ్ యు డాడీ – డాడీ , కానీ ఈ ఒక్క కోరిక విషయంలో మాత్రం మా సపోర్ట్ మా మమ్మీకే …………
” ధగా ……… ధగా ……… మోసం ”
పూజారి గారికీ వినిపించినట్లు చుట్టూ చూడటం చూసి బుజ్జాయిలూ – దేవత నవ్వుకున్నారు .
పూజారి గారు : తల్లీ ……… మీకోరిక లోకకళ్యాణం కోసం అయితే అమ్మవారి అనుగ్రహం మీకే ఉంటుంది – అందులోనూ పిల్లల కోరికలు స్వఛ్చమైనవి పిల్లలు ఏమికోరుకున్నా వెంటనే తీర్చేస్తుంది కాబట్టి 100% అమ్మవారి అనుగ్రహం మీకే సొంతం .
దేవత : యాహూ ……… అంటూ నాప్రక్కనే మోకాళ్లపై కూర్చుని లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ అని హైఫై కొట్టుకుని నాకంటే ఎక్కువ ముద్దులుపెట్టుకుని నన్ను కవ్వించారు .
అమ్మా ……… మీరుకూడా మీ తల్లీ – బుజ్జాయిల వైపే అన్నమాట అని బుజ్జాయిలను ఎత్తుకుని గుడి ఆవరణలోని చల్లనైన చెట్టు నీడలో కూర్చున్నాము .
బుజ్జాయిలూ – శ్రీమతీ ……… భోజనం చేద్దామా లేక ప్రసాదాలతో కానిచ్చేద్దామా ?.
దేవత : ఎక్కడికి వెళదాము శ్రీవారూ ……. స్టార్ హోటల్ కా లేక బ్యూటిఫుల్ బీచస్ ప్రక్కనే ఉన్న రెస్టారెంట్ కా ……..
పెద్దమ్మ ఉండగా అక్కడివరకూ ఎందుకు గాడెస్ , మన వెనుకే ఫాలో అవుతున్న బస్ లో లగ్జరీ గా డైనింగ్ టేబుల్ ……….. అలా కోరుకోగానే కోరుకున్న వెజ్ ఐటమ్స్ మనం మాత్రమే ఎంజాయ్ చేద్దాము .
దేవత : అనుకున్నాను అని కొట్టబోయి , గుడిలో కాదు కాదు అమ్మా …….. కమించు అని లెంపలేసుకుంది . అలా అయితే ఆ భోజనం కంటే అమ్మవారి ప్రసాదంతోనే తృప్తి చెందుదాము అని స్వీకరించాము .
ఇలా కాదు నెక్స్ట్ గోవాలో హిందువులు – క్రిస్టియన్స్ కలిసి ప్రార్థించే ” శాంటా – దుర్గా మాత ” అనుగ్రహం పొందుతాను అని ఆ టెంపుల్ కు చేరుకున్నాము .
అక్కడకూడా పూజారిగారు బుజ్జాయిలవైపే దుర్గమ్మ అనుగ్రహం ఉంటుందని తెలపడంతో , సైలెంట్ గా గుడిలో కూర్చుని ప్రసాదం తిన్నాను .
దేవత – బుజ్జాయిలు ……….. చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
గోవాలోని అమ్మలంతా తమ భక్తురాలైన తల్లి – బుజ్జాయిలకే సపోర్ట్ ఇస్తుండటం చూసి , అమ్మల గుళ్ళు కాకుండా దేవుడి గుడికివెళ్లి నా మొర వినిపించుకివాలని వరుసగా శ్రీ సప్తకోటేశ్వర్ టెంపుల్ – మారుతి టెంపుల్ – మహాదేవ టెంపుల్ – శ్రీ దామోదర్ టెంపుల్ – శ్రీ నగేష్ టెంపుల్ ………. దర్శించుకున్నాను . అక్కడి పూజారులు కూడా దేవుళ్లంతా ఒక్కటే నాయనా వారికి పిల్లలంటే అంత ఇష్టం వారి కోరికలనే మొదట తీరుస్తారు అని హితబోధ చేశారు . అన్నీ గుళ్ళు దర్శించుకునేసరికి చీకటిపడసాగింది .
దేవత ………. ముసిముసినవ్వులతో , శ్రీవారూ …….. అన్నీ గుళ్ళల్లో మొక్కు తీరినట్లేనా లేక ఇంకా ఏమైనా గుళ్ళు ఉన్నాయా ……….. ఇప్పటికైనా తెలిసిందా దేవతల ఆజ్ఞను పెద్దమ్మ పాటిస్తున్నారని .
గాడెస్ …….. ఇక్కడ నీకు మాత్రమే ,
దేవత : మళ్లీ మొదటికొచ్చారన్నమాట అని భుజంపై కొరికేసింది .
బుజ్జాయిలు చిరునవ్వులతో ముద్దులతో మందు రాసి , డాడీ డాడీ ………. అద్భుతమైన గుడి అన్నారు – చీకటిపడ్డాక తీసుకెళతానన్నారు అని బయటకు చూయించారు .
పర్ఫెక్ట్ బుజ్జాయిలూ – గాడెస్ ………. ఆ అద్భుతాన్ని మీతోపాటు నేనూ ఎంజాయ్ చేస్తాను అని కారుని పోనిచ్చాను .
గుడిని చేరుకునేసరికి 7 గంటలు అయ్యింది .
బుజ్జాయిలు : Manghesi temple ………… , why so special డాడీ ………
ఆ స్పెషల్ ఏమిటో మీతోపాటు నేనూ ఎంజాయ్ చేస్తాను అని బుజ్జాయిలను ఎత్తుకుని లోపలికివెళ్లాము .
గుడి ఆవరణలో 8 అంతస్థుల దీప స్థంభం చుట్టూ stepswise వందల సంఖ్యలో దీపాలు వెలుగుతుండటం చూసి బ్యూటిఫుల్ wow అంటూ దేవత నా చేతిని – బుజ్జాయిలు నన్ను చుట్టేసి నాతోపాటు – చుట్టూ గుడికివచ్చిన చాలామందితోపాటు అలా కన్నార్పకుండా చూస్తూ పరవశించిపోతున్నాము . ఎంత గాలి వచ్చినా దీపాలు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుండటం మరొక ప్రత్యేకత …………
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు ……… కోటి లవ్ యు sooooooo మచ్ శ్రీవారూ అని నా భుజం పై ముద్దుపెట్టి పులకించిపోతోంది .
Go on గాడెస్ – బుజ్జాయిలూ ………. అని ముగ్గురి నుదుటిపై ముద్దులుపెట్టి కిందకు దింపాను .
