SECOND MISSION
అది వైజాగ్ శివారుప్రాంతం . ప్రభుత్వం పట్టాభూమిలో ప్రభుత్వమే నిర్మించిన చిన్న గృహం . ఆ చిన్న ఇంటిలో మోతాదుకు మించిన బుజ్జి దేవుడి బిడ్డలు ( అనాధ పాపాయిలు ) – వారిని తన స్థాయికి మించి ఆప్యాయంగా చూసుకునే అవ్వ . చెత్త కుప్పలలో – ముళ్ల పొదలలో తల్లులకు ఇష్టం లేకుండా , పెళ్లికాకుండానే కనడం వలన భువిపైకి చేరిన బిడ్డలను తన ఒడిలోకి చేర్చుకుని , దేవతలు ……. తనకు అందించిన అదృష్టం అని ఆ వయసులోకూడా పలు ఇళ్లల్లో పనులు చేసి – కొంతమంది జాలిపడి దానం చేసిన డబ్బు , గింజలతోనే వారి ఆకలి తీర్చేది . బుజ్జిపాపాయిల చిరునవ్వులలోనే ఆకలి తీర్చుకుని రోజుకు ఒక్కపూట ఒక్కొక్కసారి ఆ అవకాశం కూడా లభించకపోయినా నీళ్లే మహాప్రసాదంలా స్వీకరించేది .
15 సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి అప్పుడేపుట్టిన బుజ్జాయి ఏడుపులు వినిపించడంతో మెలకువ వచ్చిన అవ్వ , చుట్టుప్రక్కల ఇళ్లల్లో గర్భవతులు ఎవ్వరూ లేరే , ఎక్కడ నుండి బిడ్డ ఏడుపులు ఎక్కడ ఎక్కడ అంటూ బయటకువచ్చింది . ఇంటి ప్రక్కనే ఉన్న ముళ్లపొదలలో ఏడుస్తున్న నన్నుచూసి చలించిన హృదయంతో గుండెలపైకి తీసుకుని మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పటికీ కొనసాగిస్తోంది అవ్వ .
లాలిస్తూ – ముద్దులతో జోకొడుతూ ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి గుచ్చుకున్న గాయాలకు వెన్నరాసి పొత్తిళ్లలో వెచ్చగా పడుకోబెట్టి పాలసీసాతో పాలు తాగించి లాలించింది .
అమ్మా దుర్గమ్మా …….. అనాధలానే పుట్టి అనాధలానే నేను పోకుండా , నాకు తోడుగా ఈ బుజ్జాయిని పంపించావా తల్లీ , కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈ ముసలిప్రాణానికి ఒక బాధ్యత అందించావా , నువ్వు కోరుకున్నట్లుగానే నా ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకూ జాగ్రత్తగా చూసుకుంటాను అని మురిసిపోయింది . అప్పటివరకూ బిక్కుబిక్కుమంటున్న ముసలి అవ్వ ప్రాణంలో ఉత్సాహం వచ్చింది. నాకు మహేష్ అని నామకరణం చేసి తనతో ఉన్న కొద్దిపాటి డబ్బుతో నా అవసరాలను తీర్చి పెంచింది . నా ఐదవ ఏట బడిలో చేర్పించింది .
నా వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు – సిటీలోని govt కాలేజ్లో 10 వ తరగతి చదువుతున్నాను . ఒకరోజు నేను కాలేజ్ నుండి వచ్చే సమయానికి అవ్వ చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరు బుజ్జిపాపాయిలను ఊయలలో లాలిస్తోంది .
అవ్వా …….. అంటూ సంతోషంతో వెళ్లి ఆడించాను . అవ్వా ……. ఎవరు ఈ బుజ్జాయిలు ? .
అవ్వ : 15 సంవత్సరాల క్రితం నీలానే నా దగ్గరకు చేరిన దేవుడి బిడ్డలు మహేష్ . పని నుండి వస్తుండగా హాస్పిటల్ వెనుక ఏడుపులు వినిపించడంతో చూస్తే ఈ బుజ్జాయిలు . జనాలు అటూ ఇటూ వెళుతున్నారుకానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు .
ఎంత ముద్దొస్తున్నారు అవ్వా ……. , ఈరోజు నుండీ నేనే ఆడిస్తాను అని ముద్దులుపెట్టాను . ఆరోజు నుండీ కొన్నిరోజుల్లో 10 మందిదాకా బుజ్జిపాపాయిలు మా చెంత చేరారు . మా వీధి చివరన ఉంటున్న ఒక ఇంటిలో వ్యక్తికి పెళ్లికాగానే భార్య మాటలు విని ముసలి వయసులో ఉన్న తల్లిని బయటకు గెంటెయ్యడం వలన ఏమీ చేయలేక ఎటు వెళ్ళాలో పాలుపోక చెట్టుకింద బాధపడుతున్న అవ్వను బుజ్జిపాపాయిలను చూసుకోవడానికి తోడుగా తీసుకొచ్చారు అవ్వ .
అవ్వ పనిచెయ్యడం వలన లభించే డబ్బులు బుజ్జిపాపాయిల పాలకే సరిపోక అవ్వలిద్దరూ రోజుకు ఒకే పూటతో సర్దుకునేవారు .
ఆరోజు నుండీ మా కాలేజ్లో పెట్టే మధ్యాహ్నం భోజనాన్ని తినకుండా తీసుకొచ్చి అవ్వలకు అందించేవాడిని .
అవ్వలిద్దరూ కళ్ళల్లో చెమ్మలతో నాకు వడ్డించి మిగిలినది తినేవారు . అలా కొన్నిరోజులు భారంగానే గడిచాయి – అనాధ పిల్లలు మరికొంతమంది చేరడంతో మరింత కష్టమయ్యింది .
అవ్వల మంచితనం తెలిసిన ప్రక్కింటి ఆమె , తాను ఫారిన్ లో ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్లిపోతున్నాను , ఇక మళ్లీ రావడం కుదరదేమో ఈ ఇంటిని కూడా మీరే తీసుకోండి , ఇంటితోపాటు వస్తువులు – కొన్ని నెలలకు సరిపడు ధాన్యాన్ని – పెద్ద మొత్తంలో డబ్బును అందించారు .
అవ్వలతోపాటు నేను , పిల్లలు …….. చాలా సంతోషం అని దండం పెట్టాము .
ఆమె : ఇంతమంది పిల్లలు – పాపాయిలలో వెలుగులు నింపుతున్నారు . నా వంతు చేతనైన సహాయం – మీ దీవెనలు వలన నా కుటుంబం అక్కడ సంతోషంగా ఉంటుందన్న ఆశ అని ఇంటి తాళాలు అందించి వెళ్లిపోయారు .
అవ్వల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . మహేష్ …….. కొన్ని నెలలవరకూ మనం దిగులుచెందాల్సిన అవసరం లేదు .
అవ్వలూ ……… నేను ఒక నిర్ణయానికి వచ్చాను . నన్ను ఏ లోటూ లేకుండా పెంచారు ఇంత వయసు వచ్చాక కూడా ఇక్కడే ఉండి నా ప్రాణమైన వారికి భారం అవ్వడం మంచిదికాదు – నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు లోకం తెలియజేసారు . నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయి చదువుకుంటూనే నా వంతు కష్టపడి పనిచేస్తూ మీకు సహాయపడాలనుకుంటున్నాను – నేను వెళితే ఈ ధాన్యాన్ని మరికొంతకాలం మీరు తినవచ్చు – నేను ఎక్కడ ఉన్నా నా ప్రాణం మాత్రం ఇక్కడే ఉంటుంది .
అవ్వలు : మహేష్ అంటూ హత్తుకున్నారు . ప్రతీ క్షణం మా గురించే పిల్లల గురించే ఆలోచించావు . వెళ్లు నాన్నా వెళ్లు ఇకనుండీ నీకోసం జీవించు అని సంతోషంతో దీవించారు .
అవ్వలూ ……… చెప్పానుకదా నా ప్రాణం ఇక్కడే ఉంటుంది . మీ – పిల్లలు – పాపాయిల సంతోషమే నా సంతోషం అని బుక్స్ – బట్టలు మూట కట్టుకున్నాను .
అవ్వలు : నాన్నా ……. అని డబ్బు ఇచ్చారు .
అవ్వలూ …….. నేను వెళుతున్నది నా ప్రాణమైన వాళ్లకు సహాయం చెయ్యడం కోసం – మీరుప్రార్థించే దుర్గమ్మే నాకు దారి చూయిస్తుంది – కాలేజ్లో మూడు పూటలకూ సరిపడినంత తింటాను కదా నా గురించి ఆలోచించకండి అని డబ్బును వెనక్కు ఇచ్చేసి జీవన ప్రయాణం మొదలెట్టాను .
మూటతోనే కాలేజ్ కు చేరుకున్నాను – ఆకలివేస్తున్నా శ్రద్ధతో క్లాసెస్ విన్నాను – భోజనం గంట మ్రోగగానే అన్నం పప్పు వడ్డించుకుని ఒకచోట కూర్చున్నాను – తొలిముద్ద తింటూ అవ్వలను గుర్తుకుతెచ్చుకుని కన్నీళ్ళతో , అమ్మా దుర్గమ్మా …….. ఈ అన్నం నాకు లేకపోయినా నా ప్రాణమైనవాళ్లకు ఉండేలా చూడు అని ప్రార్థించి , అన్నం పరబ్రహ్మస్వరూపంలా స్వీకరించి కన్నీళ్లను తుడుచుకున్నాను .
మధ్యాహ్నం కూడా క్లాసెస్ శ్రద్ధగా విన్నాను – కాలేజ్ బెల్ మ్రోగగానే రోజూలా నాకు తెలియకుండానే అడుగులు ఇంటివైపుపడ్డాయి . కన్నీళ్ళతోనే ఇంటికి వ్యతిరేకదిశలో నడక సాగించాను . ఒకరోజు బస్ స్టాండ్ లో మరొకరోజు రైల్వేస్టేషన్ లో పనికోసం వెతికినా ప్రయోజనం లేక ( పిల్లలను పనిలో పెట్టుకోము మమ్మల్ని జైల్లో పెడతారు ) అక్కడే పడుకుని అక్కడే ఫ్రెష్ అయ్యి కాలేజ్ కు వెళ్ళాను .
ఆ తరువాతిరోజు ఆదివారం అని తెలియక కాలేజ్ కు వెళితే లాక్ చేసి ఉండటం వలన తెలిసి సిటీలోని షాప్స్ లలో పనికోసం వెతికీ వెతికి అలసిపోయాను . ఇలాకాదుకానీ అవ్వలా ……. ఇళ్లల్లో పని దొరుకుతుందేమోనని ఒక ఇంటికి వెళ్లి లోపల ఉన్న అన్నను అడిగాను .
బాబూ …….. ఇక్కడ ఉన్నవన్నీ చిన్న చిన్న ఇల్లులు , మేము కూడా పనిచేసుకుని జీవనం సాగించేవాళ్ళము , అలాంటివాళ్ళము నీకు పని ఎలా ఇవ్వగలం చెప్పు – ఒక పనిచెయ్యి ఇలాగే కొద్దిదూరం వెళితే అక్కడ govt ఆఫీసర్స్ – బిజినెస్ మెన్స్ – డాక్టర్స్ ………. ఉంటున్న costly ఏరియా ఉంది – మాలో చాలామంది అక్కడే పనిచేస్తున్నాము , బాగా డబ్బు – మిగిలిన మంచి ఫుడ్ ఇస్తారు , నీకు అదృష్టం ఉంటే పని దొరకవచ్చు .
మధ్యాహ్నం రెండు గంటలు , ఎండ ఎక్కువగానే ఉంది , ఉదయం నుండీ ఏమీ తినలేదు , కళ్ళు మూతలుపడుతున్నాయి , పెదాలు తడి ఆరిపోతున్నాయి . ఎదురుగా ట్యాప్ లో నీళ్లు వస్తుండటం చూసి , అన్నకు థాంక్స్ చెప్పివెళ్లి కడుపునిండా నీళ్లుతాగి ముఖం కడుక్కోవడంతో కాస్త అక్టీవ్ అయ్యాను . ఆ అన్న చెప్పినట్లుగానే అటువైపుకు నడిచాను .
అంత ఎండ – సిటీ పొల్యూషన్ లో ఎంత నడిచినా costly ఏరియా కనిపించకపోవడంతో నీరసం – మైకం కమ్మి ఒకానొక క్షణంలో ఇంటికి వెళ్లిపోదాము అనిపించింది . నేను లేకపోవడం వలన పిల్లలకు స్పేస్ మరియు ఫుడ్ మరికొన్నిరోజులకు సరిపోతుంది , వెనక్కు వెళ్లి ఆ డ్రీమ్ ను వాళ్లనుండి దూరం చెయ్యడం మంచిదికాదు అని నీళ్లు తాగి దైవాన్ని తలుచుకుని మరికొంత దూరం నడిచాను .
కొద్దిదూరంలో ఆ అన్న చెప్పిన పెద్దపెద్ద బిల్డింగ్స్ కనిపించగానే , పని దొరకనీ దొరకకపోనీ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు పెదాలపై చిరునవ్వులు – హుషారుదనం వచ్చేసింది . బిల్డింగ్స్ వైపు ఏకంగా పరుగుపెట్టాను ఫుల్ ఎనర్జీ వచ్చేసినట్లు ……….
బిల్డింగ్స్ నలువైపులా పెద్ద కాంపౌండ్ గోడ , గోడ వెంబడి పరుగుపెట్టి కేవలం ఖరీదైన కార్స్ మాత్రమే వచ్చి వెళుతున్న ప్రవేశద్వారాన్ని చేరుకున్నాను . నాకు పని దొరికే చోటు అని దండం పెట్టి లోపలికి అడుగులువేశాను .
సెక్యురిటి ఆపి నా వాలకం – నా మూటను చూసి , నీలాంటి వాళ్లకు లోపలికి ప్రవేశం లేదు అని తోసేశాడు .
అన్నా అన్నా …….. పనికోసం వచ్చానన్నా , ఏపనైనా చేస్తానన్న లోపలికి వదలండన్నా అని ప్రాధేయపడ్డాను .
సెక్యురిటి : రేయ్ బాబూ …….. నిన్ను లోపలికివదిలితే మా జాబ్ పోతుందిరా , ఇలా ఉన్న నిన్ను ఇక్కడచూసినా మమ్మల్ని తిడతారు ఈ బలిసినవాళ్ళు , మేమే సంవత్సరాలుగా పనిచేస్తున్నా గేట్ దాటి లోపలికివెళ్లలేదు , వెళ్లరా బాబూ వెళ్లు తొందరగా వెళ్లు , మా జాబ్ కే ఎసరుపెట్టేలా ఉన్నావు .
ఎంత బ్రతిమాలినా లోపలికి పంపించకపోవడం – లోపలికి వెలితేనే కానీ పని దొరకదు కాబట్టి ఇలాకాదు అని గోడ వెంబడి వెళ్లి టర్నింగ్ లో ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కడం ద్వారా గోడమీదకు చేరుకున్నాను . గోడ ప్రక్కనే పెద్ద గ్రౌండ్ – గ్రౌండ్ లో నా వయసున్న పిల్లలు నాకిష్టమైన – నేను బాగా ఆడే క్రికెట్ ఆడుతుండటం చూసి చెట్టునీడలో గోడపై కూర్చుని చూస్తున్నాను . చెట్టుపై నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతుండటం – గోడపైనుండే చేతికందేంతలా ఉండటంతో మాగినవాటిని తీసుకుని తింటుంటే ప్రాణం లేచొచ్చింది .
బ్యాటింగ్ టీం క్లాస్ గా ఒకేరకమైన జెర్సీ వేసుకున్నారు – ఫీల్డింగ్ టీమ్ మాస్ గా నాలాంటి పిల్లలు .
మాస్ పిల్లలు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ వేస్తుంటే జెర్సీ వేసుకున్న పిల్లలకు ఉచ్చపడుతున్నట్లు వొళ్ళంతా దెబ్బలు తగిలించుకుంటున్నారు , చిన్న చిన్న దెబ్బలకే అమ్మా హబ్బా అంటూ రిటైర్డ్ హార్ట్ అయ్యి కూర్చుంటున్నారు . ఫీల్డింగ్ టీమ్ నవ్వుకుంటున్నారు – వాళ్ళ ఆట చూసి నాకూ తెగ నవ్వు వచ్చేస్తోంది . ఆడటం రాకపోగా డబ్బుందనే అహంకారం చూయించి తప్పుబడుతున్నారు . ఫీల్డింగ్ టీమ్ తప్పులా నాకైతే అనిపించడం లేదు – ఫాస్ట్ బౌలింగ్ మైంటైన్ చేస్తున్నారు అంతే ……..
బ్యాటింగ్ టీం డబ్బుతో మాటలు గెలిచినట్లు ఫాస్ట్ బౌలింగ్ నుండి స్పిన్ మాత్రమే వేసేలా రెస్ట్రిక్ట్ చేసినట్లు అనిపించింది . స్పిన్ బౌలింగ్ లో కూడా తడబడుతోంది బ్యాటింగ్ జట్టు – ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యేంతవరకూ స్పిన్ బౌలింగ్ మాత్రమే …… – ఫాస్ట్ బౌలర్లను స్పిన్ వెయ్యమంటే ఎలా వేస్తారో అంత సులభంగా వేస్తున్నా ఓవర్ కు 6 రన్స్ కొట్టడానికి తెగ కష్టపడుతున్నారు . ఎలాగోలా 15 ఓవర్లు కంప్లీట్ గా ఆడి 60 రన్స్ కొట్టి సూపర్ స్కోర్ అంటూ చంకలు గుద్దుకోవడం చూసి నాకైతే నవ్వు ఆగడం లేదు .
ఇలాంటి గ్రౌండ్ ఉంటే 5 – 6 ఓవర్లలో ఫినిష్ చేసేస్తాను . అదేవిషయం ఇప్పటివరకూ ఫీల్డింగ్ చేసిన పిల్లలలో ప్రస్ఫూటంగా కనిపిస్తోంది .
Expect చేసినట్లుగానే నాలాంటి మాస్ పిల్లలు మొదలుపెట్టడమే మొదలుపెట్టడం ఫస్ట్ బాల్ కే నా మీదుగా గోడ బయటకు వెళ్ళిపడేలా సిక్స్ కొట్టి ఈజి బౌలింగ్ అంటూ బ్యాట్స్ తో హైఫై కొట్టుకున్నారు – పెవిలియన్ లో ఉన్న మాస్ పిల్లలందరూ ఈలలు కేకలు వేస్తున్నారు . రేయ్ ……. 5 ఓవర్స్ లో ఫినిష్ చేసేస్తారా ఏమిటి , ఈ బుచికి బౌలింగ్ లో ఒక్క బాల్ అయినా మాకూ ఛాన్స్ ఇవ్వండిరా ఏకంగా మన బస్తీలో పడేలా కొడతాము అని కవ్విస్తున్నారు .
క్లాస్ కెప్టెన్ : ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఉడికిపోతూ బ్యాట్స్ మన్ దగ్గరికివెళ్లి ఇంకొక్కసారి బాల్ బయటకు కొడితే మీరు ఒడిపోయినట్లే ………
బ్యాట్స్ మన్ : మా బాల్ మా ఇష్టం , ఇలా కొట్టి ఎంజాయ్ చెయ్యాలనే 4 – 5 బాల్స్ తెచ్చుకున్నాము . మీ బౌలింగ్ లో పస లేదు అని ఒప్పుకోక , బాల్ బయటకు వెళితే ఓడిపోయినట్లే అంటే ఎలా , ఇలా అయితే సిక్స్ ఫోర్ కొట్టినా ఓడినట్లే అనేలా ఉన్నారే అని మరొక బాల్ అందించి నవ్వుకుంటున్నారు .
