పెద్దమ్మ Part 13

అప్పటికే ఒకామె వచ్చింది – ఇంటి పనిమనిషి అయి ఉంటుందని అనుకున్నాను .
మహేష్ …….. మేడం పంపించారు – ఈ పాత్రలలో ఫుడ్ ఉంది – ఈ బ్యాగులో బట్టలు ఉన్నాయి . డ్రెస్ చేంజ్ చేసుకుని చిరిగిన బట్టలను చెత్త బిన్ లో పడేయాలని చెప్పారు . భోజనం చేసి పాత్రలన్నింటినీ బయట ఉంచు నేను తీసుకెళతాను అనిచెప్పి వెళ్లబోయి ఆగారు . ఆ ……. మరిచిపోయాను పిల్లలందరినీ రక్షించినందుకు మరియు వాళ్లకు తోడుగా ఉండే పనికోసం అందరు మేడమ్స్ అడ్వాన్స్ ఇచ్చారు – అనుక్షణం అందుబాటులో ఉండటం కోసం స్మార్ట్ మొబైల్ అని టేబుల్ పై ఉంచి వెళ్ళిపోయింది .
కన్నార్పకుండా చూస్తూనే టేబుల్ దగ్గరికివెళ్లి వణుకుతున్న చేతులతో డబ్బుని అందుకున్నాను . అన్నీ 500 రూపాయల నోట్లు – చేతులు మరింత వణుకుతూనే 1 2 3 …….. 10 11 12 …….. 21 22 23 …….. 28 29 30 మొత్తం ముప్పై 500 నోట్లు అంటే పదిహేను వేలు అని కొన్ని క్షణాలపాటు అలా కదలకుండా ఉండిపోయాను .
మొబైల్ సౌండ్ చేయడంతో తేరుకున్నాను . జీవితంలో ఇప్పటివరకూ ఒక్క 500 నోటు చూడనేలేదు – ఇప్పుడు ఏకంగా 30 నోట్లు నా చేతిలో అదికూడా నిజాయితీగా వచ్చినవి . అవ్వా ……. మీ పెంపకం వల్లనే ఇది సాధ్యమయ్యింది అని గర్వపడ్డాను .
మొబైల్ అందుకుని ఎలా use చెయ్యాలోకూడా తెలియక స్క్రీన్ పై టచ్ చేసాను మెసేజ్ ఓపెన్ అవ్వడం – స్క్రీన్ పై మేడమ్స్ నెంబర్స్ అన్నీ మెసేజ్ రూపంలో వచ్చాయి .

ఆకలి దంచేస్తుండటంతో పాత్రలను ప్లేట్ ను వాటర్ బాటిల్ ను నేలపై ఉంచి , నేలపై కూర్చుని మూతలు తెరిచాను . ఒక పాత్రలో చికెన్ బిరియానీ – మరొక పాత్రలో చికెన్ ఫ్రై ఉండటం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి . ఇప్పటివరకూ కాలేజ్ లో స్టోర్ బియ్యంతో వడ్డించే భోజనం తప్ప ……. ఇలా పొడవైన అన్నం మెతుకుల ……. ఈ రైస్ ను ఏమో ఏమో ఆ ఆ …… బాసుమతి రైస్ తో ఏకంగా చికెన్ బిరియానీ తినే అదృష్టం దొరుకుతుందని కలలోకూడా ఊహించలేదు అని చేతినిండా తీసుకుని తినబోయి మళ్లీ కళ్ళల్లో చెమ్మతో అవ్వా – పిల్లలూ ……..
పదిహేను వేలు ఉందికదా రేపు TC తీసుకురావడానికి వెళతాను కదా కాలేజ్లో పని పూర్తవగానే అందరికీ పెద్ద హోటల్ నుండి బిరియానీ , చికెన్ ఫ్రై మరియు పిల్లలకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్ తీసుకునివెళదాము అని కన్నీళ్లను తుడుచుకుని తిని మ్మ్మ్ ……. సూపర్ అంటూ పాత్రలలో ఒక్క మెతుకు – చికెన్ ముక్క లేకుండా తృప్తిగా తినేసాను .
ఆవ్ …….. అంటూ తృప్తిగా లేచి ఒకచేతితో కష్టమైనా పాత్రలను శుభ్రం చేసి బయట ఉంచాను – డ్రెస్ చేంజ్ చేసుకుని అద్దం లో చూసుకుని మురిసిపోయాను – మూటలో ఉన్న బట్టలతోపాటు వదిలిన బట్టలను తీసుకెళ్లి మెయిన్ గేట్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేసి సెక్యూరిటీ దగ్గరకువెళ్లి తెలుసుకోవలసిన విషయాల గురించి ప్రశ్నల వర్షం కురిపించాను .

మురళి నాన్నగారు బిజినెస్ మ్యాన్ చాలా అహంకారి అని డబ్బే సర్వస్వం అనుకునేవారు అని , మురళి నాన్నగారితోపాటు ఇక్కడ ఉన్నవారంతా బిజినెస్ మెన్స్ , డాక్టర్స్ , హై govt ఆఫీసర్స్ ……. అందరూ దాదాపు ఒకేరకమైన వారేనని వారితో జాగ్రత్తగా మసులుకోవాలని లేకపోతే నిర్దాక్షన్యంగా పనిలోనుండి తీసేసి పంపించేస్తారని చెప్పారు .
అందరి గురించి తెలుసుకుని అక్కడే కూర్చున్నాను .
సెక్యూరిటీ : బాబూ ……. ఇది మా డ్యూటీ నువ్వు లోపలికివెళ్లి హాయిగా రెస్ట్ తీసుకో ……..
పర్లేదు అన్నా ……. ఇదంతా మనకు అలవాటే , రెస్ట్ అన్నది మన జీవితంలో ఉంటుందా చెప్పండి .
సెక్యురిటి : నిజం చెప్పావు తమ్ముడూ ……..

అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్క్రీన్ పై మురళి సర్ అని పడింది . మురళి సర్ అని సేవ్ చేసే మొబైల్ పంపించాడన్నమాట అని నవ్వుకున్నాను . ఎంత వొత్తినా రింగ్ అవుతూనే ఉంది …….
సెక్యూరిటీ : తమ్ముడూ …….. స్మార్ట్ ఫోన్ వాడటం ఇదే తొలిసారి కదూ అని స్వైప్ చేసాడు .
మురళి : రేయ్ …….. ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ? అని కోపం తెలుస్తోంది .
మురళీ ……. మురళీ సర్ ……. స్మార్ట్ ఫోన్ చూడటం ఇదే తొలిసారి , ఎలా వాడాలో తెలియదు సెక్యురిటి అన్న ………
మురళి : ok ok , అదీ అలా సర్ అని పిలవాలి , గ్రౌండ్ ప్రక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కు వెళ్ళాలి గేట్ దగ్గరే ఉండు .
మురళి సర్ అక్కడే ఉన్నాను .
మురళి : గుడ్ , wait చెయ్యి ………

15 నినిషాలలో ఇళ్ళల్లోనుండి పిల్లలందరూ బ్యాట్స్ బాల్ తో వచ్చిన తరువాత మురళి దర్జాగా బయటకువచ్చాడు . ఫ్రెండ్స్ …….. ఇక నుండీ వేరే ఎవ్వరితో ఆదుకునేది లేదు , మనం మనమే ఆడుకుందాము .
క్రికెట్ అంటే చాలు పిల్లల్లో ఎవరికైనా ఉత్సాహం వచ్చేస్తుంది , నేనూ ఆపుకోలేక మురళి సర్ …….. అంత పెద్ద గ్రౌండ్ లో సగం సగం ఆడటానికి ప్లేయర్స్ తక్కువపడతారు , నేనూ ఆడవచ్చా …….. ? .
మురళి ఫ్రెండ్ గోవర్ధన్ : మార్నింగ్ , మధ్యాహ్నం మాత్రమే పెద్ద గ్రౌండ్ లో మహేష్ , evenings మాత్రం బిల్డింగ్స్ చివరన గల చిన్న గ్రౌండ్ లో లగాన్ ఆడుతాము అని అక్కడికే పిలుచుకునివెళ్లారు . అయినాకూడా నిన్ను ఆడించడం కుదరదు నాన్నగారు ( డాక్టర్ ) చెప్పారుకదా చేతిని కదిలించకూడదు అని – వారం లో కాలేజ్ …… మాకు బాడీగార్డ్ గా ఉండాలంటే నువ్వు ఫిట్నెస్ సాధించాలి కాబట్టి అక్కడ కూర్చో చాలు .

మురళి మరియు గోవర్ధన్ కెప్టెన్స్ లా మారి వారి ఫ్రెండ్స్ ను సగం సగం కోరుకుని టాస్ వేశారు . గోవర్ధన్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది .

ఒక్క బ్యాట్స్ మన్ మినహా మిగిలినవారు వచ్చి నాతోపాటు కూర్చున్నారు . లగాన్ లో కేవలం ఫోర్స్ మాత్రమే – క్యాచ్ , వన్ పిచ్ క్యాచ్ అయినా మరియు చిన్న బౌండరీ లైన్ సిక్స్ కొట్టినా ఔట్ ………

మ్యాచ్ వీక్షిస్తూ చుట్టూ బిల్డింగ్స్ చూస్తున్నాను . ఏరియా లోని బిల్డింగ్స్ అన్నీ కొత్తగా రంగురంగుల పెయింట్స్ తో కళకళలాడుతున్నాయి కానీ , చిన్న గ్రౌండ్ కు ఎదురుగా అంటే బిల్డింగ్స్ చివరన ఒక మూడంతస్తుల బిల్డింగ్ మాత్రం ఎవ్వరూ నివశించనట్లు భూత్ బంగళాలా – కాంపౌండ్ మొత్తం ముళ్ల చెట్లు పిచ్చిమొక్కలతో నిండిపోయింది – మెయిన్ గేట్ కు వేసిన తాళం కూడా తుప్పుపట్టింది – గేట్ కు మంత్రశక్తుల తాయెత్తులు కట్టడం కాస్త ఆసక్తినే కలిగించి , గోవర్ధన్ ను అడిగాను ఇంత విలాసవంతమైన ఏరియా లో ఆ భూత్ బంగ్లా ఏంటి అని ……..
అంతే గోవర్ధన్ వొళ్ళంతా చెమటలు పట్టేసాయి – భయంతో వణికిపోతున్నాడు . చుట్టూ కూర్చున్న అందరూ ఒకవైపు నవ్వుతూనే మరొకవైపు భయపడుతున్నారు. గోవర్ధన్ గోవర్ధన్ …………
గోవర్ధన్ ఫ్రెండ్ వినయ్ : మహేష్ ……. కొన్నినిమిషాలపాటు కదలనే కదలడు . గోవర్ధన్ మాత్రమే కాదు ఇక్కడ ఉంటున్న డాడీ – అంకుల్ వాళ్లందరికీ ఈ బిల్డింగ్ అంటే చాలా భయం – తెలియక అన్నా భూత్ బంగ్లా అన్నది నిజమే ……. – లోపల దెయ్యాలు ఉన్నాయని ఆ బిల్డింగ్ ను పడగొడితే దెయ్యాలన్నీ ఇక్కడ ఉన్న ఇళ్లలోకి చేరతాయని మంత్రగాడు చెప్పాడు , దెయ్యాలు బయటకు రాకుండా dad వాళ్ళు పెద్ద హోమం జరిపించి ఇలా బిల్డింగ్ చుట్టూ తాయెత్తులు కట్టారు . వీడికి ఎందుకు ఇంత భయం అంటే వీడి ఇల్లు అదిగో ఎదురుగా ఉన్నదే – ఒకటి రెండు సార్లు డాక్టర్ అంకుల్ వాళ్ళు లోపల నుండి దెయ్యాల సౌండ్స్ మరియు వెలుగులు చూసారట అప్పటి నుండీ వీడికి – అంకుల్ కు బిల్డింగ్ చూస్తేనే చాలు ఉచ్చ కారిపోద్ది అని నవ్వుకున్నారు – మేము నవ్వుతున్నాము కానీ మాకూ చాలా భయం అటువైపు దగ్గరికి వెల్లమంటే వెళ్ళము ఇప్పటికే లోపలకు చాలా బాల్స్ వెళ్ళిపడ్డాయి .
మరి బాల్స్ తెచ్చుకున్నారా ……. ? .
వినయ్ : అంత ధైర్యం ఎవరికి ఉంది వదిలేసి పరిగెత్తడమే ……… , అదిగో ఆ బిల్డింగ్ ప్రక్కన ఆనుకుని ఉన్న గోవర్ధన్ మరొక చిన్న ఇల్లు , దెయ్యాలు అని తెలిసి ఒక్కరూ ఆ ఇంటిలోకి రెంట్ కు రావడం లేదు – సంవత్సరాలుగా రెంట్ మనీ మిస్ అయిపోతోందని తెగబాధపడిపోతుంటారు . మామూలుగా అయితే ఇక్కడ రెంట్ టెన్ థౌజండ్స్ పైనే ఉంటుంది సగం వచ్చినా చాలు ఎవ్వరినైనా సెట్ చెయ్యి అని బ్రోకర్ ను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది . ప్రక్కనే ఉన్న భూత్ బంగ్లాను చూసి తుర్రుమంటున్నారు అందరూ ………
ఇంట్రెస్టింగ్ గా ఉంది , ఇంత ఖరీదైన ఏరియా లో భూత్ బంగ్లా మిస్టరీలా మిగిలిపోయిందన్నమాట ………
వినయ్ : ఇదొక్కటే కాదు మహేష్ …….. , మన ఏరియా మరొక చివరన ఒక బిల్డింగ్ ఉంది . ఆ ఇంట్లో కొంతమంది మనుషులు చూస్తేనే చాలు భయపడేలా ఉంటారు , ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియదు ఒక్కొక్కసారి నెలలపాటు రారు – గమ్మత్తు ఏమిటంటే ఈ బిల్డింగ్ లో దెయ్యాలున్నాయని మొదట ప్రచారం చేసినది వాళ్లే , హోమం జరిపించి తాయెత్తులు కట్టించి లోపలికి ఒక్కరూ వెళ్లకుండా సీల్ చేసినదీ వాళ్లే ………
గోవర్ధన్ : వాళ్లకేమి భయం ఎప్పుడోకానీ రారు , మేము ఎదురుగా ఉంటాము , చీకటిపడితే చాలు భయం వచ్చేస్తుంది . ప్రక్కనే ఉన్న ఇంట్లోకి ఎవరైనా వస్తే మాకూ కాస్త దైర్యంగా ఉంటుంది .
వినయ్ : భూత్ బంగ్లా గురించి తెలిసి ఎవ్వరూ అంత సాహసం చెయ్యరు రా , పోనీ మీరే ఉండవచ్చుకదా ……..
గోవర్ధన్ : భయంతో కేకవేసి నా కుడిచేతిని గట్టిగా పట్టేసుకుని శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ……… అని వణుకుతున్నాడు .
ఫీల్డింగ్ చేస్తున్నవాళ్ళు కూడా ఆటకు బ్రేక్ ఇచ్చి నవ్వుతున్నారు .
గోవర్ధన్ : రేయ్ నవ్వండి నవ్వండి …….. రాత్రిళ్ళు భూత్ బంగ్లా సౌండ్స్ వింటే మీరూ ఇంతే ……..
మురళి : మేము దూరం రా ఉన్నది మాకు వినిపించవు – మేము సేఫ్ అని బాల్ వేసాడు .
ఆ భయంలో టాస్ బాల్ రాగానే పెద్ద గ్రౌండ్ లోలా షాట్ కొట్టాడు . అంతెత్తుకువెళ్లి భూత్ బంగ్లా మెయిన్ గేట్ తాకి కొద్దిగా సౌండ్ వచ్చింది అంతే బ్యాట్లన్నీ అక్కడే వదిలేసి క్షణాలలో అందరూ తుర్రుమన్నారు . చుట్టూ చూస్తే ఒక్కరూ లేరు .
దూరం నుండి మహేష్ మహేష్ అక్కడ ఉండకు వచ్చేయ్ వచ్చేయ్ అని కేకలు వినిపించడంతో నిజంగానే లోపల దెయ్యాలు ఉన్నాయా …… ? అని కాస్త భయంతోనే ( ఆ వయసులో భయం లేనిది ఎవరికి ) ఒకచేతితో బ్యాట్లు అన్నింటినీ పట్టుకుని అందరి దగ్గరికి చేరుకున్నాను .
థాంక్స్ మహేష్ థాంక్స్ మహేష్ …….. ఉదయం వరకూ అక్కడే ఉండిపోయేవి అని వారి వారి బ్యాట్స్ అందుకున్నారు . మురళి మాత్రం చిటికవేసి ఇంట్లో పెట్టిరమ్మని ఆర్డర్ వేసాడు .
వెళ్ళి సెక్యూరిటీని ఎక్కడ ఉంచాలో ఆడిగిమరీ అక్కడే పెట్టివచ్చాను .

మురళి : ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో క్రికెట్ ఎంజాయ్ చేయలేకపోయాము ఇండోర్ గేమ్స్ ఆడి స్విమ్ చేద్దాము పదండి అని ఒక ఆడిటోరియం లోకి వెళ్లారు . రమ్మని పిలవడంతో నేనూ లోపలికివెళ్ళాను . ఆటవస్తువులు చిన్న చిన్న గేమ్స్ స్విమ్మింగ్ పూల్ …… చూసి చాలా ఆనందం వేసింది . లోపల అప్పటికే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు . అందరూ ఎవరికినచ్చిన గేమ్ దగ్గరికివెళ్లి ఆడుకుంటున్నారు .
గోవర్ధన్ : భూత్ బంగ్లా వలన చెమటలు పట్టేసాయి అని బట్టలు విప్పి పూల్ లోకి జంప్ చేసాడు . అవునురా అంటూ ఐదారుగురు నీళ్ళల్లోకి చేరారు .
గోవర్ధన్ : మహేష్ ……. చూస్తుంటే నువ్వూ జంప్ చేసేలా ఉన్నారు . వారం వరకూ నీకావకాశం లేదు గుర్తుపెట్టుకో కావాలంటే వెళ్లి క్యారెమ్స్ – చెస్ ….. ఆడుకో ……
థాంక్స్ గోవర్ధన్ అని చిన్న పిల్లలదగ్గరికివెళ్లి నేర్చుకున్నాను . చీకటిపడేంతవరకూ అక్కడే సమయం గడిచిపోయింది .
ఇక ఇంటికి వెళదాము అని బయటకువచ్చాము . గోవర్ధన్ ఇంటి ప్రక్కనే ఆ ఏరియా కే హైలైట్ లా అన్నీ బిల్డింగ్స్ కంటే ఎత్తయిన బిల్డింగ్ చూసి సూపర్ గా ఉంది ఎవరిది గోవర్ధన్ అని అడిగాను .
గోవర్ధన్ : సూపర్ ఏమిటి మహేష్ లోపల ఆర్కిటెక్చర్ అత్యద్భుతమట డాడీ చెప్పారు సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉందట సూపర్ కదా . ఇక్కడ ఉన్నవాటికే హైలైట్ బిల్డింగ్ అని అందరూ అసూయ చెందుతున్నారు . రీసెంట్ గా పూర్తయింది – ఓనర్స్ అమెరికాలో ఉన్నారు రాగానే ఓపెనింగ్ , వాళ్లు ఎప్పుడు వస్తారో లోపలకు వెళ్లి ఎప్పుడు చూస్తామో అని ఆశతో బిల్డింగ్ వైపు చూస్తూనే ఇంట్లోకివెళ్లాడు . Wow …… నేనూ ఇంటికి చేరుకున్నాను .

రాత్రి 9 గంటలవరకూ మరియు పనిమనిషి అక్క ఔట్ హౌస్ లో భోజనం ఉంచాక తిని మళ్లీ సెక్యురిటీ దగ్గరే ఉన్నాను .
సెక్యూరిటీ : తమ్ముడూ ……. ఇది నీ డ్యూటీ కాదు వెళ్లి పడుకో అని చెప్పారు .
కష్టం అలవాటైపోయింది అన్నా అని బదులిచ్చి ఔట్ హౌస్ కు వెళ్లి బెడ్ పై పడుకోబోయి , అవ్వా పిల్లలు …… నెలపైనే పడుకోవడం గుర్తుకువచ్చి దుప్పటిని నెలపైనే పరిచి కిందనే పడుకున్నాను .
**********

సూర్యోదయం ముందుగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అయ్యి సెక్యూరిటీ దగ్గరకుచేరుకున్నాను .
కొద్దిసేపటికి గోవర్ధన్ – వినయ్ వాళ్ళు జాగింగ్ డ్రెస్ వేసుకుని వచ్చారు .
మహేష్ మహేష్ …….. ఈరోజు కాలేజ్ ఉన్నా వెళ్లడం లేదు అందుకే పెద్ద గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళుతున్నాము రా ……..
మురళి సర్ ………
మురళి : ఎప్పుడు వచ్చాడో గుడ్ మహేష్ , నేనంటే ఈ మాత్రం భయం ఉండాలి పదా అని గ్రౌండ్ చేరుకున్నాము .
పేరెంట్స్ నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం పిలుపు వచ్చేన్తవరకూ ఆడుకుని ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు .
సెక్యురిటి : తింటూనే తమ్ముడూ …….. నీ టిఫిన్ ఔట్ హౌస్ లో ఉంచారు వెళ్లి తిను .
సరే అన్నా అని తినేసి కాలేజ్ కు రెడీ అయ్యి బయటకువచ్చాను . అన్నా ……. మేడం గారిని బయటకు వెళ్ళడానికి అనుమతి కోరాలి ఎలా ? .
సెక్యూరిటీ : డైరెక్ట్ గా డోర్ దగ్గరికి వెళ్లకుండా నన్ను అడిగి మంచిపనిచేశావు తమ్ముడూ …… మనం వాళ్లకోసం ఎంత కష్టపడినా మనల్ని దూరంగానే ఉంచుతారు . ఒక్క నిమిషం తమ్ముడూ ……. అని సెక్యూరిటీ గదిలోకివెళ్లి బటన్ ప్రెస్ చేసి మైకులో మేడం గారూ …….. మహేష్ కు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు .
మేడం : ok మాట్లాడించు ……..
సెక్యూరిటీ : మహేష్ …….. మేడం గారితో ఇక్కడినుండే మాట్లాడు .
మేడం …….. అనుమతి ఇస్తే మీరు చెప్పినట్లుగా కాలేజ్ కు వెళ్లి TC తీసుకునివస్తాను .
మేడం : సెక్యూరిటీ …….. మన డ్రైవర్ కు చెప్పు తన బైకులో తీసుకెళ్లమని …….
సెక్యురిటి : అలాగే మేడం ……..
పర్లేదు మేడం , అక్కడ సమయం పడుతుందేమో నేనొక్కడినే వెళ్లి TC తీసుకుని వచ్చేస్తాను .
మేడం : మేము కూడా ఫంక్షన్ కు వెళ్ళాలి డ్రైవర్ అవసరం ఉంటుంది . అయితే ఒంటరిగానే వెళ్లి వచ్చేయ్ మహేష్ …….. , వెళ్లే విషయం పైనున్న మురళికి కూడా కాల్ చేసి చెప్పు లేకపోతే కోప్పడతాడు .
అలాగే మేడం అని బదులిచ్చి మొబైల్లో మురళికి కాల్ చేసి విషయం చెప్పాను .
మురళి : గుడ్ , నువ్వు ఏమిచేసినా నాకు ఇలా చెప్పాలి లేకపోతే నా ఈగో హార్ట్ అయ్యి కోపం వచ్చేస్తుంది , త్వరగా వచ్చేయ్ …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *