నెక్స్ట్ పీరియడ్ pune వచ్చి మహేష్ అంటూ పిలిచి నేరుగా గోల గోల చేస్తున్న LKG పిల్లల క్లాస్ కు తీసుకెళ్లి ఇంగ్లీష్ క్లాస్ అటూ లోపలికివెల్లమన్నాడు .
ఈ విషయం తెలిసినట్లు మురళి వాళ్ళు వెనుకే వచ్చి నవ్వు ఆపడం లేదు .
మేడం గారికి మాట రానివ్వకూడదు అని తలదించుకుని లోపలికివెళ్లి చివరి బెంచ్ లో కూర్చున్నాను .
నేనే ఇంగ్లీష్ టీచర్ అనుకుని ( ఇంకా కాలేజ్ డ్రెస్ లేకపోవడం – నా హైట్ చూసి ) బుజ్జి బుజ్జి పిల్లలందరూ సైలెంట్ అయిపోయి లేచి గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేశారు .
మురళి వాళ్ళతోపాటు pune నవ్వుకుని , పిల్లలూ ……. ఆ అన్నయ్య పేరు మహేష్ మీలానే స్టూడెంట్ అనిచెప్పడంతో షాక్ అయ్యి నావైపు చూసి నవ్వుకుని వాళ్ళ వాళ్ళ గోలలో పడిపోయారు .
ఇంగ్లీష్ టీచర్ రావడంతో మురళి వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లిపోయారు . బుజ్జిపిల్లలతోపాటు నేనూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నాను .
టీచర్ : మహేష్ …….. అనుకున్నాను ఇక్కడే కలుస్తాము అని అంటూ నవ్వుకున్నారు 80 ఏళ్ల వయసు పైనున్న సర్ ……..
Pune వచ్చి సర్ ఇది మహేష్ స్పెషల్ ఇంగ్లీష్ క్లాస్సెస్ అటెండెన్స్ , అటెండెన్స్ వేసి మహేష్ కు ఇవ్వండి అనిచెప్పి వెళ్లిపోయారు .
A for Apple తో మొదలుపెట్టడం చూసి నాకు నవ్వు ఆగడం లేదు.
టీచర్ : మహేష్ …….. A for Apple తెలుసుకదా ……..
సర్ ……..
టీచర్ : Ok ok అని నవ్వుకుని బుజ్జిపిల్లలకు అర్థమయ్యేలా సూపర్ టీచింగ్ చేశారు .
థర్డ్ పీరియడ్ పూర్తయినట్లుగా బెల్ మ్రోగగానే , ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటూ సర్ కంటే ముందుగానే బుజ్జాయిలు పరుగున బయటకువెళ్లిపోయారు .
టీచర్ : మహేష్ …….. ఇంటర్వెల్ తరువాత 7th A క్లాస్ కు వచ్చెయ్యి అనిచెప్పి వెళ్లిపోయారు .
హమ్మయ్యా …….. UKG అనలేదు సేఫ్ అనుకుని మా క్లాస్ కు వెళ్లి , మేడం ఆర్డర్ వేసినట్లుగానే మురళి వాళ్ల వెనుకే నడిచాను . అందరూ గ్రౌండ్ చేరుకుని ఆడుకుంటున్నారు .
మురళి : మహేష్ …….. ఇంగ్లీష్ లో జీరో వచ్చిన నువ్వు , మాతోపాటు ఆడితే మా పరువు పోతుంది అదిగో అక్కడ దూరంగా ఆడుకో అని పంపించారు .
ఇంటర్వెల్ కోసం వారం రోజుల నుండీ గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్న బస్తీ పిల్లలు కాలేజ్ కాంపౌండ్ గోడను దూకివచ్చి మురళి గోవర్ధన్ వాళ్ళందరినీ చుట్టుముట్టారు . రేయ్ భలే దొరికారురా ఈ గోలలో మేము కొట్టే దెబ్బలకు కేకలువేసినా ఎవ్వరికీ వినిపించవు – రేయ్ ఇష్టమొచ్చినట్లుగా కుమ్మేయ్యండిరా ……….
మురళివాళ్ళు చుట్టూ చూసి ఒకరినొకరు పట్టుకుని భయంతో వణుకుతూ సెక్యూరిటీ సెక్యూరిటీ సర్ సర్ …….. అని గట్టిగా కేకలువేశారు .
బస్తీ పిల్లలు : రేయ్ ……. చెప్పాముకదా ఈ గోలలో వినిపించదు అని , వినిపించినా మెయిన్ గేట్ దగ్గర నుండి సెక్యూరిటీ – స్టాఫ్ రూమ్ నుండి సర్ వాళ్ళు రావడానికి నిమిషం పైనే పడుతుంది – ఈ గ్యాప్ చాలు మా కసితీరా కుమ్మేసి వెళ్లిపోతాము అని గట్టిగా నవ్వుతూ ముందుకువస్తున్నారు .
గోవర్ధన్ – వినయ్ : మహేష్ ……. మహేష్ ఎక్కడ ? మహేష్ మహేష్ అంటూ భయంతో కేకలువేశారు .
అంతే మరుక్షణంలో పరుగున వారిదగ్గరికి చేరిపోయాను .
నన్ను చూడగానే నువ్వు నువ్వు …… ఇక్కడ …… అంటూ లాస్ట్ సోమవారం దెబ్బలుతున్న ఐదుగురు భయంతో వెనక్కు అడుగులువేస్తూనే కిందకు పడిపోయారు .
మిగిలిన బస్తీ పిల్లలు : రేయ్ ……. ఏంట్రా ఒక్కడిని చూసి ఐదుగురు భయపడుతున్నారు . మనం 10 మందిమి ఉన్నాము కదరా …….
దెబ్బలు తిన్నవాళ్ళు : టీం మొత్తాన్ని ఇంకా వీలైతే extraa ప్లేయర్స్ ను కూడా పిలుచుకునిరమ్మని చెప్పినది వాడేరా ……. వెనక్కు రండి వెనక్కు రండి – వారం రోజులు పైకిలేవడానికే కష్టమైపోయింది ఆ దెబ్బలకు , ఒంటి చేతితోనే ఐదుగురిని కుమ్మేశాడు ఇక ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడు ఎలాకొడతాడో మీరే ఊహించుకోండి అని భయంతో పరుగుపెట్టి గోడను దూకేశాడు .
మిగతావాళ్ళు కూడా భయపడిపోయి వెనుకే గోడను దూకి వెళ్లిపోయారు .
గోవర్ధన్ వినయ్ : థాంక్యూ థాంక్యూ మహేష్ ……. , నువ్వులేకపోయుంటే రక్తం వచ్చేలా కొట్టేవాళ్ళు – రేయ్ మురళీ …….. థాంక్స్ చెప్పరా ……..
మురళి : భయాన్ని లోలోపలే దాచేసుకుని బయటకు మాత్రం వాడి డ్యూటీ చేసాడు , 2 లక్షలు కట్టి కాలేజ్లో చేర్పించాము , ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా ….. అని బిల్డింగ్ వైపుకు అడుగులువేశాడు .
గోవర్ధన్ : రేయ్ మురళీ ……. ఒంటరిగా వెళ్లకు , బస్తీ పిల్లలు చాలా కోపంతో ఉన్నారు .
అంతే ఆగిపోయి ప్రక్కనే ఉన్న బెంచిపై కూచున్నాడు .
గోవర్ధన్ వాళ్ళు లోలోపలే నవ్వుకున్నారు .
మురళీ సర్ …….. మీవెంటే నేనుంటాను .
మురళి : బెల్ కొట్టాకనే వెళదాము .
గోవర్ధన్ వాళ్ళు వచ్చి , మహేష్ …….. ఇంతలా వాళ్ళను ఎప్పుడు భయపెట్టావు సూపర్ చూడగానే ఉచ్ఛపోసుకున్నారు అని సంతోషంతో చెప్పారు .
TC తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అటాక్ చేశారు ………
వినయ్ : అటాక్ వాళ్ళు చేస్తే కౌంటర్ అటాక్ నువ్వు గిఫ్ట్ ఇచ్చావు అన్నమాట అని కౌగిలించుకున్నాడు .
బెల్ వినిపించడంతో మురళి వాళ్ళను క్లాస్ లో వదిలి , నేను 7th క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ కు అటెండ్ అయ్యాను .
7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ వింతగా చూస్తున్నారు .
సర్ వచ్చి నాకు స్పెషల్ అటెండెన్స్ వేసి , నానా గురించి చెప్పారు .
అంతే పిల్లలందరూ నవ్వుకుంటున్నారు .
అయ్యో ……. లెర్నింగ్ లా లేదు పనిష్మెంట్ లా ఉంది . అందులోనూ ఈ సర్ ఒకరు వయసు పైబడింది కదా నెమ్మదిగా చెబుతారు – నిద్రవచ్చేస్తుంది అయినా తప్పదు మరి ………
క్లాస్ పూర్తిచేసుకుని మరొక నా 10th మాథ్స్ క్లాస్ పీరియడ్ అటెండ్ అయ్యాను . ప్రాబ్లమ్స్ అర్థం అవుతున్నాయి కానీ పదాలు అర్థం కావడం లేదు . ఆ తరువాత లంచ్ బెల్ …….. మురళి వాళ్ళతో కలిసి కాస్త దూరంగా కూర్చుని తిన్నాను . మధ్యాహ్నం కూడా రెండు నా క్లాస్ లు , రెండు ఇంగ్లీష్ క్లాస్సెస్ పూర్తిచేసాను . లాంగ్ బెల్ కొట్టగానే హమ్మయ్యా అనుకున్నాను .
క్లాస్ మొత్తం హుషారుగా పరుగుపెట్టినా మురళి వాళ్ళు మాత్రం నాకు ఇరువైపులా నడిచారు .
మురళి సర్ ……. ఒక్కసారి మాటిచ్చానంటే ప్రాణాలు వదిలి అయినా నిలబెట్టుకుంటాను . మీరు దైర్యంగా వెళ్ళండి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో మీ ముందు ఉంటాను .
గోవర్ధన్ వినయ్ వాళ్ళు : అమ్మో …….. మాకు భయం అని కార్లవరకూ నా తోపాటే వచ్చారు .
మురళి : డోర్ తీసుకుని వెనుక కూర్చుని , మహేష్ ముందు కూర్చో అని ఆర్డర్ వేసాడు .
ముందు కూర్చుని , మురళి సర్ …….. మేడం చెప్పారుకదా బుక్స్ తీసుకోమని తీసుకెళతారా ? .
మురళి : డ్రైవర్ ……. ఆ సంగతి ఏమిటో చూడు అని హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు .
డ్రైవర్ : మహేష్ ఎక్కడికి ? .
థాంక్స్ మురళి సర్ , అన్నా ……. ఏదైనా బుక్ స్టోర్ కు తీసుకెళ్లండి అనిచెప్పాను .
డ్రైవర్ : సిటీలోనే బిగ్గెస్ట్ షాప్ కు తీసుకెళతాను తమ్ముడూ …….. సీట్ బెల్ట్ పెట్టుకో ……..
15 నిమిషాలలో చేరుకున్నాము . కిందకుదిగి ఏ ఏ బుక్స్ అవసరమో తెలియక మురళి వైపు చూసాను . హెడ్ ఫోన్ పెట్టుకుని కళ్ళుమూసుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు . మురళి సర్ మురళి సర్ అని ఎంతపిలిచినా పలకడం లేదు . ఏమిచెయ్యాలో తెలియక నిరాశ చెందాను .
నా పరిస్థితిని చూసి తమ్ముడూ అంటూ కన్నుకొట్టి ఆపకుండా హార్న్ సౌండ్ చేస్తూనే ఉన్నాడు .
వినిపించినట్లు ఉలిక్కిపడ్డాడు మురళి . వెంటనే సైలెంట్ అయిపోయాడు డ్రైవర్ .
మురళి : ఏమైంది అంటూ హెడ్ ఫోన్స్ మెడ పైకి జార్చి అడిగాడు .
డ్రైవర్ : నథింగ్ మురళి సర్ ……..
అంటే నేనే కాదు అందరూ మురళి సర్ అని పిలిచేలా చేసుకున్నాడన్నమాట అని మనసులో అనుకున్నాడు . ఫ్యామిలీ అంతా పనివాళ్లను ఎలా చూస్తారో అర్థమైంది.
మురళి సర్ …….. ఏ బుక్స్ తీసుకోవాలో నాకు తెలియదు సహాయం చేస్తారా … ?.
మురళి : మొదట కోప్పడినా …….. , నేను బ్రతిమాలుకోవడం చూసి shit shit అంటూ నాతోపాటు షాప్ లోపలికి వచ్చి సేల్స్ బాయ్ కు లిస్ట్ చెప్పి బయటకువెళ్లిపోయాడు . ఎక్కడ బస్తీవాళ్ళు ఉన్నారేమోనని రెండువైపులా తొంగిచూసి పరుగున కారులోకి చేరి డోర్ క్లోజ్ చేసేసుకున్నాడు .
సేల్స్ బాయ్ తీసుకొచ్చిన బుక్స్ కు అమౌంట్ పే చేసాను . పెద్దమ్మా …….. డబ్బు అవసరం అవుతుందని అవ్వల ద్వారా సగం నాకు ఇప్పించారు థాంక్యూ soooooo మచ్ – దేవతలా నాకు దారిని చూయిస్తున్నారు అని గుండెలపై చేతినివేసుకుని తలుచుకున్నాము . బుక్స్ తీసుకుని కారులో కూర్చుని ఇంటికిచేరుకున్నాము .
నేరుగా కారు కాంపౌండ్ లోపలికివెళ్లి ఆగింది . గోవర్ధన్ – వినయ్ వాళ్ళతోపాటు మేడం వాళ్లంతా కారు దగ్గరికి చేరుకున్నారు .
బుక్స్ పట్టుకుని కిందకుదిగగానే , మహేష్ మహేష్ …….. మా నమ్మకాన్ని నిలబెట్టావు . వారం ముందు గ్రౌండ్ లో – ఈరోజు కాలేజ్లో మా సర్వస్వమైన బిడ్డలను కాపాడావు అని థాంక్స్ చెప్పారు .
మేడమ్స్ …….. నా డ్యూటీ చేసాను అంతే అని బుక్స్ బెంచ్ పై ఉంచాను .
వినయ్ : మమ్మీ మమ్మీ …….. 8 మంది పైనే వచ్చారు మమ్మల్ని కొట్టడానికి , మహేష్ ను చూసి వెనక్కు తిరిగిచూడకుండా పరుగో పరుగు అని నవ్వుతూ చెప్పారు .
మేడమ్స్ : మహేష్ …….. ఇలానే మా పిల్లల ప్రక్కనే ఉండాలి .
అలాగే మేడం ……. , నన్ను అంతపెద్ద కాలేజ్లో జాయిన్ చేశారు – అనుక్షణం ప్రక్కనే ఉండి చూసుకుంటాను .
మురళి : మమ్మీ …….. మమ్మల్ని కొట్టడానికి వచ్చినవాళ్లను కొట్టకుండా వదిలేసాడు .
మేడం : మహేష్ ………
క్షమించండి , పట్టుకుని కొట్టడం ఎంతసేపు మురళి సర్ …….. , అలాచేస్తే మనపై మరింత పగతో రగిలిపోతారు – టైం కోసం ఎదురుచూసి ఏదో ఓకేసమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు దాడిచేస్తారు – అలాకాకుండా వదిలెయ్యడం వలన ఈ భయంతో మన జోలికి రావడమనే ఆలోచనే రాదు – మేడమ్స్ ……. మీరు ఆర్డర్ వెయ్యండి ఇప్పుడేవెళ్లి ఆ బస్తీ పిల్లలు ఎక్కడ ఉన్నా కట్టేసి మీముందు పడేస్తాను – మీకోసం ఏమైనా చేస్తాను .
మేడమ్స్ : నో నో నో ……. మంచిపనిచేశావు మహేష్ . మనమంటే ఉన్న భయమే వాళ్ళు మరొకసారి ఇలా చెయ్యడానికి సాహసం చెయ్యరు . మురళీ ……… మహేష్ చేసినదే కరెక్ట్ అని మరొకసారి థాంక్స్ చెప్పి డబ్బుని అందించారు .
వద్దు వద్దు మేడమ్స్ ……. చోటు – ఫుడ్ – సాలరీ ఇస్తున్నారు కదా ……..
మేడమ్స్ : ఇష్టంతో ఇస్తున్నాము తీసుకో , చాలా బుక్స్ కొన్నట్లు ఉన్నావు . ఇంకా చాలా అవసరమవుతాయి అని అందించి వెళ్లిపోయారు .
మేడం : అందరూ చెప్పినట్లు ఆ పిల్లలను భయపెట్టి మంచిపనిచేశావు అని భుజం తట్టారు .
అధిచూసి మురళి కోపంతో లోపలికివెళ్లిపోయాడు .
మేడం ……… మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను .
మేడం : ఆలోచించి చెప్పు అన్నారు .
మేడం ……… మురళి అనుమతి తీసుకుని , బస్తీపిల్లల బెట్టింగ్ డబ్బు మరియు బ్యాట్స్ తిరిగిఇచ్చేస్తే మరింత మంచిది అనుకుంటున్నాను అని తలదించుకున్నాను .
మేడం : పిల్లలను ఒప్పించడం కష్టమే అయినా ఒకసారి మీ మేడమ్స్ అందరితో మాట్లాడుతాను అని లోపలికివెళ్లారు .
బుక్స్ – కొత్త బ్యాగ్ అందుకుని ఔట్ హౌస్ లోకివెళ్లి ఫ్రెష్ అయ్యాను . గంట సమయం అయినా మురళి పిలవకపోవడంతో టెక్స్ట్ బుక్స్ కు నీట్ గా కవర్స్ వేసుకున్నాను – మేడం వాళ్ళు ఇచ్చిన డబ్బుని లెక్కవేస్తే 5 వేల దాకా ఉంది – ఈ డబ్బుని ఇలాగే ఉంచుకుని సాలరీతోపాటు మొత్తం డబ్బులతో పిల్లలకు ఏమైనా తీసుకెళ్లాలి అని ఆనందించాను .
నైట్ భోజనం చేసి బెడ్ పైకి చేరాను – జీవితంలో మొదటిసారి కార్ లో ప్రయాణించాను అని మురిసిపోతున్నాను , ఇలానే అవ్వలు – పిల్లలు కూడా కారులో చిరునవ్వులు చిందిస్తూ వైజాగ్ మొత్తం చుట్టేయ్యడం చూడాలి అని నెరవేరని కోరిక తలుచుకుంటూ నిద్రలోకిజారుకున్నాను .
తరువాతిరోజు బ్రేక్ఫాస్ట్ తోపాటు మురళి పాత కాలేజ్ డ్రెస్ ను మేడం పంపించారని పనిమనిషి అక్క అందించారు .
కాలేజ్ డ్రెస్ వేసుకుని , బ్యాగులో బుక్స్ పెట్టుకుని మెయిన్ గేట్ దగ్గరికివచ్చాను .
మురళి కాలేజ్ బ్యాగుపట్టుకుని వెనుకే వచ్చారు మేడం . మహేష్ ……. నువ్వు ఇచ్చిన ఐడియా అందరికీ నచ్చింది . సెక్యూరిటీతో బెట్టింగ్ డబ్బు – బ్యాట్స్ …… బస్తీ పిల్లలకు అందేలా చూస్తాము .
థాంక్స్ మేడం అనిచెప్పి కారు వెనుక డోర్ తెరిచాను . మురళి దర్జాగా ఎక్కి కూర్చున్నాడు – మేడం నుండి బ్యాగు – లంచ్ బాక్సస్ అందుకుని లోపల ఉంచి ముందు కూర్చున్నాను . డ్రైవర్ …… కాలేజ్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు .
నిన్నటిలానే అర్థం కాని ఇంగ్లీష్ టీచింగ్ – బోర్ కొట్టే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్స్ క్లాస్ లతో పనిష్మెంట్ లా మూడు వారాలపాటు meaning less గా గడిచిపోయాయి ( evenings మరియు sundays ఆటలతో ) .
ఒక friday కాలేజ్ నుండి ఇంటికిరాగానే , మహేష్ ……. ఈరోజుతో నెలరోజులు గడిచాయి – ఈ నెలరోజులూ …….. మేము చెప్పినట్లుగానే మా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నావు – ఇదిగో నీ సాలరీ అని కవర్ అందించారు .
మేడం ……. అడ్వాన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లుంది .
మేడం : నీ మేడమ్స్ అందరూ సంతోషంగా ఇచ్చారుమరి అని లోపలికివెళ్లారు .
ఔట్ హౌస్ లోకి చేరి చూసుకున్నాను . అంత డబ్బును చూసి నోటివెంట మాటరాలేదు . ప్చ్ ……. రేపే ఆదివారం అయితే ఎంతబాగుణ్ణు అంటూ పెదాలపై చిరునవ్వుతోనే డబ్బుని జాగ్రత్తగా దాచాను . ఫ్రెష్ అయ్యి చదువుకుందామంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉండటం వలన ఓపెన్ చేసేందుకు ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు .
అంతలోనే మురళి నుండి కాల్ రావడంతో సంతోషంగా చిన్న గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్ళిపోయాను . రాత్రంతా కూడా saturday అలా స్కిప్ అయిపోతే ఎంత బాగుంటుందో అని తలుచుకుంటూనే నిద్రపోయాను .
ఉదయం రోజూలానే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్ డ్రెస్ లో గేట్ దగ్గరికి చేరుకున్నాను .
మురళి బాల్ బ్యాట్ తీసుకుని కలర్ డ్రెస్ లో బయటకువచ్చి , కాలేజ్ బ్యాగ్ – కాలేజ్ డ్రెస్ లో ఉన్న నన్నుచూసి నవ్వుతున్నాడు . బయట నుండి సేమ్ గెటప్స్ లో గోవర్ధన్ వాళ్ళు వచ్చి మహేష్ మహేష్ …….. అంటూ నవ్వుకుంటున్నారు .
మురళి సర్ , గోవర్ధన్ …….. ఈరోజు కాలేజ్ కు వెళ్లడం లేదా ? .
గోవర్ధన్ : ఈరోజు స్కూలే లేదు మహేష్ ……..
ఆశ్చర్యంగా చూస్తున్నాను .
వినయ్ : మహేష్ ……. ఈరోజు సెకండ్ సాటర్డే మరిచిపోయావా ? .
కదా అంటూ సిగ్గుపడ్డాను . అందరితోపాటు నవ్వుతూనే ఔట్ హౌస్ లోకి పరుగుతీసాను . రాత్రి స్కిప్ చెయ్యమని కోరితే ఇలా కోరిక తీర్చారా దేవతలూ ……. నా దేవత పెద్దమ్మ కదా , పెద్దమ్మా …….. థాంక్యూ soooooo మచ్ అని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను . అవ్వల దగ్గరికి వెళ్ళాలి , మురళి వాళ్లేమో బ్యాట్స్ తో రెడీగా ఉన్నారు ఇప్పుడెలా ఎలాగైనా వెళ్ళాలి అని డబ్బును – మొబైల్ ను జేబులో పెట్టుకున్నాను .
