అమ్మా ………. నిజంగా మీరు నిన్ననే పలికినట్లు దేవుడు అమ్మా మా అన్నయ్య . ఈ ఆనందంలోనే ఈరోజు ఎంత సరదాగా గడిపామో ఎంత ఎంజాయ్ చేశామో మీకు చెబుతాము . ఫోటోలు కూడా ఉండి ఉంటే బాగుండేది ……… అనేంతలో , కాలింగ్ బెల్ మ్రోగడంతో ………….
బుజ్జాయిల ముఖం వెలిగిపోయి పెదాలపై అంతులేని నవ్వుతో , అమ్మా అమ్మా ……. మా అన్నయ్య అదే అదే మీ దేవుడు వచ్చేసారు రండి రండి అని చేతులుపట్టుకుని , మీకు మీ దేవుడిని – మా అన్నయ్యకు మా ప్రియమైన దేవతలాంటి అమ్మను పరిచయం చేస్తాము అని లాక్కుంటూ డోర్ దగ్గరికి చేరుకున్నారు .
నాన్నా – తల్లీ ………. ఒక్క నిమిషం మన ఆనందబాస్పాలను కన్నీళ్లు అనుకుని మీ అన్నయ్య బాధపడతారేమో ………
లవ్ యు అమ్మా ………. అని ముగ్గురూ తుడుచుకుని , అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ అంతులేని సంతోషంతో డోర్ తెరిచారు .
బయట ఎవ్వరూ లేకపోవడంతో అన్నయ్యా అన్నయ్యా ……….. అంటూ బయటకువచ్చి చుట్టూ చూసి , నిరాశతో అక్కయ్యా – అన్నయ్యా ……….. అమ్మ దేవుడు రాలేదా అని బాధపడుతున్నారు .
దేవత పెదాలపై చిరునవ్వుతో , తల్లీ – నాన్నా ………. అని వేలితో నేలపై లోపలి నుండే చూయించారు .
కింద గిఫ్ట్ బాక్స్ అందుకొని దానిపై ప్రాణమైన బుజ్జాయిలకోసం ………. మీ అన్నయ్య అని చదివి , అమ్మా అమ్మా ………. అన్నయ్య అని మళ్లీ చుట్టూ చూసి బాక్స్ పై సంతోషంతో ముద్దుల వర్షం కురిపించి , లోపలికివెళ్లాడాన్ని ఇంటిలోనుండి తొంగిచూసి ఆనందించాను .
అమ్మా – అమ్మా ………. గిఫ్ట్ లో ఏముందో చూద్దాము రండి అని లోపలికివెళ్లి బుజ్జాయిల బెడ్ పై కూర్చోబెట్టి , మీ దేవుడు కదా మీరే ఓపెన్ చెయ్యండి .
తల్లీ ………. ఇదిగో చూడండి బుజ్జాయిలకోసం అంటే మీకోసం మీరే ఓపెన్ చెయ్యాలి.
సరే అమ్మా అమ్మా ……….. ముగ్గురమూ కలిసి ఓపెన్ చేద్దాము అని బెడ్ పై ఉంచి చుట్టూ కూర్చుని ఓపెన్ చేశారు . ఒక లెటర్ మూడు హార్ట్ సింబల్ చాక్లెట్ లు కింద బాక్స్ ఉంది .
దేవత ఆతృతతో లెటర్ తెరిచి కీర్తి తల్లీ – బిస్వాస్ ……….. మీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మతోపాటు చాక్లెట్ లు తింటూ బాక్స్ లోనివి ఆస్వాదించండి – లవ్ యు లవ్ యు లవ్ యు soooooooooo మచ్ . తల్లీ ……….. మీ అన్నయ్యకూడా తల్లీ అని ప్రేమతో పిలుస్తారా ………..
అవునమ్మా ……….. మీరు ఎంత ప్రాణంలా అయితే పిలుస్తారో అంతే ప్రాణంలా నా బంగారు బుజ్జి కీర్తి తల్లీ అని పిలుస్తారు అని మురిసిపోయింది .
దేవత కూడా పరవశించి లవ్ యు నా బంగారు బుజ్జి కీర్తి తల్లీ అని తియ్యదనంతో నవ్వుకుని , గిఫ్ట్ ఏమిటోనని ఆతృతతో ఓపెన్ చేయబోతే , కీర్తి దేవత చేతులపై కొట్టి అమ్మా ……… మా అన్నయ్య చెప్పినట్లు చాక్లెట్ ఆస్వాదిస్తూ కాబట్టి రెండూ ఒకేసారి అని కీర్తి , బిస్వాస్ ……. చాక్లెట్ లు – దేవత గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశారు .
Wow ………. ఫోటోలు తల్లీ నాన్నా అని దేవత – మా ఫోటోలు అమ్మా అని బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు .
మాకు తెలుసు మా అన్నయ్య …….. మా అమ్మ చూసి తరించడం కోసం ఖచ్చితంగా ఇస్తారని లవ్ యు లవ్ యు అన్నయ్యా ……… అని తలుచుకుంది కీర్తి .
తొలి ఫొటోలో బుజ్జాయిలు కాలేజ్ డ్రెస్ తో బోర్డ్ ముందు నిలబడ్డారు . దేవత అందుకుని ఉమ్మా ఉమ్మా ……… అని ముద్దులుపెట్టి , తల్లీ – నాన్న …….. బోర్డ్ పై మీ హ్యాండ్ రైటింగ్ అని సంతోషపు ఆశ్చర్యంతో అడిగారు .
బుజ్జాయిలు : అవునమ్మా అని గర్వపడుతూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి మా అమ్మ వల్లనే అని ఒడిలో కూర్చుని , వెంటనే నెక్స్ట్ ఫోటో చూడకండి అసలు ఏమిజరిగిందో చెబుతాము .
ఉదయం మీ తియ్యని ముద్దులు అందుకొని కాలేజ్ బ్యాగ్స్ మోస్తూ కిందకువెళ్లడం – కాలేజ్ బస్ ఎక్కనీయకపోవడం అక్కడ జరిగిన రభసకు మేము కన్నీళ్ళతో బాధపడుతుంటే , మీ దేవుడు ప్రత్యక్షమై నేను తీసుకెళ్లనా బుజ్జాయిలూ అని కన్నీళ్లను తుడిచి బ్యాగులు భుజం పై వేసుకుని మమ్మల్ని ప్రాణంలా ఎత్తుకుని కాలేజ్ కు కాలేజ్ బస్ కంటే ముందే తీసుకెళ్లారమ్మా ……….. ఈరోజు నుండి రోజూ ఈ అన్నయ్యే తీసుకెళతారు తీసుకొస్తాను అని మాటిచ్చారు అమ్మా …….. ఇక అక్కడ మొదలైంది మా సంతోషం .
తల్లీ – నాన్నా ………. అని ప్రాణంలా హత్తుకుని నిజంగా మీ అన్నయ్య దేవుడు .
అప్పుడే ఏమైందమ్మా ……… మమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చెయ్యకుండా ఊ కొట్టు కావాలంటే అన్నీ ముద్దులూ చివరికి పెట్టొచ్చు అని తమ తల్లి బుగ్గలను ప్రేమతో కొరికేశారు .
స్స్స్……. అని రుద్దుకోవడం – నోటికి తాళం వేసుకోవడం , స్స్స్……. అని రుద్దుకోవడం – తాళం వెయ్యడం చూసి ………. బుజ్జాయిలు నవ్వుకుని కొరికిన చోట తియ్యని ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలు : అన్నయ్య నెంబర్ ఇచ్చి వెళ్లిపోయారు . దేవత నెంబర్ తెలుసుకోవాలని కళ్ళతోనే express చెయ్యడం చూసి , చకచకా ********** ఇది మీ దేవుడి నెంబర్ అని మళ్ళీ ముద్దులుపెట్టారు . క్లాస్ లో మా అమ్మ tuitions వలన కాలేజ్ కంటే ముందు ఉండటం వలన ప్రతి ఆన్సర్ మాకు తెలుసని చెయ్యెత్తి సర్ కు చెబుతున్నా పట్టించుకోవడం లేదు .
తల్లీ – నాన్నా ………. అని కళ్ళల్లో కన్నీళ్ళతో హత్తుకుంది .
అమ్మా ……… అందుకే మొత్తం వినమని చెప్పింది అని కన్నీళ్లను తుడిచి , అంతే మళ్లీ మీ దేవుడు క్లాస్ లో ప్రత్యక్షమై ఏమి జరిగిందో వివరించారు – మమ్మల్ని ఎత్తుకుని బోర్డ్ దగ్గరికి తీసుకెళ్లి ఊ అని ముద్దులుపెట్టడంతో చకచకా సాల్వ్ చేసేసాము . క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయింది అమ్మా ……… సర్ అయితే నోరు తెరిచి షాక్ లో ఉండిపోయారు . అన్నయ్య సర్ కు వార్నింగ్ ఇచ్చి మా బుజ్జాయిలు కాలేజ్ సిలబస్ కంటే ముద్దు ఉన్నారు కాబట్టి వెళ్లిపోతున్నాము అని మాకు ఈ ఫోతో మరియు అన్నయ్యతో సెల్ఫీ కూడా లేదే ………. కింద ఉందేమో లే ……..
అన్నయ్య ………. మమ్మల్ని ప్రాణంలా గుండెలపై హత్తుకుని సూపర్ అని ముద్దులుపెట్టి , నాతోపాటు వస్తారా అని అడిగారు .
దేవత అంతులేని ఆనందంతో మరి మీరేమని బదులిచ్చారు తల్లీ – నాన్నా …….. అని మళ్ళీ నోటికి తాళం వేసుకున్నారు .
బుజ్జాయిలు నవ్వుకుని తమ తల్లి వేలిపై ముద్దులుపెట్టి , అన్నయ్యా – అన్నయ్యా ……….. మా అమ్మ చెప్పింది మీ అన్నయ్య కిడ్నప్ చేసినా సంతోషంగా వెళ్ళండి అని చెప్పేశాము .
లవ్ యు తల్లీ – నాన్నా ……….
బిస్వాస్ : అన్నయ్య గుండెలపైనుండి ప్రక్కకు వెళ్ళలేదు అక్కయ్య ………. అమ్మా . నెక్స్ట్ షాపింగ్ మాల్ కు వెళ్ళాము ఇదిగో డ్రెస్సెస్ అని చూయించి , షాపింగ్ మాల్లో స్టిల్స్ అన్నింటినీ తమ అమ్మకు చూయించారు .
దేవత : అమ్మో అమ్మో ……. ఎన్ని స్టిల్స్ – ఫోజస్ ……… బార్బీలానే ఉంది నా తల్లి అని ఫోటోలపై ముద్దుల వర్షం కురిసింది .
అక్కడి నుండి అన్నయ్య ఎత్తుకుని ఇక్కడికి తీసుకెళ్లారు అని ఫోటో చూయించారు .
దేవత : వెలిగిపోతున్న కళ్ళతో జూ ………. తల్లీ – నాన్నా ……… జూ వెళ్ళారా ……. లవ్ యు లవ్ యు ………. అని జూలో దిగిన బోలెడన్ని ఫోటోలను చూసి ఆనందించారు . తల్లీ లయన్ – నాన్నా టైగర్ ………. భయం వెయ్యలేదా ……….
బుజ్జాయిలు : మా ………. మీ దేవుడు ఉండగా మాకేమీ భయం అమ్మా , కానీ లయన్ గట్టిగా గాండ్రించింది అమ్మా ……… భయంతో అన్నయ్యను కాసేపటి వరకూ వదల్లేదు అని నవ్వుకుని చెప్పారు .
దేవత : తల్లీ టాయ్ ట్రైన్ కూడానా ………..
బుజ్జాయిలు : జూ లోఉన్నవన్నీ ఎంజాయ్ చేసామమ్మా ………. స్నాక్స్ – ఐస్ క్రీమ్స్ తింటూనే ఉన్నాము . పక్షులకు గింజలు వేసినప్పటి ఫోటో – జింకలకు క్యారెట్ అందించిన ఫోటో – జిరాఫీకి చెరుకు అందించిన ఫోటో …………. అని చూయించారు .
దేవత : అమ్మో అమ్మో ……… లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచెత్తారు .
బుజ్జాయిలు : ఒకసారి కాదమ్మా ……… two టైమ్స్ జూ చూసాము – మేము బాధపడుతుంటే ముద్దులుపెట్టి మళ్లీ తీసుకెళ్లారు అన్నయ్య …….కాదు కాదు మీ దేవుడు .
దేవత : అవునా తల్లీ నాన్నా ……….. మీ అన్నయ్యను చూడాలని ఉంది . ఎక్కడ ఉంటారో తెలుసుకోలేదా ………..
బుజ్జాయిలు : మీరు అడిగారని చెప్పాము అమ్మా ………. సర్ప్రైజ్ అనడంతో ……..మాకూ సర్ప్రైజ్ ఇష్టమని చెప్పాము . అమ్మా – అమ్మా ……… నెక్స్ట్ లంచ్ కోసం ఈ హోటల్ కు వెళ్లామమ్మా ……….. ఎంత పెద్దదో అని ఫోటో చూయించారు .
దేవత : పెదాలపై తియ్యని నవ్వు విరిసింది . మధురమైన జ్ఞాపకాలు మెదిలాయి .
అమ్మా అమ్మా ………. ఈ ఫంక్షన్ హాల్లోకి నో ఎంట్రీ అని వదల్లేదు . అన్నయ్య ఒక్క కాల్ చేశారు అంతే సర్ అని రెస్పెక్ట్ ఇచ్చి లోపలికి వదిలారు . లోపల ఇలా అద్భుతంగా ఉంది నాకెందుకో ఆ స్టేజీపై వాక్ చెయ్యాలనిపిస్తే అన్నయ్య నన్ను కన్నార్పకుండా అలా చూస్తూ వందల్లో ఫోటోలను క్లిక్ మనిపించారు ఇదిగో అమ్మా …….. అని భుజం కదిపింది .
తల్లీ తల్లీ ……….. అని కీర్తి ఫ్యాషన్ వాక్ ఫోటోలు – ఇద్దరూ కలిసి వాక్ చేస్తున్న ఫోటోలను చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో గుండెలపై హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చారు .
అమ్మా అమ్మా …………
లేదు లేదు తల్లీ ………. ఆనందబాస్పాలు అని గుండెను రాయి చేసుకున్నట్లు కంట్రోల్ చేసుకుని కన్నీళ్లను తుడుచుకుని నవ్వుతూ ఫోటోలపై ముద్దులుపెట్టడం చూసి బుజ్జాయిలు ఆనందించారు .
బుజ్జాయిలూ ………. మీరే తీసుకెళ్లమన్నారా ?
లేదమ్మా ……….. మీకు అద్భుతమైన చోటుని చూయిస్తాను బుజ్జాయిలూ – ఎందుకో మీకు తరువాత తెలుస్తుందు అని మీ దేవుడే తీసుకెళ్లారు . వాక్ చేస్తుంటే చప్పట్లతో కేరింతలతో ఎంజాయ్ చేశారు మీ దేవుడు అని సంతోషంతో చెప్పారు .
లవ్ యు తల్లీ ………. తరువాత నేనే చెబుతాను అని ముద్దులుపెట్టి మురిసిపోయారు .
కీర్తి : అమ్మా ………. మా ముగ్గురినీ చూసి హోటల్ మేనేజర్ ఒక తియ్యని మాట అన్నారు – అదికూడా మేము మీకు తరువాత చెబుతాను అని తన తల్లి కళ్ళల్లోకే కన్నార్పకుండా చూస్తూ ముద్దులుపెట్టింది .
నెక్స్ట్ హోటల్లోనే రెస్టారెంట్ కు అమ్మా ………. ఇదిగో ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పటికీ , మీరు కట్టించిన మా ఇద్దరి లంచ్ ను మాకు ఒక్కముద్దకూడా పెట్టకుండా – మీరు ఇంట్లో తింటారుకదా అని మొత్తం తినేసి , మీరు ఇప్పుడు ఎలా అయితే అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యారో అలా ఫీల్ అవ్వడం చూసి నవ్వుకున్నాము . మేమైతే బిరియానీ – లాలీపాప్ – డ్రింక్స్ ………. ఎలా తిన్నామో చూడమ్మా అని ఫోటోలను చూయించారు .
లెగ్ పీస్ మరియు లాలీపాప్ లను నోట్లోపెట్టుకుని మ్మ్మ్…….మ్మ్మ్…….. అంటూ లాగేస్తుండటం చూసి గట్టిగా నవ్వుకుంది దేవత . తల్లీ – నాన్నా ……… అంత బాగున్నాయా అని లొట్టలేస్తూ పెదాలను తడుముకోవడం చూసి , మా అమ్మ కూడా ఉంటే ఎంత బాగున్నో అని దేవత గుండెలపై చేరారు . అమ్మా అమ్మా ………. అన్నయ్యకు చెప్పాము కిడ్నప్ చేయాలనుకుంటే మా అమ్మను కూడా కిడ్నప్ చెయ్యమని .
లవ్ యు బుజ్జాయిలూ ………. అని కన్నీళ్లను తుడుచుకుని , మత్స్య దర్శిని ఫోటోను చూసి అంతేనా అని కవ్వించారు .
లేదమ్మా – లేదమ్మా ………. నెక్స్ట్ మత్స్య దర్శిని అని ఫోటోలను ఆ తరువాత అన్నయ్య బయటకు వెళ్తానని చెప్పినా అన్నయ్య ముందే డ్రెస్ మార్చుకుని , వాటర్ వరల్డ్ లో స్విమ్ నేర్పించడం – బోలెడన్ని సార్లు వాటర్ స్లైడ్స్ ఆడటం అక్కడ ఎంత ఎంజాయ్ అని ఉత్సాహంతో చెప్పారు .
అన్నయ్యా ……… మాకు అమ్మ ఉంది – మాకు మా అన్నయ్య అమ్మ మా అమ్మను చూడాలని ఉంది అని కోరాము .
అవును తల్లీ – బిస్వాస్ ………. మనందరికీ అమ్మ అని అనాధ శరణాలయం కు తీసుకెళ్లి , మీరు ఎంతో భక్తితో పూజించే ఈ అమ్మవారినే అందరి అమ్మ అని చూయించారు అమ్మా …………
తల్లీ – నాన్నా ……….. అయితే ,
అవునమ్మా ……….. అన్నయ్య అనాధ – అన్నయ్య అంటే అక్కడి అన్నయ్యలందరికీ ప్రాణం . అన్నయ్యను చూడగానే పరుగునవచ్చి హత్తుకుని ఇక మమ్మల్ని అయితే వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు . అన్నయ్య ……… మా చేతులతో ఐస్ క్రీమ్స్ – చాక్లెట్ లు అందించారు . వాళ్ళ ఆనందం చూసి మురిసిపోయాము . మమ్మల్ని ప్రాణంలా ఎత్తుకొనివెల్లి ఎంతసేపు ఆడుకున్నామో సమయమే తెలియలేదు . మేమైతే మిమ్మల్నే మరిచిపోయాము లవ్ యు అమ్మా లవ్ యు అమ్మా …………అని హత్తుకుని ,
బుజ్జాయిలూ …………. మీ అమ్మ ఎదురుచూస్తుంటారు అని అన్నయ్య గుర్తుచేశారు . మాకు మీదగ్గరకు రావాలని ఉంది – అక్కడే ఆదుకోవాలని ఉందని ఫీల్ అవుతుంటే , తల్లీ ……….. మీరు ఇప్పుడు కోరుకుంటే అప్పుడు తీసుకొస్తాను అని అన్నయ్య మాటివ్వడంతో , సంతోషించి బయలుదేరాము .
వార్డెన్ సర్ ఆపి మీకోసం స్పెషల్ భోజనం రెడీ చేసాము తినివెళ్లండి అని కోరడంతో , ఇదిగో ఇలా తిన్నామమ్మా ……….
దేవత : wow ………. ఇంతమంది అన్నయ్యలతోపాటు కలిసి తిన్నారా ………. లవ్లీ లవ్లీ …………
అవునమ్మా ……….. సందడే సందడి . ఎంత తిన్నామో మాకే తెలియదు . వడ్డిస్తూనే ఉన్నారు – తింటూనే ఉన్నాము .
ఉమ్మా ఉమ్మా ………. నా బంగారు బుజ్జి బుజ్జాయిలు ఎంత అదృష్టవంతులో అని పరవశించిపోయి , ఒక్క ఫోటోలోనూ మీ అన్నయ్య లేరు – మొత్తం మీరే ఉన్నారు . మీ అన్నయ్యను మీరు పట్టించుకోలేదు కదా ………. , నేను హార్ట్ అయ్యాను బుంగమూతిపెట్టుకున్నాను అని అటువైపు తిరిగారు . నాకు వెంటనే వెంటనే మీ అన్నయ్యను చూడాలని ఉంది.
