లేదమ్మా ………. అన్నయ్యతోపాటు బోలెడన్ని ఫోటోలు దిగాము . ఉండండి చూస్తాము అని భోజనపు ఫోటోల కింద గ్రూప్ ఫోటోలో నేను ఉండటం చూసి , యాహూ యాహూ ……… అని టాప్ లేచిపోయేలా కేకలువేసి అమ్మా అమ్మా …….. ఇదిగో మా ………. మీ దేవుడు అని అటువైపుకు వెళ్లి చూయించారు . అడ్రస్ తెలిసి ఉంటే స్వయంగా చూయించేవాళ్ళము .
నన్ను చూసి పెదాలపై చిరునవ్వుతో నాకు మీ అన్నయ్య అడ్రస్ తెలుసుకదా ………..,
అమ్మా అమ్మా ………. మీకు తెలుసా ఎక్కడ ఎక్కడ ఎక్కడ …………అని ఏకంగా మీదకు ఎక్కడంతో నవ్వుతూ బెడ్ పై వాలిపోయారు దేవత .
దేవత : తల్లీ – నాన్నా ………… మిమ్మల్ని చూడకుండా మీ అన్నయ్య ఉండలేరు . నిన్నరాత్రి 11 మనం పడుకున్నాక డోర్ తెరిచి ఉందేమో మిమ్మల్ని చూడటానికి అదిగో ఈ డోర్ వరకూ వచ్చారు . మిమ్మల్ని సంతోషంతో ప్రాణంలా చూస్తూ ఉండిపోయారు. ప్రక్క రూంలో అలికిడికి మెలకువ అయ్యిచూస్తే అడుగుల చప్పుడు వినిపించడంతో , మిమ్మల్ని పడుకోబెట్టి నెమ్మదిగా వెళ్ళాను . డోర్ చాటున తొంగిచూస్తే వీరు………. మీ సేఫ్టీ కోసం రాత్రంతా ……….. బయటే కుర్చీలో కూర్చున్నారు మీ అన్నయ్య అంత ప్రాణమా మీరంటే అని పొంగిపోయారు .. సో మీ అన్నయ్య ఉండేది మన ప్రక్క ఇంట్లోనే – అదే సర్ప్రైజ్ అనిచెప్పడం ఆలస్యం తమ తల్లి బుగ్గలపై లవ్ యు అని ముద్దులుపెట్టి అన్నయ్యా – అన్నయ్యా ……… అంటూ బయటకు పరుగుతీశారు .
**************
ఆఫీస్ నుండి ఫొటోలతో ముందుగా శరణాలయం కు వెళ్లి బుజ్జాయిలతో తమ్ముళ్లు ఎంజాయ్ చేసిన మరియు గ్రూప్ ఫోటోని తమ్ముళ్లకు అందించి వారి సంతోషాన్ని చూసి మురిసి , అపార్ట్మెంట్ చేరుకున్నాను .
ఫోటో బాక్స్ లు కెమెరా మరియు అక్వేరియం ను కష్టంగా అందుకోబోతుంటే , సెక్యూరిటీ అన్న అక్వేరియం అందుకొని , సర్ ……… ఒక్కసారి పిలిస్తే వచ్చేస్తానుకదా అన్నాడు .
అన్నా ………. ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టను .
సర్ ……… అలా ఫీల్ అవ్వకండి . పిల్లల ఆనందం చూడాలనుకున్నాను ఏకంగా వాళ్ళతో ఐస్ క్రీమ్ ఇప్పించారు . అధిచాలదా ……… అని మాట్లాడుకుంటూ , సర్ ……… పిల్లలు మీ అడ్రస్ తెలుసా అని అడిగారు . నేను చెప్పేంతలో మీరు సర్ప్రైజ్ అన్నారని చెప్పడంతో ఆగిపోయాను లేండి . మిత్తానికి తెలిసిపోతుంది పిల్లల దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి .
రెడీ అన్నా ………. కీర్తి బలంగా కొడుతుంది అని నవ్వుకుని లిఫ్ట్ లో ఫ్లోర్ చేరుకుని ఇంట్లోకివెళ్లి టేబుల్ ను హాల్ మధ్యలో పెట్టి దానిపై అక్వేరియం పెట్టించాను . Hi చేపలూ ……… మీ బుజ్జి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చేస్తారు ఆడుకోవడానికి రెడీగా ఉండండి ఉమ్మా ……… అని ముద్దుపెట్టాను .
సర్ ………. దెబ్బలు తినడానికి all the best గుడ్ నైట్ అని చేతులు కలిపాడు .
పర్స్ లోనుండి డబ్బుతీసి వద్దన్నా జేబులోపెట్టాను .
థాంక్స్ సర్ ……….. మీ అన్నయ్య ఇచ్చాడని మా పిల్లలను వారు కోరుకున్నది తీసుకెళతాను అని సంతోషంతో వెళ్ళాడు .
గిఫ్ట్ బాక్స్ ను అందుకుని బయటకు తొంగిచూసి , ఎవరూ లేకపోవడంతో ఉత్తకాళ్ళతో అడుగులో అడుగువేసుకుంటూ వెళ్లి లవ్ యు బుజ్జాయిలూ అని డోర్ ముందు కింద ఉంచి కాలింగ్ బెల్ నొక్కి పరుగున ఇంట్లోకి వచ్చేసి కొద్దిగా డోర్ తెరిచి చూస్తున్నాను .
దేవతతోపాటు సంతోషంతో బయటకు రావడం – బాధపడటం – దేవత గిఫ్ట్ వైపు సంతోషంతో చూయించడం – కీర్తి తల్లి అందుకుని ముద్దుల వర్షం కురిపించడం చూసి ఎంజాయ్ చేసాను . బుజ్జాయిల మాటలు విన్నంతసేపూ ……….. అక్వేరియం లోని చేపలు ఉత్సాహంతో ఎగరడం తెలిసి ఆశ్చర్యపోయి , అప్పుడే మీరు మీరు ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట అని ఆనందాన్ని పొందాను .
డోర్ సగం క్లోజ్ అవ్వడం చూసి , నో నో నో ………. నా బుజ్జితల్లి ఏక్షణమైనా రావచ్చు అని పూర్తిగా తెరిచి , మరొక సెట్ ఫోటోల బాక్స్ ను నా బెడ్రూంలోకి తీసుకెళ్ళాను . దేవత ఫోటోల దగ్గరికివెళ్లి – కీర్తి తల్లి బిస్వాస్ ఫ్యాషన్ వాక్ ఫోటోలను ముందుగా తీసి చూస్తే అచ్చు దేవతలానే అనిపించి , దేవత నడకల ఫోటో ప్రక్కన బుజ్జితల్లి నడకల ఫోటో – స్టేజి చివరికివచ్చి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలిన ఫోటో ప్రక్కన బుజ్జితల్లీ కిస్సెస్ వదిలిన ఫోటోలు – దేవత ఫొటోలో నేనున్న ఫోటో ప్రక్కన బుజ్జితల్లి బిస్వాస్ ను ఎత్తుకున్న ఫోటో ……….. అలా తల్లికి తగ్గ ఫోటోలను ప్రక్కనే అతికించాను . ఇక చుట్టూ రౌండ్ గా……. కాలేజ్లో ఎత్తుకుని దిగిన ఒక ఫోటో – షాపింగ్ మాల్లో ఎత్తుకుని దిగిన ఫోటో – జూ ఎంట్రన్స్ లో ఎత్తుకుని దిగిన ఫోటో – అక్వేరియం లో దిగిన ఫోటో – శరణాలయం లో దిగిన ఫోటో – గ్రూప్ ఫోటోలను అందంగా అతికించి వెనక్కువచ్చి కనులారా కన్నార్పకుండా తిలకిస్తూ సమాయాన్నే మరిచిపోయేలా మైమరిచిపోయాను .
****************
దేవత ప్రక్కన ఇల్లే అని చెప్పగానే తమా ఇంటి డోర్ తీసుకుని అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ………… అంటూ పరుగునవచ్చి డోర్ తెరిచి ఉండటం ఎదురుగా అక్వేరియంలో చేపలు ఎగురుతుండటం చూసి పరుగున లోపసలికివచ్చి ముద్దులుపెట్టి , అంతులేని ఆనందంతో అక్కయ్యా – అన్నయ్యా ……….. మన అన్నయ్య ఇల్లు ఇదే – మనకు చెప్పలేదు కదూ అయిపోయారు అన్నయ్య అని నవ్వుకుని , మళ్లీ గట్టిగా అన్నయ్యా అన్నయ్యా ………. అని కేకలువేశారు .
బెడ్రూంలో తేరుకుని నా బుజ్జాయిలు వచ్చేసారు అని ఫోటోలకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి , రూమ్ బయటకువచ్చి వెంటనే డోర్ క్లోజ్ చేసేసి , బుజ్జితల్లీ – బిస్వాస్ కనిపెట్టేసారా …….. అని పెదాలపై చిరునవ్వుతో మోకాళ్లపై కూర్చుని చేతులను విశాలంగా చాపి గుండెలపైకి ఆహ్వానించాను .
అన్నయ్యా – అన్నయ్యా ………. అని తియ్యదనంతో పిలిచి బుజ్జిబుజ్జికాళ్ళతో పరుగునవచ్చి నా కౌగిలిలోకి చేరిపోయారు . తనివితీరిన తరువాత కౌగిలి వదిలి తియ్యనికోపంతో చూసి నా ఛాతీపై ప్రేమతో కొట్టి , ఇక్కడే ఉండికూడా చెప్పనేలేదుకదూ అని బుగ్గలను కొరికేశారు .
స్స్స్ ……..ఆఅహ్హ్హ్……. లవ్ యు బుజ్జితల్లీ – లవ్ యు బిస్వాస్ ………. మీ ఇష్టం అని చేతులను విశాలంగా చాపాను .
మళ్లీ కొట్టబోయి పెదాలపై చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుని సర్ప్రైజ్ అదిరిపోయింది అన్నయ్యా ……….. మన అమ్మవారిని కూడా అమ్మ – అన్నయ్య ఒకచోటనే ఉండాలని కోరుకున్నాము అని నొప్పిగా ఉందా అన్నయ్యా ……… లవ్ యు లవ్ యు ………. అని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి అంతే ఘాడంగా హత్తుకుని , లవ్ యు అమ్మా ……… మాకోరిక తీర్చినందుకు మళ్లీ వచ్చి దర్శించుకుంటాము – మాంచి కిక్కిచ్చారు ఎంత అంటే మాటల్లో చెప్పలేము అని నా కౌగిలిని వదలడం లేదు .
బుజ్జితల్లీ – బిస్వాస్ ………. మీ ఫ్రెండ్స్ బుజ్జిచేపలు మీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నాయో ……… పాపం .
తెలుసన్నయ్యా ………. మమ్మల్ని చూడగానే పైపైకి ఎగిరాయి సంతోషంతో ………
అవునా ………. wow అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , రండి మరి మీ బుజ్జిచేపలకు ఫుడ్ వేద్దాము అని గుండెలపై ఎత్తుకుని తీసుకెళ్ళాను .
ఫిష్ ఫుడ్ చేతులోపెట్టుకుని బుజ్జాయిలకు ముద్దుపెట్టి ఊ …….. అన్నాను. బుజ్జివెళ్లతో అందుకుని చేపలకు వేశారు . వేసినవెంటనే మూతులు తెరిచి తినడం చూసి , అన్నయ్యా – అన్నయ్యా ……… తింటున్నాయి అని సంతోషంతో నా బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి వాటికి కడుపునిండా వేసి మురిసిపోయారు .
మా బుజ్జాయిలకోసం థాంక్స్ థాంక్స్ అంటూ పైపైకి ఎగురుతుంటే , బుజ్జాయిల చేతివేళ్ళతో తాకించగానే ముద్దులుపెట్టినట్లు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు .
బుజ్జాయిలూ ……… పాపం వాటికి ఉదయం నుండీ మీలానే రెస్ట్ లేదు . ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరు పడుకుంటే అవికూడా హాయిగా రెస్ట్ తీసుకుంటాయి .
ఊహూ ……… మేము మా అన్నయ్యను వదిలి వెల్లనే వెళ్ళము .
మరి అమ్మ …………
అమ్మతో ఎలాగో రోజూ పడుకుంటాము కదా – ఈరోజు వాడు లేడు కాబట్టి మీ గుండెలపైనే ఇలాగే నిద్రపోతాము అంతే , వెల్లమంటే బుగ్గలను కొరికేస్తాము కొరికెయ్యమా ………. అని పెద్దగా నోటిని తెరిచారు .
నవ్వుకుని , అమ్మో ………. బుజ్జి ఆడ సింహం నోరు – బుజ్జి బుల్లి సింహం నోరు నాకు భయమేస్తోంది . సరే సరే ………. నా బుజ్జితల్లి ఇష్టమే నా ఇష్టం అని ప్రాణంలా ముద్దులుపెట్టి జోకొట్టాను . బయట ఎవరో నవ్వినట్లు వినిపించింది . ఈ ఆనందంలో పట్టించుకోలేదు .
అన్నయ్యా అన్నయ్యా ……….. అప్పుడే కాదు . మనం మాట్లాడుకోవాలా – మనం ఉదయం నుండీ ఎంత ఎంజాయ్ చేశామో తెలిసి అమ్మ ఎంత ఆనందించారో – మురిసిపోయారో – పరవశించిపోయారో – ఎన్ని ఆనందబాస్పాలు కార్చారో – ఫోటోలకు ఎన్నిముద్దులుపెట్టారో ………. ఆ సంతోషాన్ని మీతో పంచుకున్న తరువాత ………….
నా బంగారు బుజ్జి తల్లీ ……….. అదంతా అయ్యేసరికి తెల్లవారిపోతుందేమో ……..
మళ్లీ ……… ముసిముసినవ్వులు వినిపించాయి .
అంతలోనే బుజ్జాయిలు గట్టిగా నవ్వుకుని ముద్దులుపెట్టి , తెల్లవారి సూర్యుడు వచ్చినా సరే అమ్మ అంత సంతోషించడం ఎప్పుడూ చూడలేదు .
నాకు కావాల్సింది కూడా అదే తల్లీ అని మనసులో అనుకున్నాను .
లెట్స్ స్టార్ట్ అన్నయ్యా ………… ఈ బుజ్జి బార్బీ డ్రెస్ అయితే అమ్మకు చాలా చాలా చాలా నచ్చేసింది . ముద్దులే ముద్దులు ……….. లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ………. ఆ క్రెడిట్ మొత్తం మీకే చెందాలి అని వరుసగా ఒక్కొక్కటే చెబుతూ ……… ఉదయం నుండి అలసిపోవడం వలన నా భుజాలపై తలలువాల్చి హాయిగా నిద్రపొయారు .
శరణాలయంలో నేర్చుకున్న లాలిపాటలు పాడుతూ అటూ ఇటూ తిరుగుతూ మధ్యమధ్యలో నా బుజ్జితల్లి – బిస్వాస్ లవ్ యు లవ్ యు అని ముద్దులుపెడుతూ ……….. హాయిగా నిద్రపోండి మీరు సంతోషంతో హాయిగా నిద్రపోతే మీ అమ్మగారు కూడా రోజంతా జరిగినవి మరిచిపోయి పెదాలపై చిరునవ్వుతో హాయిగా నిద్రపోతారు – మీ కోసమే జీవిస్తున్నారు – మీకు కూడా మీ అమ్మ అంటే ఎంత పంచ ప్రాణాలో తెలుసుకున్నాను ఉమ్మా ఉమ్మా ……… అని జోకొడుతూ ప్రపంచాన్నే మరిచిపోయాను .
డోర్ దగ్గర అలికిడి అవ్వడంతో చూస్తే దేవత – కళ్ళల్లో ఆనందబాస్పాలతో మమ్మల్నే ఆరాధనతో చూస్తున్నారు .
వెంటనే బుజ్జాయిలను జోకొడుతూనే , మోకాళ్లపై కూర్చుని మేడం ……… ఎప్పుడువచ్చారు చూసుకోలేదు క్షమించండి . అప్పుడే పంపించేవాడిని పిల్లలు ………
విన్నాను మహేష్ ……….. నన్నుకూడా వద్దనుకుని మీతోనే ఉంటారని గోలచేసినప్పుడే వచ్చాను అని సంతోషంతో నవ్వుతూ బాస్పాలను తుడుచుకున్నారు. మహేష్ ……… నేనేమీ దేవతను కాను మోకరిల్లాడానికి లే అంటూ తాకాబోయి ఆగిపోయారు .
మాకు మీరు దేవత కంటే ఎక్కువ మేడం . మీరు సహాయం చెయ్యడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను . మీరు మా శరణాలయానికి ఎంత సహాయం చేశారో మేము ఎప్పటికీ మరిచిపోము . మీరు సంతోషంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని . మేడం ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి తప్పైతే క్షమించండి శిక్షించినా సంతోషంగా భరిస్తాను .
దేవత : సంతోషంతో కన్నీళ్లను తుడుచుకుని ఏదైనా అడుగు మహేష్ ………..
మేడం ……….. ఇంత జరుగుతోంది కదా ……… మీ వాళ్లకు చెప్పొచ్చుకదా ……..
దేవత : మహేష్ ………. నీలానే నేనూ అనాధను – డబ్బున్న అనాధను అంతే తేడా ఏమీ లేదు . నేను పుట్టగానే నా తల్లిదండ్రులు ఆక్సిడెంట్ లో చనిపోయారు . నన్ను మా ఆయా పెంచి పెద్ద చేశారు . పెళ్లయ్యాక నేను పడుతున్న కష్టాలను చూసి ఆమె కూడా ……….. అని కన్నీళ్ళుపెట్టుకున్నారు .
