జీవితంలో ఫస్ట్ టైం వాళ్ళు ప్రక్కన లేరు అని ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది . కన్నీళ్లను తుడుచుకుని బయటకువచ్చి కారులో అపార్ట్మెంట్ చేరుకుని లిఫ్ట్ లో పైకివెళ్లి డోర్ తెరిచి లోపలికివెళ్లి క్లోజ్ చేసి వాళ్ళ జ్ఞాపకాలైన ట్రంక్ లను తాకి ఒకటి ఓపెన్ చేసాను . బాధలో నాదే తెరిచాను , గిఫ్ట్ బాక్స్ చూసి వెంటనే క్లోజ్ చేసేసి , నా ఫ్రెండ్స్ మూడు ట్రంక్ లను మాత్రమే బెడ్రూంలోకి తీసుకెళ్లి లేవగానే కనిపించేలా బెడ్ కు ఎదురుగా ఉంచి బెడ్ పై వాలిపోయాను . కళ్ళుమూసుకోగానే కావ్య క్యాట్ వాక్ కనిపించడంతో లేచివెళ్లి నీల్లుతాగి please please నో నో అని పదే పదే కనిపిస్తుండటంతో బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ నిద్రపోయాను .
మొబైల్ మ్రోగడంతో లేచి చూస్తే 9 గంటలు అయ్యింది . మొబైల్ అందుకొని కృష్ణగాడు అని పెదాలపై చిరునవ్వుతో ఎత్తాను .
కృష్ణ : రేయ్ మామా ………. నిద్రపోతున్నావా ok ok బెంగళూరులో అడుగుపెట్టినప్పటి నుండి మెసేజెస్ పంపిస్తూనే ఉన్నాము . నిన్ను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేదని కాల్ చెయ్యలేదు . ఆఫీస్ కు వెళుతున్నామురా ………..
All the best చెప్పి ముగ్గురితో సంతోషంతో మాట్లాడాను . ఆఫీస్ కు టైం అయ్యిందని లేచి ట్రంక్ లవైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి బాత్రూమ్లోకివెళ్లి ఇంతపెద్దదా టబ్ షవర్ ……… wow అని సంతోషించి అర గంటలో స్నానం చేసి రెడీ అయ్యి మొబైల్ కీస్ చెరొక చేతిలో పట్టుకుని బయటకువచ్చి లాక్ వేస్తున్నాను .
వెనుక చెంపచల్లుమన్న శబ్దం వెంటనే ఏడుపు వినిపించడంతో వెనక్కు తిరిగిచూస్తే , షాక్ కావ్య ………….
సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి : నీ దరిద్రపు ముఖంతో ఎదురు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి . నీవల్లనే నీ ఏడుపు వల్లనే నాకు ఈ పరిస్థితి . మొగుడు ఏమిచేసినా సపోర్ట్ ఇవ్వాలి అని మళ్ళీ ఒక్కదెబ్బ వేశారు .
అంతే నాచేతిలోని మొబైల్ కిందపడటంతో ,
సెక్యూరిటీ అధికారి వెనక్కు తిరిగి ఎవడ్రా నువ్వు , నువ్వు లోపలికిపో బయటకువస్తే కాళ్ళువిరగ్గొడతాను అనడంతో దుఃఖిస్తూ లోపలికివెళ్లిపోయింది కావ్య .
ఎవడ్రా నువ్వు ……….
నిన్ననే ఈ ఇంట్లో ……….
సర్ అన్న రెస్పెక్ట్ ఏదిరా ……….. అని కోపంతో వేలుని చూపించి బెదిరిస్తూ నాముందుకు వచ్చి నిలబడి చూస్తే తెలియడం లేదా సెక్యూరిటీ అధికారి ………. నిన్ననే ఇంట్లోకి వచ్చాము సర్ అనాలి చెప్పరా ………
నాకు సర్రున కోపం నషాళానికి ఎక్కింది కానీ కావ్యను కొట్టినందుకు సర్ పై అభిమానంతో sorry సర్ అన్నాను .
అదీ ఈ మాత్రం భయం ఉండాలి అని నా వెంట్రుకలను లాగి వెళ్లిపోయారు .
కిందపడిన మొబైల్ అందుకొని చూసి జేబులోపెట్టుకున్నాను . సెక్యూరిటీ చెప్పినట్లు కావ్యకు రోజూ దెబ్బలు అన్నమాట అని నవ్వుకుని yes అంటూ ఫోజ్ ఇచ్చాను . నా పెదాలపై నవ్వు ఆగడం లేదు . తగిన శాస్తి జరిగింది – నా ఈగో పూర్తిగా satisfy అయ్యింది యాహూ ………… అని డాన్స్ చేస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను .
కిందపడిన మొబైల్ అందుకొని చూసి జేబులోపెట్టుకున్నాను . సెక్యూరిటీ చెప్పినట్లు కావ్యకు రోజూ దెబ్బలు అన్నమాట అని నవ్వుకుని yes అంటూ ఫోజ్ ఇచ్చాను . నా పెదాలపై నవ్వు ఆగడం లేదు . తగిన శాస్తి జరిగింది – నా ఈగో పూర్తిగా satisfy అయ్యింది యాహూ ………… అని డాన్స్ చేస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను .
లిఫ్ట్ కోసం సర్ వేచిచూస్తుండటం చూసాను . నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన సర్ కు ఏదోవిధంగా థాంక్స్ చెప్పాలని , సర్ సర్ …….. sorry సర్ మిమ్మల్ని సర్ అని గౌరవించక తప్పుచేసాను . నా పేరు మహేష్ ………. మీ ప్రక్కింట్లోనే ఉంటాను . ఒక గొప్ప సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ఇంటిపక్కనే ఉంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను . థాంక్యూ sooooo మచ్ సర్ ………..
రేయ్ ……….. ఫక్ ఆఫ్ అని వేలుని చూయించి లిఫ్ట్ రాగానే ఎక్కారు . నేను లోపలికి వెళ్లబోతే , ఆపి రేయ్ నా గురించి నీకు తెలిసినట్లు లేదు . ఇలా మాట్లాడి లాకప్ లో బొక్కలిరగకుండా ఉన్న ఫస్ట్ వ్యక్తివి నువ్వే , షూట్ చేసేస్తాను . షిట్ షిట్ ఈ CBI నాకొడుకులు రివాల్వర్ లాక్కున్నారు అని వేలితో కాల్చినట్లు సైగచేసి లిఫ్ట్ బటన్ నొక్కడంతో క్లోజ్ అయ్యింది .
ఈయనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి , ఏమీ పర్లేదు సర్ ఉదయం ఉదయమే పిచ్చ కిక్కు ఇచ్చారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని సెల్యూట్ చేసి ప్రక్కనే వరుసగా ఉన్న 5 లిఫ్ట్ లనూ ప్రెస్ చేసి ఒక లిఫ్ట్ లో కిందకువచ్చి , దూరం నుండే కారు అన్లాక్ చేసి వెళ్లికూర్చుని ఆఫీస్ కు చేరుకున్నాను .
సర్ : నాకొసమే బయటే ఎదురుచూస్తూ ……… దిగగానే కౌగిలించుకుని , మహేష్ ముందుగా sorry ………. నిన్న ఎయిర్పోర్ట్ లో నన్ను బాగా తిట్టుకుని ఉంటారే …….
నో సర్ ………. మా డ్రీమ్స్ కలలో కూడా నెరవేరుతాయని మేము అనుకోలేదు . మీ వలన నలుగురి డ్రీమ్స్ తీరబోతున్నాయి లేదు లేదు తీరాయి అని నలుగురమూ కౌగిలించుకుని ఉద్వేగానికి లోనయ్యాము . రేయ్ మామా ……… సర్ ఉన్నారనే దైర్యంతోనే వదిలి వెళుతున్నామురా అన్నారు .
సర్ : టచ్ చేశారు మహేష్ ………. అని మళ్ళీ కౌగిలించుకున్నారు . వెంకట్ అని పిలిచి నా పే స్లిప్ తెప్పించి అందించారు . మహేష్ …….. నీకోసం ప్రత్యేకమైన రూమ్ కేటాయించాము అని స్వయంగా లోపలికి తీసుకెళ్లారు .
లోపలికివెళ్లగానే మిగలిన సర్ వాళ్ళు చప్పట్లతో ఆహ్వానించారు . అందరూ చేతులుకలిపి all the best మరియు కంగ్రాట్స్ చెప్పారు .
చిన్న సర్ : మహేష్ ………. ఈరోజు నుండీ నువ్వుకూడా సర్ వే ……….
సర్ ………… ఈ రూమ్ నాకువద్దేవద్దు . నేనెప్పుడూ మీకిందనే అని బయటకువచ్చేసాను .
అందరూ సంతోషించి బయటకువచ్చి , మహేష్ ………. అప్పుడూ చెప్పాము ఇప్పుడూ చెబుతున్నాము ఫ్యూచర్ లోకూడా చెబుతాము . మీరు అడుగుపెట్టాకనే మా లైఫ్ టర్న్ అయ్యింది . మీ లక్ కష్టం తొడవ్వకబోతే మేము అక్కడే ఉండేవాళ్ళము అని ఖచ్చితంగా చెప్పగలము – నువ్వు ఆ స్థాయిని వద్దంటే మేముకూడా నీతోపాటు బయటే ఉంటాము అనిచెప్పారు .
సర్ లక్ – గాడ్ ……….లను నేను నమ్మను . మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో చూసాము . మీరు హ్యాపీ అయితే సంతోషంగా ఒప్పుకుంటాను అని లోపలికివెళ్ళాను .
అందరూ లోపలికివచ్చి చప్పట్లు కొట్టి నన్ను నా కుర్చీలో కూర్చోబెట్టారు . ఇక నుండీ ఈవెంట్స్ బుక్ చేసుకోవడం డేట్స్ అడ్జస్ట్ చేయడమే నీ డ్యూటీ ……….. ఫీల్డ్ లోకివెళ్లి పనిచేయాల్సిన అవసరం లేదు – అందరినీ మ్యానేజ్ చేయడమే అని భుజం తట్టి బయటకువెళ్తుండగానే ల్యాండ్ లైన్ కు కాల్ వచ్చింది .
హలో అని విని సంతోషించి స్పీకర్ on చేసాను . వైజాగ్ లోని వన్ ఆఫ్ ద మిలియనీర్ నుండి బిగ్గెస్ట్ ఈవెంట్ బుకింగ్ కోసం వచ్చిన కాల్ అని తెలిసి , రేయ్ రేయ్ ……… అని సర్ వాళ్ళు కౌగిలించుకుని సంతోషిస్తున్న…….. నిమిషాల్లోనే 3 ఈవెంట్స్ బుక్ అవ్వడంతో ,
సర్ : మహేష్ ……… ఇప్పుడైనా నమ్ముతావా ………. ఫ్రెండ్స్ we did రైట్ థింగ్ ఇక మనకు రెస్ట్ ఉండదు స్టాఫ్ ను పెంచాలి అని సంతోషంతో బయటకువెళ్లారు .
లేవగానే నా ఇగో సంతృప్తి చెందింది . ఇక్కడ ఆఫీస్ లో బిగ్గెస్ట్ ప్రమోషన్ విత్ బిగ్గెస్ట్ సాలరీ ……… , వరుస బిగ్ బిగ్ ఈవెంట్స్ నాతోపాటు సర్ వాళ్ళు హ్యాపీ అని ఆనందించి వెంటనే వాళ్లకు కాల్ చెయ్యాలి అనేంతలో , నా మొబైల్ మ్రోగింది చూస్తే కృష్ణగాడు . Wow ………. అని వెంటనే ఎత్తి అమితమైన ఆనందంతో రేయ్ అంతా ok కదా అని అడిగాను .
కృష్ణ : బెంగళూరు చేరగానే నీ నిద్ర డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక మెసేజ్ పెట్టామురా – ఆఫీస్ కు వెళ్లేముంధూ మెసేజ్ పెట్టాము . రిప్లై రాకపోవడంతో అలసిపోయావు కదా ఇంకా నిద్రపోతున్నావని ఆఫీస్ లో జాయిన్ అయ్యాక కాల్ చేసాము .
ఎలా ఉందిరా ………….
సూరి : ఇంద్ర భవనం రా మామా ………. నెక్స్ట్ వీకెండ్ ఇక్కడికి వచ్చెయ్యి . నువ్వు కొరినట్లుగా కొలీగ్ ద్వారా అపార్ట్మెంట్ కూడా దొరికింది . సాయంత్రం అపార్ట్మెంట్ చూసి కాల్ చేస్తాము .
కంగ్రాట్స్ my ఫ్రెండ్స్ ……….. ఈ వీకెండ్ పెద్ద ఈవెంట్ ఉంది వీలుచూసుకుని వస్తానులే అని కావ్య మ్యాటర్ తప్ప ఆఫీస్ విషయాలను చెప్పాను .
ముగ్గురూ : సూపర్ గుడ్ న్యూస్ చెప్పావురా మామా ………. కంగ్రాట్స్ . మనం కలవకపోయినా వీడియో కాల్లో మాట్లాడుకుందాములే సాయంత్రం చేస్తాము బై అని కట్ చేశారు .
ఈరోజు ఒకఠితరువాత మరొక గుడ్ న్యూస్ అని పొంగిపోయాను . నా వర్క్ పూర్తిచేస్తూనే మధ్యమధ్యలో కళ్ళుమూసుకుని సాయంత్రం వరకూ పదేపదే కావ్యకు పడిన దెబ్బను తలుచుకుని లోలోపలే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను .
సర్ నా రూంలోకివచ్చి మహేష్ ………. ఈవెంట్స్ బుకింగ్ 4 గంటలవరకే , ఆరోజు ఈవెంట్ ఉంటే 4 గంటల తరువాత ఉండొచ్చు లేకపోతే వెళ్లిపోవచ్చు .
OK సర్ 10 మినిట్స్ డేటా ఎంటర్ చెయ్యాలి .
సర్ : నేను వెళుతున్నాను , వర్క్ పూర్తవగానే వెళ్లిపో అని చేతులుకలిపి వెళ్లిపోయారు .
ఇక్కడే ఉండి వేరే సర్ వాళ్లకు హెల్ప్ చెయ్యాలి అని ఉన్నా ……… కావ్య తినే మరొకదెబ్బనైనా చూడాలని 5 మినిట్స్ లో పూర్తిచేసి , కార్ కీస్ మొబైల్ అందుకుని వెంకట్ అన్నకు బై చెప్పేసి ఇంటికి బయలుదేరాను . ఫ్రెష్ అయ్యాక తినిచ్చని పిజ్జా తీసుకుని ఫ్రెండ్స్ కు కాల్ చేసి మాట్లాడుతూ అపార్ట్మెంట్ చేరుకున్నాను . కారుని పార్కింగ్ లో ఉంచి పిజ్జా అందుకుని లాక్ చేసి , అపార్ట్మెంట్ ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను చూసి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందిస్తూ నా బిల్డింగ్ వైపు నడిచాను.
ఇంతలో ఏడుపు వినిపించడంతో చూస్తే ఐదారేళ్లు ఉన్న బుజ్జిపాప బుజ్జి బాబు , ఇద్దరూ……… ఎండలోనే నిలబడి ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ ఏడుస్తున్నారు .
పడటం దెబ్బలేమైనా తగిలాయేమోనని అందుకే ఏడుస్తున్నారేమోనని పరుగునవెళ్లి మోకాళ్లపై కూర్చుని పిజ్జా ప్రక్కన ఉంచేసి , పాప – బాబు ……… ఏమైంది ఆడుకుంటూ పడ్డారా అని చేతులనూ కాళ్ళనూ చూసి దెబ్బలుకానీ తరుచుకోవడం కానీ ఎలాంటిదీ లేకపోవడంతో , ఎందుకు బుజ్జాయిలూ ఏడుస్తున్నారు అని ఆప్యాయంగా బుగ్గలను స్పృశిస్తూ అడిగాను . ఇద్దరూ ఎంత ముద్దొస్తున్నారో మాటల్లో చెప్పలేను – ఏడుపు ఆపేసి చిన్న నవ్వు నవ్వినా అలా చూస్తూ ఉండిపోతారు – ఇద్దరి ముఖ కవళికలు ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది .
ఎడారిలో ఒయాసిస్ కనబడితే ఎంత ఆనందం వేస్తుందో అంతలా బుజ్జాయిలకు నేనెవరో – నాకు బుజ్జాయిలెవరో తెలియకపోయినా …………
ఇద్దరూ ఒకేసారి అన్నయ్యా – అన్నయ్యా ……….. అంటూ ఏడుస్తూనే చెరొకవైపు హత్తుకున్నారు . వాళ్ళు వెక్కివెక్కిఏడుస్తూ వణుకుతుండటం తెలుస్తోంది . అంటే బుజ్జాయిలిద్దరూ ఒంటరివాళ్ళు ఓదార్పు కోరుకుంటున్నారని వాళ్ళ కౌగిలింత ఘాడతాను బట్టి నా మనసుకు తెలుస్తోంది .
ఏమైంది బుజ్జాయిలూ – ఎందుకు ఏడుస్తున్నారు ………… అన్నయ్యా – అన్నయ్యా అని ఆప్యాయతతో పిలిచారు కదా నాకు చెప్పొచ్చుకదా అని ఎంత ఓదార్చినా వదలకుండా మరింత మరింత హత్తుకుంటున్నారు .
ఆకలేస్తోందా ………. పిజ్జా తింటారా ……….
ఊహూ ………..
హమ్మయ్యా ………. మాట్లాడారు సంతోషం , అయినా ఈ అపార్ట్మెంట్ లో ఆకలి అన్న మాట అర్థ అయినా తెలుసుండదులే , కిందా పడలేదు – ఆకలీ వెయ్యడం లేదు ……. నాకు ప్రాబ్లం ఏమిటన్నది తెలిస్తేనే కదా నేనేమైనా చెయ్యగలను . Please please చెప్పండి బుజ్జాయిలూ ………..
మాకు ఇలానే బాగుంది అన్నట్లు నా షర్ట్ చిరిగిపోయేలా కౌగిలించుకుని దుఃఖిస్తూ ఏడుస్తున్నారు .
బుజ్జాయిలూ ……… ఈ బిల్డింగ్ లలో మీ ఇల్లు ఎక్కడో చెప్పండి తీసుకెళతాను అని పిజ్జా చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాను .
వద్దు వద్దు అన్నయ్యా వద్దు కొద్దిసేపైనా మిమ్మల్ని కౌగిలించుకొనివ్వండి . ఇంత హాయిని సేఫ్టీ ని పొందడం ఇదే తొలిసారి please please అని ముద్దుముద్దుమాటలు ఆ మాటలలో బాధ దుఃఖం తెలిసి నేనే బాధపడ్డాను .
ఇంటికి కూడా వద్దు అంటున్నారు అంటే ఇంటిలో సమస్య అయి ఉంటుంది అని అపార్ట్మెంట్ పార్క్ లోని చెట్టుకింద ఉన్న బెంచ్ పై కూర్చుని ఓదారుస్తున్నాను .
బుజ్జాయిలూ ……… ఎండలో ఏడ్చి ఏడ్చి కాలేజ్ డ్రెస్ మొత్తం చెమటలతో తడిచిపోయింది నీళ్లయినా తాగుతారా …….. లేకపోతే స్పృహతప్పి పడిపోతారు .
వెక్కివెక్కిఏడుస్తూ ……… తాగుతాము అన్నయ్యా …….. అనిచెప్పి మళ్లీ గట్టిగా చుట్టేశారు .
నీళ్లు ఎక్కడ ఉంటాయో తెలియక ఎదురుగా మెయిన్ గేట్ దగ్గర కనిపిస్తున్న సెక్యూరిటీని పిలిచాను . నిన్న సహాయం చేసిన సెక్యూరిటీ పరుగునవచ్చి సర్ మీరా ……….. చెప్పండి అన్నాడు .
అన్నా ………. పిల్లలకు దాహం వేస్తోంది నీళ్లు ఎక్కడ ఉంటాయి ఈ అపార్ట్మెంట్ లో అని అడిగాను .
సెక్యూరిటీ : ప్రతీ బిల్డింగ్ ఎంట్రన్స్ రైట్ సైడ్ పెద్ద ఫిల్టర్ వాటర్ ఫ్రిడ్జ్ ఉంది సర్ ……..
థాంక్స్ చెప్పి లేవబోతుంటే , సర్ ఇక్కడే ఉండండి క్షణాల్లో తీసుకొస్తాను అని పరిగెత్తి రెండు పెద్ద గ్లాసుల్లో తీసుకొచ్చారు .
థాంక్స్ అన్నా ………. అని అందుకొని ప్రక్కనే ఉంచి , బుజ్జాయిలూ బుజ్జాయిలూ ………. నీళ్లు తాగాక మళ్లీ ఏడవండి మిమ్మల్ని ఆపను అని వీపుపై జోకొట్టి , అన్నా ……… పిల్లలెవరో 15 నిమిషాల నుండీ ఏడుస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ ఎవరో మీకు తెలుసా ………..
బుజ్జాయిలిద్దరూ ………. ఏడుస్తూనే నా తొడలపై కూర్చుని అందించిన పెద్ద గ్లాస్ వాటర్ ను దప్పికగా ఉన్నట్లు మొత్తం తాగేసి నా చేతులలో గ్లాసెస్ ఉంచేసి మళ్లీ ఏడుస్తూ నా గుండెలపై చేరిపోయారు .
బుజ్జాయిలిద్దరినీ చూసి 15 నిమిషాలుగా కాదు సర్ ………. పాపం వీళ్ళు ఇక్కడకువచ్చి సంవత్సరం పైనే అయ్యింది . వచ్చిన రోజు నుండీ ఇద్దరి పెదాలపై చిరునవ్వు చూడలేదంటే నమ్మండి . 6 నెలలవరకూ అపార్ట్మెంట్ పిల్లలతోనైనా కాసేపు ఆడుకుని ఆనందించేవారు ఏ క్షణమైతే వీళ్ళ నాన్న గురించి పేపర్లో వచ్చిందో ఆ రోజు నుండీ ఏడుపు తప్ప నవ్వు ఆనందం దాదాపుగా మాయమైపోయాయి .
