పెద్దమ్మ Part 2

బుజ్జాయిలు : అన్నయ్యా – అన్నయ్యా ……… tasty tasty ………..ఈ ఫుడ్ తినే మీరు ఇంత బలంగా ఉన్నారన్నమాట అని మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని తృప్తిగా తిని , అమ్మవారి ప్రసాదమైన అమృతం లాంటి నీటిని తాగి , అందరితోపాటు బయటకు వాళ్ళతో మాట్లాడుతూనే వచ్చారు . అన్నయ్యా అన్నయ్యా ……….. అన్నయ్యలందరితో – మీతో ఒక గ్రూప్ ఫోటో అని కోరడంతో ………
వార్డెన్ కెమెరా అందుకుని తీశారు . బుజాయిలు పిల్లలను కౌగిలించుకుని మళ్ళీవస్తాము అనిచెప్పి కారువరకూ వచ్చి , వార్డెన్ నుండి క్యారేజీ అందుకొని అంతులేని సంతోషంతో అనంత జ్ఞాపకాలతో టాటా బై లు చెప్పి , నన్ను గట్టిగా హత్తుకుని తలెత్తి కన్నార్పకుండా కొత్తగా చూస్తూ ఉంది .
ఏంటి తల్లీ …………
హోటల్ దగ్గర నుండి ఎందుకో మరింత కొత్తగా కనిపిస్తున్నారు అన్నయ్యా ……… నన్ను ఇలానే చూడనివ్వండి – డిస్టర్బ్ చెయ్యకండి – కావాలంటే ముద్దులు పెట్టుకోండి.
మా బుజ్జితల్లి ఎలా అంటే అలా అని నుదుటిపై ముద్దులుపెడుతూ 8:30 కి అపార్ట్మెంట్ చేరుకున్నాము . తల్లీ ……… అపార్ట్మెంట్ కూడా చేరుకున్నాము – అమ్మను కలవాలని లేదా ………..
ప్చ్ ……….. మీరిద్దరినీ ఓకేదగ్గర ఎందుకు ఉంచలేదు మన అమ్మవారు అని గట్టిగా గుండెలపై హత్తుకుని బాధపడుతోంది .

బిస్వాస్ : అన్నయ్యా ………. కెమెరా ఆగిపోయింది – అమ్మకు చూయించడం ఎలా ………
అయ్యో ……….. ఛార్జింగ్ కూడా లేదే ఇప్పుడెలా ……….
కీర్తి : అన్నయ్యా ……… అమ్మకు చూయించి మొత్తం సంతోషాన్ని పంచుకోవాలని ఉంది .
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బుజ్జాయిలూ ……….
అన్నయ్యా ………. ఇంట్లో స్మార్ట్ ఫోన్ కాదుకదా చిన్న ఫోన్ కూడాలేదు . ల్యాండ్ లైన్ మాత్రమే ఉంది .
మరి కంప్యూటర్ ……..
ఊహూ ………
లాప్టాప్ ………..
ఊహూ ………… అమ్మ యూజ్ చేస్తారని ………… అంటూ బాధపడ్డారు .

కీర్తి తల్లీ ఒక పని చెయ్యండి మీరు సెక్యూరిటీ అన్నతోపాటు పైకివెళ్లండి నేను వెంటనే తీసుకొచ్చేస్తాను .
త్వరగా వచ్చేయ్యాలి అని దిగేంతవరకూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది .

అన్నా ………. అని పిలవడంతో పరుగున వచ్చారు . బుజ్జాయిల ………. కాదు కాదు వాడు వచ్చాడా …………
లేదు సర్ ………. ఈరోజుకు రాడు కూడా ……….. మీరు పేపర్ చదవరు కదా , ఈరోజు , రేపు హైద్రాబాద్ CBI ఆఫీస్ లో అటెండ్ అవ్వాలి విచారణ కోసం వెళ్లి ఉంటారు .
థాంక్స్ అన్నా ………. కాస్త ఈ బ్యాగులను తీసుకుని బుజ్జాయిలను పైకి వదులుతారా ………..
Oh yes సర్ ………… బుజ్జాయిలూ రండి అని బ్యాగులు పట్టుకుని ముందు నడిచారు .
అన్నయ్యా ………. ఆ చేపలను మీ దగ్గరే ఉంచుకోండి – వాడు చూస్తే పగలగొట్టేస్తాడు – మీరు త్వరగా వచ్చేయ్యాలి . ల్యాండ్ లైన్ నెంబర్ ********** . అందుకే గుడ్ నైట్ కూడా చెప్పడం లేదు – గుడ్ నైట్ కిస్సెస్ కూడా పెట్టడం లేదు అని , ముద్దుపెట్టకుండా దిగడం ఇద్దరికీ కష్టం అయినా కంట్రోల్ చేసుకుని కిందకు దిగి , తొందరగా వచ్చేయ్యాలి అని వేలితో వార్నింగ్ ఇస్తూ సెక్యూరిటీ వెనుక వెళ్లారు .
కీర్తి తల్లీ నెంబర్ ********** అని చెప్పడంతో నవ్వింది .
లవ్ యు బుజ్జాయిలూ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి లోపలికివెళ్లాక , ఆఫీస్ కు కాల్ చేసి వేగంగా బయలుదేరాను .

ఆఫీస్ ముందు సడెన్ బ్రేక్ వేసి , కెమెరా అందుకుని పరుగున ఎడిటింగ్ రూంలోకి వెళ్ళాను .
ఎడిటింగ్ చీఫ్ : hi మహేష్ ………. లీవ్ లో ఉన్నావని చెప్పారు . అయినా డ్యూటీ చేస్తున్నావా ? ఇదేమీ బాలేదు . వెంకట్ కు కాల్ చేశావట ఏంటి సంగతి .
Sorry సర్………. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాను . ఒక సహాయం …………
చీఫ్ : మహేష్ ………. ఆర్డర్ వెయ్యి నీకోసం ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమైనా చేస్తాము . కమాన్ కమాన్ ………..గుసగుసా అని ఉత్సాహంతో చెప్పారు .
థాంక్యూ soooooo మచ్ సర్ అని నవ్వుకుని , సర్ ………. ఈ కెమెరాలోని ఫోటోలు ప్రింటౌట్స్ కావాలి అని అడిగాను .
చీఫ్ : పో మహేష్ ……… ఇంతదానికి సహాయం తోటకూర అన్నావు . నేనేదో expect చేసాను తెలుసా అని ఫీల్ అయ్యి , కెమెరాను కనెక్ట్ చేశారు . స్క్రీన్ పై ఫోటోలను స్క్రోల్ చేసి చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ మహేష్ ……….. మాంచి సైజ్ 4k డిజిటల్ ప్రింటౌట్స్ తీద్దాము అని ప్రింటర్ ఆన్ చేశారు .

సర్ ……….. ముందు బుజ్జాయిలు ఉన్నవి మాత్రమే ………..
మహేష్ ………. నాకు లేట్ అవుతుందని ఫీల్ అవుతున్నావు కదూ డోంట్ వర్రీ , నీకోసం ఏదైనా ఇష్టంతో చేస్తాము అదే మాకు ఆనందం – నువ్వేమి చెప్పినా నాకు మాటలు వినపడవు ఎన్ని ఫోటోలు ఉంటే అన్నీ ప్రింటౌట్స్ తియ్యాల్సిందే – ఎక్కువసేపు పట్టదు కూర్చో అని చెప్పారు .
థాంక్స్ సర్ అని లోలోపలే సంతోషించాను .
ప్రతీదానికీ థాంక్స్ చెప్పకు మహేష్ ………… ఇది మనది . నీకు కూడా సర్వహక్కులూ ఉన్నాయి . ఆర్డర్స్ వెయ్యడం నేర్చుకోవాలి .
సర్ ……….. నేను ఏ స్థాయిలో ఉన్నా మీరే మాకు గురువులు ……… మిమ్మల్ని గౌరవించడం మాకు ఇష్టం .
టచ్ చేసావు మహేష్ , అందుకే కదా మీరంటే మాకు చాలా చాలా చాలా ఇష్టం . అదిగో తొలి ఫోటో వస్తోంది చూడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు .
షాపింగ్ మాల్లో కీర్తి తల్లికి బార్బీ డ్రెస్ వేసుకున్నాక తీసిన తొలి ఫోటో అచ్చం బార్బీ ఏంజెల్ లానే ఉండటం చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతున్నాను .
చీఫ్ : మహేష్ ……… నీ ఆనందం చూస్తుంటే పర్ఫెక్ట్ అనిపిస్తోంది . అయితే సెలెక్ట్ అల్ కొట్టేస్తాను 15 నిమిషాల్లో మొత్తం వచ్చేస్తాయి .
మీ ఇష్టం సర్ ………..
అదిగో మళ్లీ ………… అని నవ్వుకున్నాము .

ప్రింటర్ నుండి వస్తున్న ఫోటోలను కేవలం బుజ్జాయిలు ఉన్నవీ – నేను బుజ్జాయిలతో ఉన్నవాటిని వేరు వేరుగా ఉంచుతున్నాను . 15 నిమిషాల్లో వందల్లో ఫోటోలన్నీ వచ్చేసాయి . ఫోటోలను అందులో బుజ్జాయిల సంతోషాన్ని చిరునవ్వులను చూస్తూ మైమరిచిపోతున్నాను .
చీఫ్ : మహేష్ ………. వీడియోలు ఉన్నాయి . Cd లలో కాపీ చేసి ఇవ్వనా ………
ప్రస్తుతానికి వీడియో లలో చక్కని దృశ్యాలను ప్రింటౌట్స్ తీద్దాము సర్ ………..
చీఫ్ : అయితే ఇక్కడ ప్రక్కనే కూర్చుని షాట్స్ చూయించు అని పిలిచారు .
వీడియో ప్లే చేశారు నచ్చిన షాట్స్ ను చూపించగానే బ్యాక్ వార్డ్ వెళ్లి ప్రింటౌట్స్ కు పంపిస్తున్నారు .
అమ్మవారిని దర్శించుకున్న , ప్రార్థిస్తున్న , తమ్ముళ్లు బుజ్జాయిలకు అమ్మవారి కుంకుమ పెడుతున్న , నాకు కుంకుమ పెట్టిన , అందరితో ఆడుకుంటున్న , అందరితో భోజనం చేసిన , చివరికి బయలుదేరుతూ గ్రూప్ ఫోటో ప్రింటౌట్స్ మాత్రం రెండు తీసుకుని ఒక్కోదానిలో ఉంచాను .
ఫోటోలన్నింటినీ జాగ్రత్తగా రెండు బాక్స్ లలో ఉంచి , బుజ్జాయి ఫోటోల బాక్స్ మాత్రం అందమైన గిఫ్ట్ లా మార్చేసి , పైన బుజ్జి దేవుళ్ళకు గిఫ్ట్ from మీ అన్నయ్య అని రాసి నవ్వుకుని , సర్ కు థాంక్స్ చెప్పబోయి ఆగి చేతులను కలిపి కౌగిలించుకున్నాను .
చీఫ్ : మహేష్ వన్ మినిట్ అని మొబైల్ తీసి సెల్ఫీ తీసుకుని , నా అదృష్టాన్ని అందరికీ చూయించాలికదా అని మురిసిపోయి , మహేష్ ……….. కెమెరా ………
సర్ ………. మన ఆఫీస్ దే ఇక్కడే ఉంచండి .
నో నో నో మహేష్ ………. సర్ నీకు గిఫ్ట్ ఇచ్చేసారు . Its yours now అని నాకే ఇచ్చేసారు .
సర్ ………. ఇంత costly గిఫ్ట్ ………..
చీఫ్ : మహేష్ ………ఇంత విలువైన ఫోటోలు బోలెడన్ని తియ్యాలి ఎంజాయ్ అనిచెప్పి నాకొసమే ఇప్పటివరకూ ఉన్నట్లు ఫైల్స్ తీసుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు .
సర్ కు మరియు చీఫ్ కు మనసులో థాంక్స్ చెప్పుకుని , అన్నయ్యా ……….. తొందరగా వచ్చేయ్యాలి అన్న బుజ్జితల్లి వార్నింగ్ గుర్తుకొచ్చి నవ్వుతూ ఫోటోలన్నింటినీ కెమెరాను తీసుకుని పరుగున కారులో చేరి అపార్ట్మెంట్ వైపు వేగంగా పోనిచ్చాను .
*************

సెక్యూరిటీ వెనుకే బుజ్జిబుజ్జిఅడుగులు వేస్తూ , అంకుల్ అంకుల్ ……….. వాడు రాడన్నమాట .
సెక్యూరిటీ : అవును పిల్లలూ …………ఈ రెండు రోజులూ రాత్రికూడా మీ ఇష్టం మీరు మీ అన్నయ్యతో ఎంజాయ్ చెయ్యొచ్చు . ఒకవేళ వాడు వస్తే మీ అన్నయ్యకు వెంటనే కాల్ చేసేస్తానులే …………
బుజ్జాయిలు : మాకు కూడా మీరు చెప్పినట్లుగానే అన్నయ్యతో గడపాలని ఉంది కానీ అన్నయ్య ఎక్కడ ఉంటారో తెలియదు .
సెక్యూరిటీ : షాక్ అయ్యి , మీ అన్నయ్య ఎక్కడ ఉంటారో మీకు తెలియదా ………
బుజ్జాయిలు : ఆడిగాము . సర్ప్రైజ్ అన్నారు .
సెక్యూరిటీ : wow ………. నిజంగా షాకింగ్ సర్ప్రైజ్ చెందుతారు మీరు . తెలిసాక మీ అన్నయ్యను కోపంతో కొట్టేస్తారేమో అని నవ్వుకున్నాడు .
బుజ్జాయిలు : మా అన్నయ్యపై కోపమా – మా అన్నయ్యను కొట్టడమా ………. జరగనే జరుగదు .
సెక్యూరిటీ : ఇప్పుడు ఇలానే అంటారులే ………. తెలిసిన తరువాత తియ్యని కోపంతో కొట్టేస్తారు . కావాలంటే బెట్ ………..
బుజ్జాయిలు : అంకుల్ ………. మా అన్నయ్య ఎక్కడ ఉండేది మీకు తెలుసా ?
తెలుసు .
ఎక్కడ ఎక్కడ please please ………. చెప్పండి అని ఆతృతతో బ్రతిమాలారు .
సెక్యూరిటీ : మీ అన్నయ్య సర్ప్రైజ్ అన్నారుకదా , నేను చెబితే బాగోదు కానీ ఉదయం లోపు ఖచ్చితంగా ఆ సర్ప్రైజ్ ను ఫీల్ అవుతారు . మీ అన్నయ్యకు దెబ్బలే దెబ్బలు .
బుజ్జాయిలు : అవునా అంకుల్ ……… అని మురిసిపోయారు .
సెక్యూరిటీ ఆనందించి , పిల్లలూ ………. నేను డోర్ వరకూ వచ్చానని తెలిస్తే వాడు మిమ్మల్ని కొడతాడు అని బ్యాగులను ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే ఉంచి , all the best ఫర్ your బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని విష్ చేసి కిందకువెళ్లిపోయాడు .

బిస్వాస్ : అక్కయ్యా ………. బ్యాగ్స్ నేను తీసుకొస్తాను నువ్వు వెళ్లు – అమ్మ ఎదురుచూస్తుంటారు .
కీర్తి : లవ్ యు అన్నయ్యా ………. అని బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా అమ్మా ………. మీ బుజ్జాయిలం బోలెడన్ని సంగతులతో వచ్చేసాము అని డోర్ పూర్తిగా ఓపెన్ చేసి రా అన్నయ్యా అని పిలిచి , డోర్ దగ్గరే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న తమ తల్లి గుండెలపై ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ హత్తుకుంది .
దేవత : పరవశించి నా బుజ్జితల్లీ ……….. కాలేజ్ నుండి వచ్చాక తనివితీరా మీ అన్నయ్యను కలిసి ఆడుకున్నారన్నమాట అని ముఖమంతా ముద్దులతో ముంచెత్తి ప్రాణం కంటే ఎక్కువగా బ్యాగ్స్ తో లోపలికివచ్చినా బిస్వాస్ తోపాటు కౌగిలించుకుని కళ్ళల్లో చెమ్మతో ఆనందిస్తోంది .
బిస్వాస్ : అమ్మా ………. ఈరోజు కాలేజ్ లు వెళ్ళలేదు కదా ……….
నాన్నా , తల్లీ ………. కాలేజ్ డ్రెస్సెస్ కూడా లేవు . Wow ………. అని ఇద్దరినీ ఆనందబాస్పాలతో చూసి ఈ డ్రెస్ లలో మరింత ముద్దొచ్చేస్తున్నారు అని ఇద్దరినీ ముద్దులలో ముంచెత్తారు .
కీర్తి : లవ్ యు అమ్మా …………, బార్బీ డ్రెస్ , అన్నయ్యది బుజ్జి హీరో డ్రెస్ – మా అన్నయ్య కొనిచ్చారు . ఈరోజు ఎలా సంతోషంతో గడిపామో – ఎంత ఎంజాయ్ చేశామో మీకు మొత్తం చెబుతాము రామ్మా ………. ముందు మీకోసం తీసుకొచ్చిన ఈ ఫుడ్ తినిపిస్తాము రండి అని తమ రూమ్ కు , నాకోసం తీసుకొచ్చారా లవ్ యు అని పరవశించిపోతోంటే , ఇద్దరూ చెరొకచేతిని అందుకుని తీసుకెళ్లారు . దేవతను కూర్చోబెట్టి , చేతులను శుభ్రం చేసుకునివచ్చి ఐటమ్స్ అన్నింటినీ ముందు ఉంచి , ఆశ్చర్యపోయి చూస్తున్న తమ అమ్మకు బుజ్జిచేతులతో తినిపించారు .

దేవత : మ్మ్మ్…….. మ్మ్మ్…….. నిన్నటి ఐస్ క్రీమ్ కంటే సూపర్ గా ఉంది అని కళ్ళుమూసుకుని ఆస్వాదించి మళ్లీ నోరు తెరిచారు .
ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ తినిపించారు .
మరి మా బుజ్జాయిలు ………….
అంతే మళ్లీ తమ బుజ్జి బొజ్జలను చూయించడంతో , నవ్వుకుని , మా బొజ్జలు నిండిపోయినా మా అమ్మ చేతిముద్ద తినాల్సిందే అని ఆ అన్నారు .
దేవత : ఏమీ కాదులే పరమాన్నం tasty గా ఉంది అందుకే తింటున్నారు అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి తినిపించారు .
మా అమ్మకు మా గురించి మొత్తం తెలుసు అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి ప్రాణంలా తినిపించారు .

దేవత : బుజ్జాయిలూ ……….. ఇంత రుచికరమైన ఫుడ్ ఎక్కడిది – మీ అన్నయ్య ………….
బుజ్జాయిలు : ఫస్ట్ నుండి మొత్తం చెబుతాముకదా ఎందుకంత ఆత్రం అని బుగ్గలపై కొరికేశారు .
దేవత : స్స్స్ …….. అని తినిపిస్తున్న చేతులతోనే రుద్దుకుని , మా బుజ్జాయిల సంతోషాలకు కారణం తెలుసుకోవాలని చాలా ఆతృత అని ప్రాణమైన ముద్దులుపెట్టి బుంగమూతి పెట్టుకున్నారు .
అమ్మా అమ్మా ………. మీ బుగ్గలపై అన్నం – దేవత తుడుచోబోతుంటే ఇద్దరూ ఆపి బుజ్జి నాలుకలతో అందుకొని మరింత tasty అని నాకడంతో దేవత ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
మా అమ్మ నవ్వింది అని ముద్దులుపెట్టి , మీరు కడుపు నిండా తినండి అమ్మా ……… అంతా చెప్పే మా అమ్మ గుండెలపై నిద్రపోతాము – అంతవరకూ మాకు నిద్రకూడా రాదు అనిచెప్పారు .
దేవత : నా బుజ్జాయిలు బంగారం అని ప్రాణంలా హత్తుకుని , ఆకలేస్తోంది ఆ …….. అని తెరిచారు .
లవ్ యు లవ్ యు అమ్మా అమ్మా ……….. అని ప్రాణంలా మొత్తం తినిపించారు .
దేవత : మైమరిచిపోయి ఆ ఆ …….. అని మళ్ళీ నోరుతెరిచారు .
బుజ్జాయిలు : అయ్యో ………. అయిపోయిందే ,
దేవత : అమ్మో అమ్మో ………. మా బుజ్జాయిల బుజ్జిచేతుల మ్యాజిక్ వలన ఫస్ట్ టైం కడుపునిండా తిన్నాను – ఇంత తిన్నానంటే నాకే షాకింగ్ గా ఉంది ఇంకా ఇంత ఉన్నా తినేసేదాన్నేమో అని సిగ్గుపడుతూ ఇద్దరినీ హత్తుకుంది .
అమ్మా ………. మీ పెదాలపై మెతుకు అని తమ అమ్మ పెదాలపై ముద్దుపెట్టిమరీ అందుకొని మరింత రుచి అని మళ్ళీ మళ్ళీ ముద్దులుపెట్టడంతో ప్రాణంలా హత్తుకుని బెడ్ పై వాలి చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోతున్నారు .

దేవత : చిరునవ్వులు చిందిస్తూనే , బుజ్జాయిలకు గిలిగింతలు పెడుతూ ఆనందిస్తూ , ఏదో గుర్తుకువచ్చినట్లు ఒక్కసారిగా నాన్నా తల్లీ ………. అని గుండెలపై హత్తుకుని , కళ్ళల్లో చెమ్మ కార్చింది .
బుజ్జాయిలు కూడా చెమ్మతో హత్తుకుని అమ్మా అమ్మా ……… ఏమైందమ్మా ఏమైందమ్మా ……….. మీరు బాధపడితే మేము చూడలేము అని అడిగారు .
దేవత : నాన్నా ………. కాలేజ్ ఫీజ్ కట్టలేదని పంపించేసారా ? .

కీర్తి : నవ్వుకుని అమ్మా ………. దానికి బాధపడుతున్నారా ………. మా అన్నయ్య మొత్తం కట్టేశారుకదా అని కన్నీళ్లను బుజ్జిచేతులతో తుడిచింది .
దేవత : తల్లీ ………..
బిస్వాస్ : అవునమ్మా …….. ఒక్క నిమిషం అమ్మా అని పరుగునవెళ్లి బ్యాగులో ఉంచిన రిసిప్ట్స్ తీసుకొచ్చి చూయించాడు .
దేవత : అందుకుని చూసి రిసిప్ట్స్ పై ఆనందబాస్పాలను కార్చి , నాన్నా – తల్లీ …….. మీ అన్నయ్యకు మీరంటే అంత ఇష్టమా ? .
బుజ్జాయిలు : ఇష్టం కాదమ్మా ……… ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ . ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలవరకూ మా ఇద్దరినీ ఒక్క క్షణం కూడా కిందకు దించకుండా ఎత్తుకునే ఉన్నారు – అంత ప్రాణం మేమంటే ……….. ,
దేవతకు ఏమి మాట్లాడాలో ఎలా ఫీల్ అవ్వాలో తెలియక ఒక్కసారిగా జలదరించి , అమ్మా తల్లీ ………. నా బుజ్జాయిలకోసం మీరే పంపిన దేవుడు కదూ అని బుజ్జాయిలను హత్తుకుని ప్రార్థించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *