జాహ్నవి మమ్మీ : ఇంతదానికి కన్నీళ్లు కార్చాలా ……. , మాకంటే ప్రాణంలా చూసుకునే చెల్లెళ్లు – బామ్మలు మరియు కంటికి రెప్పలా తోడు ఉండే మీఅన్నయ్య ……. , సంతోషంగా వెళ్ళండి …… నాకు కావాల్సింది కూడా అదే అంటూ చిన్నగా గుసగుసలాడి అంకుల్ వైపు కొంటెతో చూస్తున్నారు .
దేవత – అక్కయ్య : చిలిపినవ్వులు నవ్వుకుని , అక్కయ్యా ……. ఇక అడ్డు ఎవ్వరూ ఉండరు రెచ్చిపోండి , చెల్లెళ్ళూ ……. త్వరగా బయలుదేరుదాము లేకపోతే తోసేసేలా ఉంది అక్కయ్య ……..
అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : మనందరం ఢిల్లీకి తల్లులూ …….
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ మమ్మీ అంటీ అంటూ ముద్దులుపెట్టి , అన్నయ్యా అన్నయ్యా …… అంటుపరుగునవచ్చి నన్ను హత్తుకున్నారు .
దేవత : చూసారా చూసారా ……. పర్మిషన్ దొరికేంతవరకూ నన్ను హత్తుకుని ముద్దులుపెట్టి , దొరకగానే వదిలి వాళ్ళ అన్నయ్యదగ్గరికి వెళ్లిపోయారు ప్చ్ ….. ఏమిచేస్తాం పదండి అని గుడ్ నైట్ చెప్పి కిందకువచ్చాము .
అక్కయ్య : అక్కయ్యా …… మనం చెల్లెళ్ల కారులో వెళదాము అంటూ నావైపు కన్నుకొట్టారు .
చెల్లెళ్లతో అంటే నాతోపాటు ……. లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ లోలోపలే ఆనందిస్తున్నాను .
చెల్లెళ్లు : అన్నయ్యా ….. మనం సెక్యూరిటీ అధికారి వెహికల్లో …….
దేవత : అంటే బుజ్జిహీరోతోపాటు ……. , ఇంటికి చేరేంతవరకూ అల్లరి అల్లరి చేస్తాడు ఇడియట్ …….
అక్కయ్య : ఆ అల్లరిని ఎంజాయ్ చేస్తూ వెళదాము అక్కయ్యా లేకపోతే ఇంటికి వెళ్ళేలోపు నిద్రవచ్చేస్తుంది .
దేవత : అదీ నిజమే ……. , ఇంకా ఇంటికివెళ్లి ఒక క్లాస్ పేపర్స్ అయినా కరెక్షన్ చెయ్యాలి – sorry బుజ్జిహీరో …….
అక్కయ్య : దేవత తిట్టినా కొట్టినా ……. మీ బుజ్జి భక్తుడికి ఇష్టమే అక్కయ్యా రండి – చెల్లెళ్ళూ …… మాపై కూర్చుంటారా ? .
చెల్లెళ్లు : కూర్చుంటారా అని అడుగుతున్నారా బల్లిలా కరుచుకునిపోతాము .
తియ్యదనంతో చెల్లెళ్లకు ముద్దులుపెట్టారు .
మేడం – అక్కయ్యా – చెల్లెళ్ళూ …… అంటూ సెక్యూరిటీ అధికారి వెహికల్ వెనుక డోర్స్ తెరిచాను .
దేవత : థాంక్యూ …….
అక్కయ్య – చెల్లెళ్లు : లవ్ యు తమ్ముడూ – లవ్ యు సో మచ్ అన్నయ్యా …… అంటూ బుగ్గపై ముద్దులుపెట్టి లోపల కూర్చున్నారు .
జాగ్రత్తగా డోర్స్ వేసి ముందుసీట్లో కూర్చున్నాను . సెక్యూరిటీ అధికారి సర్ …… పోనివ్వండి .
Yes మహేష్ – మహేష్ …… ఒకేఒక సెల్ఫీ తీసుకోవచ్చా …… ? .
అక్కయ్య – చెల్లెళ్ళవైపు చూసాను .
ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు .
Ok సర్ ……..
థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ వెహికల్లోనే సెల్ఫీ తీసుకుని , తెగ మురిసిపోతున్నారు .
దేవత : ఈ అల్లరి బుజ్జిమహేష్ తో సెల్ఫీ తీసుకుంటున్నారు ఏమిటి ? .
బుజ్జిదేవుడు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు కాబట్టి వాడు వచ్చేన్తవరకూ బుజ్జిదేవుడు – బుజ్జిహీరో రెండూ నేనేకదా మేడం ……. , కమిషనర్ సర్ తో అలా సెట్ చేయించాను – రేపు బుజ్జిదేవుడి స్థానంలో ప్రెసిడెంట్ ను మీట్ అయ్యేది కూడా నేనే మేడం ……. , లవ్ యు రా బుజ్జిదేవుడా ……. – నీపేరు నా పేరు ఒక్కటే అవ్వడం భలేగా కలిసొస్తోంది .
అక్కయ్య – చెల్లెళ్లు ఉమ్మా ఉమ్మా అంటూ తెగ మురిసిపోతున్నారు .
దేవత : చెల్లీ …… మనమే తప్పు చెయ్యబోతున్నాము – ఇక ఇప్పుడు బుజ్జిహీరో కూడా ……. , ప్రెసిడెంట్ గారిని మోసం చేయడం …….
అయితే నో అని కమిషనర్ సర్ కు చెప్పేయ్యండి మేడం – ఎక్కడున్నాడో పాపం తన ప్రాణమైన వారు ” దేశ ప్రథమ వ్యక్తి రాష్ట్రపతిని ” కలవబోతున్నారు అని తెగ ఆనందిస్తున్న బుజ్జిదేవుడి ఆసలన్నింటినీ దీపంలా ఆర్పేయ్యండి – సెక్యూరిటీ అధికారి సర్ కారు ఆపండి – ఈ విషయం తెలిసి ఎన్ని కన్నీళ్లు కారుస్తాడో పాపం ఆ బుజ్జిదేవుడు అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పాను .
చెమ్మ తుడుచుకో తమ్ముడూ అంటూ అక్కయ్య ఫీల్ అవుతున్నారు .
దేవత : నో నో నో ……. మనవలన బుజ్జిదేవుడు ఏమాత్రం బాధపడకూడదు – ఎలా జరగాలి అని రాసిఉంటే అలా జరుగుతుంది , అంతా నువ్వు – చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ – నేను ప్రార్థించే దైవం పెద్దమ్మే చూసుకుంటుంది .
అయ్యా ……. ఆ చివరిమాటతో పెద్దమ్మ ఎంత సంతోషిస్తూ ఉంటారో …….
మెసేజ్ సౌండ్ రాగానే , చెల్లెళ్లు …… నా జేబులోని మొబైల్ అందుకుని చూసి చాలా చాలా అన్నయ్యా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవత – అక్కయ్య ఒడిలో కూర్చున్నారు .
అంతలోనే ఇంటికి చేరుకున్నాము .
దేవత : ఈ బుజ్జిహీరో వలన క్షణాలలో వచ్చేసినట్లుంది . థాంక్యూ అండ్ నో థాంక్యూ కూడా ……..
అక్కయ్య : నో థాంక్యూ ఎందుకు అక్కయ్యా …….
దేవత : బుజ్జిదేవుడితో పోల్చుకున్నందుకు ……. , బుజ్జిదేవుడు ఎవరెస్టు శిఖరం మరొకసారి పోల్చుకుంటే దెబ్బలుపడతాయి .
ఆఅహ్హ్ ……. చాలు దేవతా చాలు అంటూ ఎవరెస్ట్ అంత ఆనందంతో కిందకుదిగి డోర్స్ తెరిచాను .
థాంక్యూ బుజ్జిహీరో – లవ్ యు తమ్ముడూ – లవ్ యు soooo మచ్ అన్నయ్యా ……. అంటూ కిందకుదిగారు దేవత – అక్కయ్య – చెల్లెళ్లు …… , చూసార హాసినీ …… మీ మమ్మీ , మీ డాడీని వదలనే వదలడం లేదు చీకటి పడింది కదా అంటూ దేవత – అక్కయ్య నవ్వుకున్నారు , అక్కయ్యా – చెల్లీ …… లోపలికి లాక్కునివెళ్లేంత కసితో ఉన్నట్లున్నారు .
కమిషనర్ సర్ : శ్రీమతిగారూ ……. కంట్రోల్ రూమ్ దాకా వెళ్ళిరావాలి వధులుతారా ? .
మిస్సెస్ కమిషనర్ ఇప్పుడా ప్చ్ …… అనేంతలో , ఇప్పుడా నో నో నో కమిషనర్ సర్ పాపం మాఅక్కయ్య చూడండి ఎంతో ఆశతో ఉన్నారు .
మిస్సెస్ కమిషనర్ : అవునవును …… , పోండి చెల్లెళ్ళూ సిగ్గేస్తోంది .
దేవత – అక్కయ్య : నిన్న కొత్తగా రుచి చూయించి ఆశలు కల్పించి ఇలా మాంచి చలిలో వదిలివెళ్లడం న్యాయమా సర్ ……. అంటూ నవ్వుకుంటున్నారు .
మిస్సెస్ కమిషనర్ సర్ గుండెల్లో తలదాచుకుని అవునన్నట్లు సిగ్గులోలికిపోతున్నారు .
కమిషనర్ సర్ నవ్వుకుని , శ్రీమతిగారూ ……. soooo sorry తప్పకుండా వెళ్లాల్సిందే – మనం రేపు ఢిల్లీ వెళుతున్నాము కదా సిటీ కంట్రోల్ ను కిందిస్థాయి సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించాలి – బిరియానీ రెడీ అని మెసేజ్ రాగానే కోస్టల్ సిటీస్ నుండి వచ్చిన ఆఫీసర్స్ ను వదిలి వచ్చేసాను , వారిని కలవాలి – ఎంత సమయం పడుతుందో చెప్పలేను కాబట్టి ఈ ముద్దుతో సర్దుకుని హాయిగా నిద్రపోండి అంటూ పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టి సెక్యూరిటీ అధికారి వెహికల్లో వెళ్లిపోయారు .
మిస్సెస్ కమిషనర్ : ప్చ్ …… అంటూ వెహికల్ మెయిన్ గేట్ దాటిపోయేంతవరకూ ఆశతో చూస్తున్నారు .
దేవత – అక్కయ్య : ముద్దునే తలుచుకుంటూ …….. అంటూ నవ్వుకుని , గుడ్ నైట్ అక్కయ్యా …… మాకూ కాస్త పని ఉంది .
మిస్సెస్ కమిషనర్ : ఈ మొగుళ్లు ఎప్పుడూ ఇంతేలే కానీ , చెల్లెళ్ళూ ……. అందరికీ ఆ ఇంటిలో సరిపోదు కాబట్టి అందరమూ మన పెద్ద ఇంట్లోనే పడుకుందాము రండి – కావాలంటే తెల్లవారుఘాముననే రెడీ అవ్వడానికి వెళ్ళవచ్చు – గుర్తుందికదా 5 గంటలకు ఫ్లైట్ …… , తల్లీ హాసినీ ….. మీఅన్నయ్యను – ఫ్రెండ్స్ ను లోపలికి పిలుచుకునివెళ్లు , బామ్మలూ రండి రండి ….. , చెల్లెళ్ళూ – తల్లులూ …… మీకోసం – మీ ప్రాణమైన అన్నయ్య కోసం టాప్ ఫ్లోర్లో ఉన్న పెద్ద రూంమొత్తం బెడ్స్ వేయించారు మోస్ట్ లగ్జరీగా మార్పించారు మీ సర్ ….. , ఎలాగైనా ఎంతమందైనా హాయిగా పడుకోవచ్చు .
దేవత – అక్కయ్య : సర్ వెల్లుపోయారు కాబట్టి మా అందరినీ ఆహ్వానిస్తున్నారు లేకపోతే మా అందరినీ ఆ చిన్న ఇంట్లోనే అడ్జస్ట్ అవ్వమని డోర్స్ వేసేసుకునేవాళ్ళు కదా అక్కయ్యా …….
మిస్సెస్ కమిషనర్ : ఆదైతే నిజమే చెల్లెళ్ళూ …… అంటూ ఇద్దరినీ కౌగిలించుకుని సిగ్గుపడుతున్నారు .
దేవత – అక్కయ్య : అమ్మో అమ్మో …… సరేలే ఇప్పటికే సర్ వెళ్లిపోయారని విరహంతో ఉన్నారు – మరింత కవ్వించడం బాగోదు – అక్కయ్యా …… కరెక్షన్ పేపర్స్ తీసుకొస్తాను వన్ మినిట్ …….
అక్కయ్య : అక్కయ్యా …… నేనూ వస్తాను అంటూ చేతిని అందుకున్నారు .
హాసిని : అన్నయ్యా – ఫ్రెండ్స్ ……. రండి , డాడీ ……ఎలా రెడీ చేయించారో చూద్దాము .
చెల్లెళ్ళూ ……. ఒకసారివెళ్లి డ్యూటీ పరిస్థితి చూసి వచ్చేస్తాను .
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ……..
అక్కయ్య : గుమ్మం దగ్గరవరకూ వెళ్లి , అక్కయ్యా ఒక్కనిమిషం అంటూ 0పరుగునవచ్చారు – బుగ్గలను అందుకుని మేము పేపర్స్ తీసుకుని పైకివెళ్ళేలోపు వచ్చేయ్యాలి సరేనా …….
మాక్సిమం ట్రై చేస్తాను అక్కయ్యా ……. , ఉదయం నుండీ లేను కదా అక్కడ పరిస్థితి ఎలా ఉందో – మురళి ఎంత కోపంతో ఉన్నాడో …….
మిస్సెస్ కమిషనర్ : ఎంత ఆలస్యమైనా పర్లేదు ఇక్కడికే రావాలి బుజ్జిహీరో …… , లేకపోతే మీసర్ రాగానే మేమంతా అక్కడికే వచ్చేస్తాము .
అక్కయ్య – చెల్లెళ్లు : అవునవును …….
ఎలాగైనా వచ్చేస్తాను మేడం – అక్కయ్యా – చెల్లెళ్ళూ …….
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …… , త్వరగా వెళ్లు మరి ……
మీరందరూ లోపలకువెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాక వెళతాను – బామ్మలూ , చెల్లెళ్ళూ ……. చలివేస్తోంది లోపలకు వెళ్ళండి .
లవ్ యు sooooo మచ్ తమ్ముడూ – అన్నయ్యా …… అంటూ అక్కయ్య – చెల్లెళ్లు హత్తుకుని ముద్దులుపెట్టారు .
అక్కయ్య …… దేవతతోపాటువెళ్లి పేపర్స్ తీసుకుని చిన్న ఇంటికి తాళం వేసివచ్చారు .
దేవత : బుజ్జిహీరో …… తొందరగా వచ్చెయ్యి – డ్రెస్ వేసుకుని ఉంటే బాగుండేది చలి ఎక్కువగా ఉందికదా ఓణీ ఇచ్చేదానిని …….
అక్కయ్య : నా ఓణీ ఉంది కదా అక్కయ్యా అంటూ దేవత చీరకొంగులోకివెళ్లి ఓణీని తీసి నాకు చుట్టారు .
ఆఅహ్హ్ …… మా అక్కయ్య అంత కేరింగ్ – వెచ్చగా ఉంది , లవ్ యు అక్కయ్యా – మేడం ……. , లోపలికివెళ్లండి ……..
అక్కయ్య : తమ్ముడూ …… తొందరగా వచ్చెయ్యి అంటూ నా చేతిని గుండెలపై హత్తుకుని ముద్దుపెట్టి వదిలారు .
మా ప్రాణమైన వారందరికీ వచ్చి గుడ్ నైట్ చెబుతాను .
చెల్లెళ్లు : అక్కయ్యలూ …… మనం తొందరగా లోపలికివెళ్లి డోర్ వేసుకుంటే , అన్నయ్య అంత త్వరగా వెళ్లివస్తారు .
అవునవును అంటూ అక్కయ్య – దేవత …… చెల్లెళ్లతోపాటు లోపలికివెళ్లి , బుజ్జిహీరో …… మెసేజ్ పెట్టు క్షణంలో డోర్ తీస్తాము అనిచెప్పి క్లోజ్ చేసుకున్నారు .
అటూ ఇటూ నిర్మానుష్యన్గా ( సర్కిల్స్ – రోడ్లలోనే జనాలు తిరగడం లేదు ) ఉండటం చూసి నిర్భయంగా లోపలికి నడిచాను .
అక్కయ్య ఓణీ నుండి వస్తున్న ఒంటి సువాసన వలన అక్కయ్య ప్రక్కనే ఉన్నారా అన్న ఫీల్ కలుగుతోంది . లవ్ యు అక్కయ్యా …… అంటూ పెదాలపై తియ్యదనంతో ఓణీ సువాసనను మరింత పీలుస్తూ వెచ్చగా మురళీ ఇంటికి చేరుకున్నాను – 9:45 కే ఫ్రెండ్స్ అందరూ నిద్రపోయినట్లు అన్నీ బిల్డింగ్స్ లైట్స్ స్విచ్ ఆఫ్ అయిఉన్నాయి .
Hi తమ్ముడూ మహేష్ …… అంటూ గేట్స్ తెరిచాడు సెక్యూరిటీ అన్నయ్య .
అన్నా అన్నా …… సౌండ్ సౌండ్ అంటూ ఆపాను . అన్నయ్యా …… మురళి – మేడం ఎవరైనా ఆడిగారా ? .
సెక్యూరిటీ : నాకు తెలిసి లేదు తమ్ముడూ …… , ఉదయం నుండీ మురళి – మేడం గారు అయితే బయటకు వచ్చినట్లే నేను చూడలేదు , కానీ సర్ మాత్రం కంగారు – బాధ – కన్నీళ్ళతో అటూ ఇటూ తిరగడం మాత్రం చూసాను . మరింత ఆశ్చర్యం ఏమిటంటే లగ్జరీ కార్లలో తిరిగే సర్ కారులో వెళ్లి ఆటోలో వచ్చారు – లోపల మూడు కార్లలో ఒక్క కారు కూడా లేదు కానీ ముగ్గురూ లోపలే ఉన్నారు .
అది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే అన్నా …… , కారు లేకుండా సర్ – మేడం గేట్ కూడా దాటడం చూడలేదు .
సెక్యూరిటీ : అవునుకదా …… మరి కార్లు ఏమైనట్లు , కొద్దిసేపటిముందు సర్ …… ఆటో దిగి లోపలికి కన్నీళ్ళతో వెళ్లడం మరిచిపోలేకపోతున్నాను , వెళుతూ వెళుతూ ఇంత డబ్బుని ఇచ్చివెళ్లారు , మురళి – మేడం …… కాస్త కోపం ప్రదర్శిస్తారు కానీ సర్ ….. చాలా మంచివారు , జీతం డబ్బులుకాకుండా extraa డబ్బులు ఇచ్చేవారు కానీ పర్సులో ఉన్నదంతా ఇచ్చేసి బాధపడుతూ లోపలికివెళ్లిపోయారు – ఉదయం తిరిగి ఇచ్చేస్తాను .
సర్ వాళ్లకేమి తక్కువ అన్నా …… , పిల్లలకు ఏమైనా use అయ్యేది తీసుకెళ్లండి .
సెక్యూరిటీ : అలాగే తమ్ముడూ …… నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను – పిల్లలు ఎప్పటినుండో కంప్యూటర్ అడుగుతున్నారు .
కంప్యూటర్ కాదు కానీ లాప్టాప్ ఇప్పించండి మరింత use అవుతుంది – ఈ డబ్బుతో RAM – ROM కెపాసిటీ తక్కువగల లాప్టాప్ వస్తుంది . ఈ డబ్బుతోకూడా అంటూ పర్స్ తీసిచూస్తే ఒక్కరూపాయికూడా లేదు – పెదాలపై చిరునవ్వులతో పర్సు జేబులో పెట్టుకుని పెద్దమ్మను తలుచుకుని మళ్లీ పర్స్ తీసి డబ్బుల కట్టను అన్నకు అందించాను – అన్నా …… పిల్లలకు తెలుసులే వాళ్ళను షాప్ కు పిలుచుకునివెళ్లి కోరిక లాప్టాప్ కొనివ్వండి .
సెక్యూరిటీ : తమ్ముడూ మహేష్ ……..
ఉంచుకో అన్నా …… మనం మనం సహాయం చేసుకోకుంటే ఎలా ….. ? , సరి సరే …… నేను కొత్తగా వచ్చిన సెక్యూరిటీ అధికారి కమిషనర్ ఇంటిలో ఉంటాను – నా గురించి అడిగితే ఒక్కకాల్ చెయ్యండి వచ్చేస్తాను .
అలాగే తమ్ముడూ అంటూ ఉద్వేగానికి లోనయ్యి కౌగిలించుకుని , సెక్యూరిటీ రూంలోకివెళ్లాడు .
థాంక్యూ సో మచ్ పెద్దమ్మా …….. సెక్యూరిటీ అన్న సంతోషం వెలకట్టలేనిది .
మెసేజ్ ……..
పెదాలపై చిరునవ్వుతో మొబైల్ తీసి చూసాను – అంతే కంగారుపడుతూ వెనక్కుతిరిగి మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను – లాక్ చేసి ఉండటంతో గేట్ ఎక్కి దూకి పరుగున మురళి ఇంటి డోర్ దగ్గరకువెళ్లి , మేడం – సర్ – మురళి సర్ అంటూ గట్టిగట్టిగా కొట్టాను .
ఆ సౌండ్ కు సెక్యూరిటీ …… సెక్యూరిటీ రూంలోనుండి వచ్చి , ఎవర్రా అది అని కేకలువేశాడు .
అన్నా …… నేను మహేష్ ని ……
సెక్యూరిటీ : తమ్ముడూ మహేష్ ఏమైంది ? అంటూ వచ్చాడు .
అన్నా …… తొందరగా డోర్స్ బద్ధలుకొట్టాలి .
సెక్యూరిటీ : తమ్ముడూ …… ఏమంటున్నావు ? .
అంతలో డోర్ తెరుచుకుంది . సర్ – మేడం …… చెంపలన్నీ కన్నీళ్ళ గుర్తులు , తుడుచుకుని తలుపులు తీసినట్లు తెలిసిపోతోంది .
సర్ – మేడం : సెక్యూరిటీ – మహేష్ …… అంటూ కోప్పడుతున్నారు .
