మేడం గారూ – సర్ …… చాలా దాహంగా ఉంది , ఔట్ హౌస్ లో చుక్క నీరు లేదు అంటూ వాళ్ళను ప్రక్కకుజరిపి సోఫాలదగ్గరికి పరుగుతీసాను . టీపాయ్ పై కనిపించకపోవడంతో సోఫాల వెనుక వెళ్ళిచూస్తే నిండుగా వాటర్ ఉన్న రెండు గ్లాస్ లు ఉన్నాయి . రెండుచేతులతో తీసుకుని హమ్మయ్యా …… వీటితో నా దాహం తీరిపోతుంది అంటూ తాగేంతలో ……
మహేష్ మహేష్ …… అంటూ సర్ – మేడం పరిగెత్తుకుంటూ వచ్చి గ్లాసులను కిందపడి పగిలిపోయేలా చేశారు .
దాహం వేస్తోంది నీళ్లు తాగడం తప్పా సర్ …….
సర్ : ఆ నీళ్లు నువ్వు దాహం తీర్చుకోవడానికి కాదు మహేష్ ……
మరి మీరు ప్రాణాలు తీసుకోవడానికా సర్ – మేడం ……..
ఇద్దరితోపాటు సెక్యూరిటీ షాక్ లో ఉండిపోయాడు .
ఎంత బాధ – కష్టం కలిగి ఉంటే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారో అర్థం చేసుకోగలను , మీకు చెప్పేటంత వయసు – అనుభవం నాకు లేదు కానీ మేడం నేను నాతోపాటు అనాధలు అంతకంటెక్కువ కష్టాలు – బాధలు – అవమానాలు భరిస్తూనే ఉంటారు . నేనూ …… వాటన్నింటినీ అనుభవించి మీముందు ఇలా దైర్యంగా ఉండటానికి మేడం గారూ ఒక కారణం – నేను ఇక్కడికి వచ్చినరోజు వరకూ నా డ్రెస్ ను చూసి అందరూ అసహ్యించుకున్న వాళ్ళు – పని అడిగినా తోసేసిన వాళ్లే ….. కానీ మీరు కూడు , గుడ్డ , పని ఇచ్చి ఆదుకున్నారు . అనాధలా పెరగడం ఎంత కష్టమో మీకు తెలియదు – మీరు ప్రాణాలు తీసుకుని పైన నుద్రపోతున్న నా ఫ్రెండ్ ను అనాధను చేసేస్తారా …… ? మేడం – సర్ …….. , మీరు ఔనన్నా నేను ఒప్పుకోను – మురళి సర్ చిన్న కష్టానికే విలవిలలాడిపోతాడు – తన తల్లిదండ్రులు ఉన్నారులే అని హ్యాపీగా జీవిస్తున్నాడు . రాత్రికిరాత్రి క్షణికావేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఆ సంతోషమైన జీవితాన్ని మాయం చేసి అనాధలా మార్చేస్తుంది – అనాధ కష్టాలు ఏమిటో ఇన్నిరోజులూ నన్ను చూసే ఉంటారు కదా …….
మేడం : లేదు లేదు మహేష్ – నాన్నా మురళీ sorry లవ్ యు లవ్ యు అంటూ పరుగున పైకివెళ్లారు .
సర్ ……. కష్టాలు అందరికీ వస్తాయి – ఎవరికష్టం వారికి పెద్దది – ప్లీజ్ ప్లీజ్ సర్ …… నా ఫ్రెండ్ ను మాత్రం నాలా అనాధను చెయ్యకండి అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాను .
సెక్యూరిటీ : సర్ సర్ …… మిమ్మల్ని ఎప్పుడూ దర్జాగా ఉండటం చూసాను – ఈరోజు ఉదయం నుండీ బాధతో ఉండటం చూస్తున్నాను – నాకు అడిగే అర్హత లేదు కానీ మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను – ఏమైంది సర్ ……..
కన్నీళ్ళతో సోఫాలో కూర్చున్నారు సర్ ……. – నా బిడ్డను అనాధకాకుండా సేవ్ చేశారు – సర్వం కోల్పోయాను …… రేపు తెల్లవారగానే బ్యాంక్ వాళ్ళు మానాన్నగారు చివరి శ్వాసను వదిలిన ఈ ఇంటిని వేలం వేయడానికి వస్తున్నారు – ఇప్పటివరకూ ఏ ఒక్కరినీ మోసం చెయ్యకుండా మా తరతరాల నుండి మా నాన్నగారు …… కష్టపడి అట్టడుగు స్థాయి నుండి ఒక స్థాయికి చేర్చిన కంపెనీని మరింత బిల్డ్ చేసి గౌరవంతో బ్రతికాను , సర్వం కోల్పోయి అందరిముందు కట్టుబట్టలతో బయటకు వెళ్లడం కంటే చావే నయం అనుకున్నాము – మా బిడ్డ పరిస్థితి ఆలోచించలేదు .
సర్ ……. వయసుకు మించి మాట్లాడుతున్నాను మన్నించండి – సర్ …… డబ్బుంటేనే జీవితం కాదు – ఇన్నేళ్లు హ్యాపీగా జీవించారు హై జీవితాన్ని చూసేశారు – ఇప్పుడు కిందిస్థాయి జీవితాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా ఆస్వాదించండి – మీ నాన్నగారు …… మీకు ఎలాగైతే లగ్జరీ లైఫ్ ఇచ్చారో ఇకనుండీ మీరు కష్టపడి మీ కొడుకుకు నా ఫ్రెండ్ కు అలాంటి లైఫ్ ఇవ్వండి – వేలం వేసిన మీ ఇంటిని మళ్లీ దక్కించుకుని గర్వపడుతూ ఎంటర్ అవ్వండి .
సర్ : ఇంత చిన్నవయసులోనే చాలా చాలా పరిణితితో చెప్పావు మహేష్ ….. , కష్టపడటం నాకు ఇష్టమే మహేష్ కానీ దారుణంగా మోసపోయాను – నమ్మినవాళ్లే నన్ను మోసం చేసేసారు – నమ్మకస్థులుగా ఉంటారని నా స్నేహితులను పార్ట్నర్స్ గా పెట్టుకుంటే మందు మైకంలో నాతో సంతకాలు పెట్టించుకుని కంపెనీతోపాటు ఆస్థులన్నీ రాయించుకోవడమే కాక లాభాలన్నీ వాళ్ళ పేర్లపై రాయించుకుని నష్టాలను మాత్రం నాపేరున మార్చి ముంబైకు చెక్కేశారు అంటూ బాధపడుతున్నారు – నా వలన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వేల మధ్యతరగతి కుటుంబాలు ఈ విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటారు – ప్రాణాలతో ఉండి ఆ పాపం మూటకట్టుకోవడం కంటే ప్రాణాలోదలడమే ఉత్తమం అనుకున్నాము అంటూఒక ఫైల్ ను టీపాయ్ పై ఉంచి పాయిజన్ బాటిల్ ను పగలగొట్టారు – నాన్నా మురళీ క్షమించు మళ్లీ ఇలాచెయ్యము .
జల్సాల వలన ఆస్తిని పోగొట్టుకున్నారని తప్పుగా అర్థం చేసుకున్నాను sorry సర్ – మోసపోయారన్నమాట అంటే మిమ్మల్ని …… మీ పార్ట్నర్స్ మోసం చేసి ఆత్మహత్య చేసుకునేలా చేసారన్నమాట – దైవం పెద్దమ్మ వలన సమయానికి వచ్చాను – మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది .
పైనుండి మేడం వచ్చారు .
సర్ : మురళి …….
మేడం : డిస్టర్బ్ చెయ్యలేదండీ నిద్రపోతున్నాడు .
మేడం మేడం ……. ఈ విషయం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తెలియనివ్వకండి తెలిస్తే బాధపడతాడు – నా ఫ్రెండ్ ఏడవడం నేను చూడలేను .
మేడం : నేను – మురళీ …… నువ్వు చిన్నపిల్లాడు అనికూడా చూడకుండా కటువుగా ప్రవర్తించాము అయినాకూడా మురళికోసం నువ్వు బాధపడుతున్నావు – నీది గొప్పమనసు మహేష్ …… – ఉదయం మురళికి ఎలాగో తెలవకుమానదు .
ఫ్రెండ్ కోప్పడినా – కొట్టినా …… ఫ్రెండు ఫ్రెండే , ప్రతీ ఫ్రెండూ అవసరమే – ఇక పాయిజన్ విషయం జీవితంలో తెలియదు మేడం ……. – మీరుణం తీర్చుకునే అవకాశం ఆ దైవం వలన నాకు లభించింది – మీరు వెళ్లి నా ఫ్రెండ్ తోపాటు పడుకోండి , తెల్లవారాక జరిగే మ్యాజిక్ చూడండి అంటూ ఫైల్ అందుకున్నాను – సర్ ఫైల్ లోని మ్యాటర్ గురించి నాకు తెలియదు , మిమ్మల్ని మోసం చేసిన పార్ట్నర్స్ గురించి తెలుసుకోవాలని తీసుకున్నాను ఎందుకంటే మన సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ సర్ కు మనమంటే ఒక లైకింగ్ …….
సర్ : అవునా మహేష్ …… నా మాటలను నమ్మినట్లు …… , పూర్తి సమాచారం ఉంది మహేష్ అని బదులిచ్చారు .
థాంక్యూ సర్ ……. , సర్ …… ఇక మీ పార్ట్నర్స్ సంగతి నాకు వదిలెయ్యండి వెళ్లి నా స్నేహితుడు ప్రక్కన పడుకోండి , ఇంతకూ మరొక పాయిజన్ బాటిల్ లేదుకదా ……..
సర్ : లేదు లేదు మహేష్ …….
ఎందుకైనా మంచిది సెక్యూరిటీ అన్నా ఇక్కడే పడుకోండి . సర్ …… అన్న లోపల ఉండటం మీకు …….
మేడం : ఈరోజుతో పూర్తిగా మారిపోయాము మహేష్ …… , యజమాని – పనివాడు , రాజు – పేద అందరూ సమానమే ……. , చావుదాక వస్తేనేకానీ మాకీవిషయం తెలియరాలేదు .
మేడం గారూ ……. ఆ విషయం మరిచిపోండి అనిచెప్పానుకదా ……. , వెళ్లి కమిషనర్ సర్ ను కలుస్తాను – గుడ్ నైట్ ……..
మహేష్ – మహేష్ ……. అని ఆప్యాయంగా పిలిచి కన్నీళ్ళతో కౌగిలించుకున్నారు . నిమిషమైనా వదలకపోవడంతో …… సర్ – మేడం …… మీరు ఇలా నన్ను ఆప్యాయతతో ఆలస్యం చేసేకొద్దీ మిమ్మల్ని మోసం చేసిన మీ పార్ట్నర్స్ మరింత మిస్ అయ్యే అవకాశం ఉంది , పైగా సెక్యూరిటీ అధికారి కంట్రోల్ ఆఫీస్ కు వెళ్లిన సర్ దగ్గరికి వెళ్ళాలి చలి చంపేస్తోంది .
సర్ : డ్రైవర్ కారు ….. తియ్యి అనబోయి బాధతో తలదించుకున్నారు .
సర్ ……. తెల్లవారులోపు మీకు సంబంధించినవన్నీ మీ చెంతకు చేరుతాయి అనిచెప్పి బయలుదేరాను .
ఆఅహ్హ్ …… చలి చలి , అక్కయ్య బంగారం ఓణీ వలన బ్రతికిపోయాను . మేడం వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటూ కమిషనర్ సర్ ఇంటి దగ్గరకు చేరుకున్నాను . సర్ వెహికల్ లేదు అంటే సర్ ఇంకా రాలేదన్నమాట సెక్యూరిటీ అధికారి కంట్రోల్ ఆఫీస్ కు వెళ్లాల్సిందే ఈ చలిలో తప్పదు అంటూ బయలుదేరి ఆగాను .
పైన లైట్స్ వెలుగుతున్నాయి అంటే అక్కయ్య – చెల్లెళ్లు ……. ఖచ్చితంగా నాకోసం నిద్రపోకుండా వేచిచూస్తూనే ఉన్నారన్నమాట , నాకు తెలుసు అక్కయ్య ….. మేల్కొనే ఉంటారు – మెసేజ్ చేద్దాము – ” అక్కయ్యా ….. ”
వెంటనే కాల్ వచ్చింది – తమ్ముడూ వచ్చేసావా ఇదిగో క్షణంలో డోర్ ఓపెన్ చేస్తాను .
నో నో నో అక్కయ్యా …… , నేననుకున్నది నిజమే మీరు నిద్రపోలేదన్నమాట …… , మరి చెల్లెళ్లు ……
అక్కయ్య : చెల్లెళ్లు కూడా …… , నా ముద్దుల తమ్ముడికి గుడ్ నైట్ కిస్ – బోలెడన్ని ముద్దులుపెట్టకుండా నిద్రపడుతుందా ? .
లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ……. ఉమ్మా అంటూ గట్టిగా ముద్దుపెట్టాను – అక్కయ్యా ……. sorry లవ్ యు లవ్ యు రావడానికి మరింత ఆలస్యం అవుతుంది .
అక్కయ్య : ప్చ్ …… పో తమ్ముడూ రాత్రిళ్ళు కూడా డ్యూటీ నా ? , ఎంతసేపౌతుంది అంటూ గోముగా అడిగారు .
ఎంతసేపౌతుందో తెలియదు అక్కయ్యా ……. , ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా …… నిద్రపోండి నేను వచ్చేస్తాను .
అక్కయ్య : మరి ముద్దులు ? .
మా అక్కయ్య ఎన్ని ముద్దులుపెట్టాలని అనుకున్నారో అంతకు రెట్టింపు మూడింతలు నేను ముద్దులుపెడతాను .
అక్కయ్య : మేము పడుకున్నా సరే ప్రతీ ముద్దూ పెట్టాలి – ఇది ఆర్డర్ .
యువరాణీ వారి ఆజ్ఞ శిరసావహిస్తాను – లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ………
అక్కయ్య : లవ్ యు టూ …… , తొందరగా వచ్చెయ్యి …….
తమ్ముడూ – సర్ ఇద్దరూ లేకుండా పెద్ద బిల్డింగ్ లో మాకు బయమేస్తుంది , తొందరగా వచ్చెయ్యి .
అక్కయ్యా …… పెద్దమ్మ తోడు ఉండగా భయమేల …….
అక్కయ్య : పెద్దమ్మా …… మా అన్నయ్య దగ్గరే ఉండమని నీ ముద్దుల చెల్లెళ్లు కోరుకున్నారుకదా …….
చెల్లెళ్లకు నేనంటే ప్రాణం – లవ్ యు చెల్లెళ్ళూ ……
లవ్ యు టూ అన్నయ్యా …….
పెద్దమ్మా …… చెల్లెళ్లకు తోడుగా ఉండండి , బై బై బై ……. పని పూర్తిచేసుకుని వచ్చేస్తాను అక్కయ్యా – చెల్లెళ్ళూ ……. అని కట్ చేసాను . పెదాలపై చిరునవ్వులతో వెనక్కుతిరిగి బిల్డింగ్ వైపు చూస్తూనే చలికి వణుకుతూ మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను – నా అదృష్టం కొద్దీ క్యాబ్ వెళుతుండటం చూసి ఆపి అన్నా …… సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ అన్నాను .
10:30 సమయం అయినా ok అనడంతో ఎక్కి వెచ్చగా కూర్చున్నాను – 20 నిమిషాలలో చేరుకున్నాను – పెద్దమ్మను తలుచుకుని పర్సు తీస్తే డబ్బులు ఉన్నాయి – థాంక్యూ పెద్దమ్మా అని తలుచుకుని పే చేసి సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ లోపలికివెళ్ళాను .
కానిస్టేబుల్ మెయిన్ డోర్ దగ్గరే ఎక్కడికి – ఎవరు కావాలి అని ఆపడం , అంతలో SI సర్ బయటకువస్తూ మహేష్ …… కానిస్టేబుల్ లోపలికి వదులు అన్నారు , మహేష్ …… ఏంటి ఈ సమయంలో …….
కమిషనర్ సర్ కోసం వచ్చాను .
SI సర్ : ఇంతవరకూ ఇక్కడే ఉన్నారు – ఇప్పుడే కోస్టల్ సిటీస్ నుండి వచ్చిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ స్టే చేస్తున్న హోటల్ కు వెళ్లారు , అటునుండి అటు ఇంటికి వెళతాను అన్నారు .
సరే సర్ అయితే అక్కడికే వెళ్లి కలుస్తాను గుడ్ నైట్ సర్ …… క్యాబ్ క్యాబ్ అంటూ బయటకు వెళ్ళేలోపు వెళ్ళిపోయింది .
SI సర్ : మహేష్ …… నేనున్నాను కదా ……
సర్ …… ఇప్పటికే ఆలస్యం అయ్యింది , ఇంటికి వెళుతున్నట్లున్నారు , ఇంటిదగ్గర మీకోసం ఎదురుచూస్తుంటారేమో మీరు వెళ్ళండి నేనెలాగో వెళతాను .
SI సర్ : నేనువెళ్ళాల్సినది అటువైపే మహేష్ – అటువైపుకాకపోయినా నిన్ను వదిలి వెళ్ళేవాడిని – ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది – ఇక్కడే ఉండు వెహికల్ తీసుకొస్తాను .
సర్ వెహికల్లో 15 నిమిషాలలో హోటల్ చేరుకున్నాము . థాంక్యూ సర్ …….
SI సర్ : అప్పుడేకాదు , సర్ దగ్గరకు వదిలాక చెప్పు అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
హోటల్ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ తో మాట్లాడుతున్న కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లారు .
బుజ్జిదేవుడు బుజ్జిమహేష్ ….. అంటూ డిన్నర్ చేస్తున్న ఆఫీసర్స్ అంతా లేచిమరీ నాకు సెల్యూట్ చేశారు .
కమిషనర్ సర్ : ఆఫీసర్స్ …… బుజ్జిదేవుడు , మా ఇంటిలో తన ప్రాణమైనవాళ్ళతోపాటు హాయిగా నిద్రపోతున్నాడు అని మాట్లాడుతూనే వెనక్కుతిరిగిచూసి , సడెన్గా లేచి మహేష్ అంటూ అందరితోపాటు సెల్యూట్ చేశారు .
సర్ సర్ …… ప్లీజ్ ప్లీజ్ have డిన్నర్ ……
అందరూ కూర్చున్నారు .
కమిషనర్ సర్ : నాదగ్గరికివచ్చి , మహేష్ …… నువ్వెంటి ఇక్కడ ? – ఎలా వచ్చావు ? .
SI సర్ : అర్జెంట్ గా మిమ్మల్ని కలవాలని హెడ్ క్వార్టర్స్ కు వచ్చాడు సర్ , ఇక్కడ ఉన్నారని పిలుచుకునివచ్చాను .
కమిషనర్ సర్ : ఒక్క కాల్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని కదా ….. , ఒంటరిగా – చలిలో ……. ముందు కూర్చో కూర్చో , ఐస్ క్రీమ్ తింటావా ? .
అమ్మో చలి చలి సర్ వద్దు , వచ్చిన విషయం ఏమిటంటే అంటూ జరిగినది మొత్తం వివరించాను – ఎలాగైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి సర్ – నన్ను ఏమిచెయ్యమన్నా చేస్తాను ప్లీజ్ ప్లీజ్ సర్ …….
కమిషనర్ సర్ : అర్జెంట్ ok , ఒక్క కాల్ చేసి ఆర్డర్ వేయొచ్చుకదా ……
అంతే డిన్నర్ చేస్తున్న ఆఫీసర్స్ అందరూ చుట్టూ చేరారు ఆర్డర్ వెయ్యి మహేష్ అంటూ …….
కమిషనర్ సర్ : చూశావా …… ? , ఈ విషయమై ఇంత రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావని నాపై కోప్పడినా కోప్పడతారు వీరంతా …….
మా కమిషనర్ సర్ అంటే నాకు ఎనలేని గౌరవం – నేను ……. మీకు ఫోన్ చేసి ఆర్డర్వెయ్యడం ఏమిటి అమ్మో ……. తప్పు తప్పు – అయినా మా సర్ సిటీ కమిషనర్ గా ఉన్న సిటీలో నాకు భయం ఏమిటి , ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోతాను .
మహేష్ అంటూ ఉద్వేగంతో కౌగిలించుకున్నారు – మహేష్ …… నువ్వు ఇంత దూరం రావడం కంటే అక్కడి నుండి ఆర్డర్ వేస్తేనే నాకు మరింత ఆనందం – నీ గురించి నాకు తెలియదా …… ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు – నువ్వు ….. నాకోసం ఇంత రాత్రి , ఇంత చలిలో ఒంటరిగా వచ్చావని తెలిస్తే …… తల్లులు – మీ మేడం – కావ్య – అవంతిక …… అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది , వాళ్లకు తెలియకముందే మనం ఇంటిలో ఉండాలి .
సర్ ముందు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి – నా మాట నమ్మి ముగ్గురు హాయిగా నిద్రపోతున్నారు సర్ ప్లీజ్ ప్లీజ్ …….
కమిషనర్ సర్ : డన్ …… ఫైల్ అన్నావుకదా ఎక్కడ ? .
సర్ అంటూ అందించాను .
కమిషనర్ సర్ : ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారని అన్నావు కదూ ……
అంతలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్ ఫైలులో ఉన్న పార్ట్నర్స్ ఫోటోలను మొబైల్లో తీసుకున్నారు . ఆ వెంటనే కాల్ చేసి ఫోటోలు సెండ్ చేసాను – వాళ్ళు ఏ హోటల్లో ఉన్నా గంటలో పట్టుకుని మక్కెలిరిగేలా కొట్టి వీడియో కాల్ చెయ్యండి .
కమిషనర్ సర్ : మహేష్ …… గంటలో పని అయిపోతుంది – ముంబై లో ఏ మూలన ఉన్నా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటారు . అక్కయ్య చున్నీ కదూ …….
అవును సర్ వెచ్చగా ఉంది .
సర్ సర్ …… ప్లీజ్ ప్లీజ్ మీరు భోజనం చెయ్యండి – నావలన ……
సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ : నో నో నో మహేష్ …… అంటూ ప్లేట్స్ అందుకుని నా చుట్టూ చేరి తింటున్నారు .
మొబైల్లో ఫోటోలు తీసుకున్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు . మిగతా ఆఫీసర్స్ అసూయతో నిరాశగా తింటున్నారు .
కమిషనర్ సర్ : కంగ్రాట్స్ ముంబై కమిషనర్ సర్ …… , చూశావా మహేష్ అందరిలోకి మొదటగా నీకు సహాయం చేసే అదృష్టం లభించిందని ఎలా ఆనందిస్తున్నారో …….
సర్ తోపాటు ఆనందించాను .
ఆఫీసర్స్ డిన్నర్స్ పూర్తవగానే ముంబై కమిసనర్సర్ కు కాల్ వచ్చింది . మహేష్ ….. అంటూ చూయించారు – చాలా ఇంకా కొట్టాలా …… ? .
నో నో నో సర్ …… మా సర్ వాటా సర్ కు చెందేలా చేస్తే చాలు – తెల్లవారేలోపు సర్ ఇంటి ముందు బ్యాంకు అధికారుల స్థానంలో వాళ్ళు క్షమాపణలు చెప్పాలి.
వీడియో కాల్ లో సెక్యూరిటీ అధికారి : సర్ …… వీళ్లకు ముంబై CI తెలుసు అని చెబుతున్నారు సర్ …… కాల్ గర్ల్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు – విల్లాలో ఎక్కడచూసినా మనీ బ్యాగ్స్ …… , రేయ్ …… అక్కడ ఉన్నది ముంబై సిటీ కమిషనర్ రా అంటూ ఒక్కొక్క దెబ్బ వేశారు .
ముంబై కమిషనర్ : రేయ్ …….
