గైడ్ : చిల్డ్రెన్స్ …… ఇంకా చాలా ఉన్నాయి సమయం లేదు – స్టెప్స్ కింద ఉంటాము తొందరగా వచ్చెయ్యండి .
చెల్లెళ్లు : Ok ok అంకుల్ ……. , అన్నయ్యా ……. నెక్స్ట్ టైం ఢిల్లీ వస్తే ఫస్ట్ ఇక్కడికే వద్దాము .
దేవత : మీ అన్నయ్య మాత్రమేనా …… ? . ఉమ్మ్ అంటూ బుంగమూతి పెట్టుకున్నారు .
చెల్లెళ్లు : మాతోపాటే మా బ్యూటిఫుల్ ఆక్కయ్యలు …….
దేవత – అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ …… అంటూ సిగ్గుపడ్డారు .
చెల్లెళ్లు : దేవత – అక్కయ్య సిగ్గుపడుతుంటే మరింత బ్యూటిఫుల్ కదా అన్నయ్యా …….
అవును చెల్లెళ్ళూ …… సిగ్గులొలికిస్తున్న దేవత – అక్కయ్య పెదాలవైపే కళ్ళు వెళ్లడం – తియ్యని జలదరింపులకు వెంటనే తలదించేసుకోవడం ……
అక్కయ్య చిలిపినవ్వులతో చెల్లెళ్ళూ …… రండి రండి అంటూ కిందకుదిగాము .
చెల్లెళ్లు : అంకుల్ నెక్స్ట్ …….
గైడ్ : one of the largest temple ” అక్షరధామ్ టెంపుల్ ” ……
పిజ్జా – స్నాక్స్ తింటూ అక్షరధామ్ టెంపుల్ – జామా మసీద్ వీక్షించడంతోనే చీకటిపడిపోయింది .
విశ్వ సర్ చెప్పినట్లుగా 7 గంటలకల్లా ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి నేరుగా ఫ్లైట్ దగ్గరికి చేర్చారు చీఫ్ కమాండో …… , సమయం వృధా కాకూడదు అని చిల్డ్రెన్స్ – బుజ్జిహీరో ……. డిన్నర్ ఏర్పాట్లు ఫ్లైట్ లోనే ఏర్పాటుచేసాము ఎంజాయ్ & హ్యాపీ జర్నీ …….
థాంక్యూ థాంక్యూ అంకుల్స్ …… , ఒక సెల్ఫీ అంటూ ఇద్దరితో తీసుకున్నాము .
చీఫ్ కమాండో : బుజ్జిహీరో – మిస్ అవంతిక & కావ్యా ……. ఫైనల్ గా one more time అంటూ సెల్యూట్ చేశారు .
విశ్వ సర్ : బ్రదర్స్ …… మీ వల్లనే పిల్లలు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూసారు – థాంక్యూ సో మచ్ అంటూ కౌగిలించుకున్నారు . బ్రదర్స్ …… మా వైజాగ్ కూడా సో బ్యూటిఫుల్ ప్లేస్ – మీ విజిట్ కోసం కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము అని ఢిల్లీకి బై చెప్పి ఫ్లైట్ ఎక్కగానే బయలుదేరింది .
చెల్లెళ్లు : అన్నయ్యా ….. మొబైల్ ఇవ్వండి మొబైల్ ఇవ్వండి – అంటీ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నారు అని అడిగి కాల్ చేసి కమింగ్ to వైజాగ్ అంటూ ఇంఫార్మ్ చేశారు .
బామ్మలు : బుజ్జితల్లులూ – తల్లులూ – బుజ్జిహీరో – విక్రమ్ …… ఉదయం అనగా తిన్నారు ముందు భోజనం చెయ్యండి అంటూ ప్లేట్స్ లో వడ్డించుకుని తీసుకొచ్చారు.
ముందు బామ్మలకు అంటూ చెల్లెళ్లతోపాటు తినిపించాను .
బామ్మలు : బంగారుకొండలు అంటూ మాకు – అక్కయ్య – దేవతకు తినిపించారు .
దేవత : అక్కయ్యా …… మీ హనీమూన్ అయిపోతే వచ్చి భోజనం చెయ్యండి .
మిస్సెస్ కమిషనర్ : సిగ్గుపడుతూ వచ్చి , వైజాగ్ చేరేంతవరకూ పూర్తవ్వదు అంటూ ఒకప్లేటులో వడ్డించుకుని దేవత – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : అయితే ఈ ముద్దులుకూడా మీ హీరోగారికే ఇవ్వండి అని పంపించేసి , బామ్మల గోరుముద్దలు తిన్నారు .
చెల్లెళ్లు : బామ్మలూ బామ్మలూ …… చాలా చాలా ఆకలివేస్తోంది ముందు అన్నయ్యకు తినిపించండి .
బామ్మలు : అలాగే బుజ్జితల్లులూ …… , మీ అన్నయ్యేమో మీకు తినిపించండి అంటాడు కాబట్టి అందరికీ ప్రాణంలా తినిపిస్తాను అంటూ ముద్దులు – ముద్దలు తినిపించారు .
లవ్ యు బామ్మలూ …… ఫుల్ గా తిన్నాము – నిద్రొచ్చేస్తోంది అంటూ బామ్మల ఒడిలోకి చేరారు చెల్లెళ్లు ……..
బామ్మలూ ……. చాలారోజుల తరువాత అక్కయ్య కాలేజ్ కు వెళుతున్నారు – హుషారుగా వెళ్ళాలి కాబట్టి చెల్లెళ్లతోపాటు అక్కయ్యను కూడా పడుకోబెట్టుకోండి .
చెల్లెళ్లు : అవునవును అంటూ లేచి ఎదురుగా ఉన్న బెడ్ ను రెడీ చేశారు – బామ్మా …… ఇక్కడ బెడ్ పై జోకొడుతూ పడుకోబెట్టుకోండి .
బామ్మలు : మాకంటే మీరు జొకోడితేనే మీ అక్కయ్య మరింత హాయిగా నిద్రపోతుంది – అలాగే బెడ్ పై మీరుకూడా నిద్రపోవచ్చు అంటూ బెడ్ పై పడుకోబెట్టారు .
చెల్లెళ్లు : లవ్ యు బామ్మలూ …….
అక్కయ్య – చెల్లెళ్లు : తమ్ముడూ – అన్నయ్యా …… నువ్వుకూడా రా ……
పర్లేదు అక్కయ్యా ప్లేస్ లేదుకదా , దేవత …….
దేవత : ఏంటీ …….
అదే అదే సోఫాలో కూర్చున్న బామ్మల ఒడిలో అంటూ వాలిపోయాను .
బామ్మలు : మా బంగారం అంటూ ముద్దులుపెట్టి జోకొట్టారు . బుజ్జితల్లీ …… అదృష్టం ఉండాలి – త్వరలోనే నీకూ తెలుస్తుందిలే …….. అంటూ బుగ్గను గిల్లేసారు.
దేవత : అలా అనాలని అనలేదు బామ్మలూ ……. , బుజ్జిహీరో అల్లరిలో అలా మాట వచ్చేసింది అంతే , sor …….
నో నో నో మేడం …… , దేవత ఎప్పటికీ sorry చెప్పకూడదు , మీరు కోప్పడినా – తిట్టినా – కొట్టినా ……. నాకు సంతోషమే , మీరేమీ ఫీల్ అవ్వకండి …….
బామ్మలు : బంగారుకొండ అంటూ నా నుదుటిపై ముద్దులుపెట్టారు .
ఉదయం నుండీ అలసిపోవడం వలన చెల్లెళ్లు – అక్కయ్య …… బెడ్ పై , నేను ….. బామ్మ ఒడిలో , దేవత …… బామ్మ భుజంపై నిద్రపోయారు .
అలా నిద్రపోయామో లేదో వైజాగ్ లో ల్యాండ్ అయ్యాము అంటూ బామ్మలు లేపడంతో నిద్రమత్తులోనే ఒకరినొకరు చేతులను చుట్టేసి ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము .
విశ్వ సర్ : శ్రీమతిగారూ …… మీ మాయలో నన్ను నేను మైమరచి , మనం వస్తున్న సంగతిని కంట్రోల్ రూమ్ కు ఇంఫార్మ్ చెయ్యడమే మరిచిపోయాను .
మిస్సెస్ కమిషనర్ : వైజాగ్ వచ్చేసాముకదా ఇక తమరి మన్మధ బాణాలు కాస్త తగ్గిస్తే మంచిది .
విశ్వ సర్ : ప్చ్ ……. ఢిల్లీలోని ఉండిపోవాల్సింది .
మిస్సెస్ కమిషనర్ : తగ్గించండి అన్నానుకానీ ఆపమని చెప్పలేదు కదా ……
విశ్వ సర్ : అవునుకదా …… , లవ్ యు శ్రీమతిగారూ ….. అంటూ చేతిపై ముద్దుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు టూ శ్రీవారూ …… , ఇంటికి వెళ్ళాక మీకిష్టమైన ముద్దులు ఇష్టమైన చోట పెడుదురుకానీ ముందువెళ్లి క్యాబ్స్ సంగతి చూడండి . బుజ్జిహీరో – తల్లులు – చెల్లెళ్లు …….
విశ్వ సర్ : యాహూ …… , ఇదిగో ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరకే తీసుకొస్తాను , మీరు వెచ్చగా లోపలే ఉండండి .
మమ్మీ – డాడీ …… మహేష్ – మేడం వాళ్ళు వచ్చేసారు అంటూ మురళి …… మహేష్ మహేష్ అంటూ పరుగునవచ్చి నిద్రమత్తులో నడుస్తున్న నన్ను అమాంతం కౌగిలించుకున్నాడు . థాంక్యూ థాంక్యూ మహేష్ – sorry మహేష్ – ఇకనుండీ నిన్ను మహేష్ సర్ అని పిలుస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు .
అంతే ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయింది . నా ఎదురుగా మేడం – సర్ ….. ఇద్దరూ విశ్వ సర్ పాదాలను స్పృశించబోతే ఆపారు .
థాంక్యూ థాంక్యూ సో మచ్ కమిషనర్ సర్ అంటూ కన్నీళ్లతో నమస్కరిస్తున్నారు .
విశ్వ సర్ : ఆపి , బ్రదర్ …… ఇందులో నేను చేసిందేమీ లేదు , మన మహేష్ వచ్చి మేడం – సర్ ……. కష్టాలు తీరిపోవాలి అని ఆర్డర్ వేసాడు , సిటీ కమిషనర్ గా నా బాధ్యత నిర్వర్తించాను , మీ థాంక్స్ లన్నీ బుజ్జిమహేష్ కే చెందుతాయి వెళ్ళండి వెళ్ళండి అని నాదగ్గరకు పంపించి , ప్రక్కనే ఉన్న కుర్చీలో దర్జాగా కూర్చున్నారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ …..
విశ్వ సర్ : బుజ్జిదేవుడి సంతోషాన్ని మనసారా ఆస్వాదించాలికదా ……
మిస్సెస్ కమిషనర్ : నేనుకూడా అంటూ ప్రక్కనే కూర్చుని , బామ్మలను రమ్మని సైగచేశారు .
మురళి : sorry మహేష్ సర్ – మీతో చాలా కఠినంగా ప్రవర్తించాను .
మేడం : మేముకూడా మహేష్ – అదేమీ మనసులో పెట్టుకోకుండా మాకు సహాయం చేసావు – మా జీవితాంతం రుణపడి ఉంటాము – మేము ఇలా ప్రాణాలతో ఉన్నామంటే …….
అంటీ – అంకుల్ ……. అంటూ ఆపాను . నేనే …… మీకు ఋణపడిపోయాను అంటీ ……
అంటీ : ఇంత మంచి పిల్లాడిని ఎంత కష్టపెట్టాము అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు .
చెల్లెళ్లు : అంటీ …… బాధపడకండి – మీరు బాధపడితే అన్నయ్య కూడా బాధపడతారు – మీరంటే అన్నయ్యకు చాలా గౌరవం – అంటీ అని ఆప్యాయంగా పిలవమన్నప్పుడే రుణం తీరిపోయింది కదా అన్నయ్యా ……
లవ్ యు చెల్లెళ్ళూ …… , మురళీ …… మనం ఫ్రెండ్స్ – ఫ్రెండ్ ఫ్యామిలీకి అదికూడా నాకు ఆశ్రయం కల్పించిన ఫ్యామిలీకి కష్టం వస్తే చూస్తూ ఉండగలనా ……
మురళి : థాంక్యూ మహేష్ సర్ …….
మురళీ …… ఫ్రెండ్ ను ఎవరైనా అలా పిలుస్తారా ? .
మురళి : నాలాంటి మూర్ఖుడు ఇన్నిరోజులూ అలానే …….
మురళీ ……. జరిగినదేదో జరిగిపోయింది . ఇకనుండీ రేయ్ – రేయ్ అని ఫ్రెండ్స్ లా పిలుచుకుందాము .
మురళి : థాంక్స్ రా మహేష్ …….
అదీ అలా అంటూ కౌగిలించుకుని పైకెత్తాను .
చెల్లెళ్లు : సూపర్ అన్నయ్యా …… అంటూ చప్పట్లుకొట్టారు .
అంటీ – అంకుల్ …… నా ఫ్రెండ్ కు చెప్పి బాధపెట్టొద్దు అని చెప్పానుకదా …….
అంటీ : బుజ్జిదేవుడి గురించి మురళికి కూడా తెలియాలనే చెప్పాము – మిమ్మల్ని చూస్తుంటే మరింత సంతోషం కలుగుతోంది .
దేవత : బుజ్జిదేవుడు అని ఈ అల్లరి మహేష్ ను పిలిచి ఆ పేరుకి గౌరవం తగ్గించకండి – అయినా ఇదంతా ఎప్పుడు జరిగిందో – ఈ బుజ్జిహీరో …… సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు .
థాంక్యూ మేడం అంటూ చెల్లెళ్లతోపాటు ఆనందించాను .
అంటీ : అవంతికా – కావ్యా చెల్లెళ్ళూ ……. మిమ్మల్ని కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది – మీది దేవత మనసు .
అక్కయ్య : అనాధ పిల్లలకు పెద్దమొత్తంలో సహాయం చేసిన మీది గొప్ప మనసు .
అంటీ : రాత్రికిరాత్రి కోల్పోయామనుకున్న క్రోర్స్ ఆఫ్ మనీని మాదగ్గరికే చేర్చారు మహేష్ – కమిషనర్ సర్ , మహేష్ మరియు మీఇద్దరి కోసం మీ పెదాలపై చిరునవ్వులను మహేష్ చూడటం కోసం మావంతు సహాయం చేసాము .
చెల్లెళ్లు : టీవీలో మీ సహాయం చూసి ఆక్కయ్యలు – అన్నయ్య ……. చాలా చాలా ఆనందించారు అంటీ ……
అంటీ : అవునా తల్లులూ ……. అంటూ ఆనందించారు .
దేవత – అక్కయ్య : ఆప్యాయంగా చెల్లెళ్ళూ …… అని పిలిచారు కాబట్టి , అక్కయ్యా ……. రాత్రికిరాత్రి ఏమి జరిగిందో వివరిస్తారా …… ? .
అంటీ …… నో నో నో …… , అయినా మనం ఉదయం కలిసేవాళ్ళము కదా ఈ సమయంలో ……
అంటీ : నీకోసం అర్ధరాత్రైనా వచ్చేవాళ్ళము మహేష్ – తల్లులు కాల్ చేశారు వచ్చేసాము .
దేవత : బుజ్జిహీరో – అక్కయ్యా స్టాప్ స్టాప్ ……. , భలేగా మాట మారుస్తున్నారు .
విశ్వ సర్ : శ్రీమతిగారూ …… మనం జారుకునే సమయం వచ్చింది అంటూ లేచారు.
దేవత : అయితే వెంటనే తెలుసుకోవాల్సిందే , అక్కయ్యా …… మీకు తెలిసినది మీరు చెప్పండి – మిగతాది కమిషనర్ సర్ చెబుతారు .
చెల్లెళ్ళూ …… నిద్రవస్తోంది కదా మీకు ……
చెల్లెళ్లు : లేదే ……. అవునవును అన్నయ్యా , అక్కయ్యలూ …… నిద్రవస్తోంది అంటూ వెళ్లి దేవత – అక్కయ్యను చుట్టేశారు .
దేవత : మీ అన్నయ్యను కవర్ చెయ్యడానికి రెడీగా ఉంటారు – కమిషనర్ గారూ …… క్యాబ్స్ ఎక్కడ ? .
అంటీ : చెల్లెళ్ళూ ……. మీకోసం రెండు కార్లు తీసుకొచ్చాము రండి .
దేవత – అక్కయ్య : అక్కయ్యా ……మేము మీ కారులో వస్తాము – జరిగినదంతా వివరించండి – ఏయ్ బుజ్జిహీరో …… ఆ సైగలు ఆపు , పదండి అక్కయ్యా ….. అంటూ చెల్లెళ్ళ చేతులను అందుకుని అంటీ కారులో – బామ్మలు మిస్సెస్ కమిషనర్ విక్రమ్ ….. అంకుల్ కారులో కూర్చున్నారు .
అక్కయ్యా …… ఒక విషయం దాచాను sorry …….
అక్కయ్య : విషయం తెలుసుకుని రియాక్ట్ అవుతాను తమ్ముడూ …… లవ్ యు .
విశ్వ సర్ : ప్లేస్ సరిపోదు మేము ముగ్గురం క్యాబ్ లో వస్తాము పదండి అని పంపించారు . బుజ్జిహీరో – మురళీ …… ఇకనుండీ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ క్యాబ్ ను పిలిచారు .
Yes సర్ అంటూ ఇద్దరమూ భుజాలపై చేతులువేసుకున్నాము .
క్యాబ్ వచ్చి ఆగింది – విశ్వ సర్ ను డ్రైవర్ చూసి కమిషనర్ సర్ కమిషనర్ సర్ నా క్యాబ్ లో అంటూ వచ్చి డోర్స్ ఓపెన్ చేసాడు .
సర్ అడ్రస్ చెప్పడంతో బయలుదేరింది .
కమిషనర్ సర్ ……
విశ్వ సర్ : ఏంటి మహేష్ …… , ఇదిగో అలా మనసులో దాచుకోకుండా ఆర్డర్స్ వెయ్యమని చెప్పానా …… ? – అసలే నువ్వు ఒంటరిగా అర్ధరాత్రి హోటల్ లో ఎంజాయ్ చేస్తున్న నాదగ్గరికి వచ్చిన విషయం తెలిస్తే తల్లులు ఎలా రియాక్ట్ అవుతారోనని భయం వేస్తోంది .
నవ్వుకున్నాను – నిజం చెప్పమంటారా నన్నేమీ అనరు మిమ్మల్నే ……
విశ్వ సర్ : అదేకదా ……. , ఇదిగో కాల్ వచ్చింది మీ అక్కయ్య నుండి , అపద్దo చెప్పలేను అంటూ జరిగింది వివరించారు , ఇంటికి వెళ్ళాక ఏమి జరుగుతుందో , తల్లులు కూడా అదేకారులో ఉన్నారు .
కమిషనర్ సర్ ……. ఇంటికి వెళ్ళాక కదా , ఇప్పుడైతే అక్కయ్య ….. కొత్తగా రేపు కాలేజ్ లో అడుగుపెట్టబోతున్నారు , అక్కయ్యకు …… కాలేజ్ హ్యాపీగా స్వాగతం పలికేలా ఏమైనా చెయ్యాలి , సమయం లేదు కానీ ……
విశ్వ సర్ : కమిషనర్ గా నేనున్నది ఎందుకు మహేష్ , నేను చూసుకుంటాను , గ్రాండ్ వెల్కమ్ ఏర్పాట్లు చేయిస్తాను , ఇప్పుడే సెక్యూరిటీ అధికారి కంట్రోల్ నుండి కాలేజ్ మేనేజ్మెంట్ కు విషయం తెలుపుతాను .
