చెల్లెళ్లు : నథింగ్ నథింగ్ దేవతా …… , ఏంటంటే …… మాకు మా దేవత – అన్నయ్య ఇద్దరిప్రక్కనా కూర్చోవాలని ఉంది .
దేవత : Ok కూర్చోండి ఎవరు కాదన్నారు .
లవ్ యు లవ్ యు దేవతా అంటూ ఆనందంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు – మేము అలా కూర్చోవాలంటే మీ ప్రక్కన అన్నయ్య కూర్చోవాలి .
దేవత : Ok – Wait wait …… మీ అన్నయ్య ప్రక్కన కాకుండా నాతోపాటుకూడా కూర్చోవాలని మరియు మీ అన్నయ్య పేరు కాకుండా నా పేరుని మొదట పలికారు అంటే ఇందులో ఏదో మతలబు ఉన్నట్లు నాకు తెలుస్తోంది .
చెల్లెళ్లు : ఏమీలేదు ఏమీలేదు దేవతా …… అంటూ కంగారుపడ్డారు , Ok ok మీకు ఇష్టం లేదని తెలుస్తోంది మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు – మా కోరిక తీరదు కాబట్టి ఇలానే నిలబడే ఉంటాము .
దేవత : అయ్యో రామా sorry లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ……. , మీ ఇష్ట ప్రకారమే కూర్చోండి తొందరగా తొందరగా బస్సు కూడా స్టార్ట్ అయ్యింది .
చెల్లెళ్లు : లవ్ యు దేవతా …… , అన్నయ్యా …… గుర్తుంది కదా పెద్దమ్మను తలుచుకుని ముద్దులు – గిలిగింతలు అంటూ వణుకుతున్న నన్ను దేవత ప్రక్కన స్పృశించేలా కూర్చోబెట్టారు .
Sorry మేడం అంటూ సీట్ చివరకు జరిగాను .
చెల్లెళ్లు : అన్నయ్యా …… మేమెక్కడ కూర్చోవాలి అంటూ వైష్ణవి ….. విండో ప్రక్కన దేవత చేతిని చుట్టేసి – వర్షిని అయితే ఏకంగా నన్ను దేవతను హతుక్కుపోయేలా జరిపి కంఫర్టబుల్ గా కూర్చుంది .
దేవతను హత్తుకున్నాక కానీ తెలియలేదు వణుకు కాదు స్వీట్ కదలికలు అని – దేవతవైపే కన్నార్పకుండా చూస్తున్నాను .
వర్షిని : చెప్పానా అన్నయ్యా ఎంజాయ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
హాసిని : ముగ్గురు కూర్చునే సీట్లలో ఇప్పటికే నలుగులు కూర్చున్నారు – నేనెక్కడ కూర్చోవాలి .
చెల్లీ …… నీ ఇష్టం మా నలుగురిలో నీకిష్టమైన వాళ్లపై కూర్చో …….
హాసిని : లవ్ టు లవ్ టు …….
దేవత : నాకు తెలుసు బుజ్జిచెల్లీ …… నువ్వు మీ అన్నయ్యపైనే కూర్చుంటావు అని అంటూ లాగి కూర్చోబెట్టుకుని గట్టిగా చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
వర్షిని : అన్నయ్యా …… పడిపోతున్నాను జరగండి అంటూ దేవతను మరింత హత్తుకుపోయేలా తోస్తోంది నవ్వుకుంటూ ……..
దేవత : అవునవును బుజ్జిహీరో జరుగు చెల్లికి ప్లేస్ లేదుకదా అంటూ నా చేతిని అందుకుని వారివైపు లాక్కున్నారు .
మేడం …… మీకు ఇబ్బంది కలుగుతుందని …….
దేవత : సో స్వీట్ ఆఫ్ యు బుజ్జిహీరో ……. పర్లేదు జరుగు జరుగు – కొద్దిసేపే కదా అడ్జస్ట్ చేసుకుందాము .
హాసిని : సో స్వీట్ ఆఫ్ యు మాత్రమే సరిపోదు అక్కయ్యా …… , అభినందనతోపాటు ముద్దుకూడా పెడితే అందం చందం , ఎలాగో మీరు పెట్టరులే మీ ముద్దుకూడా నేనే పెట్టేస్తాను , సో స్వీట్ ఆఫ్ యు అన్నయ్యా ఉమ్మా …….
వైష్ణవి : ఆగవే ఆగు , దేవత ముద్దు నువ్వు పెట్టడం ఏమిటి , దేవతా …… మీరు పెట్టండి అన్నయ్యకు – ఇది తెగ బిల్డప్ ఇస్తోంది .
దేవతకు రోషం వచ్చినట్లు అవునవును నాముద్దు నువ్వు పెట్టడం ఏమిటి బుజ్జి చెల్లీ ….. , సో స్వీట్ ఆఫ్ యు అన్నది నేనే కాబట్టి ముద్దుకూడా నేనే పెడతాను అంటూ నా చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టారు .
అంతే ఆఅహ్హ్ ……. అంటూ వొళ్ళంతా ఏదో అయిపోయినట్లు చెల్లి భుజంపై వాలిపోయాను .
వర్షిని : ముద్దుపెట్టినది దేవత కాబట్టి దేవతపైననే వాలండి అన్నయ్యా –
అమ్మో ……. భయంగా ఉంది చెల్లీ అంటూ గుసగుసలాడాను .
దేవత : అవునవును ముద్దుపెట్టినది నేను అంటూ నా తలను దేవత భుజంపై వాల్చుకున్నారు – సో స్వీట్ ఆఫ్ యు బుజ్జిహీరో అంటూ మరొక ముద్దుపెట్టారు .
ఆశ్చర్యం వేసింది .
యాహూ యాహూ ……. రెండు ముద్దులు వే వే అంటూ చెల్లెళ్లు ముగ్గురూ సంతోషంతో హైఫై కొట్టుకుని ఆనందిస్తున్నారు .
దేవత : అమ్మో అమ్మో అంతా మీ ప్లాన్ అన్నమాట – “ఆగవే ఆగు ” అని అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది – అయినా మీ అన్నయ్యకు రెండు ముద్దులు ఎలాపెట్టాను – అంతా మాయలా ఉంది – భుజంపై కూడా వాలి ముద్దులకు మళ్లీ మైమరిచిపోయాడు అంటూ నా బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ……. అంటూ తేరుకుని దేవతవైపు దీనంగా – చెల్లెళ్ళవైపు నవ్వుతూ చూసాను , మేడం …… మీరేకదా చెల్లిపై వాలిన నన్ను …….
దేవత : అదే అదే అంతా మాయలా ఉంది అంటూ మళ్లీ చిన్నగా దెబ్బలవర్షం కురిపించారు .
ఇంత చిన్నగానా కాస్త గట్టిగా కొట్టొచ్చుకదా మేడం ప్చ్ ప్చ్ ……..
చెల్లెళ్లు ముగ్గురూ దేవతవైపు తియ్యనైన కోపంతో చూస్తున్నారు .
దేవత : ఏంటి చెల్లెళ్ళూ మూడోకన్ను తెరిచేలా ఉన్నారు మీ అన్నయ్యను కొట్టాననా లవ్ యు లవ్ యు అమ్మో భయమేస్తోంది .
చెల్లెళ్లు : అన్నయ్యను కొట్టారని కాదు – చూడండి మీ దెబ్బలను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో ……. , మీకు మాకంటే అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం ( మాకూ అదే ఇష్టం అనుకోండి అంటూ ఆనందించి ) అన్నయ్యను మాత్రమే కొడతారు – ముగ్గురం ఉన్నాము మీ ఇష్టం ఎవరినైనా ఎలాగైనా కొట్టండి .
దేవత : ఇందుకా కోపం – మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ కొట్టబోయి నవ్వుతూ ఆగిపోయారు .
చెల్లెళ్లు : ప్చ్ ….. మిస్ , అన్నయ్యకు మాత్రం మిస్ చెయ్యరు అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు ముచ్చటైన బుంగమూతులతో …….
దేవత : దెబ్బలుకాదు కానీ బోలెడన్ని ముద్దులుపెడతాను అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులు కురిశాయి .
అంతలో బస్సు ఆగడం – పిల్లలందరూ జూ జూ జూ అంటూ బస్సు టాపు లేచిపోయేలా సంతోషంతో కేకలువేస్తూనే ఉండటం చూసి నవ్వుకున్నాము – బస్సు డోర్ తెరుచుకోవడం ఆలస్యం …… జూ జూ జూ అంటూ మరింత సంతోషంతో క్షణాలలో కిందకుదిగారు .
అన్నయ్యా అన్నయ్యా వచ్చేసాము చెల్లెళ్లు సంతోషంతో నా బుగ్గలపై ముద్దులు కురిపించి లేచారు .
దేవత : మీరు మాత్రం మీ అన్నయ్యకు మాత్రమే ముద్దులుపెట్టొచ్చు – నేను మాత్రం మీ అన్నయ్యను మాత్రమే కొట్టకూడదు కదూ ఇదిగో మళ్లీ మీ అన్నయ్యను కొడతాను .
Yes yes మేడం ఇంకా ఇంకా అంటూ ఎంజాయ్ చేస్తున్నాను .
దేవత : ఎవరినైనా కొడితే నో నో అంటారు – ఈ బుజ్జిహీరో మాత్రం తెగ ఎంజాయ్ చేస్తాడు , ఈ అల్లరి ఎప్పుడూ ఉండేదేకానీ పదండి పదండి స్టూడెంట్స్ అందరినీ మేమేకదా చూసుకోవాల్సింది .
అవునవును మేడం అంటూ అందరమూ కిందకుదిగాము . స్టూడెంట్స్ అందరూ జూ గేట్ ముందు నిలబడి లోపలికి ఎప్పుడెప్పుడా అన్నట్లు తెగ ఉత్సాహంతో ఎదురుచూస్తూ కేకలువేస్తున్నారు .
అప్పటివరకూ ఈగలు తోలుకుంటున్నట్లు సెక్యూరిటీ – జూ స్టాఫ్ సంతోషంతో సర్ సర్ అంటూ కేకలువెయ్యడంతో జూ మేనేజ్మెంట్ బయటకువచ్చి , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ కమిషనర్ సర్ – మా విజ్ఞప్తిని మన్నించినందుకు అంటూ ఆనందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు .
మీడియాకు సమాచారం అందినట్లు వరుసగా వెహికల్స్ వచ్చి ఆగడంతోపాటు మైకులన్నీ సర్ ముందు ప్రత్యక్షము అయ్యాయి .
విశ్వ సర్ : ఇప్పుడు మాట్లాడవలసినది నేనుకాదు – నా మాటను గౌరవించి దైర్యంగా ఇక్కడకు వచ్చిన ఈ స్టూడెంట్స్ ……. , మైకులు వాళ్ళ ముందు ఉంచడం భావ్యం …….
అలాగే సర్ అలాగే సర్ అంటూ మైకులన్నింటినీ స్టూడెంట్స్ వైపుకు చేర్చారు . టీచర్స్ ……. కమీషనర్ గారు ఎలా ఒప్పించారు ? – ఎందుకు వచ్చారు ? ……. అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది .
టీచర్స్ అందరూ సిగ్గుపడటం చూసి దేవత ముందుకువెళ్లారు – సిటీ కమిషనర్ గారు చెప్పినట్లు నిజమైన ధైర్యవంతులు మా స్టూడెంట్స్ – వారు దైర్యంగా అడుగు ముందుకువెయ్యడం వల్లనే తోడుగా మేము రావడం జరిగింది సో ఈ ప్రశ్నలన్నీ మా స్టూడెంట్స్ ను అడగడం భావ్యం .
మీడియా : అలాగే మేడం – స్టూడెంట్స్ అంటూ ప్రశ్నల వర్షం కురిసింది .
స్టూడెంట్స్ అందరూ సిగ్గు – భయం వలన తలలు దించుకుని నవ్వుకుంటున్నారు .
టీచర్స్ అయిన మేమే మైకుల ముందు మాట్లాడటానికి సంశయించాము పిల్లలుకదా – హలో బుజ్జిహీరోగారూ ……. మీ అల్లరి ప్రతాపం ఇప్పుడు చూయించండి కమాన్ కమాన్ …….
అన్నయ్యా …… మన దేవత చిలిపి కోరిక తీర్చాల్సిందే అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : చిలిపి కోరికనా ? కాదు కాదు కాదు ……
చెల్లెళ్లు : మాకు చిలిపి కోరికనే అంటూ నవ్వుకున్నారు .
మీడియా : స్టూడెంట్స్ …… మైకు ముందు వచ్చి మాట్లాడే ధైర్యం ఒక్కరికీ లేదా ? .
మా అన్నయ్యకు ఉంది అంటూ చేతినిపైకెత్తారు చెల్లెళ్లు …….
అంతే మహేష్ మహేష్ అన్నయ్య అన్నయ్య అంటూ కేకలతో దద్దరిల్లిపోతోంది – కేకలు ఆగడం లేదు .
ఇదీ మా అన్నయ్య క్రేజ్ అంటూ ముద్దులుపెట్టారు చెల్లెళ్లు …….
మీడియా చుట్టూ చూస్తూ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అంటూ మైకులు నా ముందు ఉంచారు – స్టూడెంట్ …… wow కాలేజ్ హీరో అన్నమాట , నీ పేరేంటి అంటూ ఒక విలేఖరి అడిగారు .
ఆ విలేఖరికి మొట్టికాయలు పడ్డాయి మిగతా విలేఖరుల నుండి ……
Yes yes yes జూలో ఉన్న జంతువులన్నీ బెదిరిపోయేలా కేకలువేస్తున్నారు కదూ మహేష్ మహేష్ అంటూ …….
అవునవును మహేష్ మహేష్ అంటూ స్టూడెంట్స్ అందరూ నవ్వుకున్నారు .
మీడియా : మహేష్ – కాలేజ్ హీరో …… కమిషనర్ సర్ మిమ్మల్ని ఏమనిచెప్పి ఒప్పించారు – ఎందుకు వచ్చారు .
ముందుగా ఇక్కడకువచ్చి మా ఉద్దేశ్యం అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు మీడియాకు …… మా స్టూడెంట్స్ అందరి తరుపున ధన్యవాదాలు .
మీడియా : థాంక్యూ థాంక్యూ …… కాలేజ్ హీరో అనడంలో తప్పే లేదు మహేష్ .
నో నో నో మీడియా బ్రదర్స్ – సిస్టర్స్ …… మన సిటీ కమిషనర్ విశ్వ సర్ ఇచ్చిన ధైర్యంతో ఇష్టపడి వచ్చిన నా స్నేహితులు – తమ్ముళ్లు – చెల్లెళ్లు – నా ప్రాణమైన చెల్లెళ్లు అంటూ చెల్లెళ్ళ చేతులను అందుకుని ముద్దులుపెట్టి , అందరూ అందరూ బుజ్జి హీరోలే …… టీచర్స్ కూడా అంటూ ధైర్యం ఎలా వచ్చిందో ఏమో దేవతవైపు కన్నుకొట్టాను .
అంతే దేవత కళ్ళు …… భద్రకాళీ అవతారంలా మారిపోవడం చూసి , చెల్లెళ్ళూ …… అంటూ భయంతో దాచుకున్నాను .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అన్నయ్యా అంటూ వైష్ణవి – హాసిని నా చేతులను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
వర్షిని : ఒసేయ్ అంటూ హాసిని భుజంపై కొరికేసింది .
హాసిని : స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుంటూనే , లవ్ యు లవ్ యు బుజ్జి మేడం గారూ …… మీరే చుట్టేసి ముద్దులుపెట్టండి అంటూ మళ్లీ నా బుగ్గపై ముద్దుపెట్టి , వర్షిణిని నా ప్రక్కన చేర్చి వెళ్లి దేవత ప్రక్కన చేరి నవ్వుకుంటోంది .
లేడీ విలేఖరులు : సో స్వీట్ ఆఫ్ యు …… , ఇక్కడ ఏమిజరిగిందో మాకు అర్థమైపోయింది అంటూ సంతోషించారు . మహేష్ …… చెప్పు స్టూడెంట్స్ అందరూ ఎందుకు వచ్చారు ? .
కొన్నిరోజులుగా సిటీని మనమంతా చూస్తూనే ఉన్నాముకదా – అంతదాకా ఎందుకు 9 గంటలకే తెరుచుకుని పిల్లలు – పేరెంట్స్ తో కిటకిటలాడాల్సిన జూ ఇంతవరకూ తెరుచుకోనేలేదు – ఈ జూ నమ్ముకుని ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నారో వారందరూ నాలుగు రోజులుగా రోజుకు ఒక పూటే తిని సర్దుకుంటున్నారు – వారందరికీ మునుపటిలా పని కల్పింసీబీ ఆకలితీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో మన సిటీని టెర్రరిస్ట్ అటాక్స్ నుండి ప్రాణాలకు తెగించి సేవ్ చేసిన కమిషనర్ సర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్లు 24/7 నిద్రాహారాలు మాని సిటీని కంటికి రెప్పలా ఎలా కాపు కాస్తున్నారో మా పిల్లలకంటే మీమీడియాకే బాగా తెలుసు – ఈ జూ ఒక్కటే కాదు సిటీలో ఇలాంటి govt – ప్రైవేట్ కార్యాలయాలను నమ్ముకుని జీవించే పేద కుటుంబాలు వందల – వేలు – లక్షల్లో ఉన్నాయి , వారందరికీ పనులు లభించి కష్టపడి పనిచేసి కూలీలతో ఇంటికివెళ్లి తమ కుటుంబాలను పోషించుకోవాలి – వాళ్ళపిల్లలు ….. మాలా కాలేజ్స్ లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో కమిషనర్ గారు ఈ బృహత్కార్యాన్ని చెప్పట్టినట్లు చెప్పగానే , స్టూడెంట్స్ అందరూ వెంటనే ok చెప్పేసాము అంటే జూ – జూ అనిమల్స్ కూడా ఒక కారణం అనుకోండి ……..
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు – కమిషనర్ గారు సెక్యూరిటీ ఆఫీసర్లు చప్పట్లతో ఆనందిస్తున్నారు .
సూపర్ అన్నయ్యా అంటూ చెల్లెళ్లు ముద్దులుపెట్టారు .
నవ్వుకుని , సిటీలో ఉన్న అందరికీ ఒకటి విన్నవించుకోవాలనుకుంటున్నాను ఇది మన సిటీ మనం పుట్టి పెరిగిన సిటీ , మనమే భయపడి బయటకు రాకపోతే వైజాగ్ అద్భుతమైన అందాలను వీక్షించడానికి మన ఇతర జిల్లా ప్రజలు – ఇతర రాష్ట్రాల ప్రజలు మరియు ఫారినర్స్ ఎలా వస్తారు చెప్పండి , టూరిజం నమ్ముకునికూడా వేల కుటుంబాలు జీవిస్తూనే ఉంటాయి – వాళ్ళు రెండుపూటలా తినడం తినకపోవడం మనచేతుల్లోనే ఉంది – మన సిటీ కమిషనర్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎలాగైతే ప్రాణాలకు తెగించి ఏ ఒక్క ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎలా అయితే మోస్ట్ డేంజరస్ టెర్రరిస్టుల నుండి మనల్ని రక్షించారో ఇకనుండి కూడా అలానే రక్షిస్తారని నమ్మి పిల్లలమైన మేము మా టీచర్స్ దైర్యంగా బయటకువచ్చాము – ఇక సెక్యూరిటీ ఆఫీసర్లపై నమ్మకం ఉంచి తోటి పేద ప్రజల ఆకలి తీర్చడానికి దైర్యంగా బయటకు రావడం లేదా బిక్కుబిక్కుమంటూ ఇళ్ళల్లోనే ఉండిపోతాము అనడం మీ ఇష్టం – కమిషనర్ సర్ , సెక్యూరిటీ అధికారి థాంక్యూ థాంక్యూ అంటూ సెల్యూట్ చేసాను .
అంతే చెల్లెళ్లు – స్టూడెంట్స్ – టీచర్స్ – జూ స్టాఫ్ …… అందరూ అందరూ చప్పట్లు – విజిల్స్ – కేకలువేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు సెల్యూట్ చేశారు .
సెక్యూరిటీ ఆఫీసర్లంతా …… ప్రౌడ్ గా ఫీల్ అవుతూ మా స్టూడెంట్స్ కు సెల్యూట్ చేశారు .
మీడియా : మహేష్ ……. నువ్వు కాలేజ్ హీరోనే కాదు సిటీకే హీరో – ఎంత అద్భుతంగా మాట్లాడావు , మిమ్మల్ని చూసైనా సిటీ ప్రజలంతా దైర్యంగా బయటకువస్తారని ఆసిద్దాము – మహేష్ మహేష్ …….
మీడియా బ్రదర్స్ & సిస్టర్స్ …… మా స్టూడెంట్స్ అంతా జూ దగ్గరకువచ్చి నిమిషాలు గడిచిపోయాయి – జూ దగ్గరికివచ్చి ఇంతసేపు కంట్రోల్ చేసుకోవడమే గ్రేట్ – మరొక్క ప్రశ్న ఆడిగారంటే ఇక అంతే మనల్ని తోసుకుంటూ డోర్స్ బద్దలు కొట్టుకుని వెళ్లిపోయేలా ఉన్నారు ఒకసారి మా ఫేసస్ చూసి మాట్లాడండి .
అమ్మో నిజమే అంటూ మైక్స్ అందుకుని ప్రక్కకువెళ్లబోయారు .
చెల్లెళ్లు : ఒక్కనిమిషం ఒక్క నిమిషం అంటూ మైక్స్ పట్టుకుని అక్కయ్యా – బామ్మలూ – మమ్మీ – అంటీ …… అన్నయ్య స్పీచ్ చూశారుకదా చూసే ఉంటారులే , ఎంజాయ్ ఎంజాయ్ ఉమ్మా ఉమ్మా ……..
వన్ మినిట్ బామ్మలూ – మేడమ్స్ – అంటీ – అంకుల్ ……. మొదటగా మీరే బయటకువచ్చి అందరికీ స్ఫూర్తినివ్వండి , క్యాబ్ లో జూ దగ్గరకు వచ్చెయ్యండి , అంటీ …… మురళి ఇక్కడే ఉన్నాడు మీరూ వచ్చెయ్యండి – మిమ్మల్ని చూసి నాలుగురోజులుగా ఇళ్ళల్లోనే ఉన్న మన ఏరియా వాళ్లంతా బయటకువస్తారు – మీరంటే గౌరవం అందరికీ …… , ఫ్రెండ్స్ – బ్రదర్స్ – సిస్టర్స్ …… sorry sorry మరొక నిమిషం వేస్ట్ చేసినందుకు ……..
నో నో నో మహేష్ మహేష్ అన్నయ్య అన్నయ్య …… అంటూ దద్దరిల్లిపోయింది .
జూ చీఫ్ ఆఫీసర్ : కమిషనర్ – మహేష్ – స్టూడెంట్స్ – టీచర్స్ – మీడియా …… వైజాగ్ జూ తరుపున హృదయపూర్వక స్వాగతం , మీ వలన మళ్లీ జూ కళకళలాడబోతోందన్న నమ్మకం కలుగుతోంది – స్టాఫ్ …… పిల్లలందరికీ కొద్దికొద్దిసేపట్లో ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ – స్నాక్స్ …… అందిస్తూనే ఉండాలి , త్వరగా త్వరగా గేట్స్ ఓపెన్ చెయ్యండి – వన్ మోర్ వన్ మోర్ మినిట్ , స్టూడెంట్స్ …… మీడియా కవర్ చేస్తోంది కాబట్టి రూల్స్ ప్రకారం సెక్యూరిటీ చెక్ చేసి పంపిస్తాము so that ప్రజలందరికీ నమ్మకం కుదురుతుందేమో …….
Yes yes yes అంటూ క్షణాలలో 15 – 20 rows గా క్రమశిక్షణతో నిలబడ్డాము .
వెరీ వేర్ గుడ్ స్టూడెంట్స్ – స్టాఫ్ ….. తొందరగా కానివ్వండి . చక చకా సెక్యూరిటీ వే మెషీన్స్ ఆన్ చేసి rows ముందుకు వచ్చారు .
సూపర్ సూపర్ బుజ్జిహీరో అంటూ విశ్వ సర్ వచ్చి సంతోషంతో అమాంతం పైకెత్తారు – ప్రౌడ్ ఆఫ్ యు బుజ్జిహీరో – ఒక్క స్పీచ్ తో అందరిలో చలనం కలిగించావు .
చెల్లెళ్లు : లవ్ యు డాడీ – అంకుల్ …… , డాడీ – అంకుల్ …… అన్నయ్యను కిందకుదించండి కిందకుదించండి ఫస్ట్ మేము అంటూ చుట్టేసి ముద్దులుపెట్టారు .
విశ్వ సర్ : నవ్వుకుని , మీ బామ్మలు ఇక్కడకు రావడానికి వెహికల్ పంపించాను , మన బుజ్జిహీరో ఉండగా నేను ఉండాల్సిన అవసరం లేదు సిటీ మొత్తం తిరుగుతూ అలర్ట్ చెయ్యాలి అంటూ వెళ్లిపోయారు .
ఆనందించి , దేవతవైపు ఆశతో చూస్తున్నాను – నన్నుచూసి చిరునవ్వులు చిందిస్తూ చెల్లెళ్లు కూడా చూస్తున్నారు .
దేవత : ఎందుకు చూస్తున్నారో నాకు తెలుసులే ……. , గుడ్ గుడ్ బుజ్జిహీరో ……
చెల్లెళ్లు : గుడ్ మాత్రమే సరిపోదు ముద్దుకూడా పెట్టాలి .
ఆశ్చర్యంగా సరే అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు దేవత ……
ఆఅహ్హ్ …… అంటూ పడిపోబోతే చెల్లెళ్లు పట్టుకుని నవ్వుతూ చప్పట్లుకొడుతున్నారు .
దేవత : ఎందుకు బుజ్జిచెల్లెళ్ళూ …… మీ అన్నయ్య మినీ బస్సులోలా ఫీల్ అవుతున్నాడు – మీరేమో సంతోషంతో గెంతులువేస్తున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యకు ముద్దుపెట్టారుకదా అందుకే ఈ సంతోషం …….
దేవత : ముద్దా …… ? , నేనెప్పుడు పెట్టాను నో నో నో …… , పెడితే బుజ్జిదేవుడికి పెడతాను కానీ ఈ అల్లరి బుజ్జిహీరోకు ఎందుకు పెడతాను .
