చెల్లెళ్లు : అలాగే బామ్మా ……
అక్కయ్య : అక్కయ్యా ……. అంటూ గుండెలపైకి తీసుకున్నారు .
బామ్మ : బుజ్జితల్లీ – చిట్టి తల్లీ ……. ఆ సంతకాలేవో చేసేస్తే బీచ్ కు వెళ్లొచ్చు , కదా తల్లులూ ……..
చెల్లెళ్లు : యాహూ …….
దేవత పెన్ అందుకుని మొత్తం పత్రాలలో సంతకాలు చేసి అక్కయ్యకు అందించారు .
అక్కయ్య ఏమాత్రం ఆలోచించకుండా దేవత సంతకాల కింద సంతకాలు చేసి విశ్వ సర్ కు అందించారు .
విశ్వ సర్ : పర్ఫెక్ట్ , ఇక హ్యాపీగా మినీ టూర్ ఎంజాయ్ చెయ్యండి , బుజ్జిహీరో …… నీ తొలి అడుగు వలన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది – సిటీ నలుమూలల నుండి ప్రజలు బయటకువస్తున్నారని కాల్స్ వస్తూనే ఉన్నాయి .
దేవత : అంతలా పొగడాల్సిన అవసరం లేదు కమిషనర్ సర్ ……
చెల్లెళ్లు : డాడీ – అంకుల్ …… బుజ్జిదేవుడిని కంటే ఎక్కువగా ఎవరినైనా పొగిడితే దేవతకు కోపం వచ్చేస్తుంది , మీకు కాబట్టి మాటలతో చెప్పారు మమ్మల్ని అయితే రెండుసార్లు కొట్టారు తెలుసా ……. , దేవతకు …… బుజ్జిదేవుడు అంటే అంత ప్రాణం , ఈసారి పొగిడేటప్పుడు ఆలోచించి పొగడండి ……
విశ్వ సర్ : అంత ప్రాణం అయితే కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అనడంతో అందరూ నవ్వుకున్నారు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… పదండి పదండి అంటూ బయటకు నడిచారు .
బుజ్జిహీరో ……. కాలేజ్ నుండి మన ఇంటికి చేరేలోపు బిల్డింగ్ కీస్ నీ చేతిలో ఉంటాయి అంటూ గుసగుసలాడారు విశ్వ సర్ ……
థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ అంటూ మిక్కిలి ఆనందంతో వెనుకే వెళ్ళాను . మినీ బస్సులో కాలేజ్ చేరుకుని బస్సులోకి ఎక్కి మా ప్లేస్ లో కూర్చున్నాము .
మళ్లీ అదే కథే అక్కయ్య – చెల్లెళ్లు …… నన్ను , దేవత మీదకు తోస్తూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవతను హత్తుకున్న ప్రతీసారీ దేవత చూసే చూపుకు భయంతో అక్కయ్యవైపు చూస్తున్నాను .
అక్కయ్య : ఎంజాయ్ తమ్ముడూ అంటూ ప్రేమతో ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
దగ్గరే కావడం వలన నిమిషాలలో బీచ్ చేరుకున్నాము . స్టూడెంట్స్ అందరూ బీచ్ బీచ్ వాటర్ వాటర్ అంటూ సంతోషంతో కేకలువేస్తూ బస్సు దిగుతున్నారు .
స్టూడెంట్స్ స్టూడెంట్స్ ……. ఫస్ట్ కైలాసగిరి ఆ తరువాత మీ ఇష్టమైనంతసేపు బీచ్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు అని టీచర్స్ చెప్పడంతో నిరాశతోనే ok అన్నారు .
టీచర్స్ : స్టూడెంట్స్ …… పైకి ఎలా వెళ్లబోతున్నామో తెలుసా రోప్ వే ద్వారా ……
స్టూడెంట్స్ అందరమూ సంతోషంతో కేకలువేస్తున్నారు . స్టూడెంట్స్ కంటే ఎక్కువగా అక్కయ్య ఆనందిస్తున్నట్లు చెల్లీ – నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్యను హత్తుకున్నారు సైడ్ నుండి …….
టీచర్స్ప్ : రోప్ వే ద్వారా అనగానే ఉత్సాహం వచ్చేసిందన్నమాట కమాన్ కమాన్ ఇంతమందిమి రోప్స్ ద్వారా వెళ్లాలంటే సమయం పడుతుంది ఏమాత్రం సమయం వృధా చేయకూడదు అంటూ పిలుచుకునివెళ్లారు .
మేడమ్స్ – పిల్లలూ …… అంటూ అక్కడున్న స్టాఫ్ అంతా సెల్యూట్ చెయ్యడం చూసి ఆశ్చర్యం వేసింది మా అందరికీ …….
రోప్ వే మేనేజర్ వచ్చి , టీచర్స్ టీచర్స్ ……. నాలుగురోజులనుండీ ఈరోజు ఉదయం వరకూ ఈగలు తోలుకుంటూ కూర్చున్నాము – ఎప్పుడైతే మీరు జూకు వెళ్లి న్యూస్లో మాట్లాడారో ఆ సమయం నుండి రద్దీ పెరుగుతూనే ఉంది . సర్స్ సర్స్ ……. ప్లీజ్ ప్లీజ్ మీ అమౌంట్స్ బ్యాక్ ఇచ్చేస్తాము మీరంతా స్టెప్స్ ద్వారా వెళితే పిల్లలు రోప్ వే ద్వారా ….. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ జనాలను కోరారు .
Ok ok ఈ పిల్లలవల్లనే కదా మేము దైర్యంగా బయటకువచ్చినది ముఖ్యన్గా ఒక పిల్లాడు పేరు పేరు ఆ ఆ మహేష్ మహేష్ …… మహేష్ కు మా అందరి తరుపున మరియు వైజాగ్ తరుపున థాంక్స్ చెప్పండి .
వైస్ హెడ్ మాస్టర్ : మీరే స్వయంగా చెప్పండి , మహేష్ మహేష్ ……. అంటూ పిలిచారు .
నో నో నో …….
Yes yes yes అంటూ అక్కయ్య అనడంతో చెల్లెళ్లు లాక్కునివెళ్లారు .
అదిగో అక్కడ ఉన్నాడు అంటూ జనాలంతా చుట్టూ చేరి థాంక్స్ చెప్పారు .
చెల్లెళ్ళ – అక్కయ్య – బామ్మలు – మిస్సెస్ కమిషనర్ ఆనందాలకు అవధులులేవు .
పిల్లలూ …… మీరే రోప్ వే ద్వారా వెళ్ళండి మేమంతా స్టెప్స్ ద్వారా పైకి వెళతాము – మహేష్ …… ఎనీవే నీ స్పీచ్ సూపర్ , మాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా చేసావు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
మొదట బుజ్జాయిలను …. టీచర్స్ రోప్ వే ద్వారా తీసుకెళుతున్నారు .
సూపర్ అన్నయ్యా లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లు ముద్దులుకురిపిస్తూ అక్కయ్య – దేవత దగ్గరికి తీసుకెళ్లారు . దేవతను చూసి దేవతా …… అన్నయ్యను పొగిడినందుకు మండుతున్నట్లుగా ఉందే …….
బామ్మ : అవునవును తల్లులూ …….
దేవత : అలాంటిదేమీ లేదులే …… , మీ అన్నయ్యను వైజాగ్ ప్రజలు మాత్రమే కానీ మన బుజ్జిదేవుడిని దేశమంతా …….
చెల్లెళ్లు : మరెందుకు అన్నయ్యను కొరుక్కుతినేలా చూస్తున్నారు .
దేవత : నేనెప్పుడు చూసాను లేదు లేదు ……
అక్కయ్య : అక్కయ్యా …… చెల్లెళ్లు చెప్పినది నిజమే , బుజ్జిదేవుడిపై ప్రేమవలన అలా అంటూ ముద్దుపెట్టారు .
దేవత : లవ్ యు చెల్లీ …… , అదేంటో …….
అక్కయ్య : తెలుసు తెలుసు అక్కయ్యా – బుజ్జిదేవుడు అంటే ఎంత ప్రాణమో ….. మీకు తెలియకుండానే అలా ప్రవర్తించేస్తున్నారు .
దేవత : నవ్వుకుని , బుజ్జిదేవుడిని కలిసేంతవరకూ ఇలానే ప్రవర్తిస్తానేమో …… ఇప్పుడెలా ……
అక్కయ్య : అలానే ప్రవర్తించండి చూడటానికి ముచ్చటగా ఉంది ఏమంటారు చెల్లెళ్ళూ …… ? .
చెలెళ్లు : అన్నయ్యపై ఇంత ప్రేమ అంటే సంతోషమే కదా ……
దేవత : లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ – లవ్ యు సో మచ్ చెల్లీ …… , అన్నయ్య అంటే బుజ్జిదేవుడే కదా …..
చెల్లెళ్లు : అన్నయ్యా ఆ అన్నయ్యా బుజ్జిదేవుడు బుజ్జిహీరో …… అంటూ తికమకపెట్టి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అలా సంతోషంతో ఆటపట్టిస్తూ చిరునవ్వులు చిందిస్తూ సమయమే తెలియలేదు అర గంట తరువాత చివరి రోప్ వే ట్రిప్ కోసం టీచర్స్ – మమ్మల్ని పిలిచారు .
చెల్లెళ్లు యాహూ యాహూ అక్కయ్యా ….. ఆశపడ్డారుకదా రండి అంటూ మా అందరినీ లాక్కునివెళ్లారు .
దేవత : నేను చెల్లెళ్లు మాత్రమే ఒకదానిలో – బుజ్జిహీరో …… తమరు మీ బామ్మలతోపాటు రండి .
దేవత ఆజ్ఞ , చెల్లెళ్ళూ – అక్కయ్యా – దేవతా జాగ్రత్త …….
దేవతా – అక్కయ్యా …….
దేవత : అంతేలే మీకు నాకంటే బుజ్జిహీరో అంటేనే ఇష్టం ……
లేదు లేదు మేడం – అక్కయ్యకు మీరంటేనే ప్రాణం , అక్కయ్యా – చెల్లెళ్ళూ ….. వెనుకే వస్తాముకదా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చూస్తూనే బామ్మలతోపాటు ఒక బాక్స్ లో ఎక్కాను .
దేవత : యాహూ ……. ఓన్లీ నా ప్రియమైన చెల్లీ – బుజ్జిచెల్లెళ్లతో అంటూ చేతులలో పెనవేసి ముద్దులుకురిపిస్తున్నారు .
బామ్మ : మా బుజ్జిదేవుడిని వేర్చేస్తుందా ….. ? , ఉండు ఇంటికివెళ్లాక నీ దేవత సంగతి చూస్తాము .
నో నో నో బామ్మా …… , నాపై ఇంత కోపం అంటే బుజ్జిదేవుడు అంటే అంత ప్రాణం , ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను అంటూ పైకివెళుతూనే లేచి చెల్లెళ్ళ క్యారేజీ వైపు చూస్తున్నాను .
లవ్ యు సో మచ్ బుజ్జిహీరో …… , నువ్వేమి చెప్పినా నీ దేవతకు దెబ్బలుమాత్రం తప్పవు , చూడు నీఅక్కయ్య – చెల్లెళ్లు అందులో ఉన్నారన్నమాటే కానీ నీ దేవతను చుట్టేసి నీవైపే ప్రాణంలా చూస్తున్నారు అంటూ నా చేతిపై ముద్దులుపెడుతోంది బామ్మ ……
ఆనందిస్తూ Hi hi అక్కయ్యా – చెల్లెళ్ళూ …… అంటూ చేతులు ఊపుతూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నాను .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరోనే బుజ్జిదేవుడు అని తెలిసాక ఎంత ప్రేమను చూయిస్తుందో ఊహించుకుంటేనే తెగ ఆనందం వేస్తోంది wow బ్యూటిఫుల్ నా కళ్ళ ముందు కనిపిస్తోంది .
అవునా మేడం yes yes yes …….
పైకిచేరగానే చెల్లెళ్లు పరుగునవచ్చి హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు – అన్నయ్యా ….. అక్కయ్యకు మాకంటే ఎక్కువగా ముద్దులుపెట్టాలని ఉంది కానీ …..
పర్లేదు చెల్లెళ్ళూ ……. దేవత హ్యాపీ అయితే అంతే చాలు – ఇంటికి వెళ్ళాక మిస్ అయిన ముద్దులన్నీ ఇస్తారులే అక్కయ్య అంటూ సంతోషంతో అందరమూ కైలాసగిరి అందాలను – అక్కడ నుండి బీటిఫుల్ సిటీ మరియు సముద్రాన్ని ఎంజాయ్ చేసి స్టెప్స్ ద్వారా బీచ్ చేరుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నీళ్ళల్లోకి చేరి గెంతులేస్తున్నాము .
మాకు తోడుగా వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లు …… మోకాళ్ళవరకూ లోతువరకూ వెళ్లి సముద్రంలో వరుసగా నిలబడి పిల్లలను సేఫ్ గా చూసుకుంటున్నారు .
అక్కయ్య : అక్కయ్యా – చెల్లెళ్ళూ – తమ్ముడూ …… ఫస్ట్ టైం బీచ్ కు వచ్చాను బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటూ మా అందరిపైకి నీళ్లు చల్లారు .
అక్కయ్యా – అక్కయ్యా – చెల్లీ …… అంటూ దేవత – చెల్లెళ్లు …… సంతోషంతో అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి నీళ్లు చల్లడం చూసి ఆనందం వేసి వెంటనే మొబైల్ తీసి రికార్డ్ చేస్తున్నాను .
అక్కయ్య : తమ్ముడూ వీడియో సంగతి పెద్దమ్మ చూసుకుంటారులే కానీ నువ్వు రా అంటూ మధ్యలోకి లాక్కునివెళ్లి రెండు వైపుల నుండీ తడిపేస్తున్నారు .
నేను ఊరుకుంటానా అక్కయ్యా – చెల్లెళ్ళూ – మేడం అంటూ నీళ్లు చల్లుతూ పరిగెడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము . చెల్లెళ్ళూ …… బామ్మలు – మేడమ్స్ ఎక్కడ ? .
చెల్లెళ్లు : అదిగో అక్కడ ఇసుకలో కూర్చుని మనల్నే చూస్తూ ఆనందిస్తున్నారు .
నాట్ గుడ్ నాట్ గుడ్ చెల్లెళ్ళూ ……..
చెల్లెళ్లు : అవును నాట్ గుడ్ అన్నయ్యా …… అంటూ నా చేతిని అందుకున్నారు .
వెళ్లి కూర్చున్న బామ్మలు – మేడమ్స్ ను నో నో నో అంటున్నా లాక్కుని దేవత – అక్కయ్యల దగ్గరికి తీసుకెళ్లాము . మరొక్కమాట మాట్లాడేంతలో నీళ్లతో తడిపేసి నవ్వుకున్నాము .
ఉండండి అంటూ చిరునవ్వులు చిందిస్తూ మాతో పోటీపడుతూ నీళ్లు చల్లుతూ ఆనందిస్తున్నారు .
అలా కాలేజ్ వదిలే సమయం వరకూ ఫుల్ గా ఎంజాయ్ చేసి సగం తడిచిపోయిన బట్టలతోనే చలికి వణుకుతూ బస్సుల్లోకి చేరాము .
అక్కయ్య అయితే ఫస్ట్ టైం కావడం వలన ఫుల్ గా తడిచిపోయినట్లు ఎక్కువగా వణుకుతూ నన్ను ఒకచేతితో – ఒడిలో కూర్చోబెట్టుకున్న హాసినిని ఒకచేతితో గట్టిగా హత్తుకున్నారు .
