అంతే ఆఫీస్ మధ్యలోకి అడుగుపడగానే మా ముగ్గురిపై పూలవర్షం కురిసింది – birthday మ్యూజిక్ ఆ వెంటనే చుట్టూ మరియు పైన కూడా చుట్టూ అందరూ హ్యాపీ birthday పిల్లలూ హ్యాపీ birthday పిల్లలూ ………… అంటూ సంతోషంతో విష్ చేస్తూ మా చుట్టూ దగ్గరికివచ్చారు . పోటీపడుతూ బుజ్జాయిల బుజ్జిచేతులను సున్నితంగా అందుకుని విష్ చేస్తున్నారు .
అన్నయ్యా అన్నయ్యా ………. ఇంతమంది అని సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .
సర్ వాళ్ళు వచ్చి మా లక్కీ బుజ్జి స్టార్స్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని బుజ్జి చేతులపై ముద్దులుపెట్టిమరీ విష్ చేసి , ఈ డెకరేషన్ మొత్తం మీకోసమే ……….. , మీ పుట్టినరోజు జరుపుకోవడాన్ని ఈ కంపెనీ అదృష్టంగా భావిస్తోంది అని చిటికె వేశారు అంతే క్షణాల్లో స్టెప్ బై స్టెప్ కేక్ మా ముందుకు తీసుకొచ్చారు .
బుజ్జాయిలు : అన్నయ్యా ……….. ఎంతపెద్ద కేక్ అని సంతోషంతో నన్ను గట్టిగా హత్తుకున్నారు .
సర్ వాళ్లకు మీరంటే అంత ఇష్టం బుజ్జాయిలూ ……….. , మీ birthday అనిచెప్పగానే నాకంటే ఎక్కువ సంతోషించారు – రాత్రి అంత అద్భుతమైన డెకరేషన్ చేయించింది కూడా సర్ వాళ్లే …………
సర్ : పిల్లలూ ……… చేయించింది మేమైనా , ఎలా ఉండాలంటే అని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ వివరించింది మీ అన్నయ్యే ………..
బుజ్జాయిలు : ఉమ్మా ఉమ్మా ……….
సర్ : పిల్లలూ ………. ఈ సంతోషమైనరోజు మీరు జాలీగా ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ వేసుకుని ఉంటారు – మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము – మీ అన్నయ్యకు ఈరోజు కూడా లీవ్ ఇచ్చేసాము మీ ఇష్టప్రకారం ఎంజాయ్ చెయ్యండి . కేక్ కట్ చేసిన తరువాత ……….. అని నవ్వుకున్నారు .
కీర్తి : థాంక్యూ soooooo మచ్ సర్ ……….. యాహూ ……… అని కేకలువేసి , అన్నయ్యా ……….. ఈరోజంతా పెద్దమ్మ కోరికలు తీర్చడమే మన డ్యూటీ అని చెవిలో గుసగుసలాడి , సర్ పిలవడంతో కేక్ ముందుకువెళ్లాము . కేక్ పై రాసినది చదివి మురిసిపోయి వెంటనే సర్ సర్ ……….. అన్నయ్య birthday కూడా ఈరోజే ……..
సర్ : తెలుసు పిల్లలూ ……….. మీ అన్నయ్యకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని అంటూ చిటికె వెయ్యడంతో మరొక కేక్ తీసుకొచ్చారు . అందులో ముగ్గురికీ విషెస్ ఉండటం చూసి బుజ్జాయిల ఆనందానికి అవధులు లేవు .
సర్ మొదలుకుని స్టాఫ్ అంతా birthday విషెస్ తెలిపారు .
ఆశ్చర్యపోతూనే థాంక్స్ థాంక్స్ ………. చెప్పాను .
సర్ : నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా మహేష్ , ఉదయం unknown నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది , అంతే వెంటనే మరొక కేక్ తెప్పించాము .
బుజ్జాయిలు : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ ……….
సర్ : ఆనందించి మీకోసం ఏమైనా చేస్తాము పిల్లలూ ………. అంత సంతృప్తి మాకు అని కట్ చెయ్యమన్నారు .
బుజ్జాయిలు : అన్నయ్యా ………. అంటూ కేక్ కట్ చేసాము – అందరూ నవ్వుతూ birtday సాంగ్ పాడటంతో నవ్వేసాము .
సర్ : పిల్లలూ ………… తెలుసులే మీ అన్నయ్య మీకు – మీకు మీ అన్నయ్యే ముందు తినిపించాలని కానివ్వండి . ఆ వెంటనే మేమూ తినిపిస్తాము అని సంబరంలా సెలెబ్రేషన్ ఎంజాయ్ చేశారు . సర్ దగ్గర నుండి వెంకట్ అన్నయ్య వరకూ ఇష్టంతో బుజ్జాయిలకు గిఫ్ట్స్ అందించారు . ఫోటోలు సెల్ఫీలతో సందడి సందడిలా జరిగింది .
సర్ : పిల్లలూ – మహేష్ ………. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు . ఈరోజంతా నీ ప్రాణమైన పిల్లలతో ఎంజాయ్ అని మళ్లీ చిటికె వెయ్యడంతో అకౌంటెంట్ మరొక లావుపాటి గిఫ్ట్ కార్డ్ అందించారు .
లోపల చూస్తే కట్ట ఉంది – సర్ ………. ప్రస్తుతానికి అవసరం లేదు – నిన్న డబ్బు ఖచ్చితంగా సర్ పంపించి ఉంటారని , సర్ నిన్న రాత్రే ట్రాన్స్ఫర్ చేశారుకదా అన్నాను.
సర్ : నిన్ననా నేనా అంటూ మొబైల్ చెక్ చేసి లేదే ………..
Ok సర్ అవసరమైతే తీసుకుంటాను అని అకౌంటెంట్ కు అందించి , వెళ్లిస్తాము సర్ అనిచెప్పాను . బుజ్జాయిలు సంతోషంతో టాటా చేశారు .
ముగ్గురమూ ఒకేసారి పెద్దమ్మకు కేక్ అని తియ్యదనంతో నవ్వుకుని మూడు పేపర్ ప్లేట్స్ లో మూడు పెద్ద పెద్ద ముక్కలను పట్టుకుని – నాదికూడా కీర్తి పట్టుకుని అందరికీ బై చెప్పి సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ……… అంటూ ముద్దులుపెడుతూనే బయటకువచ్చాము .
పెద్దమ్మ కారులోపలినుండే మమ్మల్ని చూసి కిందకుదిగి బుజ్జితల్లీ అప్పుడే సెలెబ్రేషన్ అయిపోయిందా అంటూ కీర్తిని గుండెలపైకి ఎత్తుకుని ముద్దుచేసి – ఎండ అంటూ చీర కొంగుని కీర్తి తలపై కప్పి వెంటనే కారులో కూర్చున్నారు . బిస్వాస్ కు కూడా ఎండ తగలకుండా ఎత్తుకునే కారులో కూర్చున్నాను .
కీర్తి : సెలెబ్రేషన్ అని మీకెలా తెలుసు పెద్దమ్మా ……….
పెద్దమ్మ : మా బుజ్జాయిల చిరునవ్వులు సంతోషం మరియు చేతులలో కేక్ చూస్తుంటేనే తెలియదూ …………
కీర్తి : అవునవును మా పెద్దమ్మకు మనసులో ఉన్నదే తెలిసిపోతుంది ఇక బయటకు బాగా తెలిసిపోతోంది తెలియకుండా ఉంటుందా ……….. , పెద్దమ్మా ……… పెద్ద పెద్ద కేక్ లు రెండూ మేమే కోసాము – happy birthday పెద్దమ్మా అని కీర్తితోపాటు బిస్వాస్ కూడా కేక్ తినిపించి మురిసిపోయింది .
పెద్దమ్మ : కూడా కేక్ తినిపించి happy birthday కీర్తి తల్లీ – బిస్వాస్ అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , మరి మరొకచేతిలో ఉన్న కేక్ ………..
కీర్తి : నా కుడిచేతిలో ఉన్నది నేను మీకోసం – అది బుజ్జి అన్నయ్య మీకోసం – ఇక నా మరొక చేతిలో ఉన్నది మా అన్నయ్య మీకోసం ప్రేమతో తీసుకొచ్చింది .
పెద్దమ్మ : మీరు తీసుకొచ్చిన కేక్ లు తినిపించారు – మరి మీ అన్నయ్య ………
కీర్తి : నా కేక్ నాకు అందించి అన్నయ్యా ………. తినిపించు అని స్వీట్ ఆర్డర్ వేశారు .
అలాగే అలాగే కీర్తి తల్లీ ……… కూల్ కూల్ , వణుకుతున్న వేళ్ళతో చిన్న ముక్కను అందుకొని హ్యాపీ బర్త్డే పెద్దమ్మా అని తినిపించాను .
పెద్దమ్మ : ఒక్క క్షణం అంటూ ప్లేటులో ఉన్న కేక్ అందుకుని హ్యాపీ బర్త్డే మహేష్ ఆ …….. అంటూ నోరుతెరిచారు .
ఆటోమేటిక్ గా నా నోరు తెరుచుకుంది .
పెద్దమ్మ నా వేళ్ళను మొత్తం నోట్లోకి తీసుకొని కేక్ తో పాటు వేళ్ళను కూడా జుర్రేస్తూ నా కళ్ళల్లోకే తియ్యదనంతో చూస్తున్నారు .
అంతే తియ్యని జలదరింపులతో మైమరచి నేనూ పెద్దమ్మ వేళ్ళను జుర్రేస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాము .
బుజ్జాయిలు నోటికి తాళం వెయ్యబోయి , ఇలాకాదు బయట ఏ సౌండ్ అన్నయ్యకూ – పెద్దమ్మకూ వినిపించి ఫీల్ మిస్ కాకూడదు అని కీర్తి పెద్దమ్మ చెవులనూ – బిస్వాస్ నా చెవులనూ మూసేసారు .
బుజ్జాయిల ప్రేమకు పరవశించి ఒకరినొకరము నవ్వుకుని లవ్ యు లవ్ యు అంటూ ముద్దులతో ముంచెత్తాము . పెద్దమ్మ జుర్రేసిన నా వేళ్ళను టేస్ట్ చెయ్యాలని యాక్టింగ్ చేస్తూ నోట్లోకి తీసుకొని ఎవరూ చూడలేదు కదా అని ఓర కంటితో చూస్తే , పెద్దమ్మ కూడా అలానే చేస్తుండటం చూసి తియ్యదనంతో సిగ్గుపడ్డాను .
బుజ్జాయిలూ – పెద్దమ్మా ………. కేక్ తిన్నారుకదా నీళ్లు తాగండి అని అందించి పోనిచ్చాను . పెద్దమ్మా ……….. మరొక చిన్నపని పూర్తయిన తరువాత ఫుల్ ఎంజాయ్ …………
పెద్దమ్మ : బ్యాంక్ కే కదా ………..
షాక్ తో పెద్దమ్మవైపు చూసి , ఎలా పెద్దమ్మా ……… మాకూ నేర్పించొచ్చు కదా ,
పెద్దమ్మ : నవ్వుకుని , మీ కోరికలన్నీ తీర్చడానికే కదా నేను ఉన్నది అని మనసులో అనుకుని , సరే హీరో ………….
పెద్దమ్మా ………. మీకు తెలిసిపోయి ఉంటుంది , నిన్న పాపం ఎవరికో ట్రాన్స్ఫర్ చెయ్యబోయి నాకు పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు . నా ఫ్రెండ్స్ వేసారేమో అనుకుని ఖర్చు చేసేసాను . వెళ్లి ఎవరిది వారికి ………….
అందుకే నువ్వంటే పిచ్చి హీరో అని నా బుగ్గపై ఉమ్మా ……… అంటూ ముద్దుపెట్టి లవ్ యు చెప్పారు .
ముద్దు సంతోషంలో కన్నార్పకుండా జిగేలుమంటున్న కళ్ళతో నోరుతెరిచి పోనిస్తున్నాను .
పెద్దమ్మతోపాటు కీర్తి తల్లి నవ్వుకుని అన్నయ్యా ……… ఈగలు దూరతాయి అని నోటిని మూసింది . అయినా నేను అలానే ఉండటం చూసి ష్ ష్ ……… అంటూ నన్నే చూస్తూ ఆనందించారు .
బ్యాంక్ చేరుకుని బుజ్జితల్లీ , పె ………. ఇక్కడే ఉండండి ఐదే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాము .
కీర్తి : నవ్వుకుని , అన్నయ్యా ………. నేను బుజ్జాయిని నాకు చెబితే ఎలా , పెద్దవాళ్లకు చెబితే మీ బుజ్జాయిని జాగ్రత్తగా చూసుకుంటారు .
సిగ్గుపడి , పెద్దమ్మా ఐదునిమిషాల్లో వచ్చేస్తాము అని తలదించుకునే చెప్పాను .
పెద్దమ్మ : సరే , ఐదంటే ఐదే నిమిషాలు ……….. ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఆగలేను – అదే అదే మన బుజ్జితల్లి ఆగలేదు .
అలాగే పెద్ద ……….. బుజ్జితల్లీ అని తియ్యదనంతో నవ్వుకుని బిస్వాస్ ను ఎత్తుకుని బ్యాంక్ లోపలికివెళ్ళాను .
ఆఫీసర్ ను చేరుకుని విషయం చెప్పాను .
ఆయన చెక్ చేసి అలాంటి మిస్టేక్ ఏదీ జరగలేదు సర్ ……….. మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేక మీరంటే ఇష్టమైనవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సర్ప్రైజ్ చెయ్యడానికి పంపించి ఉంటారు . ఏ నెంబర్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యింది .
చెప్పడంతో చెక్ చేసి , మా బ్యాంక్ కాదు . కొన్నిరోజులు ఆగండి ఎవరో తెలియవచ్చు – మిస్టేక్ గా పడినది అయితే కాదు అని కాన్ఫిడెంట్ గా చెప్పారు .
థాంక్స్ చెప్పేసి వచ్చేసాను . పెద్దమ్మకు విషయం చెప్పాను .
పెద్దమ్మ : హీరో ……… మరి ఆ డబ్బుని ఏమిచేస్తావు .
పెద్దమ్మా ……….. నాకు తెలిసింది కొంతమందే , వాళ్ళు మేము కాదు అన్నారు .
కీర్తి : అన్నయ్యా ……….. ఆ కొంతమందిలో పెద్దమ్మను కూడా ఉందికదా ఆడిగారా ?
లేదు బుజ్జితల్లీ ……….. పెద్ద ………..
పెద్దమ్మ : నవ్వుని ఆపుకుంటూ నేనా ? , హీరో కనీసం నాతో మొబైల్ అయినా ఉందా ట్రాన్స్ఫర్ చెయ్యడానికి – అయినా అంతడబ్బు నాతో ఎలా ……….. అనాధను క…….
పెద్దమ్మా ………. అంటూ నోటిని చేతితో మూసేసి , ఇంకెప్పుడూ అలా అనకండి మా పెద్దమ్మ మీరు , బుజ్జాయిలు – మేడం – మీరు – నేను – నా ఫ్రెండ్స్ ………. రాత్రే ఒక ఫ్యామిలీ అయిపోయాము . అనాధను అని నేను మరిచిపోయాను అని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనయ్యాను .
పెద్దమ్మ : sorr ……… వెంటనే చెంపలను రెండుచేతులతో కప్పుకుని కీర్తివైపు నవ్వి , లవ్ యు లవ్ యు లవ్ యు ……….. sooooo స్వీట్ ఇంకెప్పుడూ అలా అనను సరేనా , స్మైల్ స్మైల్ స్మైల్ ………….
నేను నవ్వడంతో …………..
బుజ్జాయిలూ – పెద్దమ్మా ………. అన్నయ్య నవ్వేసారూ అంటూ ముగ్గురూ సంతోషంతో హైఫై కొట్టుకుని , పెద్దమ్మ అయితే ఏకంగా నా చేతిని చుట్టేసి లవ్ యు లవ్ యు ………. అని చెబుతూనే ఉంది .
ఆఅహ్హ్హ్………. అంటూ పెదాలపై తియ్యదనం ……….
పెద్దమ్మ : కీర్తి వైపు కన్నుకొట్టి , మహేష్ ……… నేనూ కాదని తెలిసింది కదా నెక్స్ట్ ఏంటి …………..
మొబైల్ తీసి నిన్న వచ్చిన మొత్తం అమౌంట్ ను సెలెక్ట్ చేసి బుజ్జితల్లీ ……… సెండ్ నొక్కమని చెప్పాను .
కీర్తి : to అనాధ శరణాలయం అని చదివి , ఒక్కసారిగా పెద్దమ్మ నుండి నామీదకు జంప్ చేసి మా అన్నయ్య రియల్ హీరో అని నా బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , పెద్దమ్మ వేలిని అందుకుని సెండ్ పై ప్రెస్ చెయ్యడంతో సక్సెస్ అంటూ క్లింగ్ మంది .
పెద్దమ్మ : తల్లీ ………..
కీర్తి : దేవుళ్ళు పంపించిన డబ్బును దేవత ద్వారానే …………. ఇప్పుడు పుణ్యం మొత్తం మా ప్రాణమైన పెద్దమ్మ దేవతకే అని సంతోషంతో చప్పట్లు కొట్టడంతో , నేనూ సంతోషంతో చప్పట్లు కొట్టాను .
పెద్దమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కీర్తిని అందుకుని గట్టిగా చుట్టేసి ముద్దుపెట్టబోతుంటే ,
బుజ్జితల్లి ఆపి , నేనేమి చేశానని నాకు ముద్దు ఇస్తున్నారు పెద్దమ్మా ……… ఇవ్వాల్సింది ………
పెద్దమ్మ : అర్థమైంది బుజ్జితల్లీ అంటూ తల ఊపి , నా వైపు తిరిగి నా కళ్ళల్లోకి ఆరాధనతో చూస్తూ నా చేతిని చుట్టేసి , ఎంత పుణ్యం ఇచ్చావో తెలుసా …………. వందల్లో ఉన్న అనాధ పిల్లల ఒక్కొక్క చిరునవ్వుకూ ……….. పైనున్న దేవతలందరూ నన్ను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ హీరో ……….. మన బుజ్జితల్లి చెప్పినట్లు రియల్ హీరోవి అని ప్రేమతో బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , లవ్ యు లవ్ యు అంటూ భుజం పై వాలిపోయారు .
నేనైతే గాలిలో తేలిపోతున్నాను . పెద్దమ్మ స్పర్శకు తియ్యని జలదరింపులతో వణికిపోతున్నాను . ఉదయం నుండీ ఒకదానితరువాతమరొక మాధుర్యమైన అనుభూతులను ఆస్వాదిస్తూనే ఉన్నాను . ఇప్పుడు ఏకంగా సగం కౌగిలింత తియ్యని ముద్దు …………. బుజ్జాయిల మరియు దేవతల పుట్టినరోజైన ఈ అద్భుతమైన రోజున ఇంకెన్ని మాధుర్యాలు ఆస్వాదించబోతున్నానో అని ఊహల్లోకి వెళ్ళిపోయాను .
కీర్తి : నన్నుచూసి సంతోషంతో నవ్వుకుని , పెద్దమ్మకు బోలెడంత పుణ్యం – అన్నయ్యకు అన్నయ్యకు అన్నయ్యకు …………..
వెంటనే బుజ్జితల్లిని నా గుండెలపై హత్తుకుని , బుజ్జితల్లీ ………… మేము బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు ఏమిచేశారు అని డైవర్ట్ చేసాను .
కీర్తితల్లి నవ్వుకుని , అన్నయ్యా ………… పెద్దమ్మ మూవీనే అదే పేదరాసిపెద్దమ్మ మూవీని చూస్తున్నాము .
Wow ………… అంటూ బుజ్జాయిలను నేను – పెద్దమ్మ నా చేతిని చుట్టేయ్యడంతో , దేవత మరియు బుజ్జిదేవతల స్పర్శ ఇంతకంటే ఈ జీవితానికి ఏమికావాలి అని పెద్దమ్మ నుదుటిపై ముద్దుపెట్టబోయి ఆగి బుజ్జాయిలకు మాత్రమే ప్రాణమైన ముద్దులుపెట్టి పోనిచ్చాను .
పెద్దమ్మ తియ్యని కోపంతో నావైపు చూసి చూద్దాము ఇంకెంతసేపు ఇలా దూరం ఉంచుతావోనని నా భుజం సై ప్రేమతో కొరికేశారు .
స్స్స్ ………..
కీర్తి : అన్నయ్యా ………ఏమైంది .
పెద్దమ్మ నవ్వుతుంటే , ఏమీ లేదు తల్లీ భుజం పై చీమ కొరికినట్లు ………..
కీర్తి : అవునా అన్నయ్యా ………. చూస్తాను ఉండండి అంటూ షర్ట్ జరిపి పంటిగాట్లు చూసి , పెద్దమ్మవైపు చూసి నవ్వుకుని అన్నయ్యా ……….. పెద్ద చీమ ఉండండి మందురాస్తాను అని ముద్దుపెట్టబోయి , ఏ చీమ కుట్టిందో ఆ చీమగారితోనే మందు రాయిస్తాను అని పెద్దమ్మ బుగ్గపై ముద్దులుపెట్టింది .
పెద్దమ్మ : తియ్యని నవ్వుతో లవ్ యు తల్లీ అని నా చేతిని తన ఎదపై హత్తుకుని భుజంపై ప్చ్ ప్చ్ ప్చ్ ……… అంటూ ముద్దులు కురిపించింది .
ప్రతీ ముద్దుకూ తియ్యదనపు అనుభూతితో మైమరచి కారుని నెమ్మదిగా పోనిస్తున్నాను . గాట్లు మాయమైపోయేంతవరకూ ముద్దుల వర్షం కురిసింది .
కీర్తి : అన్నయ్యా ……… చీమ కుట్టిన ఆనవాళ్లే లేవు .
పెద్దమ్మ : ప్చ్ ……….
నేనుకూడా నిరాశతో ప్చ్ ………అన్నాను .
పెద్దమ్మ నవ్వుకుని కీర్తి తల్లీ సరిగ్గా చూడు ………..
కీర్తి : అవునవును పెద్దమ్మా ………. అటువైపు నాకు కనిపించలేదు – ఆపకుండా మందు రాస్తూనే ఉండండి .
నా పెదాలపై చిరునవ్వుతో హుషారుగా వేగం పెంచాను .
పెద్దమ్మ – కీర్తి తల్లి నవ్వుకుని పెదాలు పెదాలు కలిపి ప్చ్ …….. అంటూ ప్రేమతో ముద్దుపెట్టుకుని పరవశించిపోయారు .
అర గంటలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు కారుని ఆపాను .
కీర్తి : చూసి అన్నయ్యా ……… అమ్మవారిదగ్గరికే తీసుకొచ్చారా ? , లవ్ యు లవ్ యు లవ్ యు ఉదయం అమ్మ చెప్పింది మీ అన్నయ్యకు చెప్పి వైజాగ్ అమ్మవారి దర్శనం చేసుకోండి అని . అమ్మ అనుక్షణం ప్రార్థించేది అమ్మవారినే అని సంతోషంతో నన్ను గట్టిగా కౌగిలించుకుంది .
పెద్దమ్మ : అమ్మవారిదగ్గరకు వచ్చామా ………. , తల్లీ క్షమించు క్షమించు అని నా షర్ట్ సరిచేసి ముందుగానే చెప్పొచ్చుకదా అని నీళ్ల బాటిల్ అందుకుని ముందు నాపై బుజ్జాయిలపై తనపై నీటిని చిలకరించి కళ్ళుమూసుకుని ప్రార్థించి పెదాలపై చిరునవ్వుతో బుజ్జితల్లిని ఎత్తుకుని ఇప్పుడు పదండి అని కిందకుదిగాము .
గుడి పచ్చని తోరణాలతో పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉండటం చూసి సంతోషించాము .
బుజ్జాయిలు : అన్నయ్యా – పెద్దమ్మా ……… ఈరోజేమైనా పండగనా ?
పెద్దమ్మ : పండగే కదా తల్లీ ………. మా బుజ్జాయిల పుట్టినరోజు పండగ – కావ్యతల్లి పుట్టినరోజు పండగ – హీరో గారి పుట్టినరోజు పండగ ………….
బుజ్జాయిలు : మా ప్రాణమైన పెద్దమ్మ పుట్టినరోజు పండగ ……….
పెద్దమ్మ : అవునవును అని ముద్దుచేసి నవ్వుకుని , మనకోసమే అమ్మవారు స్వాగతం పలకడం కోసం ఇలా ……….. వెళదామా బుజ్జితల్లీ అని ప్రాణంలా హత్తుకుని లోపలికి నడిచారు . వెనుకే మురిసిపోతూ వెళ్ళాను .
