పెద్దమ్మ Part 4

బుజ్జాయిలు బయటకు చూసి పెద్దమ్మా ……….. వచ్చేసాము , అయినా పర్లేదు మీ ఇష్టమొచ్చినంతవరకూ మందు రాయండి అని ముద్దుపెట్టి చెప్పారు .
పెద్దమ్మ అందమైన సిగ్గుతో మాయమైంది బుజ్జితల్లీ అని మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా కీర్తిని చుట్టేసి మురిసిపోతున్నారు .
బుజ్జితల్లీ కారులోనే ఉండండి అనిచెప్పి బిస్వాస్ ను ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కువెళ్లి రెండు పెద్ద కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి , డోర్ తెరిచాను .
పెద్దమ్మ బుజ్జితల్లిని ఎత్తుకుని దిగారు .
కీర్తి : అన్నయ్యా ………. మీఇద్దరి మాత్రమేనా ? అని బుంగమూతిపెట్టుకుంది .
ఉమ్మా ……….. ఇది నీకు – ఇది బిస్వాస్ కు ……….
కీర్తి : మరి మీ …………. అర్థమైంది అర్థమైంది అని బుజ్జితల్లి పెద్దమ్మకు – బిస్వాస్ నాకు తినిపించి తిన్నారు .

పెద్దమ్మ : చల్లగా బాగుంది బుజ్జితల్లీ …….. లవ్ యు అంటూ గట్టిగా ముద్దుపెట్టారు .
కీర్తి : పెద్దమ్మా ……… తెచ్చింది నేను కాదు .
పెద్దమ్మ : సరే తల్లీ ……… అని తల ఊపారు .
అతిశుభ్రమైన అందమైన బీచ్ రోడ్ వెంబడి నడుచుకుంటూ వెళ్లి బీచ్ దగ్గరికి చేరుకున్నాము . సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నట్లు ఆకాశం ఎరుపువర్ణంలోకి మారుతుండటం – అది సముద్రపు అలలపై పది మరింత శోభాయమానంగా వెలిగిపోతుండటం చూసి బుజ్జితల్లీ ……….. చాలా చాలా సౌందర్యంగా ఉంది – ప్రకృతిలో చాలా వింతలు దాగి ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం అని అంతులేని ఆనందంతో బుజ్జితల్లిని ముద్దులతో ముంచెత్తుతున్నారు .
కీర్తి : పెద్దమ్మా ………. బీచ్ కు తీసుకిచ్చింది కూడా నేను కాదు .
పెద్దమ్మ : తెలుసు ఉమ్మా …….. అని కీర్తికి ముద్దుపెట్టి , నాకు అతి దగ్గరగా ఇద్దరమూ ఒక్కటయ్యేంత హత్తుకుని చేతితో నా చేతిని చుట్టేసి , ఇంత అందమైన ప్రకృతిని తిలకించేలా చేసినందుకు లవ్ యు హీరో అని నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి భుజం పై తలవాల్చి ఆస్వాధిస్తున్నారు .
పెద్దమ్మ వెచ్చని స్పర్శకు తియ్యదనంతో జలదరించి పెదాలపై చిరునవ్వుతో బుజ్జాయిలకు ముద్దులుపెట్టి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను .
పెద్దమ్మ చిరుకోపంతో ఏకంగా నా బుగ్గపై కొరికేసి నేను కెవ్వుమని అరవడంతో , మరి బుజ్జాయిలకు మాత్రమేనా అని నవ్వుకున్నారు .
కీర్తి తల్లి నవ్వుతూనే నా బుగ్గపై రుద్దుతూ పెద్దమ్మ మాటలు వినపడలేదు కదా అని అడిగింది .
లేదు తల్లీ ఏమి మాట్లాడారు అని అమాయకంగా అడిగాను .
కీర్తి : అయితే కొరకడంలో తప్పులేదు అని బుజ్జితల్లికూడా అక్కడే కొరికేసింది .
నిజంగా వినపడలేదు తల్లీ ………… , బుజ్జితల్లీ పెద్దమ్మా ………… కైలాసగిరి నుండి చూస్తే మరింత సౌందర్యంగా ఉంటుంది శరణాలయం లో ఉన్నప్పుడు చాలాసార్లు ఎక్కాము వెళదామా ………..
పెద్దమ్మ : కోరికలు తీర్చేవారు తమరు , ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వచ్చి ఎంజాయ్ చెయ్యడం మా వంతు . ఉదయం నుండీ జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను అందించావు – తమరి వెంటనే మేము అని సంతోషంతో బదులిచ్చారు .
లవ్ యు పెద్దమ్మా – బుజ్జాయిలూ ………. రోప్ వే ద్వారా పైకి వెళదాము మరింత థ్రిల్ గా ఉంటుంది నేనూ అలా వెళ్లడం ఫస్ట్ టైం అని చేరుకుని టికెట్స్ తీసుకుని లోపల కూర్చున్నాము . నెమ్మదిగా కదులుతుంటే అన్నయ్యా – పెద్దమ్మా ………. గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది అని చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నారు . ఒకవైపు కొండ మరొకవైపు సముద్రం అందాలను చూసి పెద్దమ్మ పులకించిపోయి లవ్ యు హీరో చాలా చాలా అందంగా ఉంది అని నా చేతిని చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు .

ముగ్గురి ఆనందాన్ని తిలకిస్తూ నేనూ ప్రకృతిని ఆస్వాధిస్తున్నాను . పైకి చేరుకున మొదట శివపార్వతుల దర్శనం చేసుకుని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ వ్యూ పాయింట్స్ చేరుకుని చీకటిలో వెలిగిపోతున్న వైజాగ్ మరియు నీలి ఆకాశంలో మెరుస్తున్న సముద్రపు అందాలను వేగంగా తాకుతున్న వెచ్చని గాలులను తనివితీరా ఆస్వాదిస్తూ అన్నయ్యా అన్నయ్యా – హీరో ……….. బ్యూటిఫుల్ ఎంత చూసినా తనివితీరడం లేదు .
మీ ఇష్టం బుజ్జాయిలూ – పెద్దమ్మా ………… మీకు తనివితీరాకనే వెళదాము అనిచెప్పి వాళ్ళ ఆనందాన్ని చూసి పరవశించిపోయాను .
పెద్దమ్మ : ఇక్కడే ఉండిపోతే మరి సముద్రపు అలలలో మన బుజ్జాయిలతో ఆడుకోవాలన్న కోరిక ఏమవ్వాలి అని కాసేపు తిలకించి పెద్దమ్మ కోరిక ప్రకారం మళ్ళీ బీచ్ చేరుకున్నాము .

లవ్ యు హీరో అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , బుజ్జాయిలను కిందకుదించి బుజ్జిచేతులను పట్టుకుని సంతోషంతో కేకలువేస్తూ నీళ్ళల్లోకివెళ్లిపోయి ఒకరికొకరు నీళ్లు చల్లుకుని , అన్నయ్యా అన్నయ్యా – మహేష్ …….. త్వరగా రా అని పిలవడంతో , పెదాలపై చిరునవ్వుతో నీళ్ళల్లోకి అడుగుపెట్టగానే ముగ్గురూ ఒకేసారి నీళ్లు చల్లారు . బుజ్జాయిలూ – పెద్దమ్మా ……… ఉండండి అంటూ చిరునవ్వులు చిందిస్తూ వాళ్లపై చల్లి పూర్తిగా బట్టలు తడిచిపోయేంతవరకూ తనివితీరా ఎంజాయ్ చేసి సంతోషంతో నవ్వుతూ ఒడ్డుకు చేరుకున్నాము .
మహేష్ – అన్నయ్యా ………. పూర్తిగా తడిచిపోయాము – చలికూడా వేస్తోంది అంటూ వణుకుతుంటే బుజ్జాయిలను ఎత్తుకుని చుట్టేసి వెచ్చని ముద్దులుపెట్టాను .
పెద్దమ్మ చూసి మొదట కోపంతో చూసి తరువాత బుంగమూతి పెట్టుకోవడం చూసి , అన్నయ్యా ………. పెద్దమ్మకు కూడా చలివేస్తున్నట్లుగా ఉంది – మీరు వెంటనే కౌగిలించుకోకపోతే శపించేలా ఉన్నారు ఎంతైనా దేవత కదా ………..
అమ్మో ………. వద్దు వద్దు బుజ్జితల్లీ ………. ఏమిచెయ్యాలో మీరే చెప్పండి .
కీర్తి : చలికి వణుకుతున్న దేవతను కౌగిలించుకోవడమే ………..
పెద్దమ్మకు ఇష్టమో కాదో …………
అంతే పెద్దమ్మ నా ఛాతీపైకి చేరి ముగ్గురినీ ఏకమయ్యేలా చుట్టేసి ఆఅహ్హ్హ్హ్…….. వెచ్చగా ఉంది అని పెదాలపై చిరునవ్వు చిగురించింది .
కీర్తి : అన్నయ్యా ………. వెచ్చని ముద్దుకూడా పెట్టండి .
నేను వణుకుతూ పెద్దమ్మ నుదుటిపై తాకీతాకనట్లుగా ముద్దుపెట్టాను .
పెద్దమ్మ : నిన్నూ ………. అంటూ పాదాలను పైకెత్తి నా బుగ్గను ప్రేమతో కొరికేసి మళ్లీ ఛాతీపై చేరిపోయారు .
కీర్తి : ముద్దు అంటే అలా పెట్టాలి – పో అన్నయ్యా ……… అని నా భుజాలపై కొట్టారు .
ఏమో బుజ్జాయిలూ ……….. ఈ ఫీలింగ్స్ అన్నీ మొదటిసారి ఆస్వాధిస్తున్నాను ఏమిచెయ్యాలో ఎలా ప్రవర్తించాలో నాకేమీ అర్థం కావడం లేదు .
పెద్దమ్మ : sooooooo స్వీట్ హీరో , కొరికాను కదా నొప్పివేస్తోందా లవ్ యు లవ్ యు అని కొరికిన చోట బోలెడన్ని ముద్దులుపెట్టి , హీరో ……….. ఆడుకోవడం వలన ఆకలేస్తోంది .
కీర్తి : wow ………. పెద్దమ్మ కోరిన సెకండ్ బెస్ట్ ఫుడ్ ………
పెద్దమ్మ : కీర్తి తల్లీ ……… సెకండ్ బెస్ట్ ఫుడ్ కూడా మధ్యాహ్నం తినేసాము .
కీర్తి : అవునవును soooooo tasty ………
పెద్దమ్మ : ఇప్పుడు మూడవ బెస్ట్ ఫుడ్ బుజ్జాయిలూ ……… ఎక్కడికీ తీసుకెళతాడో మీ ప్రాణమైన అన్నయ్య ,
కీర్తి : మీరే చూస్తారుకదా అని మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : బుజ్జితల్లీ ……….. బట్టలన్నీ తడిచిపోయాయి .
ఒక్కనిమిషం పెద్దమ్మా ……….. అని బిస్వాస్ ను పెద్దమ్మకు అందించి , బిస్వాస్ వచ్చేన్తవరకూ పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి అని కీర్తితోపాటు పరుగున కారుదగ్గరికివెళ్లి రెండు నిమిషాల్లో బీచ్ దగ్గరికి చేరుకుని , నా బట్టలు తీసుకుని బుజ్జాయిలూ లోపల మార్చుకోండి అని కాస్త దూరం వెళ్ళాను .
పెద్దమ్మ : హీరో మాకు భయమేస్తోంది – చీకటిగానే ఉందికదా కారు ప్రక్కనే మార్చుకో అని చిలిపినవ్వుతో చెప్పారు .
అలాగే పెద్దమ్మా ……… అని కారు వెనుకకు వెళ్లి నిమిషాల్లో మార్చుకుని అటువైపు తిరిగి నిలబడ్డాను .

అర గంట తరువాత డోర్ ఓపెన్ అయిన శబ్దంతోపాటు అన్నయ్యా అన్నయ్యా …….. మార్చేసుకున్నాము అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .
మరి పెద్దమ్మ ……….
కీర్తి : పెద్దమ్మ కూడా అన్నయ్యా …….. పదండి వెళదాము బెస్ట్ థర్డ్ ఫుడ్ తినడం కోసం .
లవ్ యు తల్లీ – బిస్వాస్ అని ముద్దులుపెట్టి కూర్చున్నాను . ఆఅహ్హ్ ……… ఏంటీ పరిమళం లవ్లీ గా ఉంది .
పెద్దమ్మ కీర్తిని ఎత్తుకుని చిలిపిదనంతో నవ్వుకుని , నాచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయారు .
కీర్తి : బట్టలు మార్చుకున్నాముకదా ఆ పరిమళం అయ్యుంటుందిలే అన్నయ్యా ……
పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మ కురుల వాసన పీల్చి అవునవును బుజ్జితల్లీ …….. అని పోనిచ్చాను . బుజ్జితల్లీ ………..మొన్న మనం తిన్న హోటల్ కు వెళదామా అని అడిగాను .
కీర్తి : పెద్దమ్మ చెప్పినట్లు కోరికలు తీర్చడం మీవంతు – ఎంజాయ్ చెయ్యడం మావంతు ………. కదా పెద్దమ్మా అని నవ్వుకున్నారు .

15 నిమిషాలలో హోటల్ చేరుకున్నాము .
పెద్దమ్మ : బుజ్జితల్లీ ………. మీరు ఫ్యాషన్ షో వాక్ చేసినది ఇక్కడే కదా ……..
కీర్తి : చిరునవ్వులు చిందించి అవును పెద్దమ్మా ………. రండి తీసుకెళతాము అని ముందు ఫంక్షన్ హాల్ వైపు తీసుకెళ్లారు .
పెద్దమ్మ : తల్లీ ……….. సెక్యూరిటీ ………
కీర్తి : పెద్దమ్మా ……….. సెల్యూట్ చేసి లోపలకు పంపిస్తారు మీరు రండి అని లాక్కునివెళ్లారు . అలానే జరగడం చూసి ఉమ్మా ఉమ్మా …….. అంటూ చేతులతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టారు .

పెద్ద డోర్ తెరిచి లోపలకు అడుగుపెట్టారు ఆనందిస్తూ వెనుకే వెళ్ళాను . పెద్దమ్మ చుట్టూ చూసి బుజ్జితల్లీ ……….. డెకరేషన్ సూపర్ ………
కీర్తి : పెద్దమ్మా ………. ఆరోజులానే ఈరోజుకూడా ఫంక్షన్ జరిగినట్లుంది .
పెద్దమ్మ : బుజ్జాయిలూ నాకోసం ……….
బుజ్జాయిలు : లవ్ టు పెద్దమ్మా ………. మాతోపాటు మీరుకూడా అని లాక్కునివెళ్లారు . స్టేజీపై సిగ్గుపడుతూ నావైపు అడుగులువేశారు .
అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
కీర్తి : నవ్వుకుని , అన్నయ్యా ……….. అమ్మకు చూయించాలికదా ఫోటోలు తియ్యండి.
అలాగే అలాగే తల్లీ అని కెమెరాలో క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను .
ముగ్గురూ నాకు అతిదగ్గరగావచ్చి పెద్దమ్మా రెడీ కదా అంటూ నావైపు ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
ఫ్లాట్ అయిపోయి వెనుకున్న కుర్చీలోకి చేరిపోవడం చూసి అందంగా నవ్వుకున్నారు . ఆ ఆనందం చూసి హృదయం పులకించిపోయింది .
అన్నయ్యా అన్నయ్యా ………. అంటూ కిందకు దిగి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .

అన్నయ్యా ……… ఆకలేస్తోంది అని చెప్పడంతో , లేచి పెద్దమ్మా …….. రండి అని రెస్టారెంట్ కు చేరుకున్నాము .
మేనేజర్ గారు చూసి hi hi పిల్లలూ , మహేష్ …….. ఫ్యామిలీతోపాటు వచ్చినందుకు చాలా సంతోషం – బాయ్స్ ………. సర్ నా ఫ్రెండ్ ఏలోటూ రాకూడదు అనిచెప్పి వెళ్లిపోయారు .
పెద్దమ్మ నావైపు ప్రేమతో చూస్తోంది .
ఒక టేబుల్ లో కూర్చుని వెజ్ – నాన్ వెజ్ స్పెషల్ ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసాను .
పెద్దమ్మ : మహేష్ ……….. నేను వెజిటేరియన్ .
బాబూ ……….. ఓన్లీ వెజ్ ఐటమ్స్ అని ఆర్డర్ చేసాను .
పెద్దమ్మ : లవ్ యు హీరో ………. , బుజ్జాయిలూ ……… పెద్ద హోటల్ , మొదటిసారి రావడం లవ్ యు అంటూ ముద్దులుపెట్టారు .
కీర్తి : పెద్దమ్మా ………. హోటల్ కు తీసుకొచ్చినదికూడా ……….
పెద్దమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , ఇంటికివెళ్లాక మొత్తం ముద్దులు ఒకేసారి ఇచ్చేస్తానులే బుజ్జితల్లీ కాస్త మీరే హెల్ప్ చెయ్యాలి – మీ అన్నయ్య రొమాన్స్ లో కాస్త వీక్ అని నా వైపు కైపుతో చూస్తూనే బుజ్జితల్లి చెవిలో గుసగుసలాడారు .
కీర్తి : అవునా పెద్దమ్మా ………. యాహూ అన్నయ్యా ……… ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ నాకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఎంజాయ్ చేస్తోంది .

అంతలో ఇర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి . టేబుల్ మొత్తం ఆక్రమించేసాయి .
కీర్తి : పెద్దమ్మా ………. రుచి చూసి బెస్ట్ థర్డ్ డిష్ అని కంఫర్మ్ చేస్తే కడుపునిండా తిందాము .
పెద్దమ్మ : లవ్ యు బుజ్జితల్లీ అని ముద్దుపెట్టి తిన్నారు .
మేము ముగ్గురమూ పెద్దమ్మ ఫీల్ కోసం ఆశతో కన్నార్పకుండా చూస్తున్నాము .
పెద్దమ్మ : ఊహూ ……… అన్నట్లు తలఊపారు .
కీర్తి : పెద్దమ్మా ఈ ఐటమ్ ఈ ఐటమ్ ………. అని ఒక్కొక్కటే అందించినా కూడా ఊహూ అన్నారు .

థర్డ్ బెస్ట్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచనలో పడ్డాను .
కీర్తి ………. పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టి , నాదగ్గరకు వచ్చి అన్నయ్యా అన్నయ్యా ……… అంటూ ఆతృతతో చెవిలో గుసగుసలాడింది .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………… లవ్ యు బుజ్జితల్లీ – పెద్దమ్మా …….. మీకోరిక తీర్చేస్తాము , సంకలో పిల్లిని పట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాము అని సర్వర్ ను పిలిచి అన్నింటినీ పార్సిల్ చెయ్యమనిచెప్పి బిల్ టిప్ పే చేసి పార్సిల్స్ అందుకుని కారులో బయలుదేరాము .
మెయిన్ రోడ్ ప్రక్కన ఉంటున్న homeless పీపుల్ దగ్గర కారుని ఆపి ఫుడ్ అంతటినీ మరియు పర్సులో ఉన్న మొత్తం డబ్బును బుజ్జాయిల చేతులతో ఇప్పించాను .
వాళ్లంతా చల్లగా ఉండండి పిల్లలూ అని దీవించారు . ఆకలిగా ఉన్నట్లు సంతోషంతో తినడం చూసి బుజ్జాయిలు ఆనందంతో లవ్ యు అన్నయ్యా ………. అని ప్రాణమైన ముద్దులుపెట్టారు .

బుజ్జాయిలూ ……….. వెళదామా అని ఎత్తుకునివచ్చి కారులో కూర్చున్నాను .
పెద్దమ్మ : హీరో ……….. టచ్ చేసావుపో , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ – ఆకలిగా ఉన్నవాళ్లకు పట్టెడు అన్నం పెడితే కలిగే పుణ్యం ఎంత డబ్బు సంపాదించినా రాదు . వాళ్ళ ఆనందం చూసి బుజ్జాయిల చిరునవ్వులు చిందించడం ……….. లవ్ యు లవ్ యు నిన్ను ఇక్కడికిక్కడే రే ………. కొరుక్కుని తినేయ్యాలని ఉంది అని నా చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దులతో ముంచెత్తారు .

ముద్దులను ఆస్వాదిస్తూనే శరణాలయం చేరుకున్నాము . శరణాలయం అదికూడా 8 గంటల సమయంలో ఇంత పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండటం ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయి కిందకు దిగిచూస్తే , చుట్టూ కరెంట్ ఉంది శరణాలయం మాత్రం చిమ్మచీకటిగా ఉంది . బిస్వాస్ ను ఎత్తుకుని – కీర్తి ని ఎత్తుకున్న పెద్దమ్మ చేతిని అందుకొని కంగారుపడుతూనే చిన్న దీపం వెలుగుతున్న అమ్మవారి దగ్గరికి చేరుకుని మొక్కుకుని వెనక్కుతిరిగాము .

ఒక్కసారిగా మాపై పూలవర్షం – శరణాలయం మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం – తమ్ముళ్లూ పిల్లలందరూ హ్యాపీ బర్త్డే కీర్తి – హ్యాపీ బర్త్డే బిస్వాస్ – హ్యాపీ బర్త్డే అన్నయ్యా ……….. అంటూ చుట్టూ చేరి సంతోషంతో కేరింతలువేస్తూ విష్ చేశారు .
బుజ్జాయిల ఆనందానికి అవధులు లేనట్లు థాంక్స్ థాంక్స్ అన్నయ్యలూ ……….అని చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
వార్డెన్ కూడా వచ్చి ముగ్గురికీ విష్ చేశారు .
వార్డెన్ మీకెలా ……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *