పెద్దమ్మ Part 4

అమ్మా ……… వాడు .
నాకు మీ ఆనందమే ముఖ్యం ………. ఇలా జరిగిందని మీ ప్రాణమైన అన్నయ్యకు కానీ – పెద్దమ్మకు కానీ తెలియనివ్వకండి హాయిగా ఎంజాయ్ చేసివచ్చి నాకు చెబితే ఆనందిస్తాను .
అమ్మా ………. మిమ్మల్ని వదిలి మేము వెళ్ళము .
లోపల అలికిడి అవ్వడంతో తల్లీ – నాన్నా ……… వాడు వచ్చేస్తున్నాడు వెళ్ళండి అని ముద్దుల వర్షం కురిపించి బలవంతంగా బయటకు వదిలి డోర్ వేసేసుకుని ఆనందం బాధతో కన్నీళ్లు కార్చారు .
అమ్మా అమ్మా …….. అంటూ ఏడ్చి ఏడ్చి ……… అన్నయ్యా – అక్కయ్యా …….. అమ్మ ఇచ్చిన మాట ముఖ్యం అని కన్నీళ్లను తుడుచుకుని మాదగ్గరికి వచ్చారు .

కళ్ళల్లో కన్నీళ్ళతో సడెన్ గా లేచి బట్టలు వేసుకుని పెద్దమ్మ భుజాల వరకూ దుప్పటి కప్పి బయటకువచ్చి బుజ్జాయిల ఇంటివైపు చూస్తూ సెక్యూరిటీలా కూర్చున్నాను .
నిమిషానికే పెద్దమ్మ దుప్పటి కప్పుకునివచ్చి , నా గుండెలపై గువ్వపిల్లలా వొదిగిపోయి , మహేష్ మరొక్కరోజు ఆగు అంతా సంతోషమే అని నా కన్నీళ్లను తుడిచారు . డోర్ వైపు చూస్తూ చూస్తూనే కళ్ళుమూతలుపడ్డాయి .

వెలుగు కళ్లపై పడటంతో లేచి చూస్తే నేను బెడ్ పై ఒంటరిగా పడుకున్నాను . పెద్దమ్మా పెద్దమ్మా ………. బాత్రూమ్ వెళ్లారనుకుని టైం చూద్దామని మొబైల్ అందుకుంటే స్క్రీన్ టచ్ చేయగానే మెసేజ్ ఓపెన్ అయ్యింది .
మహేష్ – హీరో – శిష్యా – శ్రీవారూ ……….. వచ్చిన పని పూర్తయ్యింది – నేను కోరిన కోరికలన్నీ తీర్చావు – ఇక తీరాల్సింది నా ప్రియమైన శ్రీవారి కోరికనే – నేను ఉంటే మరింత ఆలస్యం అవుతుంది కాబట్టి ఎక్కడ నుండి అయితే వచ్చానో అక్కడికే వెళ్లిపోతున్నాను – నాకోసం వెతకొద్దు – నీ దేవత కష్టాలను తీర్చు ……… సెలవు .

ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్ళతో పెద్దమ్మా పెద్దమ్మా ………. అంటూ కేకలువేస్తూ హాల్లోకి వచ్చాను . హాల్లో బుజ్జాయిలు ఆటవస్తువులతో ఆడుకుంటున్నారు – వంట గదిలో పెద్దమ్మ కోసం చూస్తే దేవత వంట చేస్తోంది . ఇంట్లో ఎక్కడా పెద్దమ్మ కనిపించకపోవడంతో బయటకు పరుగుతీసి వింగ్ మొత్తం వెతికి మెట్ల ద్వారా చెమటతో కన్నీళ్ళతో అపార్ట్మెంట్ మొత్తం చూసినా ఎక్కడా కనిపించలేదు . సెక్యూరిటీని అడిగితే నేను మేల్కొనే ఉన్నాను మహేష్ సర్ …….. ఎవ్వరూ వెళ్ళలేదు కనీసం ఒక వెహికల్ కూడా వెళ్ళలేదు అని చెప్పారు . పరుగుపెట్టి అటువైపు కిలోమీటర్ ఇటువైపు కిలోమీటర్ పెద్దమ్మా పెద్దమ్మా ………. అంటూ వెతికినా జాడలేదు .
పెద్దమ్మా పెద్దమ్మా ……….. మమ్మల్ని వదిలివెళ్లి మళ్లీ అనాధలను చెయ్యకండి అని మోకాళ్లపై కూర్చుని కళ్ళల్లో కన్నీళ్ళతో ఆయాసపడుతూ బాధపడుతున్నాను .

మొబైల్ కు మెసేజ్ రావడంతో చూసాను .
హీరో ……….. నేనంటే అంత ప్రేమనా ? – ఇంత ప్రాణం అయితే నేనెలా వెళ్లగలను – నీ దేవత కళ్ళల్లో సంతోషం చిగురించాలంటే నేను నీ ప్రక్కనే ఉండకూడదు అందుకే వెళ్ళాను తప్ప నీమీద ప్రేమ లేక కాదు – మిమ్మల్ని అనాధల్ని చెయ్యాలని కాదు .
రాత్రి ఎక్కడ పడుకున్నావు ?
ఇంటి బయట మిమ్మల్ని కౌగిలించుకుని ……….
ఉదయం ఎక్కడ లేచావు ?
ఇంటిలో బెడ్రూంలో ………
ఏ ఇంటి బెడ్రూం లో ?
మన ……… కాదు కాదు బుజ్జాయిలు ఉన్నారు – దేవత వంట ………
అవునవును ………. నువ్వు రాత్రి కన్న కల నిజం . నేను నీతోనే తోడుగా ఉంటాను – నేను వచ్చినది మిమ్మల్ని ఏకం చెయ్యడానికి – కానీ నీ ప్రేమకు దాసీని అయ్యి స్వర్గంలో విహరించాను లవ్ యు హ హ హ ……….. – నువ్వు ఎంత తొందరగా నీ దేవత కష్టాలను తీర్చేస్తే మళ్లీ మనమంతా అంత త్వరగా ఒక్కటిగా ఉండవచ్చు .

అర్థమైంది పెద్దమ్మా ……… మేము పూజించే అమ్మవారు మాకష్టాలను తీర్చడానికి మిమ్మల్ని పంపించారు అని అమ్మవారిని ప్రార్థించి కన్నీళ్లను తుడుచుకుని , మన ఇద్దరి ఏకైక కోరిక తీరుస్తాను పెద్దమ్మా ………. అని అపార్ట్మెంట్ చేరుకుని పైకివెళ్లి నా ఇంట్లోకి కాకుండా దేవత ఇంట్లోకివెళ్ళిచూస్తే మొత్తం ఫోటోలలో యూనిఫార్మ్ లో నేను ఉండటం చూసి ఆశ్చర్యపోయాను ……………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *