పెద్దమ్మ Part 5

బుజ్జాయిలూ ……… కడుపు నిండిపోయింది చాలు చాలు – మాకు కూడా అన్నయ్యా ……….. బుజ్జిపొట్ట చల్లగా అయిపోయింది అని నవ్వుకున్నారు . అన్నయ్యా ……… ఇవి కరిగిపోయేలోపు అందరికీ ఇచ్చేసివస్తాము అని మళ్ళీ ఒక రౌండ్ వేసివచ్చారు .
శ్రీవారూ ……… నీ దేవత నీకోసం స్పెషల్ చేశారు అని పెద్దమ్మ నుండి మెసేజ్ వచ్చింది – లంచ్ సమయం అవ్వడంతో పెదాలపై తియ్యదనంతో ఇంటికివెళదాము అని బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జాయిలను ఎత్తుకుని బయటకువచ్చాను .
బుజ్జాయిలు : సర్ ………బాధపడకండి , బ్యాగ్స్ ఇక్కడే ఉన్నాయి లంచ్ చేసి మళ్లీ వచ్చేస్తాము .
సర్ : ఉమ్మా ఉమ్మా ………. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

బయటకువచ్చి బయలుదేరాము . దారిలో రోడ్ ప్రక్కన ఫ్లవర్స్ షాప్ కనిపించడంతో ఆగి బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి రంగురంగుల గులాబీ పూలను మరియు తులిప్స్ పూలను రెండు అందమైన బొకేలలా రెడీ చేయించాను . పే చేసి పెదాలపై చిరునవ్వుతోనే వచ్చి కారులో కూర్చున్నాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ………. ఒకటి పెద్దమ్మకు మరొకటి ఎవరికో నాకు తెలుసులే అని నన్ను సంతోషంతో చుట్టేసింది .
కీర్తి త…….ల్లీ ……… రెండూ నీ…….కోసమే లవ్ యు అంటూ అందించాను .
బుజ్జితల్లి : అన్నయ్యా …….. మీ కళ్ళల్లో అపద్దo – మాటల్లో తడబాటు …….. నాకు అర్థమైపోయిందిలే – ఇంకా భయం ఎందుకు అన్నయ్యా ………. పోనివ్వండి పోనివ్వండి – ఇంత సౌందర్యమైన పూలు అందుకున్నవారి పాదాలు నేలపై ఉండవేమో ……… – మాకు వెంటనే ఆ సంతోషాన్ని చూడాలని ఉంది .
కీర్తి తల్లీ …………
ష్ ………. అంటూ బుజ్జి వేలితో నా నోటికి తాళం వేసి – బుజ్జిచేతితో పోనివ్వండి అని చూయించింది .
పెదాలపై తియ్యదనంతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెడుతూనే స్టార్ట్ చేసి పోనిచ్చాను.
అన్నయ్యా అన్నయ్యా ……….. ఎంత సంతోషం కలుగుతోందో మాటల్లో చెప్పలేను లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ప్రాణంలా గుండెలపై బుజ్జిచేతులతో చుట్టేసింది .
అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి మనం తిన్నాము మరి ………
బుజ్జితల్లి సంతోషం పట్టలేక నా బుగ్గను కొరికేసింది . పూలను నెమ్మదిగా బిస్వాస్ ఒడిలో ఉంచి , అన్నయ్యా అన్నయ్యా ………. అమ్మకు మొదటిసారి మీరు ఇచ్చిన ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం .
అలాగే తల్లీ ……… అని గిలిగింతలుపెడుతూ ఎత్తుకునివెళ్లి అదే ఐస్ క్రీమ్ ను మరింత స్పెషల్ గా గోల్డ్ ప్లేట్ కోటింగ్ వేయించాను – ఐస్ క్రీమ్ తోపాటు సిల్క్ చాక్లెట్ తీసుకున్నాను .
కీర్తి : అమ్మకు ఇష్టమైన చాక్లెట్ కూడా అదే ……….
లవ్ యు తల్లీ అని ముద్దులుపెట్టి పే చేసి అందుకుని నిమిషంలో అపార్ట్మెంమెంట్ చేరుకున్నాము.
ఫ్లవర్స్ పట్టుకున్న బిస్వాస్ – ఐస్ క్రీమ్ చాక్లెట్ పట్టుకున్న బుజ్జితల్లిని ఎత్తుకుని లిఫ్ట్ లో పైకివచ్చాము . బుజ్జాయిలూ ……….నాకు భయం వేస్తోంది మీరే తీసుకెళ్లండి అని ముద్దులుపెట్టి కిందకుదించాను .
ప్రస్తుతానికి మేము ఇస్తాము నెక్స్ట్ మాత్రం మీరే ఇవ్వాలి సరేనా అన్నయ్యా ……… , ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చోండి భోజనం తీసుకొస్తాము అనిచెప్పి , అమ్మా అమ్మా ……….. అంటూ పరుగుతియ్యగానే నేను లోపలికి చేరిపోయాను . దేవ ………. మేడం ఎలా రిసీవ్ చేసుకుంటారోనని గుండె వేగంగా కొట్టుకుంటోంది . పెద్దమ్మా …….. భారం అంతా మీదే అని తియ్యని నవ్వుతో వెళ్లి ఫ్రెష్ అయ్యి హాల్లోకివచ్చాను .

చేపలకు ఫుడ్ వేస్తున్న బుజ్జాయిలు నా అడుగుల చప్పుడుకే అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి , అన్నయ్యా ……… ఘుమఘుమలాడే స్పెషల్ భోజనం తీసుకొచ్చాము రండి తిందాము అన్నారు .

గిఫ్ట్స్ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో బుజ్జాయిలవైవు మార్చి మార్చి ఆశతో చూస్తున్నాను .
నా చూపుల అర్థం బుజ్జితల్లికి తెలిసిపోయినట్లు , అన్నయ్యా ………. మీరిచ్చిన గిఫ్ట్స్ తో లోపలికివెళ్లి అమ్మా ……… అంటూ చూయించాము . ఎవరిచ్చారో అమ్మకు అర్థమైపోయినట్లు , వెంటనే వంట గదిలోకివెళ్లి హాట్ బాక్స్ మరియు ప్లేట్ తీసుకొచ్చి మీ అన్నయ్యకు ఆకలివేస్తూ ఉంటుంది పాపం తీసుకెళ్లండి అని ఆత్రంగా మమ్మల్ని బయటకు పంపించేశారు .
పంపించేసారా ………..
అన్నయ్యా ………. పూలు ఐస్ క్రీమ్ చాక్లెట్ అందుకుని పంపించేశారులే – నాకు తెలిసి అమ్మ పూలను గుండెలపై హత్తుకుని అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు .

బుజ్జితల్లీ ………. మీరు చూడలేదు కదా – నా సంతోషం కోసం అలా చెబుతున్నారు అని ఫీల్ అయ్యాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ……… మీరు ఇలా ఫీల్ అవుతారని ఎక్కడి నుండి ప్రత్యక్షము అయ్యారో పెద్దమ్మ కనిపించి , బుజ్జితల్లీ ……….. మీ అమ్మ ఫీలింగ్స్ నేను మొబైల్లో రికార్డ్ చేస్తానులే – మీ అమ్మకు సిగ్గు – పాపం అలా లవ్లీ ఫ్లవర్స్ గిఫ్ట్ లా అందుకుని 7 సంవత్సరాలకు పైనే అయ్యిందికదా – ఒక్కసారిగా అందుకోగానే తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే చూయిస్తాను అన్నారు .
అవునా బుజ్జితల్లీ – బిస్వాస్ ………అంటూ ముద్దులవర్షం కురిపించి , సాయంత్రం వరకూ ఏంటి మరొక సంవత్సరం అయినా సంతోషంగా వేచిచూస్తాను అని ప్రాణంలా హత్తుకుని తిందాము అని సోఫాలో కూర్చున్నాము .
బుజ్జితల్లి హాట్ బాక్స్ నుండి వెజిటబుల్ రైస్ – కూర్మా వడ్డించుకుని తినిపించి ఎలా ఉంది అన్నయ్యా ………….
దేవతే స్వయంగా అమృతం వండినట్లుగా ఉంది బుజ్జితల్లీ ………. అని ఇద్దరికీ బుజ్జి బుజ్జి ముద్దలు తినిపించాను .
మ్మ్మ్మ్మ్………. అమృతం ఇలానే ఉంటుందా అన్నయ్యా …………

రాత్రి స్వీకరించిన అమృతపు ఊహల్లోకి వెళ్ళిపోయి , రేయ్ రేయ్ ……….. తప్పు తప్పు అని సిగ్గుపడ్డాను .
అన్నయ్యా ……….. డ్రై fruits అని రైస్ తోపాటు తినిపించింది .
ముందు మా బుజ్జాయిలు తినాలి బలం కోసం అని ఏరి ఏరి తినిపించాను .

బుజ్జితల్లీ – బిస్వాస్ ………. వెళ్లి అమ్మకు చెప్పిరండి ఆఫీస్ కు వెళదాము అని ముద్దులుపెట్టాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ……….. అటు నుండి ఆటే వెళ్లిపోండి అని అమ్మ ఆర్డర్ …….. డోర్ తెరవను అని చెప్పేసారు .
నాకైతే నవ్వు ఆగలేదు . లవ్ యు లవ్ యు అని ముద్దులుపెట్టి ఎత్తుకుని ఆఫీస్ కు బయలుదేరాము .

దారిలో చాక్లెట్ heaven దగ్గర కారుని ఆపాను .
బుజ్జితల్లి : అన్నయ్యా అన్నయ్యా ……… ఇక ఈరోజు తినడం మావల్లకాదు please please ………. ఎక్కడా ఆగకుండా ఆఫీస్ కు వెళ్లిపోదాము వెళ్లిపోదాము అని నన్ను దిగనీకుండా చేతులను బుజ్జి చేతులతో పట్టేసుకుని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది .
బుజ్జితల్లీ నీకు వద్దులే బిస్వాస్ కు తీసుకుందాము .
బిస్వాస్ : అన్నయ్యా …….. ఇటుచూడండి అని ఉబ్బిన పొట్టన చూయించడంతో ,
నవ్వుకుని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆఫీస్ చేరుకున్నాము .
వెంకట్ మొదలుకుని సర్ వరకూ లంచ్ గురించి అడిగి బుజ్జాయిలను నవ్వించారు .

రూంలోకి వెళ్ళగానే నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టి వెళ్లి సోఫాలో కూర్చుని కలర్ పెన్స్ తో డ్రాయింగ్స్ వేస్తున్నారు .
వెళ్లి ఇద్దరిముందు మోకాళ్లపై కూర్చుని బుజ్జాయిలూ ……… ఇంట్లో మీ అమ్మకు ముద్దులుపెడుతున్న డ్రాయింగ్ ………..
బుజ్జితల్లి : నేనూ బుజ్జిఅన్నయ్య కలిసి వేశాము అన్నయ్యా ………. , బయటకువెళ్లి ఫోటోలు తీసుకునే వీలు లేదుకదా ………..
కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు soooo మచ్ బుజ్జాయిలూ ……….. అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులుపెట్టి , ఆకలివేసినా ఏమైనా కావాలన్నా ……… అడగండి .
లవ్ యు అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ చిరునవ్వులు చిందిస్తూ గట్టిగా ముద్దులుపెట్టారు .
పెదాలపై అంతులేని ఆనందంతో వెళ్లి వర్క్ లో మునిగిపోయాను .

3 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్టేషన్ అని ఉంది . వెంటనే ఎత్తాను .
అలర్ట్ అలర్ట్ ………. ఐదుగురు కాలేజ్ అమ్మాయిలు మిస్సింగ్ మిస్సింగ్ – ఉదయం కాలేజ్ కు వెళ్లిన అమ్మాయిలు లంచ్ కు ఇంటికి రాలేదని- కాల్స్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని కంప్లైంట్స్ అల్ సెక్యూరిటీ అధికారి అలర్ట్ అలర్ట్ ………. సిటీ నుండి బయటకు వెళ్లే వాహనాలన్నింటినీ పూర్తిగా చెక్ చెయ్యండి .
నాకు ………. స్టేషన్ నుండి కాల్ – yes yes ……… వాడికి వచ్చే కాల్స్ నాకు కూడా వినిపిస్తాయి అని పెద్దమ్మ చెప్పారుకదూ ………..
మరొక కాల్ స్టేషన్ నుండే 10 మంది అమ్మాయిలు మిస్సింగ్ . మళ్లీ 10 నిమిషాలకు ******* కాలేజ్ నుండి అమ్మాయిలు మిస్సింగ్ – నిమిషానికి ఒక కంప్లైంట్ వస్తోంది – ఇప్పటివరకూ 25 మంది అమ్మాయిలు మిస్సింగ్ అలర్ట్ అలర్ట్ ……….. సిటీ నుండి వెళుతున్న పెద్ద పెద్ద వెహికల్స్ అన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేయ్యండి . సిటీ లోపల బయట ఉన్న బిల్డింగ్స్ అన్నింటినీ చెక్ చెయ్యండి ………….అలా కాల్స్ మీద కాల్స్ గంటలో 50 మందికిపైనే సిటీలోని నలువైపులా ఉన్న కాలేజస్ నుండి మిస్సింగ్ అని నిమిషానికి ఒక కాల్ వస్తూనే ఉంది . సిటీలోని కాలేజస్ అన్నింటిదగ్గరా హై అలర్ట్ పెంచండి అని ఆర్డర్స్ .
ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ ……….. ఏమై ఉంటుంది – ఎలా జరిగి ఉంటుంది – కిడ్నప్ ……….. ఎవరు చేసి ఉంటారు అని ముఖమంతా చెమటలు పట్టేసాయి .

అన్నయ్యా – అన్నయ్యా ………. చెమట పట్టింది అని బుజ్జి కర్చీఫ్ లతో తుడిచి , నిద్రవస్తోంది అన్నారు .
నా బంగారం అంటూ గుండెలపై హత్తుకుని సోఫాలో పడుకుంటారా లేక ఇంటికివెళదామా అని అడిగాను .
ఇక్కడ పడుకుంటాము అని గుండెలపై ముద్దులుపెట్టి నన్ను చుట్టేసి కళ్ళుమూసుకున్నారు .
లవ్ యు బుజ్జితల్లీ – లవ్ యు బిస్వాస్ …….. అంటూ లేచి నిలబడి అటూ ఇటూ తిరుగుతూ కురులపై ముద్దులుపెడుతూ జోకొట్టాను . క్షణాల్లో వెచ్చని బుజ్జిశ్వాసలను నా గుండెలపై వదులుతూ హాయిగా నిద్రపొయారు .

5 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో వెంటనే సైలెంట్ లో ఉంచేసాను . లేదు లేదు ………… తల్లీ – బిస్వాస్ అని ముద్దులుపెట్టాను , మొబైల్ అందుకొని సోఫాలో కూర్చున్నాను . చూస్తే స్టేషన్ నుండి కాకుండా పార్టనర్ నుండి కాల్ వస్తుండటం చూసి ఎత్తి చెవిదగ్గరపెట్టుకున్నాను .
గోవర్ధన్ ………. అమ్మాయిల మిస్సింగ్ గురించి మీవాళ్ళు ………
పార్టనర్ ……… నేనున్నానుకదా , అమ్మాయిలను గోడౌన్ లో బంధించండి – వైజాగ్ లో ఉన్న మొత్తం గూండాలూ రౌడీలను కాపలా ఉంచండి . రేపు ఉదయానికల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది . దానికోసం నైట్ అన్నీ ఏర్పాట్లూ చేసాను . నేను మన గోడౌన్ కు వచ్చేన్తవరకూ కాల్స్ చెయ్యొద్దు అని కట్ చేసాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *