పెద్దమ్మ Part 5

అదే నిజం మహేష్ గారూ ………. , నిన్న మధ్యాహ్నం ………. వాడు బాత్రూంలో ఉండగా ఫోన్ ఎత్తకపోవడం వలన నెక్స్ట్ ల్యాండ్ లైన్ మ్రోగడంతో ఇద్దరమూ ఒకేసారి రూంలోని మరియు హాల్లోని ఫోన్ ఎత్తాము . వాడు మమ్మల్ని ఎలా చంపబోతున్నాడో చెప్పాడు .
ఒక్కసారిగా నా కళ్లల్లో ధారలా కారుతున్న కన్నీళ్ళతో కోపంతో మేడం చెంప చెల్లుమనిపించబోయి మిల్లీమీటర్ దూరంలో ఆపేసి , అందుకేనా …….. బుజ్జాయిలను నాదగ్గరే ఉండమని చెప్పారు – మీరు లేకుండా బుజ్జాయిలు నే …….. ఎలా అంటూ అంతులేని బాధతో – ఆ ఊహకే భయంతో వణుకుతున్నాను – ఎంత అడిగాను ఒక్కమాటైనా చెప్పొచ్చుకదా అని కళ్ళతోనే వ్యక్తం చేసి తట్టుకోలేక మళ్లీ కొట్టబోయి ఆగిపోయాను .

మేడం : మరింత కోపంతో అర్థం కాని మరొక ఫీల్ తో చెల్లెళ్ళూ ……… వెళదాము పదండి అని ఇద్దరి చేతులను అందుకుని బయటకు నడిచారు .
మేడం sorry ………. అన్నానో లేదో , బుజ్జాయిలు నిద్రలోనే నా చెంపలు చెళ్లుమనిపించారు .
మిగిలిన చెల్లెమ్మలు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
మేడం మేడం ……….. అంటూ వెనుకే బయటకువెళ్ళాను .
మేడం కోపంతో ………. కారులో కూర్చోబోతే , చెల్లెళ్ళూ ……….. ఈ వెహికల్లో మీ అక్కయ్యను పిలుచుకునివెళ్లండి అనిచెప్పాను .
అక్కయ్యా ………. please please అంటూ క్యార వ్యాన్ లో ఎక్కేలా చేశారు .
మేడం ……….. మిమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించడం తప్పే నన్ను మన్ని ……….
మళ్లీ చెంపలు చెళ్లుమన్నాయి .
చెల్లెళ్లతోపాటు మేడం కూడా నవ్వినట్లు అనిపించింది .
మేడం ……….. బుజ్జాయిలు అని అందివ్వబోయాను .
మేడం : కోపంతో చూసి , నేనేమీ ఇక్కడికి మీ బుజ్జాయిలకోసం రాలేదు – లేచాక మా అన్నయ్య నుండి నిద్రలో ఎత్తుకుని వచ్చేసారా అని నన్ను కొట్టిద్దామని అనుకుంటున్నారా ………. , చెల్లెమ్మలూ ………. వాడు ఆ దుర్మార్గుడు ఉన్న ప్లేస్ లో ఒక్క క్షణం కూడా ఉండలేను పదండి వెళదాము .
చెల్లెళ్ళూ ……….ఏమైనా తప్పుచేశానా ?
చెల్లి : చాలా చాలా పెద్ద తప్పు అన్నయ్యా ……… , మా అక్కయ్య మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి త్వరగా – ఆలస్యం అయ్యేకొద్దీ అక్కయ్య బాధ పెరుగుతూనే ఉంటుంది .
ఆడవారి మాటలకు అర్థాలు వేరు అని ఊరికే అనలేదు మహానుభావులు – చెల్లెళ్ళూ ………. నిన్న ఉదయం నుండీ బుజ్జాయిలు అమ్మ ప్రేమను పొందలేదు అని అందించాను .
చెల్లెళ్ళు : యాహూ ………. అంటూ కేకలువేసి , అంతకంటే అదృష్టమా అన్నయ్యా ……… అంటూ లోపల ఉన్నవాళ్ళుకూడా వచ్చి పోటీపడి ఒకరినొకరు తోసుకుని ప్రాణంలా ఎత్తుకున్నారు .
దే ……… మేడం నే చూస్తూ , చెల్లెళ్ళూ …….. డ్రైవర్ నేరుగా అపార్టెంట్ తీసుకెళతారు జాగ్రత్త అన్నాను .
కోపంతో మేడం ముఖాన్ని అటువైపు తిప్పుకున్నారు . నాకైతే ఏమీ అర్థం కాలేదు – దేవతను బాధపెట్టానా ఎలా కొట్టబోయాను అని నన్ను నేను తిట్టుకున్నాను – అసలు నాకు ఏ అధికారం ఉంది అని లెంపలేసుకున్నాను .
సరే అన్నయ్యా ………… తొందరగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వెళుతున్నాము అని లోపల కూర్చున్నారు .
పెద్దమ్మా ……… ఇంటికి అని మనసులో తలుచుకోగానే వెహికల్ కదిలింది . వెహికల్ విండో నుండి ఎవరో చూసినట్లు అనిపించి చూస్తే వెంటనే లోపలికి వెళ్లిపోయారు . సెక్యూరిటీ అధికారి వెహికల్ వెనుకే ఫాలో అయ్యింది . నిన్న రాత్రి ఊరిబయట గ్యారేజ్ దగ్గర వదిలిన కారు నాముందువచ్చి ఆగడంతో లవ్ యు పెద్దమ్మా …….. అని తలుచుకుని వెనుకే పోనిచ్చాను – అందరమూ అపార్ట్మెంట్ చేరుకునేసరికి ఉదయం 5 గంటలు అయ్యింది .బుజ్జాయిలను ఎత్తుకున్న చెల్లెమ్మలతోపాటు మేడం లోపలికివెళ్లారు . ఎందుకో తెలియదు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్లినట్లు నా మనసుకు అనిపించి చూస్తే అలాంటిదేమీ లేకపోవడంతో నిరాశచెంది , వెనుకే పైకివెళ్ళాను . మేడంతోపాటు చెల్లెళ్ళు కూడా ఇంట్లోకి వెళ్లిపోవడంతో తన్నుకొస్తున్న బాధతో నన్ను నేను తిట్టుకుంటూ వెళ్లి సోఫాలో వాలిపోయాను . అలసిపోయినట్లు చెమ్మతో కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది .
శ్రీవారూ ………. ఏది జరిగినా అంతా మన మంచికే హాయిగా రెస్ట్ తీసుకోండి అని పెద్దమ్మ గుసగుసలు ముద్దులు స్పృశించడంతో సోఫాలోనే ఘాడమైన నిద్రలోకిజారుకున్నాను .

9గంటలకు అన్నయ్యా అన్నయ్యా ………. అంటూ కలవరిస్తూ బెడ్ పై స్పృశించి అన్నయ్యా అన్నయ్యా …….. అంటూ సడెన్ గా లేచికూర్చుని , చుట్టూ రూమ్ మొత్తం అపార్ట్మెంట్ బుజ్జాయిలు పిల్లలు ఉండటం చూసి ఆశ్చర్యంతో కదలకుండా ఉండిపోయారు .
అక్కయ్యలూ – అంటీ ……….. మా బుజ్జి ఫ్రెండ్స్ నిద్రలేచారు అంటూ నలుగురు పరుగున వెళ్లారు .
అందరినీ ఒకేసారి అదికూడా తమ చుట్టూ చూసి బుజ్జాయిలకు సంతోషం పట్టలేక వెక్కిళ్ళు వచ్చేసాయి .
అక్కయ్యలూ – అంటీ ……… వాటర్ వాటర్ అంటూ మరొక నలుగురు పరిగెత్తారు .

చెల్లెళ్ళు …….. నీళ్లతో పరుగునవచ్చి బుజ్జితల్లీ – బిస్వాస్ ……… అంటూ ప్రాణంలా హత్తుకుని తాగించి , మీరు చూస్తున్నది నిజమే , మీతో ఆడుకోవడానికి నాలుగు బిల్డింగ్స్ లోని అందరూ తమ పిల్లలను మీదగ్గరికి సంతోషంతో పంపించారు – ఇక అందరూ మీతోనే ఆడుకుంటారు – మీకోసం తెల్లవారుఘామున నుండీ ఇష్టంతో మీరెప్పుడు లేస్తారా అని ఇక్కడే ఎదురుచూస్తూ ఉన్నారు .
కీర్తి – బిస్వాస్ – చెల్లీ – తమ్ముడూ ………. మమ్మల్ని క్షమించండి – మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుండీ మనమంతా కలిసి సంతోషంతో ఆడుకుందాము – మీతో వెళ్లి ఆడుకోండి అని అర్ధరాత్రి నిద్రపోతున్న మాపై నీళ్లుచల్లి మరీ జరజరా లాక్కునివచ్చారు అమ్మావాళ్ళు – మీరు మాతో ఆడుకుంటేనే మమ్మల్ని ఇంట్లోకి పిలుచుకుంటారంట లేకపోతే బయటే ……….
బుజ్జాయిలిద్దరూ ………… సంతోషంతో బుజ్జిబుజ్జినవ్వులు నవ్వారు .
కీర్తి – బిస్వాస్ …….. నవ్వారు అని సంతోషంతో బుజ్జాయిలు – పిల్లలందరూ ……… ఒక్కొక్క గిఫ్ట్ అందించి మురిసిపోయారు .

చెల్లెళ్ళు : సంతోషించి , చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జాయిల నుదుటిపై – బుగ్గలపై – కురులపై ………. ప్రేమతో ముద్దులుపెట్టారు . అక్కయ్యా అక్కయ్యా ……… ఏంటి అలా తొంగి తొంగి చూస్తున్నారు లోపలికి రండి .
మేడం : లోపలికివస్తే కొడతారు చెల్లెళ్ళూ ………..
బుజ్జాయిలు : అక్కయ్యలూ ………. అన్నయ్య వల్లనే కదా ఇదంతా ………
చెల్లెళ్ళు : అవునన్నట్లు మళ్లీ ముద్దుల వర్షం కురిపించారు . మీ సంతోషం కోసం మీ అన్నయ్య ఏమైనా చేస్తారు .
బుజ్జాయిలు : అన్నయ్య ఎక్కడ , రాత్రి అన్నయ్య దగ్గర ఉన్నాము కదా ఇక్కడికి ఎలావచ్చాము . అమ్మ ఎత్తుకుని వచ్చిందా అని కోపంతో రూమ్ బయటకువెళ్లి మేడం గుండెలపై కొట్టి బుగ్గలను కొరికేశారు . హాల్ మొత్తం ఉన్న అపార్ట్మెంట్ అమ్మలు సంతోషంతో నవ్వుతుండటం చూసి , ఇంతమంది తమ ఇంటిలోనా మరియు తమ తల్లి స్వచ్ఛమైన సంతోషాన్ని చూసి కళ్ళల్లో చెమ్మతో అమ్మా ……….. అన్నయ్య వల్లనే కదా అంటూ గుండెలపైకి చేరిపోయారు .
మేడం : అవును తల్లీ – నాన్నా ……….. అని ఆనందబాస్పాలతో చెప్పారు .

అమ్మా అమ్మా ………. అన్నయ్య దగ్గరికి వెళతాము అని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి పరుగుబెట్టబోయి ఆగి వెనక్కుతిరిగి , ఫ్రెండ్స్ – అక్కయ్యలూ – అన్నయ్యలూ ………. రండి మన అన్నయ్య దగ్గరికివెళదాము అని పిలిచారు .
అమ్మలూ ……….. మేమంతా ఫ్రెండ్స్ అయిపోయాము అని బుజ్జాయిల చుట్టూ చేరారు .
బుజ్జాయిలతోపాటు అందరి ఆనందాలకు అవధులే లేకపోయాయి .
మేడం – అక్కయ్యలు : కీర్తి తల్లీ – బిస్వాస్ ………. మీ అన్నయ్యకోసం ప్రేమతో టిఫిన్ చేసాము .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా – లవ్ యు అక్కయ్యలూ ……….. అని హాట్ బాక్స్ ప్లేట్స్ వాటర్ …………. అందుకుని పరుగున వచ్చి , డోర్ దగ్గర నుండే సోఫాలో పడుకుని ఉండటం చూసి ష్ ష్ ష్ ……… అంటూ అడుగులో అడుగువేసుకుంటూ లోపలికివచ్చారు .

నిద్రలోనే బుజ్జితల్లీ – నాన్నా బిస్వాస్ ……….. అని ప్రాణంలా పిలిచాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ……… అంటూ హాట్ బాక్స్ టేబుల్ పై ఉంచి నా గుండెలపైకి నిలువునా చేరిపోయి ఎలా తెలిసింది అని బుగ్గలను కొరికేశారు .
నా బుజ్జాయిల అడుగుల చప్పుడే నా గుండెచప్పుడు అని ప్రాణంలా నా గుండెలపైకి హత్తుకున్నాను . బుజ్జితల్లీ ……….. ఘుమఘుమలు అంటూ లేచికూర్చుని పిల్లలను చూసి ఆశ్చర్యపోయాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ………. నా ఫ్రెండ్స్ అక్కయ్యలు అన్నయ్యలు – ఫ్రెండ్స్ ……… మా ప్రాణం అని పరిచయం చేసారు .
అందరూ : hi అన్నయ్యా hi అన్నయ్యా ……….
Hi hi ………… అమ్మో ఇంతమంది ఫ్రెండ్స్ , ప్రపంచంలో ఎవ్వరికీ ఉండరు – నా బుజ్జితల్లి బిస్వాస్ కు మాత్రమే అని ముద్దులతో ముంచెత్తాను .

పిల్లలూ ……… టిఫిన్ చేసి ఆడుకుందురు రండి అని పిల్లల అమ్మలు పిలిచారు .
అందరూ : కీర్తి – బిస్వాస్ …….. ఇంటికివెళ్లివస్తాము అందరమూ కలిసి ఆడుకుందాము అనిచెప్పి టాటా చెప్పారు .
బుజ్జితల్లీ – బిస్వాస్ ……….. ఫ్రెండ్స్ అయిపోయారు కదా – మీ ఫ్రెండ్స్ కు గిఫ్ట్స్ ఇవ్వాలికదా మరియు మీ బుజ్జి ఫ్రెండ్స్ ను కూడా పరిచయం చెయ్యాలికదా …………
బుజ్జాయిలు : అవును అన్నయ్యా ……… ఇవ్వాలి అని తలలు దించుకున్నారు .
నా బుజ్జాయిలు బంగారం అంటూ కురులపై ముద్దులుపెట్టి , అదిగో ఆ బాక్స్ లలో ఒకదానిలో పెద్ద పెద్ద చాక్లెట్ లు మరొకదానిలో బుజ్జి బుజ్జి టెడ్డి బేర్ లు ఉన్నాయి – మీ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వండి అనిచెప్పాను .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ………. అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవెళ్లి బాక్స్ లలో చూస్తే నిండుగా చాక్లెట్ లు టెడ్డి బేర్ లు ఉన్నాయి . ఫ్రెండ్స్ ……… అంటూ చాక్లెట్ లు టెడ్డి బేర్ లు అందించారు . ఒకటి తియ్యగానే వాటి ప్లేస్ లో మరొకటి ప్రత్యక్షము అయ్యింది – వందకుపైనే ఉన్న పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు .
lలవ్ యు soooooo మచ్ పెద్దమ్మా అని తలుచుకున్నాను .

అందరూ సంతోషంతో అందుకుని థాంక్స్ కీర్తి – బిస్వాస్ ……… అని అపార్ట్మెంట్స్ మొత్తం వినిపించేలా కేకలువేశారు .
బుజ్జాయిలు : అంతులేని ఆనందంతో , ఫ్రెండ్స్ ……… ఇక మన బుజ్జి ఫ్రెండ్స్ ను పరిచయం చేస్తాను అని అక్వేరియంలోని చేపలను చూయించింది . వాటి ఆనందం తారాస్థాయికి చేరినట్లు ఎగిరెగిరి గెంతులేసాయి .
చేపలను పలకరించి బుజ్జాయిలను కౌగిలించుకుని పిల్లలందరూ వెళ్లిపోయారు .
బుజ్జాయిలు : బై బై …….. ఫ్రెండ్స్ , అన్నయ్యా అన్నయ్యా ……… చూసారా ?
అవును బుజ్జితల్లీ – నాన్నా ………. మరి మీరంటే అంత ప్రాణం వాటికి అని ఎత్తుకున్నాను .
బుజ్జాయిలు బుజ్జిబుజ్జినవ్వులతో చేపలను స్పృశించి పలకరించారు . ఆకలేస్తోందా ……….. మాకు కూడా అని ఫుడ్ వేసి ఆనందించారు .

బుజ్జితల్లీ – బిస్వాస్ ……… ఆకలేస్తోందా , నాకు కూడా ……….
మన ఆకలి గురించి అమ్మకు – అక్కయ్యలకు బాగా తెలుసు అన్నయ్యా ……… అందుకే అని హాట్ బాక్స్ వైపు చూయించారు .
బుజ్జితల్లీ ………. నేనింకా బ్రష్ చెయ్యలేదు – అంత ఓపిక కూడా లేదు క్లోజ్ లో ఉన్న హాట్ బాక్స్ నుండే ఘుమఘుమలు అధిరిపోతున్నాయి ఇక ఓపెన్ చేస్తే అని పెదాలను తడుముకున్నాను .
బుజ్జాయిలు : : అన్నయ్యా – అన్నయ్యా ………. మీకు ఒక విషయం చెబుతాము – మేముకూడా బ్రష్ చెయ్యలేదు – బ్రష్ చేయాలన్నా శక్తిలేదు . ఎవ్వరూ చూడటం లేదు కాబట్టి ముందు తినేసి తరువాత బ్రష్ చేద్దాము .
వద్దు బుజ్జితల్లీ ……… మీ అమ్మకు తెలిస్తే నన్ను కొడతారు . ఇప్పటికే రెండు చెంప దెబ్బలు పడ్డాయి అని దీనంగా చెప్పాను .
బుజ్జితల్లి : ఎవరు అన్నయ్యా ………. అమ్మ మిమ్మల్ని కొట్టారా ? , అదికూడా రెండుసార్లు . ప్చ్ ……… మేము చూడలేకపోయాము – మీరంటే ఎంత ప్రాణం అయితే కొడతారు – ఇంతవరకూ మమ్మల్ని కూడా కొట్టనేలేదు – మిమ్మల్ని కొట్టారంటే అమ్మకు మాకంటే మీరంటేనే ఎక్కువ ప్రాణం అన్నమాట – ఇప్పుడు బ్రష్ చెయ్యకుండా తిని అన్నయ్యే బ్రష్ చెయ్యకుండా తినొచ్చు అని తినిపించేశారు అమ్మా …….. అని అపద్దo చెబుతాము – అప్పుడు అంతులేని ప్రేమతో ప్రాణంలా ఎలా కొడతారో చూడాలని ఉంది అని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .

బుజ్జితల్లీ ……….. ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు .
బుజ్జాయిలు నవ్వుకుని అమ్మ వచ్చాక పూర్తిగా అర్థమౌతిందిలే అన్నయ్యా ……… , అమ్మా ఆకలి అన్నయ్యా ……. ఆకలి – తినిపిస్తారా లేక మీ బుగ్గలను కొరుక్కుని తినేయ్యమంటారా ?
తియ్యదనంతో నవ్వుకుని ముద్దుచేస్తూ వాష్ బేసిన్ దగ్గరకువెళ్లి చేతులు కడుక్కున్నాను – అన్నయ్యా అన్నయ్యా ……… మేముకూడా అని వొంగి కడుక్కున్నారు . కుమ్మేద్దాము రండి అని సోఫాలో కూర్చున్నాము . కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాక హాట్ బాక్స్ ఓపెన్ చేసి ఆఅహ్హ్ ………. నా దేవత వంట అని మురిసిపోయాను .
బుజ్జితల్లి ప్లేట్ లో వడ్డించుకుంది . నేను…….. బుజ్జాయిలకు – బుజ్జాయిలు …… నాకు తినిపించుకుని మ్మ్మ్మ్మ్………. సూపర్ అని నవ్వుకున్నాము .

బుజ్జితల్లి : అన్నయ్యా ……….. ఇంటి నిండా అక్కయ్యలు అంటీ వాళ్ళు , అమ్మ ఆనందానికైతే అవధులే లేవు అంత ఆనందంతో ఉన్నారు . అమ్మ అలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు . లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ……….. అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో ముద్దకలిపి పెడుతున్న చేతిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . మేమంటే ఎందుకు అన్నయ్యా ……… అంత ప్రాణం – ఇప్పటివరకూ మానుండి ఏమీ ఆశించకుండా ………..
ఇందులో నా స్వార్థం కూడా ఉంది బుజ్జితల్లీ ……….. , దేవ …… మేడం …….. మీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మ పెదాలపై మీరు కోరుకున్న ఆనందం నవ్వు చూడాలని – ఆ పెదాలపై ఆ పెదాలపై ………. అని సిగ్గుపడి బుజ్జితల్లి ఒడిలో తలదాచుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ………. మీ ప్రియమైన బుజ్జాయిలదగ్గర సిగ్గుపడుతున్నారా , చెప్పండి చెప్పండి అని బుగ్గపై ముద్దులుపెట్టారు .
లేచి కూర్చుని మెలికలు తిరిగిపోతూ బుజ్జితల్లీ – బిస్వాస్ ……… ఆ చిరునవ్వులు చిందిస్తున్న మీ అమ్మ పెదాలపై అనేంతలో ………….
అన్నయ్యా అన్నయ్యా ……….. అని కేకలు వినిపించడంతో బయటకువెళ్ళాను .
ఒంటిపై నిలువెల్లా కట్లతో వచ్చిన గోవర్ధన్ గాడు – నా ఇంటిలోకి ఇంతమందిని ఎందుకు రానిచ్చావని దేవ ………. మేడం ను కొట్టబోతుంటే , రేయ్ ……. అన్నాను .
అంతే వాడు నన్నుచూసి అంత దూరం వెళ్లి భయంతో బిక్కుబిక్కుమంటున్నాడు .
చెల్లెళ్ళు అయితే గట్టిగా నవ్వేశారు . వాళ్ళతోపాటు మేడం కూడా ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
రేయ్ ……… స్త్రీలు – అమ్మాయిలు మనకు దేవతలూ – దేవకన్యలతో సమానం . వారిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలికానీ నీలా మృగం లా హింసించకూడదు .

వాడు భయపడుతూనే లోపలికివెళ్లి కొన్ని క్షణాల తరువాత కోపంతో వచ్చి , నా డబ్బు నా డబ్బు అన్నాడు .
దేవత : ఇంకెక్కడ డబ్బు , ఉదయం IT వాళ్ళు వచ్చి మొత్తం తీసుకెళ్లిపోయారురా ……….. ఎన్ని పాపాలు చేసి సంపాదించావు చివరికి ఇలా వెళ్ళిపోయింది .
వాడు : నన్ను రా …….. అంటావా అని మళ్ళీ కొట్టబోతే ఈ సారి మేడం స్వయంగా చేతిని పట్టుకుని వాడిని వెనక్కు తిప్పి పట్టుకుంది .
వాడు నొప్పితో విలవిలలాడిపోయి గింజుకుంటూ బ్రతిమాలడంతో వదిలారు .
అధిచూసి నేనూ – బుజ్జాయిలు – చెల్లెళ్ళు షాక్ లో అలా నిలబడిపోయాము .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *