ఇవతల మండపంలో హారిక తన ఇద్దరు ఆడపిల్లలతో మాట్లాడుతుండగా కవిత కూడా ఐస్ క్రీం తింటూ వెళ్లి కుర్చీల్లో కూర్చుంది.
కవిత : హమ్మయ్యా.. అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి
హారిక : మా ఆయన మీ ఆయన ఇద్దరు కనిపించట్లేదేంటి
కవిత : వాళ్ళేక్కడికి పోతారు మందుకెళ్ళుంటారు
హారిక : గమనించనే లేదు అందరూ వెళ్లిపోయారు మనమే ఉన్నది.. పేమెంట్లు అన్నీ అయిపోయాయా
కవిత : ఎప్పుడో.. పదండి ఇంటికి వెళదాం, చిన్నా లావణ్య ఇద్దరు ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయారు
హారిక : వాడికి కొన్ని రోజులు పడుతుందిలే వాడు ఉన్నట్టుండి పెళ్ళికి ఒప్పుకోవడమే నాకు ఇంకా నమ్మబుద్ది కావట్లేదు
కవిత : కూతురు కోసం ఒప్పుకోనుంటాడు
హారిక : ఉండు ఐస్ క్రీం తిని వెళదాం అని లేచింది.
ఉన్నట్టుండగా ఒకేసారి ఆరు వైపుల నున్న తలుపులు కిటికీలు అన్ని పెళ్ళున మూసుకుపోయాయి.. కిటికీ అద్దాలన్ని పగిలిపోయాయి ఇటు హారికకి అటు కవితకి జల్లు మంది. ఇద్దరు లేచి నిలబడ్డారు.. హారిక వెళ్లి తలుపులు తీయబోతే రాలేదు.
అవి రావు అన్న బేస్ వాయిస్ ఒకటి వినిపించింది కానీ ఎవ్వరు లేరు, కవిత కూడా హడలిపోయింది ఎందుకంటే ఆ గొంతు కవిత గుర్తుపట్టేసింది. ఏమి అర్ధం కాకపోయినా వెంటనే పిల్లల ఇద్దరి చేతులు పట్టుకుంది.
హారిక : ఎవరు..
నేనే అప్పుడే మర్చిపోయావా.. (అదే బేస్ వాయిస్)
హారిక చుట్టూ చూసింది కానీ ఎవ్వరు కనిపించలేదు.. భయపడి ఎవరు.. ఎవరు అని గట్టిగా అరిచింది
కవిత : అక్షితా…
పరవాలేదే ఇంకా ఒకరికి గుర్తున్నాను అని నవ్వింది గట్టిగా.. ఇంతవరకు ఎవ్వరికి మాటలు తప్ప ఏమి కనిపించలేదు. పెద్దవాళ్లు ఇద్దరు భయపడుతుంటే పిల్లలకి కూడా భయమేసింది. స్టేజి మీద నల్లని పొగలలో ముందు ఎర్రని కళ్ళతో అక్షిత ఒక కాలు మడుచుకుని ఇంకో కాలు చాపుకుని కూర్చుని ఉంది. పిల్లలిద్దరు అది చూసి ఏడుపు లంకించుకున్నారు. అక్షిత చెయ్యి లేపగానే పిల్లలు ఇద్దరు గాల్లోకి లేచారు. అక్కడే గాల్లో ఆపేసింది.. పిల్లలిద్దరు కేకలు.
ఇదంతా చూస్తున్న హారికకి వెన్నులో పుట్టింది వణుకు, వెంటనే తేరుకొని తన పిల్లలని చూసి అక్షిత కాళ్ళ మీద పడిపోయింది ఏడుస్తూ.. కవిత కూడా భయంతో చెమటలు పట్టాయి కానీ దెగ్గరికి వెళ్లే ప్రయత్నం చెయ్యలేదు. అది చూసి అక్షిత చెయ్యి ఊపగానే రెండు బాడీలు రక్తపు ముద్దలతో కవిత ఎదురుగా పడ్డాయి. కవిత మొగుడిని అల్లుడిని చూసి కేకలు కేకలుగా ఏడుస్తూ వాళ్ళ మీద పడిపోయింది అది చూసి అక్షిత గట్టి గట్టిగా నవ్వుతూ పిచ్చిది అయిపోయింది.
హారిక అటు పిల్లలని ఇటు తన మొగుడు తండ్రిని అందరినీ చూసి ఏం చెయ్యాలో తెలీక ఏడుస్తుంటే అక్షిత వెంటనే నవ్వడం ఆపి హారిక గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది అది చూసిన కవిత పరిగెత్తుకుంటూ వెళ్లి అక్షిత కాళ్ళ మీద పడిపోయింది తప్పైపోయింది కనికరించమంటూ.

Fantastic
Different story in between sex stories.wonderful story.really liked it.thanks to the writer.
Different story in between sex stories.thanks to the writer.