అక్షిత : ఏంటి మీవేనా ప్రాణాలు నావి కావా
కవిత : అక్షిత.. అక్షిత..
అక్షిత : చెప్పు ఏం చెపుతావో నేను కూడా వింటాను
…………………………………………………….
కార్ వేగంగా నడుపుతున్న చిన్నాకి ఫోన్ రాగానే ఎత్తాడు
చిన్నా : హలో
సర్ నేను CI ని మాట్లాడుతున్నాను, మీ ఫాదర్ కారుకి ఆక్సిడెంట్ అయ్యింది కానీ ఇక్కడ వాళ్ళు ఇద్దరు లేరు, కారు చిత్తు చిత్తు అయ్యింది బతికే అవకాశమే లేదు కానీ వాళ్ళ బాడీలు కూడా దొరకలేదు.
చిన్నా : నేను వస్తున్నాను అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసి ఇంకా వేగంగా మండపం వైపు తొక్కాడు కారుని.
చిన్నా వెళ్లడం తలుపులు అన్ని మూసి ఉండడంతో కిటికీలో నుంచి లోపలికి దూకాడు. అక్షిత తప్ప అందరూ అటు వైపు చూసారు. కవిత పరిగెత్తింది.. చిన్నా చిన్నా వదిలేయ్యమని చెప్పు.. చూడు నాన్నని బావని చంపేసింది.. పిల్లలు అని ఏడవటం మొదలు పెట్టింది. పిల్లలు కూడా మావయ్యా మావయ్యా అని ఏడవటం మొదలు పెట్టారు.
అక్షిత చిన్నా వైపు చూసింది, చిన్నా ఏం మాట్లాడలేదు ఒకసారి తన నాన్న బావ వైపు చూసి మళ్ళీ అక్షితని అలా చూస్తూ ఉండిపోయాడు. చిన్నగా నడుచుకుంటూ అక్షిత ముందుకు వెళ్లి నిల్చున్నాడు.
అక్షిత : ఏంటి అలా చూస్తున్నావ్.. వదిలేయ్యాలా వీళ్ళని.. చెప్పు.. చెప్పు చెప్పు చెప్పు అని ఏడుస్తూ అరిచింది గట్టిగా
చిన్నా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి రెండు చేతులతో కళ్ళు మూసుకుని ఏడుస్తూ అక్కు… నన్ను కూడా నీతో పాటు తీసుకుపో.. నన్ను కూడా తీసుకుపో అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసాడు అది చూసి అక్షిత హారిక గొంతు వదిలేసి మాములుగా మారిపోయింది, హారిక పిల్లలు చిన్నగా కిందకి దిగిపోయారు.. పసి పిల్లలు ఇప్పటి వరకు భయపడినా అక్షితని మామూలుగా చూడగానే అంతా మర్చిపోయి అత్తయ్యా అని తన దెగ్గరికి పరిగెత్తారు.. అక్షితని వాటేసుకోబోతే దూరారు తప్ప పట్టుకోలేకపోయారు పిల్లల ప్రేమ చూసి ఒక చూపు హారిక వైపు విసిరింది అందులో చూసావా నీ పిల్లలకి ఎంత ప్రేమ పంచానో అన్న గర్వం ఉంది.. హారిక తల దించుకుంది.. చిన్నాని దాటుకుని కవిత వైపు వెళ్ళింది.
అక్షిత : అత్తయ్యా.. నాకు నువ్వంటే ఇష్టం లేదనొ లేక నన్ను బెదిరించి ఉంటెనో లేక ఇది మా పరిస్థితి మాకు డబ్బులు కావాలంటేనొ నేను నా బుజ్జి దాన్ని తీసుకుని మీ అందరికి దూరంగా వెళ్లిపోయే దాన్ని కదా.. ఎందుకు నన్ను చంపేశారు.. నీ కూతురుని రెండు నిముషాలు గొంతు పట్టుకుంటే విల విల లాడిపోయావు, ఏ.. నాది ప్రాణం కాదా.. ఎందుకు డబ్బు లేనోళ్లంటే అంత చులకన.. కనీసం నా బిడ్డని ముట్టుకోలేని పరిస్థితి నాది.. పాపం చిన్నూ నాకోసం ఎంత ఏడ్చింది ఎంత వెతుక్కుంది, నిద్రలో కూడా నన్నే కలవరిస్తుంది.. నాకు నా బిడ్డ కావలి.. నా బిడ్డకి నన్ను ఇవ్వగలవా.. అని ఏడ్చేసింది.. వదినా నువ్వు కూడానా.. నీకు నీ పిల్లలకి నీ తమ్ముడు బంగారం చేపించాడు ఆస్తులు ఇచ్చాడు ఒక్కసారి కూడా నేను మీ విషయాల్లో జోక్యం చేసుకోలేదు.. ఒక్క మాట కూడా నేను వాడిని అడగలేదు.. నేను మిమ్మల్ని నా కుటుంబం అనుకున్నాను.. నాకు ఒక కుటుంబం ఉంది.. నాకు ఏదైనా అయితే నన్ను చూసుకోడానికి ఇంత మంది ఉన్నారనుకున్నాను కానీ ఇలా నమ్మించి చంపేస్తారనుకోలేదు.. హారిక భయపడి చూస్తుంటే.. భయపడకు నేను నిన్ను ఏమి చెయ్యను.. నా బిడ్డ నేను లేక ఎంత తపించిపోతుందో చూస్తూనే నిన్ను నీ పిల్లలకి దూరం చెయ్యలేను.. నన్ను చంపినా నా బిడ్డని ముట్టుకోడానికి ఒప్పుకోలేదు మీరు అందుకు థాంక్స్ అత్తయ్యా.. అని కింద కూర్చుని భారంగా కోపంతో రోదిస్తుంటే మండపం మొత్తం అదిరింది.
ఇంతలో చిన్నూ గొంతు వినిపించేసరికి అక్షిత ఏడవటం ఆపి మాములుగా అయిపోయి అన్ని తలుపులు తెరిచింది. చిన్నూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్షిత ముందు ఆగిపోయింది.. సారీ మమ్మి.. ముట్టుకోవద్దని చెప్పావు కదా మర్చిపోయాను.. లావణ్య అమ్మ కూడా వచ్చింది.. అదిగో అని చూపించింది.. లావణ్య కళ్ళ నిండా నీళ్లతో లోపలికి వచ్చి అక్షిత ముందు నిలుచుంది.. అక్షిత ముందుకు జరిగి లావణ్య కాళ్ళ దెగ్గర తన చేతులు పెట్టింది.
అక్షిత : థాంక్స్.. నా బిడ్డ కోసం నీ భవిష్యత్తుని అడిగాను.. వెంటనే ఒప్పుకున్నావు.. ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేనిది.. అని చేతులెత్తి మొక్కింది.. లావణ్య బాధగా తన తల అక్షిత మీద పెట్టింది ఆ గాలిని తాకుతూ.. అక్షిత పాప వైపు చూసింది.. చిన్నూ..
చిన్ను : అమ్మా.. పద ఇంటికి వెళదాం నిన్ను నేను కట్టేయ్యాలి..
అక్షిత : (నవ్వుతూ కళ్ళు తుడుచుకుని) ఇలారా.. అదిగో అమ్మ అక్కడుంది.. ఇక నుంచి తనే నీకు అమ్మ
చిన్నూ : మరి నువ్వు ?
అక్షిత : నేను వెళుతున్నా.. చాలా పనులున్నాయి నాకు.. నువ్వు ఎలా ఉన్నావా.. నా మీద బెంగ పెట్టుకున్నావా.. అని నిన్ను చూసి పోదాం అని వచ్చాను.
చిన్నూ : నన్ను వదిలి వెళ్ళకు మా.. ప్లీజ్.. డాడీ అయితే నీకోసం రోజూ ఏడుస్తాడు.. రాత్రంతా నేను పడుకున్నానని అనుకుని నీ ఫోటో ముందు కూర్చుని ఏడుస్తూ ఎప్పుడో పడుకుంటాడు.. మమ్మల్ని వదిలి వెళ్లకమ్మా
అక్షిత : ఇవన్నీ నీకెలా తెలుసు.. దొంగ పడుకునట్టు నటించి నాన్నని మోసం చేస్తున్నావా అనగానే చిన్నూ.. హి హి హి.. అని నవ్వింది.. నేను వెళుతున్నాను నువ్వు అమ్మ దెగ్గరికి వెళ్ళు
చిన్నూ : మళ్ళీ ఎప్పుడు వస్తావు
అక్షిత : నువ్వు ఎప్పుడంటే అప్పుడే.. కళ్ళు మూసుకుని తలుచుకో నీ మైండ్ లోకి వచ్చేస్తాను.. అప్పుడు నువ్వు నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్నిటికి సమాధానం చెపుతాను సరేనా.. లావణ్య అమ్మని విసిగించకు.. సరేనా

Fantastic
Different story in between sex stories.wonderful story.really liked it.thanks to the writer.
Different story in between sex stories.thanks to the writer.