అయ్యో వాటర్ మరిచిపోయాను , జానకీ – మేడం …… ఇప్పుడే తీసుకొస్తాను .
జానకి : జానకి జానకి జానకి …… థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ పులకించిపోతోంది – మహేష్ …… నేనూ వస్తాను .
నేనేమీ వాటర్ క్యాన్ తీసుకురావడం లేదు జానకీ …… , నా క్లాస్రూంలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళుతున్నాను , నువ్వు ……
జానకి : నువ్వు అని పిలవకు …… జానకీ అనే పిలువు ……
జానకీ ……
జానకి : ఆఅహ్హ్ ….. అంటీ అంటూ సంతోషంతో చుట్టేసింది .
జానకీ …… మీ అంటీతో ఉండు – చిటికెలో తెచ్చేస్తానుగా …… అంతవరకూ తింటూ ఉండండి . ఫాస్ట్ గా వెళుతూ ……. అంటీలను చూసి మాట్లాడి కోప్పడి గంటలు అయిపోయింది ఒకసారి కాల్ చేద్దాము – పెదాలపై చిరునవ్వుతో ముగ్గురికీ ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ చేసాను .
హలో ….. అంటూ వాసంతి అంటీ – హలో …… అంటూ సునీత అంటీ – హలో ….. అంటూ కాంచన అంటీల మధురమైన స్వరాలు వినిపించగానే వొళ్ళంతా తియ్యదనం , తియ్యనైన నవ్వులతో గప్ చుప్ గా వారి స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నాను .
” సునీతా – వాసంతీ – కాంచన …… నువ్వు ? నువ్వు ? నువ్వు ? , ముగ్గురికీ కాన్ఫరెన్స్ కాల్ చేసి ఎవ్వరూ మాట్లాడరేమిటి హలో హలో హలో ….. రాంగ్ నెంబర్ ఏమో అని కట్ చేసేసారు ” .
ముసిముసినవ్వులు నవ్వుకుని మళ్లీ కాన్ఫరెన్స్ కాల్ చేసాను ……
ఈసారి కాస్త కోపం తో కట్ చేశారు .
మళ్లీ మళ్లీ కాల్ చేస్తూ అంటీల స్వరాలను ఎంజాయ్ చేస్తూనే క్లాస్రూంలోకివెళ్లి బాటిల్ తీసుకుని బయటకునడిచాను .
భౌ …… అంటూ డోర్ చాటున దాక్కున్న జానకి భయపెట్టింది .
ఉలిక్కిపడి వెంటనే నవ్వుకున్నాను .
జానకి : మహేష్ …… భయపడ్డావు భయపడ్డావు .
జానకీ వచ్చేశావా ? అంటూ నవ్వుతున్నాను ……..
జానకి : చిటికెలో వస్తాను అనిచెప్పి రాలేదు కదా అందుకే నేనే వచ్చేసాను .
అదీ అదీ అంటీల ఫోన్ అంటూ రీడయల్ ఆప్షన్ ఆన్ చేసి చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకున్నాను కేవలం అంటీల వాయిస్ మాత్రమే వినిపించేలా సెట్ చేసి జేబులో ఉంచుకున్నాను – అంటీ వాళ్ళు కట్ చేయగానే ఆటోమేటిక్ గా ముగ్గురికీ కాన్ఫరెన్స్ కాల్ వెళ్లిపోతోంది .
జానకి : బాటిల్ ఇవ్వు పట్టుకుంటాను – కలిసినప్పటి నుండీ చూస్తున్నావు అంటీలూ అంటీలూ అంటున్నావు తప్ప అమ్మ నాన్న అనడం లేదు .
ఎంత భయపడ్డానో తెలుసా …… , జానకీ ….. తింటూ మాట్లాడుకుందాము రా అంటూ నవ్వుతూనే చేరుకున్నాము .
హెడ్ మిస్ట్రెస్ : ఏమైంది అంతలా నవ్వుతున్నారు ? .
నథింగ్ నథింగ్ మేడం …… , జానకీ …… ప్లీజ్ ప్లీజ్ ……
హెడ్ మిస్ట్రెస్ : జానకీ చెప్పు చెప్పు …… అంటూ ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .
జానకి : అంటీ …… మీరేమో మహేష్ వలనే ధైర్యం వచ్చింది అంటూ తెగ పొగిడారు – భౌ అనగానే భయపడిపోయాడు ……
ఉలిక్కిపడ్డాను అంతే అంతే ……
జానకి : అవును అంతే అంతే అంటూ నవ్వుతూనే ఉంది .
జానకీ …… తింటూ ఎంతసేపైనా నవ్వు – నీ నవ్వులు ఎంతసేపైనా చూడొచ్చు అంత అందంగా ఉంటాయి .
హెడ్ మిస్ట్రెస్ : అవునవును అంటూ జానకి నుదుటిపై ముద్దుపెట్టారు , జానకీ నీకొక విషయం చెప్పనా …… నేను లిస్ట్ చూసి బాధపడుతుండటం చూసి నాతోకూడా ఇలానే అన్నాడు .
ఇద్దరూ నవ్వుకున్నారు .
జానకి : నాకు తెలిసి మహేష్ ….. తనచుట్టూ ఉన్నవాళ్లను హ్యాపీగా ఉంచుతాడు .
థాంక్యూ థాంక్యూ …… , జానకీ – మేడం ….. తినండి చుట్టూ అందరూ తినేస్తున్నారు చూడండి .
జానకి : Ok మహేష్ ……. , అంటీ …… నేను అటువైపు కూర్చుంటాను .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ …… వద్దులే రోజూలా ఎమోషనల్ అవుతావు అంటూ ప్రేమతో కౌగిలించుతున్నారు .
జానకి : ప్లీజ్ ప్లీజ్ అంటీ …….
మేడం …… జానకి కోరికప్రకారం ఇటువైపు వచ్చి కూర్చోండి – నేను దూరంగా వెళ్లి కూర్చుంటానులే …….
జానకి : దూరంగా కూర్చోమని మేము చెప్పామా ….. ? , మా ప్లేస్లో కూర్చోవచ్చుకదా ……. అంటూ చిరుకోపంతో చెప్పింది .
Sorry sorry థాంక్యూ కూల్.కూల్ అంటూ లేచివెళ్లి కూర్చున్నాము . అంటీల కోపం తెలుస్తూనే ఉంది – చిలిపిగా నవ్వుకుంటున్నాను , sorry అంటీలూ …… మీ వాయిస్ వినకుండా ఉండలేను .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ తల్లీ ….. బాధపడకు బాధపడకు అంటూ జానకి కన్నీళ్లను తుడుస్తూ ప్రేమతో ఓదారుస్తున్నారు .
మేడం చెప్పినట్లుగానే జానకి కళ్ళల్లో కన్నీళ్లు – తనను అలా చూసి హృదయం చలించిపోయింది – మేడం మేడం …… ఏమైంది ? జానకి కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఎందుకు ? ఇంతవరకూ సంతోషంగా నవ్విందికదూ అంటూ నాకళ్ళల్లో చెమ్మతో అడిగాను హెడ్ ఫోన్ ను కిందకు జార్చేసాను .
హెడ్ మిస్ట్రెస్ : రోజూ ఇలానే మహేష్ …… , లంచ్ సమయానికి ఇదే ప్లేస్లో కూర్చుని నీవెనుక బుజ్జి స్టూడెంట్స్ కు వాళ్ళ అమ్మలు ప్రేమతో గోరుముద్దలు తినిపించడం చూసి ఇలా ఎమోషనల్ అయిపోతుంది .
జానకీ …… నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి మేడంతోపాటు నేనూ తట్టుకోలేను , పని ఉండి రాలేకపోయారేమో ……. రాత్రికి నీ ఇష్టప్రకారమే ప్రేమతో తినిపిస్తారులే …..
హెడ్ మిస్ట్రెస్ : అలా తినిపించడానికి జానకి అమ్మ లేరు మహేష్ ……. అంటూ ప్రాణంలా ముద్దులుపెడుతున్నారు .
Sorry sorry సో sorry జానకీ …… అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : అందరిలా అమ్మ ప్రేమను పొందలేకపోయినా కనీసం అమ్మ స్పర్శను కూడా ఆస్వాదించలేకపోయింది .
మేడం ….. ? .
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ …… , జానకి జన్మించిన రోజునే జానకి అమ్మ స్వర్గస్థులయ్యారు , అమ్మ స్పర్శ – అమ్మ ప్రేమ కనీసం అమ్మను చూడకుండానే పెరిగింది , అమ్మ ప్రేమకోసం బాధపడని రోజంటూ లేదు , జానకీ అని నువ్వు గెస్ చేయగానే అంతులేని సంతోషంతో నిన్ను ఎందుకు కౌగిలించుకుందో తెలుసా ……
” అమ్మ పేరు జానకి ”
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ …… , జానకి తన అమ్మ పేరు – అలా పిలవగానే ఎంత సంతోషించిందో నువ్వూ చూశావుకదా , ఇలా గుర్తుచేసుకుని మధ్యాహ్నం పూట సరిగ్గా భోజనం కూడా చెయ్యదు – ఒక్కొక్కసారి ముద్దకూడా ముట్టకుండా కాలేజ్ వదిలేంతవరకూ భాదపడుతూనే ఉంటుంది .
నెంబర్2 ….. కాదుకాదు జానకీ …… , అమ్మప్రేమ పొందలేని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు …… , నీ బాధను తగ్గించడానికి అపద్దo చెబుతున్నాను అనుకోవద్దు , ఇందాక ఆడిగావు కదా అంటీలూ అంటీలూ అంటావు అమ్మానాన్నల గురించి మాట్లాడవా అని …… , నేనుకూడా వారి ప్రేమ లేకుండానే పెరిగాను – వారు ఎలా ఉంటారో కూడా తెలియదు – నాకు ఊహ తెలిసేనాటికి అనాధాశ్రమంలో ఉన్నాను .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ …… అంటే నువ్వు ? .
అవును మేడం అనాధనే …… , నిన్ననే మా ఇంటి ముందు ఉన్న అంటీలు చెప్పారు నెక్స్ట్ ఇయర్ తో మన ఇండియా జనాభా ….. చైనా జనాభాను మించిపోతుందని , అంతమంది ఉన్న నేను అనాథను ఎలా అవుతాను .
మేడం – జానకి కన్నీళ్ళతో నాచేతిని అందుకున్నారు .
I am happy i am happy జానకీ – మేడం …… , నన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసుకునే పెద్దమ్మ ఉన్నారు అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను , నిన్ననే అంటీలు – ఆక్కయ్యలను కలిశాను , ఈరోజు మేడం ను – నిన్ను ….. ok ok జానకిని మరియు ఇంతమంది స్టూడెంట్స్ ను కలిశాను …… , హమ్మయ్యా …… జానకి నవ్వింది .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
జానకీ …… రెండు విషయాలు చెబుతాను తరువాత నీ ఇష్టం ఇలా రోజూ బాధపడతావో – సంతోషంగా ఉంటావో ……. , మొదటిది నా అనుభవంతో చెబుతున్నాను …… నాకు తెలిసి కాన్పు రోజున డాక్టర్స్ వచ్చి ఇక ఏమీ చేయలేము తల్లినో – బిడ్డనో ఒక్కరినే కాపాడగలం అని జానకి అమ్మ ప్రక్కన ఉండగానే చెప్పి ఉంటారు , అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏ తల్లి అయినా ఏమని బదులిస్తారో తెలుసా …… ? .
హెడ్ మిస్ట్రెస్ : డాక్టర్స్ …… నాకేమైనా పర్లేదు నా బిడ్డను బ్రతికించండి అంటూ ప్రాధేయపడుతుంది అంటూ ఆనందబాస్పాలతో చెప్పారు .
జానకీ …… ఒకసారి మీ అంటీ కళ్ళల్లోకి చూడు , జానకి అమ్మగారు కూడా అంతే సంతోషంతో చెప్పి ఉంటారు , అమ్మలకు …… బిడ్డలు చల్లగా ఉండాలన్నదే సంతోషం కాబట్టి …… , జానకి అమ్మ వారి ఆయువునంతా పోసి నీకు సంతోషంతో జన్మనిచ్చి అపురూపంగా గుండెలపైకి తీసుకుని తల్లీ …… నీలో నేను బ్రతికే ఉంటాను – నిన్ను అనుక్షణం కాపు కాస్తూనే ఉంటాను అని ముద్దుపెట్టి …….. కన్నీళ్లను తుడుచుకుని జానకి చేతిని సున్నితంగా అందుకున్నాను .
జానకి : మహేష్ ……. నన్ను అమ్మ స్పృశించారా ? .
హెడ్ మిస్ట్రెస్ : తన ప్రాణాన్ని గుండెలపై హత్తుకుని ముద్దుకూడా పెట్టి ఉంటారు జానకీ …….
జానకి : అంటీ – మహేష్ …… చాలా ఆనందం వేస్తోంది అమ్మ ప్రేమను పొందానని తెలిసి చాలా చాలా ఆనందం వేస్తోంది అంటూ అంటీ గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : నిన్ను ప్రాణం కంటే ఎక్కవగా ముద్దుపెట్టకుండా ఎలా ఉంటారు జానకీ అంటూ ముద్దులుకురిపిస్తున్నారు .
జానకి : ఆనందిస్తూనే ……. మహేష్ మహేష్ మరొకటి ఏమిటి ? అంటూ ఆతృతతో అడిగింది .
హెడ్ మిస్ట్రెస్ ప్రేమతో గోరుముద్దలు కలిపి తినిపిస్తారు తింటేనే చెబుతాను .
జానకి : అంటీ ……
హెడ్ మిస్ట్రెస్ : ఇదిగో ఇదిగో ఇప్పుడే తినిపిస్తాను జానకీ …… అంతకంటే అదృష్టమా …… , థాంక్యూ థాంక్యూ మహేష్ …… అంటూ ప్రేమతో తినిపించారు .
జానకి : మహేష్ నువ్వూ తిను ……
Yes yes జానకీ ….. థాంక్యూ థాంక్యూ అంటూ తిన్నాను .
జానకి : ఇష్టంగా తింటున్నాను కదా చెప్పు మరి ? ……
చెబుతా చెబుతా …… , రెండవది వచ్చేసి పెద్దమ్మ ద్వారా తెలుసుకున్నాను – ఏమిటంటే …… మనం ఇక్కడ అమ్మను తలుచుకుని చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉంటే పైన స్వర్గంలో ఎక్కడ స్వర్గంలో చెప్పు చెప్పు …..
జానకి – మేడం : స్వర్గంలో అంటూ ఆనందిస్తున్నారు .
అవును స్వర్గం నుండి చూస్తూ మురిసిపోతారు – అదే మనం బాధపడుతుంటే అమ్మలు నరకంలో ……
జానకి : వద్దు వద్దు మహేష్ ……. అంటూ మేడం ను గట్టిగా హత్తుకుంది .
అవును జానకీ …… మన బాధనే వారికి నరకం – నిన్ను పైనుండి అలా చూస్తూ ఎంత బాధపడతారో …….
జానకి : లేదు లేదు లేదు ఇంకెప్పుడూ బాధపడను , అమ్మను తలుచుకుని సంతోషంగా ఉంటానుకదా …… , అమ్మ స్వర్గంలో సంతోషంగా ఉండాలి …….
అలా ఉండాలంటే నువ్వు చెప్పినట్లుగానే ఉండాలి ఇక నీఇష్టం ……
జానకి కళ్ళుతుడుచుకుని , అంటీ అంటీ తినిపించండి …….
జానకి …… మొదట నిన్ను తినమని ఎందుకు చెప్పానో తెలుసా ? .
హెడ్ మిస్ట్రెస్ : నాకు తెలుసు నాకు తెలుసు ……. , ఏ బుజ్జి జానకి తింటేనే స్వర్గంలో ఉన్న జానకి అమ్మ తినేది …….
జానకి : అవునా అంటీ …… ? .
హెడ్ మిస్ట్రెస్ : అవును జానకీ ……. , మొదటిదాని మాదిరి మహేష్ అనుభవంతో ఈ విషయం చెప్పి ఉంటే నేనూ నమ్మెదానిని కాదు – పెద్దమ్మ చెప్పారన్నారు చూడు ఎవరైనా నమ్మాల్సిందే , రుజువు నేనే నిన్నటికీ ఇప్పటికీ తేడా చూస్తూనే ఉన్నావుకదూ …….
జానకి : నేనే నమ్మలేకపోయాను , ఉన్నట్టుండి మా అంటీ రుద్రమదేవిలా మారిపోవడం అంటూ సంతోషంతో నవ్వుకున్నారు , ఇలా అడుగుతున్నానని ఫీల్ అవ్వకండి ఇంతకూ పెద్దమ్మ ఎవరు అంటీ – మహేష్ …….
అనాధలకు అమ్మలాంటివారు జానకీ …… , పేదరాసిపెద్దమ్మ కథలు వినే ఉంటావు చిన్నప్పుడు ….
జానకి : అమ్మమ్మ చెబుతూ నిద్రపుచ్చేవారు …..
వారే పెద్దమ్మ ….. , నీలో ఉంటారు – నాలో ఉంటారు – మేడం లో ఉంటారు ……
హెడ్ మిస్ట్రెస్ : ఉన్నారు ఉన్నారు …… , పెద్దమ్మే నా ధైర్యం …… థాంక్యూ పెద్దమ్మా …….
జానకీ …… స్వర్గంలో జానకి అమ్మ – పెద్దమ్మ కలిసే ఉంటారని నా నమ్మకం ……
జానకి : అయితే పెద్దమ్మ నాకుకూడా అమ్మే అంటూ బుజ్జి హృదయంపై ముద్దుపెట్టుకుంది సంతోషంతో ……..
జానకి : మహేష్ ….. మేము తింటున్నాము కానీ నువ్వు తినడం లేదు .
రెండవది చెప్పకపోయుంటే కొట్టేలా ఉన్నావు చెబుతూ ఎలా తినగలను చెప్పు …..
జానకి : Sorry sorry అంటూ మేడంతోపాటు నవ్వుతోంది – ఇక డిస్టర్బ్ చెయ్యములే తిను ……
ట్యాంక్ చుట్టూ నీరు చేరడం వలన బుజ్జిస్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ….. ప్లేట్స్ కడగడం కోసం – నీరు తాగడం కోసం ఇబ్బందిపడుతుండటం చూసి ఒక్క నిమిషం జానకీ అంటూ లేచి పరుగుపెట్టాను , పిల్లలూ …… wait wait అక్కడే ఉండండి పాచి ఉంది జారి పడిపోతారు అంటూ బాటిల్లో వాటర్ పడుతున్నాను – ట్యాంక్ లోపలకూడా పాచి ఉన్నట్లు బాటిల్లోకి చేరింది – పిల్లలూ …… ప్రస్తుతానికి ప్లేట్స్ మాత్రమే కడుగుదాము నిమిషంలో ఫ్రెష్ వాటర్ తోపాటు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ రాబోతున్నాయి .
పిల్లలు : ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి అంటే నిమిషం ఏమిటి ఎంతసేపైనా ఉంటాము అన్నయ్యా అన్నయ్యా ……
ఒక్క నిమిషం చాలు పిల్లలూ అంటూ పెద్దమ్మను ప్రార్థించాను . పిల్లలూ ….. ప్లేట్స్ – క్యారెజీ ఇవ్వండి అంటూ వాళ్ళతోపాటు శుభ్రం చేస్తున్నాను .
ఎప్పుడు వచ్చిందో ఏమిటో జానకి కూడా హెల్ప్ చేస్తోంది – పిల్లలూ …… జారిపోతారు అని మీ అన్నయ్య చెబుతున్నాడు కదా అక్కడే ఆగండి .
నవ్వుతూ పిల్లలకు హెల్ప్ చేస్తున్నాము .
పిల్లల అమ్మలు …… థాంక్స్ చెప్పడం చూసి జానకి ఆనందం మరింత పెరిగింది .
అలా పూర్తయ్యిందో లేదో వాటర్ బాటిల్స్ వెహికల్ – కూల్ డ్రింక్స్ వెహికల్ తోపాటు పెద్ద ఐస్ క్రీమ్ వెహికల్ కాలేజ్ లోపలివచ్చాయి .
పిల్లలు : అమ్మా అమ్మా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ …….
అమ్మలు : మీ కాలేజ్ దగ్గరికి ఐస్ క్రీమ్ వస్తుందని తెలియక డబ్బు తీసుకురాలేదు – సాయంత్రం ఇంటికి వెళ్ళాక కొనిస్తాములే …….
పిల్లలూ …… అవి సొసైటీ స్పాన్సర్ వెహికల్స్ , వాటర్ బాటిల్స్ తోపాటు కూల్ డ్రింక్స్ – ఐస్ క్రీమ్స్ ఫ్రీ …….
పిల్లలు : ఫ్రీ నా ? .
ఒకటి కాదు రెండు కాదు మీ ఇష్టమైనన్ని తినొచ్చు – మీరు అడగడం ఆలస్యం ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు వెళ్ళండి వెళ్ళండి …….
పిల్లలు : చాలే చాలే అమ్మా అంటే వినకుండా తినిపించావు – ఇప్పుడు చూడు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినలేము అంటూ గిల్లేసి పరుగులుతీశారు .
అమ్మలు : తల్లీ – కన్నా …… ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు .
జానకి : ఏమీకాదులే అమ్మలూ …… , ఎండ ఉందికదా ఎన్ని తిన్నా కోల్డ్ చెయ్యదు .
అమ్మలు : మీఇష్టం అంటూ నవ్వుకున్నారు .
పిల్లలు …… వాటర్ బాటిల్ వెహికల్ మరియు కూల్ డ్రింక్స్ వెహికల్ దగ్గరికి ఒక్కరూ వెళ్ళలేదు అందరూ ఐస్ క్రీమ్ వెహికల్ నే చుట్టుముట్టారు .
పిల్లలూ …… అందరికీ ఎన్నికావాలంటే అన్ని ఇస్తాము సరేనా అంటూ రెండు చేతులకు రెండు రెండు ఐస్ క్రీమ్స్ అందిస్తున్నారు .
అమ్మలు : పిల్లలూ …… ముందు నీళ్లు తాగాలి .
జానకి : అమ్మలూ …… ఐస్ క్రీమ్స్ తిన్నాక చేరేది అక్కడికే మీరేమీ కంగారుపడకండి అనిచెప్పి ఆనందిస్తోంది .
ఆఅహ్హ్ ….. జానకీ , నీ నవ్వుని చూస్తే చాలు ఈ బుజ్జిహృదయం గాలిలో తెలిపోతుందనుకో ……
జానకి : మరింత అందంగా నవ్వుతోంది .
అమ్మో ఆకలి ఆకలి అంటూ మేడం వైపుకు అడుగులువేశాను .
పిల్లలు రెండురెండు ఐస్ క్రీమ్స్ పట్టుకుని థాంక్యూ థాంక్యూ అన్నయ్యా అంటూ తింటున్నారు .
నాకెందుకు చెబుతున్నారు – వెహికల్స్ కు చెప్పండి ….. ( వాటికి చెబితే వాటిని పంపించిన పెద్దమ్మకు చెప్పినట్లే అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను ) .
