తల్లీ …… తల్లీ మహీ ……
జానకి : అమ్మమ్మ వచ్చింది , మహేష్ …… మా అమ్మమ్మ వచ్చింది అంటూ బ్యాగుని అక్కడే వదిలేసి బయటకు పరుగులుతీసింది .
మేడంతోపాటు నవ్వుకుని బ్యాగుని తీసుకుని వెనుకే వెళ్ళాము .
జానకి : అమ్మమ్మా అమ్మమ్మా …… అంటూ పరుగునవెళ్లి స్కూటీ దిగిన తన అమ్మమ్మ గుండెలపైకి చేరింది .
తల్లీ ….. తల్లీ మహీ …… నేను చూస్తున్నది నిజమేనా ? అంటూ ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులుకురిపిస్తున్నారు , తల్లీ …… నిన్ను ఇలా మళ్లీ చూస్తాననుకోలేదు – మీ తాతయ్య చూస్తే ఎంత ఆనందిస్తారో …… నా తల్లీ నా బంగారుకొండ నా ప్రాణం ……. అంటూ ముద్దులు ఆపడంలేదు .
హెడ్ మిస్ట్రెస్ : మీ జానకినే అంటీ …….
అమ్మమ్మ : కూతురి పేరు వినగానే ఉద్వేగానికి లోనైనట్లు ….. జానకినా ? అంటూ బుజ్జిజానకి బుగ్గలను అందుకుని ఆశ్చర్యపు సంతోషంతో చూస్తున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : బుజ్జిజానకి అంటీ ……
జానకి : అవును అమ్మమ్మా …… , ఈ ఆనందాలకు కారణం మహేష్ అంటూ జరిగింది మొత్తం వివరించింది .
అమ్మమ్మ : బాబూ మహేష్ అంటూ దగ్గరికివచ్చి చల్లగా ఉండు నాయనా అంటూ దీవించారు .
అమ్మమ్మా …… ఇకనుండీ బుజ్జిజానకి హ్యాపీగా ఉంటుంది – మీరుకూడా బుజ్జిజానకి అనిపిలిస్తే ఫుల్ హ్యాపీ …..
అమ్మమ్మ : చాలా సంతోషం మహేష్ …… , బుజ్జిజానకీ ……
జానకి : అమ్మమ్మా …… అంటూ సంతోషంతో చుట్టేసింది .
అమ్మమ్మ : ఈసంతోషం చూడాలని మీ తాతయ్య నేను మొక్కని దేవుడంటూ లేరు – బుజ్జిదేవుడి రూపంలో వచ్చి మా కోరిక తీర్చారన్నమాట …… , మీ తాతయ్య వేచిచూస్తున్నారు వెళదామా ? .
జానకి – మేడం : బుజ్జిదేవుడన్నమాట అంటూ ఆనందిస్తున్నారు .
అమ్మమ్మ : మహేష్ ….. నీరుణం తీర్చుకోలేనిది .
తీర్చుకోవచ్చు అమ్మమ్మా ……. అంటూ బుజ్జిజానకి బ్యాగును స్కూటీలో ఉంచాను .
జానకి : అమ్మమ్మా …… వెళదాము పదా …..
అమ్మమ్మా అమ్మమ్మా ……
మేడం నవ్వులు ఆగడం లేదు
జానకి : వినకు అమ్మమ్మా …… , ఏమిటో నేను చెబుతాను పదా ……
నాకోరిక తీర్చారన్నమాట సరే …… , బుజ్జిజానకీ …… ” HAPPY NEW YEAR ” .
బుజ్జిజానకి : ఈ ఆనందంలో ఆ సంగతే మరిచిపోయాను అంటూ దగ్గరికివచ్చి happy new year మహేష్ – happy new year అంటీ …… విష్ చేసింది .
హెడ్ మిస్ట్రెస్ : Happy new year బుజ్జిజానకీ – Happy new year మహేష్ ……
Happy new year మేడం ……
బుజ్జిజానకి : తాతయ్య ఎదురుచూస్తూ ఉంటారు రేపు ఉదయం కలుద్దాము మహేష్ …… , తొందరగా వచ్చెయ్యి …… , అంటీ బై …..
హెడ్ మిస్ట్రెస్ : బై తల్లీ …… ఉమ్మా .
అమ్మమ్మ : తల్లీ జానకీ….. ఎప్పుడు వీలుకుదిరితే అప్పుడు మహేష్ ను ఇంటికి పిలుచుకునిరా …… , ఇష్టమైనవన్నీ చేసిపెడతాను .
జానకి : నాకు తెలియదా అమ్మమ్మా …… , మహేష్ బై …….
రేపు కలుద్దాము బుజ్జిజానకీ ….. అంటూ ఒక చేతిని బుజ్జిహృదయంపై వేసుకుని మరొకచేతితో టాటా చెప్పాను , wait wait బుజ్జిజానకీ వన్ మినిట్ అంటూ పరుగునవెళ్లి మూడు ఐస్ క్రీమ్స్ తీసుకుని ఒకటి దాచుకుని వచ్చాను – అమ్మమ్మా …… మీకు తాతయ్యగారికి ……
జానకి : మరి నాకు ….. ఈ ఈ ఈ .
నవ్వుకుని దాచుకున్నదానిని అందించాను .
జానకి : నా మహేష్ గురించి నాకు బాగా తెలుసు – Once again Happy new year అంటూ నా బుజ్జిహృదయంపై ముద్దుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయింది .
ఆఅహ్హ్హ్ …….
హెడ్ మిస్ట్రెస్ : పట్టుకున్నానులే ఇక నువ్వూ వెళ్లు మహేష్ – బై అంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు .
మీదెబ్బ టేస్ట్ చెయ్యకుండా ఎలా బై చెప్పగలను అంటూ నా క్లాస్రూంలోకివెళ్లి బ్యాగు భుజాలపై వేసుకుని నేరుగా ఆఫీస్ రూమ్ దగ్గరకువెళ్లి May i come in మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : దెబ్బలుపడతాయి ఇంకొకసారి లోపలికిరావడానికి పర్మిషన్ ఆడిగావంటే , నేను ఉన్నా లేకపోయినా నువ్వు – జానకి ఎప్పుడైనా నేరుగా లోపలికివచ్చేయ్యొచ్చు అంటూ కోపంతో చూస్తున్నారు .
ఆ దెబ్బలే కదా మేడం నాకు కావాల్సింది – నేను రెడీ ……
హెడ్ మిస్ట్రెస్ : అమ్మో కేర్ఫుల్ గా ఉండాలి లేకపోతే జానకి బాధపడుతుంది .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడం ……..
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో మహేష్ అంటూ నవ్వుకుంటూనే ఆఫీస్ రూమ్ కీస్ తీసుకుని హ్యాండ్ బ్యాగు సర్దుకుంటున్నారు .
అంతేనా మేడం ……
హెడ్ మిస్ట్రెస్ : అంతే మహేష్ ……. అనిచెప్పి అటువైపుకు తిరిగారు .
ఫైనల్ గా బ్రతిమాలుకుంటున్నాను ……
హెడ్ మిస్ట్రెస్ : ఫైనల్ గా బదులిస్తున్నాను – దెబ్బలు తప్ప ఏమైనా అడుగు ……
దెబ్బనే కావాలి ఇలాకాదు అంటూ సైడ్ కు వెళ్లి మేడం బుగ్గపై ముద్దుపెట్టాను .
అంతే చెంప చెళ్ళుమంది దెబ్బ కాస్త గట్టిగానే …… – మహేష్ మహేష్ …… sorry sorry – నా చెంప ఎర్రగా కందిపోవడం చూసి మేడం కళ్ళల్లో చెమ్మ ……
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ మేడం – ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది అంటూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాను .
నిమిషం తరువాత మేడం బాధపడుతూనే బయటకువచ్చారు .
మేడం …… నేను లాక్ చేస్తాను అంటూ అందుకుని డోర్స్ వేసి లాక్ చేసి కీస్ అందించాను .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ …… ఇంకా వెళ్లలేదా ? .
మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి అదికూడా అప్పుడప్పుడూ భయంవేస్తుంది అని చెప్పాక ఎలా వెళ్లగలను మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : ఇంత మంచివాడిని కొట్టాను – ఇంకా నా వేలి గుర్తులు అలానే ఉన్నాయి అంటూ బాధపడుతూ చెప్పారు .
మేడం …… మీరు దేనిగురించి మాట్లాడుతున్నారు – ఈ దెబ్బే కదా రేపు ఉదయం వరకూ మిమ్మల్ని గుర్తుచేస్తూ ఉండేది .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ …… నొప్పివేస్తోందా ? .
మేడం మేడం …… ఇంత సంతోషంతో నవ్వుతుంటే నొప్పివేస్తోందా అని అడుగుతారేమిటి ? , ఒకేఒక స్కూటీ ఉందంటే అది మీదే అన్నమాట ……. ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ స్కూటీవరకూ వదిలాను , మేడం …… I am happy అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను – నేను ఆడిగినవెంటనే కొట్టి ఉంటే ఇంతవరకూ వచ్చేదే కాదు ……. ఏమాత్రం ఆలోచించకుండా జాగ్రత్తగా వెళ్ళండి .
హెడ్ మిస్ట్రెస్ : అవును తప్పంతా నాదే ……
అదిగో మళ్లీ …… , ముందు మీరు వెళ్ళండి .
హెడ్ మిస్ట్రెస్ : నువ్వు ఎక్కడికి వెళ్ళాలి …….? .
చాలాదూరం మేడం ….. , బస్ స్టాప్ ఇక్కడే కదా నెనువెళతాను మీరువెళ్లండి ఒక్క నిమిషం అంటూ పరుగునవెళ్లి మేడం ఇంటిలో ఎంతమంది ఉన్నారో తెలియక బోలెడన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి అందించాను .
హెడ్ మిస్ట్రెస్ : నవ్వేశారు …… , మహేష్ ….. మాఇంట్లో మా బుజ్జి బాబు – అత్తయ్యా మావయ్య …….
బుజ్జిబాబు …… , మీ అంత క్యూట్ గా ఉంటాడు .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ …… 3rd ఇయర్ , నెక్స్ట్ ఇయర్ ఈ కాలేజ్లోనే జాయిన్ చేస్తాను .
మరి సర్ …… ? .
మేడం కళ్ళల్లో చెమ్మ – ఇక్కడ లేడు అంటూ కాస్త కోపంగానే బదులిచ్చారు , సరే అయితే నవ్వించేశావు జాగ్రత్తగా ఇంటికివెళ్లు అంటూ నా బుగ్గను స్పృశించారు .
ఇష్టమైనదే కదా మేడం ….. టాటా అంటూ పంపించాను , అలా వెనుకకు చూడకండి మేడం బై …… , ఆఅహ్హ్ తియ్యనైన నొప్పి …… అంటూ స్పృశించుకుంటూ బయటకు నడిచాను – అంటీలకు కాల్ చేసాను – అంటీల కోపపు వాయిస్ విని నవ్వుకున్నాను , అంటీలను ఐస్ క్రీమ్స్ రా అంటూ మళ్లీ వెహికల్ దగ్గరకువెళ్ళాను . అన్నా …… స్టూడెంట్స్ అందరికీ సరిపోయాయా ? .
అన్న : ఏంటి మహేష్ తెలియనట్లు అడుగుతున్నావు – ఇది స్వర్గపు ఐస్ క్రీమ్ వెహికల్ అంటూ ఒక ఐస్ అందుకున్నారు మారుక్షణంలో ఆ ప్లేస్ లో రెండు ఐస్ క్రీమ్స్ ప్రత్యక్షం అయ్యాయి – స్టూడెంట్స్ అందరూ ఇష్టమైనన్ని ఇంటికి తీసుకెళ్లారు .
Wow ….. లవ్ యు లవ్ యు పెద్దమ్మా …… , అన్నా ……. మూడు కోన్ ఐస్ క్రీమ్స్ ఇవ్వండి మా అంటీ వాళ్లకు …… థాంక్యూ , సేఫ్టీ కి మరొక మూడు ఇవ్వండి అంటూ వాటిని బ్యాగులోఉంచుకుని బై చెప్పడంతో ఒక్కసారిగా మాయం అయిపోయాయి .
అటెండర్ …… క్లారూమ్స్ అన్నింటికీ తాళాలు వేస్తుండటం చూసి చేతులలో ఐస్ క్రీమ్స్ తో అంటీలను గుర్తుచేసుకుని వచ్చేస్తున్నాను అంటూ బయటకునడిచాను .
షాక్ ……. ముగ్గురు ఆక్కయ్యలు ఏకంగా స్కూటీలలో స్టైల్ గా గ్లాస్సెస్ పెట్టుకునిమరీ మహేష్ మహేష్ మహేష్ …… అంటూ సంతోషంతో పిలుస్తూ నాదగ్గరికి వచ్చి చుట్టూ రౌండ్స్ వేస్తున్నారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ …… ఇది మెయిన్ రోడ్ సైడ్ కు రండి సైడ్ కు రండి ……..
ముగ్గురూ సైడ్ కు వెళ్లి స్కూటీలను ఆపి గ్లాస్సెస్ ను మెడ కింద డ్రెస్ పై ఉంచుకున్నారు – ఇందుకుకాదూ నువ్వంటే ఇష్టం అంటూ నాదగ్గరికివచ్చి బుగ్గలను గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ …… , అక్కయ్యలూ …… కొత్త స్కూటీలు ? .
ఆక్కయ్యలు : అవును మనవే , అక్కయ్యలూ ….. అందరూ స్కూటీలలో వస్తున్నారు మీరుమాత్రం బస్సులో వస్తున్నారు అని అలా అన్నావోలేదో ……. ఏమిజరిగిందో తెలుసా ? ……
ఆక్కయ్యలు చెప్పకముందే కళ్ళముందు మెదిలింది , Wow …… మా ఆక్కయ్యలు టాపర్స్ అన్నమాట , అక్కయ్యలూ అక్కయ్యలూ ……. మీ సంతోషాలను నాదగ్గరకాదు అంటీలదగ్గర పంచుకోండి ……. అదే నాకూ సంతోషం .
ఆక్కయ్యలు : అంటీలూ అంటీలూ అంటీలూ ……. అంటూ మళ్లీ బుగ్గలను గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ……
ఆక్కయ్యలు : అయినా మేము టాపర్స్ అని నీకెలా తెలుసు ? .
అది ఒకరు చెప్పాలా అక్కయ్యలూ ……. , మా అక్కయ్యల గురించి నాకు తెలియదా ? .
ఆక్కయ్యలు : థాంక్యూ థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు – మహేష్ …… నొప్పివేస్తోందా ? .
అవునుమరి ……. అదే అంటీలు గిల్లి ఉంటే హాయిగా ఉండేది అంటూ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను .
ఆక్కయ్యలు : నువ్వంటేనే మండిపడే అమ్మలు అంటే ఎందుకంత ఇష్టం అంటూ తియ్యనైనకోపాలతో మళ్లీ గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ……. , ఇప్పుడు ఎంత కోప్పడితే తరువాత అంత ప్రేమ …… అది మీకు అర్థం కాదులే అక్కయ్యలూ …… మీకింకా అంత అనుభవం లేదు .
ఆక్కయ్యలు : మెడికల్ చదువుతున్నాము మాకు తెలియదు అంటావా ….. ఆయ్ ఆయ్ ఆయ్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ మాకోసమే కదా …….
నో నో నో అంటీలకోసం ఇష్టంతో తీసుకొచ్చాను .
ఆక్కయ్యలు : నడుములపై చేతులను వేసుకుని పెద్దపెద్దకళ్ళ కోపంతో చూస్తూనే లాక్కున్నారు – ప్రక్కనే ఉన్న మాకు కాకుండా దూరంగా ఉన్న అమ్మలకు ఇస్తాడట అంటూ మళ్లీ గిల్లేసి టేస్ట్ చేశారు – మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ …… ఇదేంటే ఇంత బాగుంది – మన కాలేజ్ క్యాంటీన్ లో మరియు అమ్మలతో షాపింగ్ వెళ్ళినప్పుడు ఎన్ని ఐస్ క్రీమ్ లు తిన్నాము …… this is wow మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ …… The best ఐస్ క్రీమ్ ఎవర్ మహేష్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ……
ప్చ్ ప్చ్ ……. అంటీలకోసం తీసుకొచ్చాను – ఐస్ క్రీమ్ వెహికల్ కూడా మాయమైపోయింది అదే అదే వెళ్ళిపోయింది ……..
ఆక్కయ్యలు : ఐస్ క్రీమ్ వెహికల్ ఏమిటి – మాయమవ్వడం ఏమిటి ? , నోటిలో కరిగిపోతోంది మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ……
అక్కయ్యలూ …… తినండి త్వరగా తినండి , అక్కడ అంటీవాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు .
ఆక్కయ్యలు : అవునవును కాస్త ఆలస్యం అయితే చాలు కంగారుపడిపోతారు ఏకంగా బస్ స్టాప్ దగ్గరకు వచ్చేస్తారు . అవును మహేష్ …… మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేసావు అంటూ ప్రేమతో అడిగారు .
అక్కయ్యలూ …… కాలేజ్లో మధ్యాహ్న భోజనం పెడతారుకదా …..
ఆక్కయ్యలు : అంతగా బాగోదు కదా మహేష్ అంటూ బాధపడ్డారు .
ఈ ఒక్కరోజుకే అక్కయ్యలూ ….. రేపటినుండి మొత్తం మార్పించేస్తున్నారు మా హెడ్ మిస్ట్రెస్ అంటూ జరిగింది జరగబోయేది వివరించాను .
ఆక్కయ్యలు : విన్నాము విన్నాము కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ చాలా మంచివారని విన్నాము – అంటే కాలేజ్ పూర్తిగా మారిపోబోతుందన్నమాట గుడ్ గుడ్ , మా మహేష్ కోరుకున్నాడు మాకు స్కూటీలు వచ్చాయి – కాలేజ్లో అడుగుపెట్టాడు కాలేజ్ చేంజ్ అవుతోంది …… అంటూ ఆనందిస్తున్నారు , అవునూ ….. మధ్యాహ్నం లంచ్ కోసమని ముగ్గురమూ ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ వచ్చింది ఏమిటీ ? .
ఓహ్ ఆదా ….. అంటీలకు కాల్ చేస్తుంటిని అంటూ సిగ్గుపడుతూ బదులిచ్చాను .
ఆక్కయ్యలు : అమ్మలు నీతో మాట్లాడారా …… , ఇంత సంతోషమైన విషయాన్ని ఇంత ఆలస్యంగా చెబుతావే అంటూ మురిసిపోతున్నారు .
అక్కయ్యలూ ……
ఆక్కయ్యలు : అంటే మాట్లాడలేదా ? , మరి గంటసేపు ……. ? .
కాన్ఫరెన్స్ రీ డయల్ చేస్తూ అంటీల స్వీట్ వాయిసస్ ఎంజాయ్ చేసాను అంటూ జరిగింది వివరించాను .
ఆక్కయ్యలు : ఏమిటీ …… ఆగంటసేపూ ……
అవునవును అంటూ మరింత సిగ్గుపడ్డాను – ఆ గంటసేపే కాదు అక్కయ్యలూ …… నా బుజ్జి మనసుకు అనిపించిన ప్రతీసారీ ……
ఆక్కయ్యలు : అంటే రోజంతా నీ బుజ్జిమనసులో ఉన్నది అమ్మలేకదా – రోజంతా చేస్తూనే ఉన్నావన్నమాట …….
అవునవును అంటూ చిరునవ్వులు చిందిస్తూ తలఊపాను .
ఆక్కయ్యలు : అమ్మలు కోప్పడలేదా ? .
చాలా చాలా …… , అంటీల ఆప్యాయతతోపాటు ఆ కోపం కూడా నాకు ఇష్టమేకదా …… అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
