థర్డ్ MISSION 2

సూర్యకిరణాలకు మెలకువవచ్చింది – ఆఅహ్హ్ ……. హాయిగా నిద్రపట్టింది అంటూ కళ్ళుతెరిచిచూస్తే పూలపాన్పుపై ఉన్నాను – మళ్లీ ఇక్కడికి ఎలా వచ్చాను , వర్షంలో బయట నిలబడినట్లు గుర్తు ……. , మొన్నా ఇలానే జరిగింది – నిన్నా ఇలాగే జరిగింది , ముగ్గు విషయంలో సహాయం చెయ్యనేలేదు కానీ నాకేమైనా జరిగితే తట్టుకోలేరు పెద్దమ్మ – లవ్ యు పెద్దమ్మా అంటూనే తియ్యదనంతో కోప్పడ్డాను .
ఇంతకూ టైం ఎంత అయ్యింది – మొబైల్ పగలగొట్టాను కదూ ……. కానీ పాన్పు ప్రక్కనే కొత్త ఐఫోన్ దానికింద సర్టిఫికెట్స్ …… కాలేజ్లో 9th క్లాస్ జాయిన్ అవ్వడానికి అవసరమైన TC – ఆధార్ కార్డ్ వాటితోపాటు పర్సులో బోలెడంత డబ్బు – బ్యాంక్ డీటెయిల్స్ & ATM కార్డ్ ……. , అంటే రాత్రి పెద్దమ్మ వచ్చారన్నమాట లవ్ యు పెద్దమ్మా ……. , అమ్మో ……. అప్పుడే 7 గంటలు దాటింది అంటూ టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి బయటకువచ్చాను .

పాన్పుపై కాలేజ్ డ్రెస్ – కాలేజ్ బ్యాగ్ మరియు ప్రక్కనే టేబుల్ పై వేడివేడిగా టిఫిన్ …….. , కాలేజ్ డ్రెస్ వేసుకుని టిఫిన్ చేసేసరికి 8:30 అయ్యింది …… , మామూలుగా govt కాలేజ్స్ 9 కు కాబట్టి ఇట్స్ టైం అంటూ కాలేజ్ బ్యాగ్ లో సర్టిఫికెట్స్ పెట్టుకున్నాను – పెద్దమ్మా …… లంచ్ ఎలా ? , Ok ok వేడివేడిగా అక్కడికే వస్తుందన్నమాట – మీరెలా అంటే అలా …….

బయట ….. అమ్మలూ అమ్మలూ …… 9 గంటలు అవ్వబోతోంది మహేష్ ఇంకా బయటకురాలేదు , ఇక మీరు వద్దు అన్నా వినము లోపలికివెళ్లి చూస్తాము ఏమైందో ఏమో కంగారుగా ఉంది .

అదేసమయానికి కాలేజ్ బ్యాగ్ వేసుకుని కాలేజ్ డ్రెస్సులో డోర్ తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాను .
హమ్మయ్యా …… థాంక్ గాడ్ మహేష్ , నీకేమీ కాలేదు – గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంతో విష్ చేశారు ఆక్కయ్యలు …….
ఇంటికి తాళం వేసి , ఆ విషెస్ ను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కయ్యలను దాటుకుని రోడ్డుమీదకు వచ్చాను .
అక్కయ్యల మాటలకు అంటీ వాళ్ళు కూడా కంగారుపడుతూ బయటకు రావడం చూసి నవ్వుకున్నాను – అంటీలూ …… నాకేమైనా అయ్యిందని కంగారుపడ్డారా ? , మీరు ఎదురుగా ఉండగా నాకేమౌతుంది చెప్పండి , గుడ్ మార్నింగ్ వాసంతి అంటీ – గుడ్ మార్నింగ్ సునీత అంటీ – గుడ్ మార్నింగ్ కాంచన అంటీ ……..
అంటీ వాళ్ళు : నీగురించి కంగారుపడ్డాము చూడు – అదీ మా తప్పు …… , దిట్టంగా ఉన్నావు అని చెబితే రాత్రి నుండీ నమ్మడం లేదు మా తల్లులు , తల్లులూ …… చూశారుకదా ఇప్పుడు అర్థమయ్యిందా ? .
ఆక్కయ్యలు : అర్థమయ్యింది అర్థమయ్యింది , ప్రేమతో విష్ చేసింది మేమైతే మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని దాటుకుని వెళ్లి మరీ మిమ్మల్ని అంతకంటే ప్రేమతో విష్ చేసాడు అదికూడా పేరుపేరునా ? .
అంటీ వాళ్ళు : మాకేమీ ఆ విషెస్ అవసరం లేదులే – నిన్న చేసిన ఘనకార్యం చాలు ……. , చూడు కాలనీ అంతా అధ్యక్షురాలి బ్యానర్లతో ఎలా నిండిపోయిందో …….
అంటీ …… ఈ బ్యానర్లు కేవలం కాలనీకి మాత్రమే పరిమితం , మా అంటీలకోసం ఏదో గొప్పదే ఎదురుచూస్తోంది …….
అంటీ వాళ్ళు : చాలు నాయనా చాలు , మాగురించి ఆలోచించడం మానేసి బుద్ధిగా వెళ్లి చదువుకో …… , తల్లులూ జాగ్రత్త అనిచెప్పి లోపలకు నడిచారు .
( 24/7 మా అంటీలు …… నా హృదయంలో ఉంటారు – అంత అందాలను ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను )
ఆక్కయ్యలు : లవ్ యు మామ్స్ ……. , మహేష్ …… తిన్నావా ? .
ఇది అంటీలు అడిగి ఉంటే బాగుండేది ……
ఆక్కయ్యలు : అంటీలు అంటీలు అంటీలు ……. , అంతలా నిన్ను దూరం పెడుతుంటే మళ్లీ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు ……
అక్కయ్యలూ …… అంటీలు తిన్నారా ? .
ఆక్కయ్యలు : అదిగో మళ్లీ ……
అంటీ వాళ్ళు : మా తల్లులు కాలేజ్ కు వెళ్ళాక తింటాము – అయినా నీకెందుకు చెప్పాలి …….
చెప్పేసారు అంటీలూ అంటూ నవ్వుకున్నాను .
ఆక్కయ్యలు : అవును అమ్మలూ …… చెప్పేసాక మళ్లీ నీకెందుకు చెప్పాలి అంటారేమిటి అంటూ నవ్వుకుంటున్నారు .
అంటీ వాళ్ళు : చిరుకోపంతో మాసంగతి వదిలెయ్యండి , పిల్లాడు తిన్నాడో లేదో కనుక్కోండి .
ఫుల్ గా తిన్నాను అంటీలూ …… , ఆఅహ్హ్ …… థాంక్యూ ఫర్ అస్కింగ్ , ప్చ్ …… తినలేదు అని ఉంటే బాగుండేది , అంటీల చేతి వంట టేస్ట్ చేసేవాడిని ……. , నాకు తెలిసిపోతోంది అంటీ వాళ్ళు సూపర్ గా వండుతారని ……
ఆక్కయ్యలు : ఒకరినిమించి మరొకరు మహేష్ ……. , క్యారెజీ ఉంది టేస్ట్ చేస్తావా ? .
అది అంటీలు చెప్పాలి …….
అంటీ వాళ్ళు : పగటి కలలు కనకు …….
ఆ అదృష్టం కోసం ఎన్నిరోజులైనా వేచిచూస్తాను అంటీలూ …….
అంటీ వాళ్ళు : ALL THE BEST …….
థాంక్యూ అంటీలూ ……. , 9 అవుతోంది మీరు వెళ్లి టిఫిన్ చెయ్యండి .
అంటీ వాళ్ళు : నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు – జాగ్రత్త ……
ఆఅహ్హ్ …… మళ్లీ థాంక్యూ అంటీలూ ……
అంటీ వాళ్ళు : మేము చెప్పినది మా తల్లులకు ……
ప్చ్ ప్చ్ …….
అంటీలు నవ్వుకుంటూ లోపలికివెళ్లారు .

ఒసేయ్ …… వీళ్ళ మధ్యన మనం కేవలం సైడ్ పాత్రధారులం మాత్రమే అంటూ ఆక్కయ్యలు చిరు చిరు కోపాలతో నాచేతులపై గిల్లేసారు ఆక్కయ్యలు …….
స్స్స్ స్స్స్ …….
ఆక్కయ్యలు : అమ్మలు ఎంత దూరం పెడుతున్నా – కోప్పడుతున్నా ఎందుకు ? .
కొత్త సంవత్సరం రోజున చెప్పినవన్నీ జరిగి అంటీల పెదాలపై ఆ ఆనందం చూడాలికదా అక్కయ్యలూ …….
ఆక్కయ్యలు : జరిగినప్పుడు చూద్దాములే కానీ మహేష్ , ముందుగా అయితే మేము ….. కాలేజ్ కు – నువ్వు ….. కాలేజ్ కు పోదాము పదా …… , మహేష్ ….. మీ govt కాలేజ్ – మా govt మెడికల్ కాలేజ్ ప్రక్కప్రక్కనే …….
Wow …… , ఫస్ట్ డే ఆలస్యంగా వెళ్లకూడదు కాబట్టి పదండి …….
ఆక్కయ్యలు : అవునవును …… , వీధి చివరలో బస్ స్టాండ్ ……

అక్కయ్యలూ …… మీ బ్యాగ్స్ – క్యారెజీ ఇవ్వండి మోసుకొస్తాను .
ముగ్గురూ షాక్ లో ఉండిపోయారు ……
అక్కయ్యలూ అక్కయ్యలూ ……. ఏమైంది ఏమైంది ? .
ఆక్కయ్యలు : ఫస్ట్ టైం పాజిటివ్ గా స్పందించావు తెలుసా …… , థాంక్యూ థాంక్యూ థాంక్యూ …… పర్లేదులే బరువుగా ఏమీ లేవు , నువ్వు ….. నీ కాలేజ్ బ్యాగ్ కూడా మోస్తున్నావు కదా పదా……
అదికాదు అక్కయ్యలూ …… , మీ బ్యాగ్స్ మోసినందుకు ప్రతిఫలంగా ప్రతిఫలంగా …….
ఆక్కయ్యలు : ప్రతిఫలంగా ? ప్రతిఫలంగా ? ప్రతిఫలంగా ……. ?
ప్రతిఫలంగా ఇంటి నెంబర్స్ ఇస్తారని ఆశ …….
అక్కయ్యలు : ఇంటి నెంబర్స్ OR అమ్మల నెంబర్స్ …… ? .
అంటీల నెంబర్స్ …….
ఆక్కయ్యలు : అనుకున్నాము అనుకున్నాము , మాతో పాజిటివ్ గా మాట్లాడటం ఏమిటి అని , ఇది అన్నమాట విషయం …… , అమ్మల నెంబర్స్ ఇవ్వాలంటే ఏదైనా మ్యాజిక్ జరగాలి , మేమిచ్చాము అని తెలిస్తే అమ్మలు వీరంగం ఆడేస్తారు – నీపై అలా మారింది మరి అభిప్రాయం …… చూద్దాములే అదిగో బస్ బస్ మనం వెళ్ళేలోపు వెళ్లిపోయేలా ఉంది – మిస్ అయితే మళ్లీ 15 నిమిషాలు వేచిచూడాలి స్టాప్ స్టాప్ స్టాప్ ……

స్టాప్ స్టాప్ …… అంటూ పరుగులుపెట్టిమరీ వెళుతున్న బస్సును కొట్టినా ఆపకపోవడంతో బస్సుకంటే వేగంగా పరిగెత్తి బస్సుకు అడ్డుగా నిలబడ్డాను – బస్సు ఆగింది .
మహేష్ మహేష్ మహేష్ …… అంటూ కంగారుపడుతూ వచ్చి థాంక్ గాడ్ అంటూ హత్తుకున్నారు ఆక్కయ్యలు …….
అక్కయ్యలూ …… బస్సు ఆగింది పదండి ఎక్కుదాము .
అంతలో బస్సు హార్న్ కొట్టడంతో ఎక్కి కూర్చున్నాము .
ఆక్కయ్యలు : మహేష్ ….. 15 నిమిషాలు వేచి చూసేవాళ్ళం కదా – నీకేమైనా జరిగి ఉంటే …….
అంటీల కళ్ళల్లో పరిపూర్ణమైన సంతోషం చూసేంతవరకూ నాకేమీ కాదు అక్కయ్యలూ మీరు కంగారుపడకండి .
ఆక్కయ్యలు : ఎందుకు చేసావు ? ఎంత భయం వేసిందో తెలుసా ? ……
కూల్ కూల్ అక్కయ్యలూ …… , నాకేమీ కాదు – మీరే కదా అంటీల నెంబర్స్ ఇవ్వాలంటే మ్యాజిక్ జరగాలని …….
ఆక్కయ్యలు : అందుకని ఇలా చేస్తావా ? , ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు , ఇలా చెయ్యకూడదంటే ముందు అమ్మల నెంబర్స్ ఇచ్చేయ్యాలి …….
యాహూ యాహూ yes yes …… అంటూ కేకలువెయ్యడంతో బస్సులో ఉన్నవాళ్ళందరితోపాటు బస్సు డ్రైవర్ కూడా బ్రేక్ వేసి మావైపుకు తిరిగారు .
Sorry sorry డ్రైవర్ అన్నా పోనివ్వండి పోనివ్వండి రైట్ రైట్ అంటూ అక్కయ్యలతోపాటు నవ్వుకున్నాను .
ఆక్కయ్యలు : అంతగా కేకలువెయ్యాలా ? .
మరి అంటీల నెంబర్స్ సంపాదించడమంటే మాటలా …… ఎవరెస్టు ఎక్కినంత ఆనందం వేస్తోంది , ముందు అంటీల నెంబర్స్ ఇవ్వండి ఇవ్వండి ……
ఆక్కయ్యలు : నీ మొబైల్ బద్దలైపోయింది కదా ……
గ్యారంటీ ఉంది అక్కయ్యలూ …… , నిన్న రాత్రి షాప్ కు వెళ్ళానా గంటలో రీప్లేస్ చేసిచ్చాడు అంటూ మొబైల్ బయటకు తీస్తూనే టక్కున అపద్ధము చెప్పేసాను .
ఆక్కయ్యలు : న్యూఎస్ట్ వర్షన్ అంటూ అందుకుని ఆనందిస్తున్నారు , ముందు మా నెంబర్స్ ఎంటర్ చేస్తాము .
వద్దు వద్దు అక్కయ్యలూ …… స్టోరేజ్ సరిపోదు …..
ఆక్కయ్యలు : అన్ని కాంటాక్స్ ఉన్నాయా నీతో , ఏదీ చూద్దాము అంటూ చూసి భద్రకాళీ కోపాలతో మొబైల్ ను నావైపుకు చూయించారు . ఇందులో ఉన్నది ఒకేఒక్క నెంబర్ ” పెద్దమ్మ ” నెంబర్ …… అంటూ కొడుతున్నారు .
Sorry sorry అక్కయ్యలూ ……. , ముందు అంటీల నెంబర్స్ తరువాత మీ నెంబర్స్ …….
ఆక్కయ్యలు : కుదరదు అంటూనే మొదట అంటీ నెంబర్స్ ఆ తరువాత వాళ్ళ నెంబర్స్ సేవ్ చేశారు …… , మహేష్ ….. ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యి – ఫుడ్ అవసరమైతే ఏమాత్రం మెహమాటపడకు …….
చెప్పానుకదా అక్కయ్యలూ …… అంటీలు తిను అనాలి అప్పుడే తినాలి , మీరేమీ బాధపడకండి పార్ట్ టైం జాబ్ ద్వారా బానే సేవ్ చేసుకుంటున్నాను , ఇష్టమైంది ఆర్డర్ చేసి తినేస్తాను .
ఆక్కయ్యలు : అయితే ok …… , అమ్మల నెంబర్స్ ….. మేమిచ్చాము అనిమాత్రం చెప్పకు ……
Ok …… , అక్కయ్యలూ …… నేను షాప్ కు వెళ్ళినప్పుడు ఐఫోన్ వాడుతాను అనుకోలేదు అలా ముట్టుకున్నాను ఇలా నా చేతిలో ఐఫోనే – మీరూ ముట్టుకున్నారు కాబట్టి సాయంత్రం లోపు ఐఫోన్ ……
ఆక్కయ్యలు : లేదు లేదులే మహేష్ …… , ఐఫోన్ కంటే ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి , అయినా థాంక్స్ …… అంటూ మొబైల్ ఇచ్చారు .
( ప్రాబ్లమ్స్ అడగబోయి ఆగిపోయాను – తొలిరోజే కదా తెలుస్తాయిలే అని మనసులో అనుకున్నాను ) , సూపర్ నెంబర్స్ ……
ఆక్కయ్యలు : థాంక్యూ మహేష్ …….
మీవి కాదు అక్కయ్యలూ …… అంటీ వాళ్ళవి .
అంతే కోపంతో మళ్లీ కొట్టారు .
టికెట్ అంటూ కండక్టర్ వచ్చారు .
నా పర్సులోనుండి చేంజ్ తీసేలోపు వాగ్దేవి అక్కయ్య ….. 4 టికెట్స్ టు govt మెడికల్ కాలేజ్ అంటూ హండ్రెడ్ ఇచ్చారు – ఏంటి మహేష్ …….
ఏమీలేదు ఏమీలేదు అక్కయ్యా …… , అంటీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాబట్టి నేను హ్యాపీ అంటూ పర్సు లోపల ఉంచేసుకున్నాను .
ఆక్కయ్యలు : ఇక్కడ కూడా అమ్మలేనా ? అంటూ గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ….. ఇలా అంటీ వాళ్ళు ఎప్పుడు కొడతారో – ఎప్పుడు గిల్లుతారో , ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ప్చ్ ప్చ్ …….
ఆక్కయ్యలు : నువ్వు మారవు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
20 నిమిషాల తరువాత కాలేజ్ ముందు బస్సు ఆగడంతో ప్రక్కనే కాబట్టి అక్కయ్యలతోపాటు నేనూ దిగాను .

ఆ బస్సులోనుండి కాలేజ్ వెళ్ళేవాళ్ళు ఆక్కయ్యలు మాత్రమే దిగారు – వేరువేరు చోట్ల నుండి వచ్చిన బస్సులోనుండి దిగినవాళ్ళు కూడా కాలేజ్ వైపుకు వెళ్లడం లేదు – చుట్టూ చూస్తే సిస్టర్స్ అందరూ స్కూటీలలో నేరుగా కాలేజ్ లోపలికి వెళ్లిపోతున్నారు , 5 నిమిషాలు చూస్తే కేవలం ఒక్కరు మాత్రమే బస్సు నుండి కాలేజ్లోపలికి వెళుతున్నారు .
అక్కయ్యలూ …… మీకు స్కూటీలు లేవా ? , స్కూటీలలో అయితే ఎంచక్కా ….. బస్సు టైమింగ్స్ తో పనిలేకుండా మన ఇష్టప్రకారం కాలేజ్ కు రావచ్చు ……
ఆక్కయ్యలు : బస్సు కంఫర్టబుల్ & కన్వీనియన్స్ గానే ఉంది మహేష్ …… , ఇక స్కూటీ ఎందుకు చెప్పు …… , hi hi ఫ్రెండ్స్ వస్తాము వస్తాము ……
నేనొచ్చాను కదా అక్కయ్యలూ …… పూర్తిగా మారబోతోందిలే .
ఆక్కయ్యలు : మహేష్ …… పిలిచావా ? .
అక్కయ్యలూ …… నా కాలేజ్ ఎక్కడో చెప్పనేలేదు …….
ఆక్కయ్యలు : మా కాంపౌండ్ ప్రక్కనే , అదిగో మీ కాలేజీ పిల్లలు , ఉండు అక్కడిదాకా వచ్చి డ్రాప్ చేస్తాము .
I am not a kid అక్కయ్యలూ …… , మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు కదా హ్యాపీగా వెళ్ళండి , సాయంత్రం కాలేజ్ వదలగానే వచ్చేస్తాను …….
లంచ్ కు వచ్చెయ్యి కలిసి తిందాము ……
పర్లేదులే అక్కయ్యలూ …….
ఆక్కయ్యలు : అవసరమైతే కాల్ చెయ్యి , జాగ్రత్త ….. ఆ govt కాలేజ్ గోలగొలగా ఉంటుంది .
Ok అక్కయ్యలూ ….. బై ….. – పెద్దమ్మా ….. ఇంతకుముందు ఐఫోన్స్ చెప్పి ఉంటే వాటితోపాటు స్కూటీలు కూడా కావాలి …… డాట్ ….. సంతోషంతో ఎగురుకుంటూ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను .

ఆశ్చర్యం …….. govt కాలేజ్ మెయిన్ గేట్ ప్రక్కనే కాంపౌండ్ వాల్ కు ఆనుకుని పాన్ షాప్ అందులో సిగరెట్స్ …… ఘోరం ఏమిటంటే నాముందే ఇద్దరూముగ్గురు కాలేజ్ డ్రెస్సులో ఉన్నవాళ్లు సిగరెట్స్ కొన్నారు …… సిగరెట్స్ మాత్రమే కాదు మందు ….. మందు మరియు గుట్కాలు కూడా పెద్దవాళ్ళు కొనుక్కుని వెళుతున్నారు – బెల్ట్ షాప్ లా అనిపించింది .
కాలేజ్ టైం 9 గంటలకు ఇప్పుడు 9:15 …… నేనే ఆలస్యం అనుకుంటే కాలేజ్ కు వచ్చిన పిల్లలందరూ కూడా క్లాస్సెస్ కు వెళ్లకుండా – ప్లే గ్రౌండ్ లోనూ ఆడుకోకుండా కాంపౌండ్ వాల్ పై కూర్చుని ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు చేసుకుంటున్నారు .
మై గేట్ పూర్తిగా పాడయ్యింది ఎవడు పడితే వాడు ఏకంగా మందు బాటిల్స్ గ్లాసులతో లోపలకువెళ్లి ఒక మూలన తాగేసి బాటిల్స్ ను అక్కడే పారవేసి వెళుతున్నారు .
కాలేజ్ చుట్టూ కాంపౌండ్ వాల్ చాలా చోట్ల కూలిపోయింది , బ్లాక్ హోల్స్ లా కొన్నిచోట్ల రంధ్రాలు – పిల్లలు వాటి ద్వారా అటూ ఇటూ వెళుతూ వస్తున్నారు – కాంపౌండ్ అటువైపు నివాసిస్తున్నవారు ఇదంతా చూసి కాలేజ్ గ్రౌండ్ ను చెత్త కుప్ప అనుకున్నారో ఏమో …… వాళ్ళ వేస్ట్ అంటూ కాంపౌండ్ ఇటువైపుకు దర్జాగా పారబోస్తున్నాను , క్లాస్సెస్ పైకప్పుల పెంకులు చెల్లాచెదురైపోయాయి ఏ క్షణాన క్లాసులో కూర్చున్న పిల్లలపై పడతాయో తెలియదు , మధ్యాహ్న భోజనం పథకం అయితే చెప్పే పరిస్థితులలో లేదు – పాత్రలను ….. మురికిలోనే ఉంచుతున్నారు – త్రాగడానికి ఏర్పాటుచేసిన ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడం దానిచుట్టూ నీరు నిలిచి మురుగులా మారిపోయింది – పిల్లలంతా దాటుకునివెళ్లి అక్కడే నీళ్లు తాగుతున్నారు .
గ్రౌండ్ లో పరిస్థితి ఇలా ఉంటే క్లాస్సెస్ లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది , సరైన బెంచస్ లేవు – బ్లాక్ బోర్డ్ విరిగిపోయాయి – లైట్స్ లేవు ఫ్యాన్స్ సంగతి చరప్పనక్కర్లేదు – టీచర్స్ లేకపోవడంతో పిల్లలంతా చిందులువేస్తున్నారు – టెక్స్ట్ బుక్స్ చింపేసి ఉంటలు చేసి కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు – అప్పుడే దర్జాగా వచ్చిన టీచర్స్ వీటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా ఆఫీస్ కు వెళ్లి నిమిషానికే బయటకువచ్చేశారు ఇకనైనా క్లాస్సెస్ కు వెళతారు అనుకుంటే ” సర్ …… రిజిస్టర్ లో సంతకం పెట్టేసాను బ్యాంకుకు వెళ్ళాలి అని ఒకరు – స్టాక్స్ చెక్ చేసుకోవాలని ఒకరు – మరొకరైతే ఏకంగా ఇక్కడ టీచింగ్ వదిలేసి దగ్గరలోని ప్రైవేట్ కాలేజ్లో టీచ్ చెయ్యడానికి వెళుతున్నాను క్లాస్ కు వెయ్యి నువ్వూ ట్రై చెయ్యి అంటూ మరొక టీచర్ ను కూడా తీసుకెళ్లాడు ” …….
ఆక్కయ్యలు చెప్పినది నిజమే కాలేజ్ మొత్తం గోలగోలగా మార్కెట్ ను తలపిస్తోంది – ముందైతే ఆఫీస్ రూమ్ కు వెళ్లి జాయిన్ అవుదాము జాయిన్ చేసుకునేవాళ్ళు అయినా ఉన్నారో లేదో …….
10th క్లాస్ క్లాస్రూం విండో దగ్గరికి చేరుకోగానే హృదయస్పందన వినసొంపుగా నా చెవులవరకూ వినిపించసాగింది – మనసు సంతోషంతో పులకించిపోసాగింది – అడుగులు ఆగిపోయాయి …….. మనకోసం ఎవరో ఎవరో ఇక్కడ పరితప్పిస్తున్నట్లు హృదయస్పందన ద్వారా తెలుస్తోంది , కళ్ళు వెతకడం మొదలుపెట్టాయి – లోపల ….. 10th క్లాస్ exams దగ్గర పడుతున్నాయి కాబట్టి సగం మంది బుద్ధిగా చదువుకుంటున్నారు మిగతా సగం వారిని డిస్టర్బ్ చేస్తున్నాము అనికూడా జ్ఞానం లేకుండా గోలగోలచేస్తున్నారు – చదువుకుంటున్న వాళ్ళనూ గోల చెయ్యడానికి లాగుతుండటం వారిపై పేపర్స్ విసురుతుండటం చూసి ఆగలేకపోయాను .
నేరుగా లోపలకువెళ్లి డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళ తలలపై బుద్ధిలేదా బుద్ధిలేదా అంటూ మొట్టికాయలువేశాను అంతకూ విననివాళ్ళ వీపులు విమానం మ్రోగడంతో ఆ సౌండ్స్ కు నొప్పితాలూకు కేకలకు అందరూ సైలెంట్ అయ్యి నావైపుకు తిరిగారు , మీరెలాగో చదువుకోవడం లేదు – బుద్ధిగా చదువుకుంటున్న వాళ్ళను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు గాడిదల్లా ఉన్నారు బయటకు వెళ్లి ఆడుకోండి – మీకంటే ఆ పిల్లలే నయం బయట ఆడుకుంటున్నారు .
నువ్వు ఎవర్రా చెప్పడానికి అని మీదకు వచ్చిన వాడి చేతిని వెనక్కు తిప్పాను …..
నొప్పి నొప్పి నొప్పి …….
వాడి కేకలకు కాంసెంట్రేట్ తో చదువుతున్న బాయ్స్ & గర్ల్స్ మావైపుకు చూసారు – ఆఅహ్హ్ ……. గుండెల్లో స్వీటెస్ట్ పెయిన్ …… , వాడి చేతిని అలాగేపట్టుకుని మరొకచేతిని హృదయంపై వేసుకుని తననే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
అందం – అమాయకత్వం కలగలిసినట్లు నావైపే చూసి నవ్వడం చూసి నా బుజ్జిహృదయం జివ్వుమంది ……
నొప్పి నొప్పి నొప్పి ……. బయటకు వెళ్లిపోతాము బయటకు వెళ్లిపోతాము ……
గుడ్ అంటూ తననే అపురూపంగా చూస్తూ వదలగానే …… అందరూ బయటకు పరుగులుతీశారు .
అందరితోపాటు తానూ …… థాంక్స్ చెప్పగానే , కలిగిన ఆనందం …… ఆఅహ్హ్ అంటూ వెనక్కుపడిపోయాను – సపోర్ట్ గా బెంచ్ ఉండటంతో పడిపోలేదు అంతే …….
మీరు మీరు చదువుకోండి చదువుకోండి ఎవ్వరూ రాకుండా నేను చూసుకుంటానుగా అంటూ హృదయంపై చేతినివేసుకుని తననే చూస్తూ ఉండిపోయాను అక్కడనుండి కదలలేకపోయాను , తనను చూస్తున్నంతసేపూ …… హృదయం – మనసు పరవశించిపోతున్నాయి .
మరుక్షణమే టీచర్ వచ్చినట్లు చదువుకుంటున్న సగం మంది లేచి విష్ చెయ్యడంతో తనూ మిగతావారూ లేచి విష్ చేశారు – అంతమందిలో తన వాయిస్ మాత్రం నేరుగా హృదయాన్ని తాకి సంజీవినిలా నా ఆయుష్షును మరికొంతకాలం పెంచేసినట్లు వొళ్ళంతా హాయిగా అనిపిస్తోంది .
టీచర్ : స్టూడెంట్ …… , ఈ క్లాసులో నిన్నెప్పుడూ చూడనేలేదే , వెళ్లి కూర్చో …….
Sorry sorry సర్ నేను 9th క్లాస్ …….
టీచర్ : అయితే ప్రక్క క్లాసులోకి వెళ్లు ……
Yes సర్ అంటూ దీనంగా తనవైపు చూస్తున్నాను .
9th క్లాస్ అయ్యుండి 10th క్లాస్ స్టూడెంట్స్ ను కొట్టావంటే గ్రేట్ అన్నట్లు కళ్ళతోనే తెలియజేస్తోంది .
పెదాలపై తియ్యదనం – సిగ్గు ……. , ఒక్కొక్క అడుగు బయటకు పడుతున్నకొద్దీ ….. హృదయవేగం పెరుగుతూపోతోంది , వెళ్లకురా అంటూ గోలగొలచేస్తోంది , సర్ ……. మీరు మాథ్స్ బాగా explain చేస్తారని విన్నాను ……
టీచర్ : నేను సైన్స్ టీచర్ ను కదా ……
అందరితోపాటు తనూ నవ్వుతోంది .
( మీ టీచింగ్ అంటే సరిపోయేది మాథ్స్ అని చెప్పాలా ? ) yes yes sorry sorry సర్ …… మీరు సైన్స్ బాగా టీచ్ చేస్తారని విన్నాను సర్ – నేను ఈరోజే జాయిన్ అవుతున్నాను – మీ క్లాస్ వినవచ్చా ? .
టీచర్ : ఈరోజు జాయిన్ అవుతున్నావా ? , షాకింగ్ …… నా టీచింగ్ బాగుంటుంది అని ఎవరు చెప్పారు అంటూ మురిసిపోతున్నారు .
సర్ బుట్టలో పడినట్లే …… , బుద్ధిగా చదువుకుంటున్న ఈ స్టూడెంట్స్ సర్ ……
టీచర్ : Are you స్టూడెంట్స్ ? .
మేమా అంటూ ఆశ్చర్యంతో చూస్తోంది .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ……..
తను : Yes సర్ అంటూ అందరితోపాటు నవ్వకుంది .
ఆఅహ్హ్ ……. ఆ నవ్వులో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు హృదయంపై చేతినివేసుకుని అలా చూస్తుండిపోయాను .
టీచర్ : అయితే వెళ్లి కూర్చో ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
థాంక్యూ థాంక్యూ సర్ అంటూ తన చూడచక్కనైన నవ్వులు కనిపించేలా తనకు ఒక యాంగిల్ లో వెనుక కూర్చున్నాను – బోర్డ్ వైపు కాకుండా తననే చూస్తున్నాను – క్షణక్షణానికీ ఆనందం రెట్టింపవుతూనే ఉంది .

Now అటెండెన్స్ అంటూ టీచర్ చెప్పగానే ……. , తన పేరు తెలిసిపోతుందని తియ్యనైన గిలిగింత కలిగింది .
Yes సర్ yes సర్ ఫస్ట్ అటెండెన్స్ …….
టీచర్ : సైలెన్స్ ……
Sorry sorry సర్ ……. , అంతలోనే నిరాశ …… పేర్లు పిలవకుండా నెంబర్స్ పిలిచి అటెండెన్స్ వేస్తున్నారు ప్చ్ ప్చ్ …….
నా గుసగుసలు వినిపించినట్లు ……. తను మాత్రమే నావైపుకు తిరిగి ఏమైంది అంటూ కళ్ళతోనే అడిగింది .
ఆఅహ్హ్ …… అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు వాలిపోవడం చూసి ఆశ్చర్యంతో నవ్వుతోంది .
ఆ కళ్ళు ఏంటో కానీ నన్ను ఆకర్షించేస్తున్నాయి .

టీచర్ : నెంబర్ 2 ……
ప్రెజెంట్ సర్ అంటూ తన స్వీట్ వాయిస్ , అంతే ఆ క్షణం నుండీ నెంబర్ 2 నా ఫెవరేట్ అయిపోయింది .
అటెండెన్స్ తరువాత క్లాస్ స్టార్ట్ అవ్వడంతో తనతోపాటు అందరూ శ్రద్ధగా వింటున్నారు – ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా విరిగిపోయిన బెంచ్ పైననే మోచేతిని ఆనించి తననే కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను – ఎంతసేపు చూసినా తనివితీరడం లేదు .
నా చూపుల ఘాడత తనకు తెలిసినట్లు మధ్యలో రెండుమూడుసార్లు నావైపు చూసినప్పుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ కనురెప్పకొట్టాను .
అంతలోనే బెల్ మ్రోగడంతో …… టీచర్ క్లాస్ పూర్తిచేశారు – స్టూడెంట్ స్టూడెంట్ …….. నాక్లాస్ ఇష్టమని చెప్పి ఒక్కక్షణం కూడా బోర్డ్ వైపు చూడనేలేదు …….
అందరితోపాటు తనూ నవ్వుతోంది .
తలదించుకుని నవ్వుకున్నాను .
టీచర్ : జాయిన్ అవ్వాలన్నావు కదా రా ఆఫీస్ రూమ్ వరకూ వదులుతాను కమాన్ కమాన్ …… నేను మరొక క్లాసుకు వెళ్ళాలి .
తనవైపు చూస్తూనే సర్ తోపాటు బయటకువెళ్ళాను .
టీచర్ : అదిగో చివరగా ఉన్నదే ఆఫీస్ రూమ్ ముందు వెళ్లి జాయిన్ అవ్వు …… , ఉన్నది చాలన్నట్లు మరొకడు ఈ కాలేజ్ ఎప్పటికి మారెనో ……
అంటే ఇలాంటి మంచి టీచర్స్ కూడా ఉన్నారన్నమాట గుడ్ గుడ్ అంటూ మళ్లీ ఒకసారి క్లాస్ లోపలికి చూసాను – అంతలోనే మళ్లీ చదువులో నిమగ్నమైపోయి ఉండటం చూసి డిస్టర్బ్ చేయకూడదని ఆఫీస్ రూమ్ వైపుకు నడిచాను – ఫస్ట్ పీరియడ్ అయిపోయినా సగం స్టూడెంట్స్ గ్రౌండ్ & కాంపౌండ్ గోడలమీదనే ఉండటం చూస్తూనే ఆఫీస్ రూంలోకివెళ్ళాను .

టీసీ తోపాటు అవసరమైనవాటిని కాలేజీబ్యాగులోనుండి తీసి ఎదురుగా కనిపిస్తున్న మేడం దగ్గరకువెళ్ళాను – మేడం …… న్యూ జాయినింగ్ …….
” ఇయర్ మధ్యలోనా …… ? , ఇక్కడున్నవాళ్ళు చాలదన్నట్లు నువ్వుకూడానా ? , హెడ్ మిస్ట్రెస్ సంతకం కావాలి లోపలికివెళ్లు ”
Ok అంటూ డోర్ దగ్గరికివెళ్లి May i come in మేడం అన్నాను .
ఫైల్స్ చూస్తూనే Yes come in అన్నారు .
థాంక్యూ హెడ్ మిస్ట్రెస్ మేడం అంటూ లోపలికివెళ్లి , న్యూ జాయినింగ్ కోసం మీ సంతకం కావాలన్నారు .
న్యూ జాయినింగ్ ఈ మిడ్ ఇయర్ లోనా అంటూ నావైపు చూసి కన్నీళ్లను తుడుచుకున్నారు హెడ్ మిస్ట్రెస్ ………
అంటీలను చూసినంత ఆనందం కలుగుతోంది , తెలుసుకదా ఆటోమేటిక్ గా కుడి చెయ్యి హృదయంపైకి చేరిపోయింది – నా చేతిలో సర్టిఫికెట్స్ అన్నీ నేలపైకి చేరాయి .
హెడ్ మిస్ట్రెస్ : బాబూ బాబూ …….
మేడం స్వీట్ వాయిస్ వినిపిస్తోంది కానీ మైండ్ మాత్రం వారినే చూస్తూ ఉండిపోయింది .
హెడ్ మిస్ట్రెస్ : స్టూడెంట్ స్టూడెంట్ అంటూ లేచివచ్చిమరీ కిందపడిన సర్టిఫికెట్స్ తీసుకోవడం చూసి , sorry sorry మేడం అంటూ సడెన్ గా కిందకూర్చునే సమయంలో తలలు గుద్దుకున్నాయి .
స్స్స్ – స్స్స్ …… అంటూ ఇద్దరమూ నవ్వుకుని రుద్దుకుంటూనే పైకిలేచాము .
మేడం దెబ్బ బహు తియ్యగా అనిపించి నవ్వుతూనే ఉన్నాను .
మేడం : స్టూడెంట్ నొప్పివేస్తోందా ? స్టూడెంట్ స్టూడెంట్ …… అంటూ నా కళ్ళ ముందు చేతిని ఊపుతున్నారు , ప్రయోజనం లేక భుజం కదిల్చారు .
స్వీట్ షాక్ కొట్టినట్లు జలదరించాను , sorry sorry మేడం …….
మేడం : ఎవరిని దేనిని చూస్తున్నావు అంతలా ……
ఇంకెవరిని మేడం మిమ్మల్నే ……. అదే అదే మేడం …… మీ సంతకం కోసం చూస్తున్నాను .
మేడం : మిడ్ ఇయర్ లో జాయిన్ అవుతున్నావు ? .
జాయిన్ కాకూడదా మేడం …….
మేడం : నా ఉద్దేశ్యం అలాకాదు , కాలేజ్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వవచ్చు , ఎంతమంది స్టూడెంట్స్ కాలేజ్ కు వస్తే అంత మంచిది కాదా దేశానికి …….
ఆ ఒక్క మాటతో హెడ్ మిస్ట్రెస్ గారిపై అభిప్రాయం – గౌరవం ఎవరెస్టుని చేరింది .
మేడం : ఏ ఊరు – ఏ కాలేజ్ నుండి వచ్చావు అని , టీసీ లో ఉంటాయనుకో అంటూ నవ్వుకున్నారు .
ఆఅహ్హ్ …… హృదయంపై చెయ్యి ……
మేడం : ఏమైంది ? .
నథింగ్ నథింగ్ మేడం …….
మేడం : ఆ సంగతులన్నీ బ్రేక్ లో చూస్తాను – ఇప్పటికే సెకండ్ పీరియడ్ స్టార్ట్ అయి ఉంటుంది , క్లాసుకు వెళ్లు జాయినింగ్ సంగతి నేను పూర్తిచేసి అటెండర్ ద్వారా పంపిస్తాను .
వెళ్ళాల్సిందేనా …… మేడం ? ప్చ్ …….
మేడం పెదాలపై చిరునవ్వు …… స్స్స్ గట్టిగానే గుద్దుకున్నాము , స్టూడెంట్ ….. టీసీ చూసి మహేష్ …… నీకూ నొప్పివేస్తోందా ? అని అడిగారు .
స్వీట్ పెయిన్ గురించి ఎప్పుడైనా విన్నారా మేడం ……
మేడం : స్వీట్ పెయిన్ ? .
నాకు అలాంటి పెయిన్ వేస్తోంది అంటూ నవ్వుతూ చెప్పాను .
మేడం : మాటలు బాగానే మాట్లాడుతున్నావు ఇక వెళ్లు – క్లాస్ మిస్ అవుతావు ……..
ఎక్కడికి వెళ్ళేది మేడం , ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయని తెలియదా మీకు ……
మేడం : తెలుసు తెలుసు కానీ అవసరం లేదు – నువ్వూ ఇలాంటివి నమ్మకు ……
నమాకాలలో సంతోషమైనవాటిని నమ్మాలి – బాధపెట్టేవాటిని వదిలెయ్యాలి , మీ గుద్దు నాకు సంతోషాన్ని పంచింది ప్లీజ్ ప్లీజ్ మేడం …….
మేడం : అమ్మో …… మొదటి దెబ్బనే గట్టిగా తగిలింది – పెద్దలు చెప్పినట్లుగా రెండవసారి మరింత గట్టిగా గుద్దుకోవాలి , నావల్ల కాదు …….
మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ …….
మేడం : నో అంటే నో క్లాసుకు వెళ్లు ……
నెత్తిపై కాకపోతే అదిగో ఆ బెత్తంతో చేతిపై – ఒంటిపై …… మీ ఇష్టం ఎక్కడైనా కొట్టండి , మీ దెబ్బ స్వీట్ గా ఉంది …..
మేడం : What …… ? అంటూ ఆశ్చర్యపోతూనే నవ్వుకుంటున్నారు .
అలా నవ్వకండి మేడం రెండు దెబ్బలు తినాల్సివస్తుంది .
మేడం : నో నో నో …… వెళ్లు వెళ్లు …… అంటూ డోర్ వరకూ వదిలారు .
మేడం ……. మీనుండి దెబ్బ తినికానీ ఇంటికి వెళ్లను – ఒక దెబ్బ తినడానికి ఇంతలా ఎప్పుడూ బ్రతిమాలలేదు ……
మేడం : మహేష్ …… కోపం వచ్చేస్తుంది అంటూ నవ్వుతూనే క్లాసుకు వెళ్ళమని చేతితో చూయించి , నావైపు చూస్తూ చూస్తూనే వెళ్లి కూర్చున్నారు .
మేడం ……. నా మాటంటే మాటే , మీనుండి ఎలాగైనా దెబ్బ తినే ఇంటికివెళతాను , ఇప్పుడైతే మీరు ఆర్డర్ వేసినట్లుగా క్లాసుకు వెళుతున్నాను .

అంటీలను చూడకుండా ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 4 గంటలదాకా ఉండలేనేమో అనుకున్నాను కానీ అనుక్షణం ముగ్గురు అంటీలను గుర్తుచేసే అందమైన హెడ్ మాస్టర్ మరియు తన చిన్న చిరునవ్వుతోనే హృదయమంతా ఆక్రమించేసిన సీనియర్ ……. ఆఅహ్హ్ నెంబర్ 2 ను తలుచుకుంటేనే పెదాలపై అమితమైన ఆనందం …… , 10th క్లాస్ దగ్గరికి వచ్చేసామా …… నా హృదయస్పందన వినిపిస్తోంది అంటే వచ్చేసినట్లే అంటూ విండో దగ్గరికివెళ్లి , శ్రద్ధగా క్లాస్ వింటున్న తనను చూస్తూనే ఉండాలనిపిస్తోంది . ఆఅహ్హ్హ్ ….. పెద్దమ్మా , నన్నుకూడా 10th క్లాసులో చేర్పించి ఉండొచ్చుకదా – మీరు ఏమిచేసినా నా మంచికే అని తెలుసులే ……..
అనుకున్నాను అనుకున్నాను జాయిన్ అయినవెంటనే క్లాస్ కు రాకుండా ఇక్కడే ఆగిపోతావని అంటూ చెవుని పిండేస్తూ 9th క్లాస్ లోపలికి తీసుకెళ్లారు సైన్స్ టీచర్ ……..
నవ్వుతూనే వెళ్లి వెనుక బెంచ్ లో కూర్చున్నాను – అంటే సైన్స్ టీచర్ సెకండ్ పీరియడ్ మనదే అన్నమాట ……
టీచర్ : స్టూడెంట్స్ ……. న్యూ జాయినింగ్ , అచ్చు మీలానే అల్లరి పిల్లాడు , పేరు పేరు …….
మహేష్ సర్ ……
టీచర్ : మహేష్ ……. , చూద్దాము ఈ క్లాస్ అయినా శ్రద్దగా వింటాడో లేడో …….
మీగురించి తెలుసుకున్నాను – మీ క్లాస్ వినకపోతే మిస్ అయినట్లే అంటూ సైలెంట్ గా కూర్చుని బోర్డ్ వైపు చూస్తున్నాను .
టీచర్ : చూద్దాము మహేష్ అంటూ క్లాస్ స్టార్ట్ చేశారు – టీచింగ్ ఆసక్తిగా ఉంది .

కొద్దిసేపటి తరువాత ఎస్క్యూస్ మీ సర్ అంటూ అటెండర్ లోపలికివచ్చి టీచర్ తో మాట్లాడి వెళ్ళిపోయాడు .
టీచర్ : మహేష్ come here …… , మహేష్ ….. ఇవి కాలేజ్లో జాయిన్ అయినట్లుగా ఫార్మ్స్ – ఇవి govt టెక్స్ట్ బుక్స్ ……. , కొత్తవి లేవని పాతవే పంపించారు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పమన్నారు .
బుక్స్ పాతవి అయితేనేమి సర్ ……. , సిలబస్ ముఖ్యం కానీ …… , రెండింటిలో ఒక్కటే ఉంటుంది కదా ……..
టీచర్ : గుడ్ మహేష్ – తీసుకుని వెళ్లి కూర్చో …….
థాంక్యూ చెప్పి వెళ్లి కూర్చున్నాను . సైన్స్ టెక్స్ట్ బుక్ తప్ప మిగతా టెక్స్ట్ బుక్స్ బ్యాగులో ఉంచుకుని , జాయినింగ్ ఫార్మ్స్ చూస్తున్నాను – వాటిలో చివరన ” కాలేజ్ – స్టూడెంట్స్ మారాలంటే చెయ్యవలసినవి ” అన్న లిస్ట్ ఉన్న లెటర్ కనిపించింది – లిస్ట్ చదివితే నేను …… కాలేజ్లోకి ఎంటర్ అయినప్పుడు ఏవైతే గమనించానో వాటితోపాటు మరికొన్ని ఉన్నాయి , అంటే నేను హెడ్ మాస్టర్ రూమ్ కు ఎంటర్ కాకముందు ఈ లిస్ట్ నే చూస్తూ బాధపడుతున్నారన్నమాట – అంటే మేడం కళ్ళల్లో చెమ్మకు కారణం …… , నా జాయినింగ్ ఫార్మ్స్ తోపాటు ఈ లెటర్ కూడా జతకలిసి నాదగ్గరకు చేరింది – పెద్దమ్మ చేర్చి ఉంటారు – అంటే మనం రంగంలోకి దిగాల్సిన సమయం ఇంత త్వరగా వచ్చేసిందన్నమాట , పెద్దమ్మా …… మీ ఆజ్ఞను కాదంటానా చెప్పండి , హెడ్ మిస్ట్రెస్ మరింత మంచివారన్నమాట – ఏదో అంటీలలా అందంగా ఉన్నారని అనడం లేదు , నాతో మాట్లాడిన విధానం అంతకంటే ముఖ్యంగా ఈ లిస్ట్ చాలు వారి మంచితనం – నిజాయితీ తెలియజెయ్యడానికి …….
అంతలో కాలేజ్ బెల్ మ్రోగింది – టీచర్ …… క్లాస్ పూర్తిచేయకముందే ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటూ బయటకు పరుగులుతీశారు .
టీచర్ : నువ్వొక్కడివి ఉన్నావన్నమాట – రేపటి నుండి నువ్వూ ఇంతేలే …… , govt కాలేజ్ మేనేజ్మెంట్ అంటే ఇంతే …….
హెడ్ మిస్ట్రెస్ గారు …….
టీచర్ : నో నో నో …… కాలేజ్ – స్టూడెంట్స్ మార్పుకోసం హెడ్ మిస్ట్రెస్ గా జాయిన్ అయిన తొలిరోజు నుండీ సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తూనే ఉన్నారు వీలు కావడం లేదు , ముందు టీచర్స్ మారితేనేకదా స్టూడెంట్స్ అటుపై కాలేజ్ మార్పు చెందేది …… , మన హెడ్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే , ఈ స్కూళ్ళోనే చదివి ఈ సంవత్సరమే నెల ముందు ఈ కాలేజ్ కే హెడ్ మాస్టర్ గా వచ్చారు – ఇలా మారిపోయి ఉండటం చూసి బాధపడని రోజు లేదు – మార్చడానికి govt ఆఫీసస్ చుట్టూ తిరగని రోజు లేదు – మన మేడం ను కలెక్టర్ గారిని కలవకుండా చేస్తున్నారు ఆఫీసర్స్ …… ఎప్పటికి మారుతుందో ఏమిటో అంటూ బాధపడుతూ వెళ్లారు .

నా జాయినింగ్ ఫార్మ్స్ బ్యాగులో పెట్టి కాలేజ్ బ్యాగును క్లాసులోనే ఉంచి , లిస్ట్ తీసుకుని నేరుగా ఆఫీస్ రూమ్ కు చేరుకున్నాను , May i come in మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : Not now మహేష్ అంటూ టేబుల్ కింద వెతుకుతున్నారు .
థాంక్యూ మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : నేను లోపలికి రమ్మనలేదు ……
నేను కూడా ఎంటర్ అవ్వనేలేదు మేడం అంటూ నవ్వుతున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : మరి థాంక్స్ దేనికి ? .
నన్ను చూడకుండానే నా మాటలు గుర్తుపట్టి మహేష్ అని పిలిచినందుకు ……
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో పిలవలేదు ……
మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : పిలిచే ఉంటాను నాకు తెలియకుండా ……
తెలియకుండానా …… Why మేడం ? .
హెడ్ మిస్ట్రెస్ : ఎందుకా …… , నానుండి దెబ్బతినకుండా వెళ్లను అని సవాల్ చేసి వెళ్ళావుకదా , అప్పటి నుండీ అదే ఆలోచన …….
యాహూ …… yes yes yes …… ( మేడం కు తెలియకుండానే మేడం మనస్సు నన్ను తలుచుకుంటోంది అంటే నాకులానే అక్కడ కూడా కొట్టేసుకుంది అన్నమాట – మేడం కే ఇంకా తెలియరాలేదు ) , మేడం ముందైతే మీ కళ్ళల్లో చెమ్మను తుడుచుకోండి – ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గమనించాను .
హెడ్ మిస్ట్రెస్ : అలాంటిదేమీ లేదు అంటూనే తుడుచుకున్నారు – ఇంతకూ ఎందుకు వచ్చావు నేనైతే కొట్టను – కొమ్ములు వస్తే రానివ్వు చూద్దాము .
నవ్వుకున్నాను – కొమ్ములు వస్తే బాగోరు మేడం …… , ఎందుకు వచ్చాను అంటే మీరుదేనికోసమైతే కిందా మీదా వెతుకుతున్నారో అది నాదగ్గర ఉంది అంటూ లెటర్ చూయించాను .
హెడ్ మిస్ట్రెస్ : నాదగ్గరకు వచ్చి లాక్కున్నారు – ఇచ్చావుగా ఇక వెళ్లు అంటూ విండో దగ్గరకువెళ్లి మెయిన్ గేట్ దగ్గర షాపులోనుండి ఇద్దరముగ్గురు స్టూడెంట్స్ సిగరెట్స్ కనుక్కోవడం చూసి బాధపడుతున్నారు .
లిస్ట్ రాసుకుని – నిజాయితీ ఉంచుకుని ఇలా బాధపడటం ఏమీ బాగోలేదు మేడం , వాటికి తోడు కాస్త ధైర్యం తోడైతే మీరు కలలు కంటున్న మార్పువైపుకు అడుగులువెయ్యవచ్చు …….
హెడ్ మిస్ట్రెస్ : అవును ఆ ధైర్యమే కావాలి – ఆడదాన్ని ఏమిచెయ్యగలను చెప్పు – కాలేజ్లోని టీచర్స్ స్టూడెంట్స్ కూడా నామాట వినడం లేదు …….
ఘాన్సీ లక్స్మీభాయి ఆడవారే – రుద్రమదేవి ఆడవారే – సరోజినీ నాయుడు విజయలక్ష్మి పండిట్ దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ……. ఇలా చెప్పుకుంటూ పోతే వందలమంది ఆడవారు దేశ స్వాతంత్రోద్యమంలో పోరాడి విజయ శంఖారావం మ్రోగించినవారే …… , మీరు ఎందులో తక్కువ చెప్పండి .
హెడ్ మిస్ట్రెస్ : అవును తక్కువే కాదు – మగవారితోకూడా తక్కువ కాదు ……., అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ……
మీవెనుక పెద్దమ్మ – నేను ఉంటాము , దైర్యంగా ముందుకు దూసుకుపోండి …….
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ …… ఇంతకూ పెద్దమ్మ ఎవరు ? .
మీలాంటి నిజాయితీగా ఉండేవారికి ధైర్యాన్ని ఇచ్చే దేవత – పెద్దమ్మను మనసులో తలుచుకోండి – అడుగు ముందుకువెయ్యండి …….
హెడ్ మిస్ట్రెస్ : ముందైతే నువ్వు లోపలికిరా మహేష్ ……. , పెద్దమ్మా …… కాలేజ్ బాగుకోసం నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని ప్రార్థించి , చీరకొంగును ముందుకు తీసుకుని నడుముభాగంలో చిక్కించుకున్నారు , మహేష్ ….. లిస్ట్ పట్టుకుని ఒక్కొక్కటీ గుర్తుచెయ్యి …….
Yes మేడం …… , మొదటిది షాపువాడు సిగరెట్స్ – మందు – గుట్కా లాంటివి అమ్మకుండా వార్నింగ్ ఇవ్వడం …….
హెడ్ మిస్ట్రెస్ : ఆఫీస్ రూంలో ఉన్న కర్రలలో లావుపాటి రెండు కర్రలను తీసుకుని నాకూ ఒకటి అందించి ” OPERATION college MISSION STARTS ” మహేష్ పదా అంటూ ఘాన్సీ – రుద్రమదేవిలా కదిలారు .
కమింగ్ మేడం అంటూ మేడం వాటర్ బాటిల్ అందుకుని వెనుకే ఫాలో అయ్యాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *