మేడం …… 10th క్లాస్ మీదుగానే వెళ్లడం చూసి ఉత్సాహంతో వెళ్ళాను – విండో దగ్గర ఆగి చూస్తే లోపల ఎవ్వరూలేరు – ఇంటర్వెల్ కదా ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు అంటూ చుట్టూ చూస్తూనే మేడం వెనుక మెయిన్ గేట్ చేరుకున్నాను .
అంతలో ఇంటర్వెల్ అయిపోయినట్లు బెల్ మ్రోగింది – అయినా ఒక్కరూ క్లాస్సెస్ వైపుకు వెళితే ఒట్టు , అధికాదు అన్నట్లు మేడం ముందే నా ఎత్తు ఉన్న స్టూడెంట్ సిగరెట్టు కొనడం చూసి మేడం కోపం పాతాకస్థాయికి చేరుకుంది , స్టూడెంట్స్ ….. సిగరెట్స్ పారేసి బుద్ధిగా క్లాస్సెస్ కు వెళ్ళండి అన్నారు .
హెడ్ మిస్ట్రెస్ – టీచర్స్ చెబితేనే వినలేదు ఇక మీరు చెబితే వింటామా అంటూ మత్తులో తూగుతూ బదులిచ్చారు .
రేయ్ రేయ్ …… వచ్చినది హెడ్ మిస్ట్రెస్ మేడమే రా అంటూ మరొకడు చెప్పాడు .
ఎవరైతే మనకేంటి అంటూ తూగుతూనే బదులిచ్చి సిగరెట్టు అంటించుకున్నాడు .
మేడం …… బుద్ధిగా వెళ్లి ఉన్న కొద్దిపాటి పిల్లలకు పాఠాలు చెప్పుకోండి పాఠాలు అంటూ షాపువాడితోపాటు మరొక నలుగురు అలానే తూగుతూ రాక్షసుల్లా నవ్వుకుంటున్నారు .
మేడం …… ఆ మత్తు సిగరెట్టు వలన వచ్చినది కాదు మత్తుపదార్థాల వలన వచ్చినది – అది ఇంకా ప్రమాదం …… , మత్తుపదార్థాలు కూడా అమ్ముతున్నారు , వీరిని వెంటనే హాస్పిటల్లో చేర్చాలి .
హెడ్ మిస్ట్రెస్ : మత్తుపదార్థాలా …… ? అంటూ కళ్ళల్లో చెమ్మ – కోపం ……
ఇంకా ఆలోచిస్తున్నారు ఏమిటి మేడం – కళ్ళల్లో చెమ్మతో ఉపయోగమేమీ లేదు – మీ వెనుక ముందు …… పెద్దమ్మ – నేను ఉన్నాము .
హెడ్ మిస్ట్రెస్ : పెద్దమ్మను తలుచుకున్నారు , గోడపై కూర్చున్న స్టూడెంట్స్ వైపు కోపంతో చూస్తూ క్లాస్సెస్ కు వెళ్ళమని చెప్పారు .
ఆ కోపాన్ని చూసి సగం మంది వెళ్లారు – సగం మందికి భయం భక్తి లేనట్లు పట్టించుకోకుండా అలానే కూర్చున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : వెళతారు వెళతారు అంటూ షాప్ దగ్గరికి వెళ్లారు ,
షాప్ వాడు : రండి రండి మేడం …… , కాలేజ్ కు హెడ్ మిస్ట్రెస్ గా వచ్చినప్పటి నుండీ నా షాపులో ఏమీ కోనేలేదు – ఇక్కడ అన్నీ ఉన్నాయి అంటూ తేడాగా మాట్లాడుతున్నాడు .
హెడ్ మిస్ట్రెస్ : నేనొచ్చాను కదా ఇక నీ షాప్ ఇక్కడ ఉండదు , కాలేజీకు హాఫ్ కిలోమీటర్ వరకూ సిగరెట్స్ – మందు అమ్మకూడదని తెలియదా ? వాటితోపాటు గుట్కా – మత్తుపదార్థాలు కూడా అమ్ముతున్నావు – వాటివల్ల పిల్లలకు చాలాప్రమాదం , వెంటనే నీ షాప్ మూసేసి వేరే ఎక్కడైనా పెట్టుకుంటే నీకే మంచిది .
షాప్ వాడు : ఆ విషయాన్ని మీ స్టూడెంట్స్ కు చెప్పుకోండి – నా షాప్ ఎక్కడ పెట్టుకోవాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మేడం ముందే పోకిరీలతోపాటి మత్తుమందు సేవించాడు , ఇలాంటిదే మీ స్టూడెంట్స్ ముగ్గురికి ఇచ్చాను అదిగో స్వర్గం చూస్తున్నారు చూడండి అంటూ మళ్లీ రాక్షస నవ్వులు నవ్వుతున్నారు .
ఇంకా ఆలోచిస్తారు ఏంటి మేడం నాకొస్తున్న కోపానికి ……..
హెడ్ మిస్ట్రెస్ : ఇంతవరకూ హెడ్ మిస్ట్రెస్ లా చెప్పాను వినలేదు ఇక ఘాన్సీ – రుద్రమదేవిలా వినపడేలా చెప్పాల్సిందే అంటూ షాప్ వాడి చెవ్వు గువ్వుమనేలా లావుపాటి కర్రతో ఒక్క దెబ్బవేశారు .
గింగిరాలు తిరిగినట్లు మత్తు ఎక్కువై షాప్ లోనే పడ్డాడు …..
మావాడినే కొడతావా ఎంత ధైర్యమే నీకు అంటూ ఏకంగా ఆ నలుగురూ మీదకు వచ్చారు .
మర్యాద మర్యాద …… ఈ కాలేజ్ కే హెడ్ మిస్ట్రెస్ రా మేడం గారు అంటూ మోకాళ్ళు విరిగేలా పాదాలపై దెబ్బలమీద దెబ్బ వేసాను .
నొప్పికి తాళలేక మోకాళ్లపై కూర్చుని దండం పెడుతున్నారు .
ఇంతలో షాపు లోపల పడిన వాడు వెనుకవైపునుండి మేడం మీదకు వచ్చాడు .
మేడం ఊరికే ఉంటారా ….. , పెట్టెలలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ ను అందుకుని పగలగొట్టి వాడివైపుకు చూయించారు .
అంతే వాడు భయంతో మిగితావాళ్ళతో కలిసి మోకాళ్లపైకి చేరాడు .
అంతే గోడపై ఆసక్తితో చూస్తున్న స్టూడెంట్స్ అందరూ అమ్మబాబోయ్ హెడ్ మిస్ట్రెస్ హెడ్ మిస్ట్రెస్ అంటూ క్లాస్సెస్ వైపుకు పరుగులుతీశారు – మత్తుపదార్థాలు తీసుకున్న ముగ్గురు స్టూడెంట్స్ షాక్ లో కదలకుండా భయపడుతున్నారు .
షాప్ వాడు : మాకు రౌడీలు తెలుసు ఒక్క కాల్ చేస్తే వస్తారు .
హెడ్ మిస్ట్రెస్ : రమ్మను రా …… , చూశావా స్టూడెంట్స్ అందరూ బుద్ధిగా ఎలా క్లాస్సెస్ కు వెళ్ళారో …… , నీకు రౌడీలు తెలిస్తే నాకు పెద్దమ్మ తెలుసురా …… మహేష్ ఏమంటావు అంటూ హైఫై కొట్టి , ఇప్పుడు ఇప్పుడు మేడం రాక్షస నవ్వులు నవ్వుతున్నారు .
అంతే కాలేజ్ మొత్తం వినిపించేలా విజిల్ వేసాను .
హెడ్ మిస్ట్రెస్ : బుద్ధిగా వెల్లమంటే వెళ్ళలేదు , ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ల దాకా తీసుకొచ్చావు అంటూ 100 కు మరియు 108 కు కాల్ చేశారు , అటెండర్ గారూ …… వీళ్ళ ముగ్గురి పేరెంట్స్ కు కాల్ చెయ్యండి .
అటెండర్ : అలాగే మేడం అంటూ స్టూడెంట్స్ నెంబర్స్ కోసం ఆఫీస్ రూమ్ వైపుకు పరుగులుతీశారు .
అయ్యబాబోయ్ సెక్యూరిటీ ఆఫీసర్లు అంటూ పరుగులుపెట్టబోయిన ఐదుగురు కదలకుండా మోకాళ్లపై మరొక దెబ్బవేశాము – అడుగుకూడా వెయ్యలేక నేలకొరిగారు ……..
మేడం …… సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేన్తవరకూ ఇక ఎక్కడికీ వెళ్లలేరు .
15 నిమిషాలలో సెక్యూరిటీ అధికారి జీప్ మరియు అంబులెన్స్ ఒకేసారి వచ్చాయి .
మేడం కంప్లైంట్ ఇవ్వడంతో , పిల్లలు చదువుకునే కాలేజ్ ముందు పిల్లలకే మత్తుపదార్థాలు అమ్ముతారా అంటూ మరొక నాలుగు దెబ్బలువేసి జీప్ లోకి ఎక్కించారు – పిల్లలను ….. వారి పేరెంట్స్ తోపాటు అంబులెన్స్ లో హాస్పిటల్ కు పంపించారు . మేడం గారూ …… చాలా మంచిపని చేశారు – నా పేరు విశ్వ SI – మళ్లీ ఎవరైనా ఇబ్బందిపెడితే 100 తోపాటు నాకూ చెయ్యండి అని నెంబర్ ఇచ్చారు , బాబూ ….. నువ్వేంటి అంతపెద్ద కర్ర పట్టుకున్నావు ? .
హెడ్ మిస్ట్రెస్ : ఇంతటి ధైర్యాన్ని ఇచ్చినది ఈ పిల్లాడే సర్ …… , మహేష్ లేకపోయుంటే ఇది ఇలానే కంటిన్యూ అయ్యేది , ఈ క్రెడిట్ మొత్తం మహేష్ కే చెందాలి ……
లేదు లేదు SI సర్ …… , నేను వెనుక ఉన్నాను అంతే ……
SI సర్ : బ్యాక్ స్టేజ్ బుజ్జిహీరో అన్నమాట …… , నా నెంబర్ నువ్వుకూడా ఉంచుకో , గుడ్ గుడ్ బుజ్జిహీరో …… అంటూ భుజంపై తట్టి షాప్ కు సీల్ వేశారు – అయిపోయార్రా మీరు అంటూ వెళ్లిపోయారు .
హెడ్ మిస్ట్రెస్ : యాహూ …… , ఒక్క సమస్య తీరితేనే ఇంత సంతోషంగా ఉంది ఇక కాలేజ్ సమస్యలన్నీ తీరితే ఎంత ఆనందం కలుగుతుందో …… , మహేష్ …… నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమిటి త్వరగా త్వరగా చెప్పు అంటూ దైర్యంగా అడిగారు .
లిస్ట్ చూస్తూ కన్నీళ్లు కార్చిన మా హెడ్ మిస్ట్రెస్ మేడమేనా ఈ మేడం అంటూ ఆశ్చర్యపోయాను .
హెడ్ మిస్ట్రెస్ : అంతా నీవలన మరియు పెద్దమ్మ వల్లనే , పెద్దమ్మను తలుచుకోగానే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది మరి , నాలో ఈ మార్పు చాలా ఆనందంగా ఉంది .
నాకైతే ఆనందంగా లేదు మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ఏమైంది ? .
మీ కోరికలు తీరుతున్నాయి మరి నా దెబ్బ సంగతేమిటి ? – గట్టిగా స్వీట్ దెబ్బవేసి ……..
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో నెవర్ …… , నాలో ఇంత మార్పుకు కారణమైన బుజ్జిహీరోవి నువ్వు – నిన్ను కొట్టడమా …… ? , అది జరగని పని – వేరే ఏదైనా కోరుకో …….
నాకు దెబ్బనే కావాలి , ఇంతకుముందూ చెప్పాను ఇప్పుడూ చెబుతున్నాను – మీనుండి దెబ్బతినే ఇంటికివెళతాను – మీ స్టూడెంట్ గా ఇదే నా ప్రతిజ్ఞ …….
హెడ్ మిస్ట్రెస్ : ప్లీజ్ ప్లీజ్ మహేష్ , అదికాకుండా వేరే ఏమైనా ప్రతిజ్ఞ చెయ్యవచ్చుకదా …….
ఊహూ ……. , మీతో ఎలాగైనా దెబ్బ తింటాను లేకపోతే రేపు ఉదయానికల్లా మీరు కొమ్ములతో నిద్రలేస్తారు .
మేడం ఫక్కున నవ్వేస్తున్నారు ……
ఆఅహ్హ్ ……. నవ్వితే ఎంత బాగున్నారు మేడం అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ …….
థాంక్యూ మేడం …… క్యాన్సిల్ థాంక్యూ క్యాన్సిల్ …… దెబ్బకొడితేనే థాంక్స్ ……
హెడ్ మిస్ట్రెస్ : నిన్నూ అంటూ కట్టి ఎత్తారు .
Yes yes కమాన్ కమాన్ మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో …… అమ్మో కొట్టేసేదానిని – ఇదా నీ ప్లాన్ నెవర్ …… , sorry sorry మహేష్ …… , నిన్ను కొడితే నన్ను నేను క్షమించుకోలేను , ఈ ధైర్యం – సంతోషం నీవల్లనే కదా ……..
దెబ్బ తియ్యదనం లేని sorry లు ఎందుకు మేడం …… ప్చ్ ప్చ్ ……
మేడం నవ్వులు ఆగడం లేదు , మహేష్ నువ్వు ఎప్పుడూ ఇంతేనా ? , చుట్టూ ఉన్నవాళ్లను ఇలానే సంతోషపెడతావా ? .
సంతోషపెట్టాను అంటారు కానీ రుణం తీర్చుకోరు ……. భావ్యమా ? .
హెడ్ మిస్ట్రెస్ : అదితప్ప వేరే ఏదైనా అడుగు మహేష్ ప్లీజ్ ప్లీజ్ ……
మా మేడం నుండి ఎలా తీసుకోవాలో నాకు తెలుసులే మన దగ్గర చాలా కన్నింగ్ ప్లాన్స్ ఉన్నాయి కానీ ముందైతే లిస్ట్ లోని రెండవ సమస్య స్టూడెంట్స్ డిసిప్లిన్ …… , ఎలానో ఆలోచించే ఉంటారుకదా ……
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ అంటూ వివరించారు .
సూపర్ మేడం …… , కాలేజ్ బెల్ కొట్టించి స్టూడెంట్స్ – టీచర్స్ అందరినీ గ్రౌండ్ లోకి రప్పించెయ్యండి …….
హెడ్ మిస్ట్రెస్ : అటెండర్ గారూ …… టీచర్స్ కు విషయం తెలియజేసి లాంగ్ బెల్ కొట్టండి .
అటెండర్ : అలాగే మేడం అంటూ పరుగులుతీసాడు .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ లెట్స్ గో ……
మేడం …… మొత్తం స్టూడెంట్స్ & టీచర్స్ కాబట్టి ఈ బెత్తం కూడా అవసరమౌతుందేమో …….
హెడ్ మిస్ట్రెస్ : Yes yes థాంక్యూ మహేష్ ……
అల్వేస్ వెల్కమ్ మేడం …… , మేడం మరొకమాట ….. SI సర్ చెప్పినట్లు నేను కేవలం బ్యాక్ స్టేజ్ బుజ్జిహీరోని కాబట్టి క్రెడిట్ నాకు ఇవ్వాలని ప్రయత్నించకండి , ఇది మీ లిస్ట్ మీరే పూర్తిచేయాలి – మొత్తం సంతోషం మీరొక్కరే ఆస్వాదించాలి ……
హెడ్ మిస్ట్రెస్ : ఇంత చిన్నవయసులోనే ఇన్ని మాటలు – ఇంత తెలివు – ఇంత అనుభవం ఎలా మహేష్ …… నాకే అసూయపుడుతోంది .
అంటీలు కూడా ఇలానే అడిగారని గుర్తుకువచ్చి ఆనందించాను .
హెడ్ మిస్ట్రెస్ : నాకూ చెబితే నేనూ ఆనందిస్తాను కదా ……
ఏమీలేదు మేడం , ఇలానే నాకిష్టమైన అంటీలు కూడా అడగడం గుర్తువచ్చి సంతోషం కలిగింది ……. , అదిగో టీచర్స్ – స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్ లోకి వచ్చేసారు .
హెడ్ మిస్ట్రెస్ : ఇక నేనేంటో చూయిస్తాను – రా మహేష్ నా ప్రక్కనే ఉండు అంటూ పెద్దమ్మను ప్రార్థించారు .
అదిగో మళ్లీ ….. ఇప్పుడే చెప్పాను – ఇది మీ యుద్ధం – గెలిచేది మీరే – All the best మేడం …… మీటింగ్ తరువాత కలుద్దాము అనిచెప్పి , నా హృదయమంతా నిండిన నెంబర్ 2 కోసం అన్వేషణ మొదలెట్టాను గోలగోలచేస్తున్న గుంపులో ……. , ఎక్కడ ఎక్కడ కనిపించడం లేదే అంతలోనే నా హృదయస్పందన నాకే వినిపించింది అంటే అతిదగ్గరలోనే తను ఉంది అనుకుని చూస్తే ముందువరుసలో ఉంది , తన చిరునవ్వు చూడకపోతే ఆగలేను అన్నట్లు తెగ అల్లరిచేస్తోంది హృదయం ……. , కాస్త ముందుకువెళ్లి అటువైపు నుండి తనకు ఎదురుగా నడిచాను – ఆఅహ్హ్ …… స్వచ్ఛమైన చిరునవ్వులను చూసి హృదయంపైకి ఆటోమేటిక్ గా చెయ్యి వెళ్ళిపోయింది .
Hi ……. అంటూ నావైపు చేతిని కదిలించి నవ్వుతోంది .
అటూ ఇటూ వెనుకకు చూసి నాకేనా …… నాకే నాకే అంటూ చిరునవ్వుతో hi చెప్పి వెనుకకుచేరి ఆఅహ్హ్ …… yes yes అంటూ తెగ ఆనందిస్తున్నాను .
అంతలో నాకోసం అన్నట్లు తిరిగిచూసి , వెనుకే నిలబడి ఉండటం చూసి వెంటనే ముందుకు తిరిగి ముసిముసినవ్వులు నవ్వుకుంటోంది .
క్లౌడ్ నైన్ లోకి వెళ్ళిపోయాను .
నేనెవరో తెలుసుకదా …… మీ హెడ్ మిస్ట్రెస్ .
మేడం గంభీరమైన స్వరానికి మరియు ఇంతకుముందు కాలేజ్ బయట జరిగినది గుర్తుకువచ్చినట్లు , అప్పటివరకూ గోలచేస్తున్న స్టూడెంట్స్ అందరూ సైలెంట్ అయిపోయి మేడం వైపుకు తిరిగారు .
హెడ్ మిస్ట్రెస్ : ముందు వరుసలలో క్రమశిక్షణతో నిలబడటం నేర్చుకోండి – టీచర్స్ మీరుకూడా ……. , PET గారూ …… ఇదేనా రోజూ మీరు నేర్పుతున్నది .
PET : Yes no మేడం అంటూ షాక్ లో ఉండిపోయారు .
హెడ్ మిస్ట్రెస్ : ఎక్కువ సమయం లేదు తొందరగా ……
PET సర్ ఆశ్చర్యపోతూనే వచ్చి , స్టూడెంట్స్ లైనప్ లైనప్ …… అంటూ వరుసలుగా నిలబెట్టారు .
PET గారూ …… 15 నిమిషాలు తీసుకున్నారు , రోజూ స్టూడెంట్స్ కు ఏమి నేర్పిస్తున్నట్లు …… , ఇదే ఫస్ట్ & లాస్ట్ వార్నింగ్ …… రేపు ప్రేయర్లో ఒక్కరు తప్పుగా నిలబడినా మీపై అక్షన్ తీసుకుంటాను .
షాక్ లోనే yes మేడం అనిచెప్పి తలదించుకున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : స్టూడెంట్స్ …… చూసారా ఇప్పుడు చూడటానికి ఎంత బాగుందో , మొదటి తప్పు మాదే – ఇకనుండీ అలా జరగదు , రేపటి నుండి 9AM లోపు స్టూడెంట్స్ – టీచర్స్ అందరూ కాలేజ్ ప్రేయర్లో ఉండాలి , 9:05AM కు కాలేజ్ గేట్ మూసివేయడం జరుగుతుంది , ఏ ఒక్క స్టూడెంట్ గోడలు దూకి రాకూడదు వెళ్లకూడదు క్రమశిక్షణతో మై గేట్ ద్వారానే రావాలి వెళ్ళాలి , ప్రతీ ఒక్క స్టూడెంట్ అందరమూ ఒకటే అని చాటి చెప్పడానికి ఖచ్చితంగా యూనిఫార్మ్ వేసుకునిరావాలి . ఇక టీచర్స్ ……. క్లాస్ బెల్ మ్రోగగానే వారి వారి క్లాసులలో లేకపోతే నోటీస్ పంపించబడును , అటెండర్ గారూ …… మూడు నోటీసులు దాటితే సస్పెండ్ చేస్తున్నట్లు నోటీస్ బోర్డ్ లో అతికించండి – అటువంటి టీచర్స్ పై సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ కూడా ఫైల్ చెయ్యబడును ఎందుకంటే స్టూడెంట్స్ భవిష్యత్తే నాకు ముఖ్యం ……
సూపర్ మేడం గారూ అంటూ గట్టిగా విజిల్ వేసాను .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ …….
మహేష్ అనే స్టూడెంట్ ఇక్కడెక్కడా లేడు హెడ్ మిస్ట్రెస్ ……..
మేడం నవ్వుకున్నారు .
నా ముందున్న నా హృదయస్పందన వెనక్కు తిరిగిచూసి wow సూపర్ అంటూ చేతితో సైగచేసింది .
నో నో నో నాకేమీ సంబంధం లేదు అంటూనే సిగ్గుపడ్డాను .
” Ok ok మహేష్ ……. , నీ పేరు తెలిసిపోయింది ”
నీ పేరుకూడా చెప్పొచ్చుకదా …… అని వినీవినిపించనట్లు అడిగాను .
వినపడినట్లు నవ్వుతోంది .
ఆఅహ్హ్ ………
హెడ్ మిస్ట్రెస్ : ఫైనల్ గా స్టూడెంట్స్ – టీచర్స్ including me …… should ఫాలో డిసిప్లిన్ ……. , ” this is not a first warning – this is last and final warning ” , Now go to your respective classes …….
Its already 1PM హెడ్ మిస్ట్రెస్ – లంచ్ టైం లోకూడా క్లాస్సెస్ కు వెళ్ళాలా ? .
హెడ్ మిస్ట్రెస్ : Sorry sorry మహేష్ – స్టూడెంట్స్ ……. అంటూ నవ్వుకుంటున్నారు .
ఎన్నిసార్లు చెప్పాలి హెడ్ మిస్ట్రెస్ …… ఇక్కడ మహేష్ అనే స్టూడెంట్స్ ఎవ్వరూ లేరని …….
నా నెంబర్ 2 నవ్వు ఆగడం లేదు ……
హెడ్ మిస్ట్రెస్ : Ok ok ……. , ఫైనల్ గా మరొకటి – మధ్యాహ్న భోజనంపై రోజూ కంప్లైంట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ నుండి , ఈరోజుకు మినహాయింపు ఇస్తున్నాను , రేపటి నుండి ఒక్క కంప్లైంట్ వచ్చినా ఊరికే వదలను , డబ్బుకు తగ్గ క్వాలిటీ ఫుడ్ పెట్టాల్సిందే ……. , మీకే చెబుతున్నాను ఒక్క కంప్లైంట్ ఒకేఒక్క కంప్లైంట్ ……
రాదు మేడం అంటూ బదులిచ్చారు .
థాంక్యూ థాంక్యూ థాంక్యూ మేడం అంటూ చప్పట్లు – కేకలు – విజిల్స్ తో గ్రౌండ్ మొత్తం సంతోషాలు వెల్లువిరిసాయి .
