ఇట్లు మోహిత 137

“అయిందా సెలక్షన్”

“నేను అడగాలి. అయిందా మీ ఆఫీస్ పని”

“ఫోన్లో అయింది. ఇక వెళ్ళి చూడాలి”

“ఎలా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్”

“పింక్ కలర్. బ్యూటిఫుల్, ఐ లైక్ థెమ్”

“అయితే తీసుకుంటాను”

“ష్యూర్”

“ఎంత ఇవి”

“18,000 సార్”

“రైట్”

“సార్ మీకు కాఫీ, కూల్ డ్రింక్”

“ఏం వద్దు. మేం వెళ్లాలి”

“ఒక్క పావుగంట ఉందాం. రెండు కూల్ డ్రింక్స్”

“వెళ్లాలి”

“టెన్ మినిట్స్”

కూల్ డ్రింక్స్ వచ్చాయి. తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

“సరే ఇంకేమన్నా కావాలా”

“ఏమీ వద్దు. ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకు కాదు. ఆ అమ్మాయి హారికకి ఇవ్వడానికి”

“ఔనా. నీక్కాదా”

“ఇంత కాస్ట్ పెట్టి నేను కొంటానా, మీకు తెలీదా”

“నిజమే, మరి ఇప్పుడు ఎందుకు కొన్నట్టు”

“ఆ అమ్మాయి అమెరికాలో చదువుకుంది. వాళ్ళ నాన్న కన్నా పెద్ద స్థాయి, అమెరికా సంబంధం, పెళ్లవ్వగానే వెళ్ళిపోతుంది. మీ తరఫున ఇస్తున్న గిఫ్ట్. ఆ అమ్మయికి ఎలా స్థాయి ఉందో, మీకు కూడా ఉంది కాబట్టి ఇంత కాస్ట్”

“నీకనుకున్నాను”

“కాదు”

“సార్ బిల్. క్యాష్ ఆర్ కార్డ్”

“కార్డ్”

పర్స్ నించి కార్డ్ తీసి ఇస్తూ ఉండగా మొబైల్ వైబ్రేట్ అయింది.

స్క్రీన్ మీద కనిపించిన ‘ఆఫీస్ యస్’ అనే పేరు చూసింది మోహిత.

మొబైల్ మీద కనిపించిన పేరు చూసి… “ఆఫీస్ యస్, ఇదేం పేరు”… అడిగింది మోహిత.

“యస్ అంటే సేల్స్, సేల్స్ డిపార్ట్మెంట్. నేను మాట్లాడొస్తాను” అంటూ మళ్ళీ బయటకి వెళ్ళాడు.

వెళ్ళిన భర్త వైపే చూస్తూ… ‘బాగా బిజీ ఉన్నట్టుంది ఈ రోజు’ అనుకుంది.

“మేడమ్ ఇంకేమన్నా కావాలా”… అడిగాడు సేల్స్ మ్యాన్.

“ఏం వద్దు. అంతే”

“ఒకే మేడం. బిల్, ఐటం” అంటూ కవర్ చేతికిచ్చాడు.

కవర్ తీసుకుని బయటకి నడుస్తూ దూరంగా ఫోన్ మాట్లాడుతున్న భర్తని చూడసాగింది.

కాల్ మాట్లాడుతున్న భర్త మొబైల్ చెవి దగ్గర నించి తీసి మొబైల్ని ముద్దుపెట్టుకున్నట్టుగా అనిపించింది.