నిజమైన ప్రేమ! 1

ఇంట్లోకి వచ్చి నీరసం గా కూర్చున్న దేవ్ ను చూస్తూ “ఈ నెలలో రెండో సారి”అంది కోపంగా సుమిత్ర..
“విసిగించకు”అన్నాడు దేవ్..
“మా నాన్న నా గొంతు కోశారు.. మీకిచ్చి పెళ్లి చేసి”అంది..
వాళ్ళు బొంబాయ్ లో చిన్న గదిలో ఉంటున్నారు..
సుమిత్ర ఒక కంపెనీ లో అకౌంటెంట్..
దేవ్ ఒక సేట్ వద్ద అకౌంటెంట్ అని పెళ్ళిచేసరు…సుమిత్ర పెద్ద వాళ్ళు…ఇక్కడికి వచ్చాక మెల్లిగా తెలిసింది…సుమిత్ర కి …
వాళ్ళ ఓనర్ చేసే రెండో రకం బిజినెస్ లో ఈయన ఉన్నాడు అని..
కొడుకు పుట్టాడు అప్పటికే…
అందుకే నోరు మూసుకుని ఉంది..కానీ ఈ నెలలో రెండు సార్లు అరెస్ట్ చేస్తే bail మీద ఉన్నాడు..
“ఇంకో పని చూసుకో”అంది..
“ఇంత జీతం ఎవరు ఇవ్వరు..”అన్నాడు..
****
మూడు నెలల తర్వాత కాండ్ల పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు కొందరినీ అరెస్ట్ చేశారు..దేవ్ వాళ్ళలో ఉన్నాడు..

జైల్ లో ఉన్న దేవ్ ను కలిసింది..సుమిత్ర..
“నీకు నాకు కుదరదు…నీకు పదేళ్లు పడుతుంది శిక్ష అన్నాడు..లాయర్”అంది..
“విడాకుల”అన్నాడు.
“కోర్టు చుట్టూ తిరగాలి…నేను హైదరాబాద్ వెళ్తున్నాను..ఇక నా జీవితం లో నువ్వు లేవు”అని వెళ్ళిపోయింది..
దేవ్ కి పదేళ్ళు పడింది శిక్ష…అది తెలిసిన తర్వాత అతన్ని వదిలేసి..ఉద్యోగం చేస్తూ..కొడుకుని పెంచి పెద్ద చేసింది..
వాడి పేరు..సూరి…పూర్తిగా చిన్నప్పటి నుండి తల్లి క్రమశిక్షణ లో పెరిగాడు..
బుద్ది మంతుడిగా పేరు తెచ్చుకున్నాడు…
సుమిత్ర ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి తీసుకువెళ్ళింది వాడిని..

“ఎరా సూరి ..ఎప్పుడు మాతో తిరగవే”అడిగాడు..ఫ్రెండ్..రావు..
“అమ్మ కి తెలిస్తే బాధ పడుతుంది”అన్నాడు సూరి..
“ఇలా అయితే ప్రపంచం గురించి నీకు ఎలా తెలుస్తుంది”అన్నాడు రావు..
ఇద్దరు డిగ్రీ ఫైనల్ year లో ఉన్నారు..
“అది సరే,,నువ్వు ఎవరో అమ్మాయిని ప్రేమించావు కదా..ఏమైంది”అన్నాడు సూరి.
“Ok అయ్యింది..అది సరే గానీ..నీ సంగతి ఏమిటి..నీకు ఎవరు నచ్చలేదా..”అడిగాడు రావు..
ఇబ్బంది పడుతు “మీనాక్షి అంటే ఇంట్రెస్ట్ ఉంది..కానీ చెప్పాలంటే భయం”అన్నాడు..
“ఎవరు ఫస్ట్ year అమ్మాయి ,,రావు గారి కూతురు… మీనాక్షీ న”అన్నాడు రావు.
“అవును”
“వెళ్లి చెప్పు..”అన్నాడు రావు.
“అమ్మకి ముందు చెప్పి అప్పుడు.చెప్తా”అన్నాడు సూరి.
“అవిడెక్కడో వైజాగ్ లో జాబ్ చేస్తోంది..ఇల్లుకుడ కట్టుకుంది అన్నావు…ఫోన్ లో చెప్తావా”అన్నాడు రావు.
“ఉత్తరం రాస్తా”
సూరి గురించి తెలుసు కాబట్టి…రావు మాట్లాడలేదు..
****
మీనాక్షి లంగా, ఓణీ లో వస్తుంటే చాలా మంది గుండెలు ఆగడం మామూలే..అయితే ఆ కాలేజీ లో ఆమె ఒక్కత్తే కాదు..చాలా మంది అందగత్తెలు ఉన్నారు..
సూరి ఉత్తరం రాశాడు సుమిత్ర కి..
“ఇంటర్ బేస్ మీద ఉద్యోగాలు పడ్డాయి ..ముందు అది చూడు”అని reply ఇచ్చింది..
“చెప్పానా…ఒప్పుకోదు”అన్నాడు సూరి.
రెండు రోజుల తర్వాత క్యాంటీన్ వద్ద కలిసిన మీనాక్షి తో మాట్లాడుతూ రావు..తెగ సైగలు చేస్తుంటే…”ఏమిటి”అంది..
జరిగింది చెప్పాడు రావు…”ఇక మీరు చూసుకోండి..నా లవర్ పిలుస్తోంది”అని వెళ్ళిపోయాడు..
“సో..నేనంటే ప్రేమ..నీకు”అంది నవ్వి..
“ఇంట్రెస్ట్..ఎలాగూ పెళ్లి చేసుకోవాలి కదా..నువ్వు నచ్చావు..”అన్నాడు..
“నాకు నిన్నవొకడు లవ్ లెటర్ రాశాడు”అంది నవ్వుతూ..
***
తర్వాత వాళ్ళు పెద్దగా మాట్లాడుకోలేదు..డిగ్రీ అయ్యేలోపు ఇంటర్ బేస్ మీద మనోడు జాబ్ పట్టుకున్నాడు..
సుమిత్ర ,సూరి వెళ్లి రావు గారి కి విషయం చెప్పారు..
ఆయన గయ్యి మన్నాడు..”నేను lic లో పని చేస్తున్నాను..అల్లుడు కూడా lic లోనే ఉండాలి”అన్నాడు..
“ఇప్పుడు government జాబ్స్ ఎక్కడున్నాయి…”అంది మీనాక్షి..
“నోరు మూసుకో…వాడి కులం ఏమిటి..తండ్రి ఎవరు..ఎవడో వచ్చి..ప్రేమ అంటే నువ్వు కూడా ప్రేమే అంటావా..తోలుతీస్తా”అన్నాడు..
రెండు మూడు రోజులు సూరి,సుమిత్ర బతిమాలాక…మీనాక్షి కూడా “కట్నం లేదుగా”అనడం తో తు తు మంత్రం గా పెళ్లి చేసి చెయ్యి దులుపుకున్నారు రావు దంపతులు..
ఉద్యోగం అదే ఊరిలో కావడం తో డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ కాలేజ్ లో టీచర్ ఉద్యోగం లో చేరింది .కాలక్షేపానికి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *