రంగ తన కూతురు చెప్పింది విని చాలా సంతోషించి సరే చిట్టి తల్లి నీ బట్టలు సర్దుకొని ఉండు నేను నిన్ను రేపు పొద్దునే బండి ఎక్కించి వస్తాను సరేనా అని అన్నాడు..
హిమజ…సరే నాయన అంటూ తన గది లొకి వెళ్ళిపోయింది…
…..పైడితల్లి ఊరి సెంటర్లో కూర్చొని తన వాళ్ళతో మాట్లాడుతూ రేయ్ చెప్పింది గుర్తు ఉంది కదా రేపు ఇక్కడికి వచ్చే అధికారులు మనం చెప్పినట్టే ఊర్లో వాళ్ళకి చెప్పాలి . ఈ చెరువు లో నీళ్ళు తాగడానికి పనికి రావు అని మనం అప్పుడు purification గురించి వాళ్ళ ముందుకు తీసుకొని వస్తాం అని అన్నాడు…
కానీ ఇదంతా ఎందుకు అయ్య మనం ప్రజలను భయపెట్టి కూడా ఈ పని చేయొచ్చు కదా…అని ఒకడు అడిగాడు..
పైడితల్లి…రేయ్ రౌడిజం కి రాజకీయం కి తేడా ఉంది రా మనం మంచి చేస్తున్నాం అని తెలిస్తే ప్రజలు ముందు వెనుక ఆలోచించకుండా మనం చెప్పింది చేస్తారు..అదే దౌర్జన్యం చేసాము అనుకో ఇదిగో నా బావ మీద కంప్లైంట్ ఇచ్చి నట్టు ఇస్తారు అని అన్నాడు…
కానీ అయ్య మీ బావ గారి మీద పిర్యాదు చేసింది మనమే కదా అని ఒకడు అన్నాడు….
పైడితల్లి ..రేయ్ నిజం ఎప్పుడు సమాధి లోనే ఉండాలి బయటకు రాకుడడు ఇలా రా అంటూ వాడిని దగ్గరకి పిలిచి కడుపులో కత్తితో పొడిచాడు..తన మనుషులను చూస్తూ రేయ్ వీడు ఎలా చనిపోయాడు అని అడిగాడు..
ఎద్దు పొడిచింది అయ్య అని అన్నారు అందరూ..
పైడితల్లి..శభాష్ అంటూ సరే రేపటి పనుల గురించి చూడండి అని వెళ్ళిపోయాడు…