సర్పంచ్ గారు….సర్పంచ్ గారు…అంటూ అరుస్తూ కొంత మంది రఘు రామయ్య ఇంటికి వచ్చారు…
రఘు రామయ్య…రేయ్ ఎంది రా పొద్దునే ఎవరి కొంపలు తగలడ్డాయి అని అరుస్తున్నారు .. ఎందీ మందల…
సర్పంచ్ గారు అది..అది.. కొత్త సర్పంచ్ వచ్చేశాడు అయ్య వెనుక మంది నీ వేసుకొని వచ్చాడు.. చాలా బలగం ఉంది వెనుక..
రఘు రామయ్య…ఎవడు రా వాడు నా ఊర్లోకి మందిని వేసుకొని వచ్చే అంత పోటుగాడు ఈరోజు వాడి తల తెగాల్సిందే అంటూ కత్తి తీశాడు .పదండి రా అంటూ ఆ కొత్తగా వచ్చిన సర్పంచ్ ఎవడు అని బయలు దేరాడు..
రఘు రామయ్య తన మనుషలతో కలిసి ఊరి మధ్యలో వచ్చి నిలబడి చూస్తున్నాడు..తనకి ఎదురుగా చాలా మంది అటు వైపు తిరిగి నిలబడి సర్పంచ్ గారు జిందాబాద్ ..అంటూ అరుస్తూ ఉన్నారు . రఘు రామయ్య వాళ్ళని తోసుకుంటూ నాయాల ఏవడ్రా కొత్త సర్పంచ్ అంటూ మద్యలో నిలబడి ఉన్న మనిషి భుజం మీద చెయ్యి వేసి తన వైపు కి తిప్పాడు..చేతిలో పట్టుకుని ఉన్న కత్తి తనకు తెలియకుండానే కింద వదిలేశాడు..
ఆ మనిషి ఎంద్ది బావ ఎవడినో నరకడానికి బయలు దేరి నట్టు ఉన్నావు నన్నే నా అంటూ ఉరిమి చూసాడు…
రఘు రామయ్య రెండు అడుగులు వెనక్కి వేసి గుటకలు మింగుతూ బా..బా..బావ నువ్వా కొత్త సర్పంచ్ అని అన్నాడు..
పైడి తల్లి…హా నేనే జరుగు నా దారికి అడ్డం అంటూ రఘు రామయ్య నీ పక్కకి తోసేసి ముందుకు కదిలాడు…
పైడి తల్లి చుట్టూ జనం సర్పంచ్ గారు జిందాబాద్ .. అంటూ అరుస్తున్నారు…
పైడి తల్లి తన చెల్లి ఇంటికి వచ్చాడు..
అనసూయ..అన్న అక్కడే ఆగు నీకు దిష్టి తీస్తాను ఊరికి అసలైన మగాడు వచ్చాడు అంటూ వేట కోసి దాని నెత్తురు తో దిష్టి తీసి బొట్టు పెట్టింది..
పైడి తల్లి…ఏం చెల్లి ఎట్లా ఉన్నవ్ అంటూ అనసూయ నీ దగ్గర కు తీసుకుంటూ తన వెనుక వచ్చిన రఘు రామయ్య నీ ఏం బావ ఊరిని ఇంటిని కలపకు లోపలికి నడు నీతో సానా మాట్లాడాలి అంటూ అనసూయ తో కలిసి ఇంట్లోకి వెళ్ళాడు..
అనసూయ..అన్నో నీకోసం తలకాయ కూర ఇంకా రాగి సంకటి చేయిస్తున్న నీ తతంగం కానిచ్చుకొని కూడు తినడానికి రా అంటూ వంట గది లోకి వెళ్ళింది..
రఘు రామయ్య..బావ ఎలా ఉన్నవ్ అంటూ పైడి తల్లి నీ పలకరించాడు…
పైడి తల్లి నవ్వుతూ వంట గది వైపు చూస్తూ రఘు రామయ్య నీ కాలితో ఒక తన్ను తనాడు..నాయాల నీకు ఈ ఊరిలో సర్పంచ్ గా కూర్చోబెట్టింది . ఊర్లో ఉన్న ముందలతో కులుకుతావు అని కాదు ఆ చెరువు నీ ఇంకిపోయేలా చేసి నాకు ఇస్తావు అని..
ఆ చెరువులో ఉన్న ఖనిజం నాకు కావాలి అని నీకు చెప్పా కదా అంటూ కింద పడి ఉన్న రఘు రామయ్య గుండెల మీద కాలు వేసి నొక్కుతూ యురేనియం ఆ చెరువు ఉన్న ఏరియా ను బట్టి దాదాపు 10 లక్షల టన్నుల యురేనియం నిల్వలు అక్కడ ఉన్నాయి అని తెలిసి ఈ ఊరి పాత సర్పంచ్ నీ పాతికేళ్ల క్రితం చంపేసి వాడి ప్లేస్ లో నిన్ను సర్పంచ్ గా కుర్చో బెడితే నువ్వు దాని సంగతి వదిలేసి పుకుల చుట్టూ తిరుగుతున్నావు ..ఇక నుండి నేనే ఇక్కడ సర్పంచ్ నువ్వు నా చెల్లి కి మొగుడివి మాత్రమే అంటూ రఘు రామయ్య గుండెల మీద నుండి కాలు తీసి లే లేచి నా బావ లా దర్జాగా కనపడు అందరికీ అంటూ రఘు రామయ్య నీ పైకి లేపాడు…
….వాసుకి ఇంట్లో….
వాసుకి ఊర్లో ఉన్న నీటి సమస్య గురించి అలాగే ప్రజలు పడుతున్న బాధలు ఇంకా కష్టాల గురించి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటూ దాని గురించి ఒక లెటర్ రాస్తూ ఉంది ఈ లోపు బయట గోల గోలగా ఉండే సరికి ఏంటో చూద్దాం అని బయటకు వచ్చింది..
తను ఉంటున్న వీధిలోని జనం అంతా నీళ్ళ టాంకర్ దగ్గర గుమి గూడి ఉండటం చూసి ఆశ్చర్యపోయి విషయం తెలుుకోవడానికి కిందకు వచ్చింది…
వాసుకి నిన్న రాత్రి మాట్లాడిన ఒబులమ్మా నీ పిలిచి విషయం అడుగుతుంది..