వాసుకి… ఒబులామ్మ ఎంటి ఈ నీళ్ళ టాంక్ ఎవరు తెప్పించారు…
ఓబులమ్మా…కొత్తగా వచ్చిన సర్పంచ్ గారు తెప్పించారు పంతులమ్మ .
వాసుకి…కొత్తగా వచ్చిన సర్పంచ్ హా ఎవరు ఆయన..
ఓబులామ్మ…ఆయన పేరు పైడి తల్లి అంట ఈరోజే మన ఊరికి వచ్చారు వస్తూ ..వస్తూ ఈ నీళ్ళ టాంకర్ తీసుకొని వచ్చారు .. మొత్తం ఊరికి వీధికి ఒకటి చొప్పున 30 నీళ్ళ తాంకర్లు పెట్టించారు రోజుకి రెండు పూటలా వస్తాయి అంట ఇంకా మాకు నీళ్లకు అంత దూరం వెళ్ళే బాధ తప్పింది అంటూ నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళింది…
వాసుకి హ్మ్మ్ అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయి తను రాస్తున్న లెటర్ తీసుకొని చూస్తూ దాన్ని చించేసింది…
ఇంట్లో పనులు చేసుకొని మొక్కలకు నీళ్ళు పోస్తూ తన భర్త కి ఫోన్ చేసింది… ఈరోజు అయిన వస్తారా రార అని..
ఇక్కడ ఒక విషయం చెప్పాలి . వాసుకి ఇంకా వాసుదేవ్ విడాకులు తీసుకొని ఉన్నారు కానీ వాళ్ళ కూతురు కోసం కలిసే ఉంటున్నారు..
వాసుదేవ్ ఫోన్ switchoff అని వస్తుంది..సరే లే ఏమి పని లో ఉన్నారో అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి.. తన పని లో తాను ఉంది…
…..సంధ్య ఇంకా సూరజ్ ….
అబ్బా సంధ్య గారు నా మాట వినండి ప్రశాంతంగా ఒక 10 రోజులు ఎటైనా వెల్లివద్దాం అని సూరజ్ అంటున్నాడు..
సంధ్య…అది కాదు సూరజ్ గారు మరి మీ కజిన్ సంగతేంటి..
సూరజ్..అమ్మ కి ఫోన్ చేసి చెప్తాను మేమే అక్కడికి వస్తున్నాం అని సరే నా… అంటూ సూట్కేస్ సర్డుతున్నాడు..
సరే నేను ఇక్కడే ఉంటాను మరి స్టేషన్ లో చాలా పనులు ఉన్నాయి అంటూ సూరజ్ తో సరసాలు ఆడుతూ ఉంది..ఇంతలో ఊహు ఊహు అంటూ ఎవరో దగ్గుతూ క్షమించాలి మీ ఏకాంతం నీ మధ్యలో చెడ గొట్టను అంటూ గొంతు వినిపించేసరికి సంధ్య ఇంకా సూరజ్ గుమ్మం వైపు చూసి ఎవరు మీరు అని అడిగారు..
ఆ వ్యక్తి నన్ను పైడి తల్లి అని పిలుస్తారు .. ఈ ఊరి సర్పంచ్ రఘు రామయ్య కి బావ అవుతాను.. సంధ్య అంటే మీరే కదా అప్పుడెప్పుడో నా చెల్లి అనసూయ చీర నడిరోడ్డు లో విప్పేసారు అంట కదా దాని గురించి మాట్లాడుదాం అని వచ్చాను అంటూ లోపలికి వస్తున్నాడు…
సంధ్య అక్కడే ఆగు అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న తన తీసుకొని గురి పెట్టింది…
పైడి తల్లి…కాలుస్తవా కాల్చు దమ్ముంటే కాల్చు అంటూ ముందుకు వస్తూ చూడు నేను రఘు రామయ్య అంత మెతక అని అనుకుంటే నువ్వు తప్పు చేసినట్టే నా చెల్లి ఏదో చేసింది .. నువ్వు ఏదో చేశావ్ అయిపోయింది అది అలాగే ఉండాలి.. అంతే కానీ మొన్న ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెల్లావ్ అంట కుత్తిక కోస్తా ఇంకో సారి నా వాళ్ళ జోలికి వస్తె అంటూ వెనక్కి తిరిగి వెళ్తూ ఆగి సంధ్య నీ చూస్తూ చూడు నేను ఇదే ఊర్లో ఉంట ఏదో స్టేషన్ కి వెళ్లి duty చేసుకున్నాం నలుగురు చిల్లర గాళ్ళని పట్టుకున్నాము అన్నట్టే ఉండాలి లేదు కాలుస్తా పెలుస్తా అని ఎగిరావో అసలే ఆడదానివి అంటూ వెళ్లిపోయాడు..
సూరజ్ సంధ్య దగ్గరకు వచ్చి సంధ్య గారు ఎందుకు వచ్చిన తలనొప్పి చెప్పండి..ఏదో మీరు జాబ్ చేస్తాను అంటే సంబరపడ్డాను ఇలాంటి రిస్క్ మనకి వద్దు అమ్మ వాళ్ల దగ్గర కు వెళ్లి కొన్ని రోజులు ఉండి వద్దాం అని అన్నాడు..