వాసుకి గ్లాస్ లో వాటర్ నింపుతూ నేను , నా కూతురు మా ఆయన ఉంటారు అంటూ పైడితల్లి నీ చూడకుండానే జవాబు ఇచ్చింది…అయిన ఇవన్నీ మీకెందుకు అంటూ నీళ్ళ గ్లాస్ తీసుకొని వచ్చి పైడితల్లి కి ఇచ్చింది..
పైడితల్లి గ్లాస్ తీసుకుంటూ వాసుకి శరీర కదలికలు గమనిస్తూ మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటా నేను రావడం అంటూ గ్లాస్ పక్కన పెట్టేసి పైకి లేచి నిలబడి సరే నేను వెళ్తున్న.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి..ఈ ఇంట్లో మీరు తప్ప ఎవరూ ఉండరు అని ఇంటి లోపలి పరిస్థతి చూస్తే అర్ధం అవుతుంది..డైనింగ్ టేబుల్ మీద ఒకటే ప్లేట్ ఉంది..హాల్ లో మీ శరీర వాసన తప్ప ఇంకో మనిషి వాసన రావడం లేదు..క్షమించాలి తప్పుగా మాట్లాడితే ఒంటరిగా ఉండటం ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు ఇంట్లోకి పిలిచినందుకు థాంక్స్ నేను వెల్లోస్త్సాను.. sorry మళ్లీ వచ్చే అవకాశం ఉండదు అనుకుంటా అంటూ గుమ్మం దగ్గర నిలబడి హా రేపు ఊర్లో మరమ్మత్తు పనులు మొదలు పెట్టడానికి భూమిపూజ చేస్తున్న ఒక టీచర్ గా పిల్లలను మంచి దారిలో తీర్చిదిద్దే మీకంటే గొప్పవాళ్ళు ఈ ఊర్లో నాకు ఎవరు కనిపించలేదు..అందుకే మొదటి ఆహ్వానం మీకే చెప్తున్న మన ఊరి లింగయ్య సెంటర్ లో రేపు పూజ కార్యక్రమం మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు…
….రఘు రామయ్య కి ఏమి తోచడం లేదు అతను తప్పుడు పనులు చేసిన తనని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయలేదు . అంత ఎందుకు మొన్న రెండు రోజుల క్రితం హిమజ తల్లి అయిన సీత ను కూడా తన గదిలోకి పిలవడానికి కారణం పెళ్ళీడు కు వచ్చిన అమ్మాయి నీ ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకుంటావు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టేది లేదా అని చెప్పి తన భార్య అనసూయ కి తెలియకుండా డబ్బు సహాయం చేయడానికి మాత్రమే రఘు రామయ్య కి ఉన్న భయం ఒకటే ఊర్లో ప్రజలు తన గురించి ఏమి అనుకున్న పర్వాలేదు కానీ తనని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచే జరగాలి.అందుకే సంధ్య విషయం లో కూడా ఎన్నడూ హద్దు దాటలేదు హా తన వొంటిని తాకేవాడు అది కూడా సంధ్య ఇష్తం తోనే ఇప్పుడు కూడా హిమజ జీవితం నాశనం అవ్వకూడదు అని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు….
రఘు రామయ్య కి అనసూయ కి మధ్య గొడవలు ఏమి లేవు కానీ ఇద్దరు కలిసి ఒకే గది లో ఉండరు దాని గురించి ఇంట్లో వాళ్ళు , పని చేసే వాళ్ళు ఎప్పుడు అడిగింది లేదు..
రంగ ( హిమజ నాన్న).. నాటు సారా తీసుకొని వచ్చి రఘు రామయ్య కోసం వెనుక పెరట్లో ఎదురు చూస్తున్నాడు..ఇంతలో రఘు రామయ్య వచ్చాడు..
రంగ…ఎంటి అయ్య గారు మీకు మనసు బగలేకపోతే కదా నాటు సారా అడుగుతారు ఇప్పుడు ఏమైంది మీ బావ గారు గురించ అని అడుగుతూ సీసా చేతికి అందించాడు..
రఘు రామయ్య…అదేం కాదు రా రంగ మా అమ్మ కి ఈ మధ్య వొంట్లో అసలు బాగుండటం లేదు అక్కడ తనని చూసుకోవడానికి ఎవరు లేరు.. తనని ఇక్కడికి వచ్చి ఉండమంటే నా దగ్గర కు వచ్చి ఉండటానికి ఇష్ట పడదు ఏమి చేయాలో అర్థం కావడం లేదు రా తనని చూసుకోవడానికి ఎవరిని అయిన అక్కడ పెట్టాలి . బాగా నమ్మకం ఉన్న వాళ్ళని అంటూ సీసా లేపాడు..
రంగ…హ్మ్మ్ పెద్దమ్మ గారు మీ మీద ఇంకా కోపం గానే ఉన్నారు . పోనీ ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరిని అయిన ఆమె దగ్గర కు పంపించండి అయ్య అంటూ ఉప్పు చేప ఇచ్చాడు..
రఘు రామయ్య…ఉప్పు చేప ముక్క తింటూ హా కానీ ఎవరు ఉన్నారు రా అని అడిగాడు..
రంగ…మీరు ఏమి అనుకోను అంటే నా కూతురు నీ అక్కడికి పంపిస్తాను .. హిమజ కి కూడా పెద్దమ్మ గారు అంటే చాలా ఇష్టం అయ్య చిన్నప్పుడు ఆవిడే కదా తనని చూసుకుంది.
రఘు రామయ్య…వద్దు రా రంగ పెళ్ళీడు కు వచ్చిన అమ్మాయి నీ అల ఒంటరిగా వేరే చోట ఉంచడం మంచిది కాదు..నేను ఎవరిని అయిన సర్దుబాటు చేస్తాలే..
రంగ…అయ్యో పర్వాలేదు అయ్య మేము మీ ఉప్పు తిని బ్రతికే వాళ్ళం ఇలా అయిన కాస్త మీ రుణం తీర్చుకునే భాగ్యం కలిగింది మాకు అని అన్నాడు..
రఘు రామయ్య…సరే రంగ రేపు ఉదయం 5 గంటలకు రైలు ఉంది కదా ఆ బండికి పంపించు కానీ ఈ విషయం మా ఆడదానికి తెలియకూడదు దానికి మా అమ్మ అంటే అసలు నచ్చదు అని చెప్తూ సీసా ఖాళీ చేశాడు..
రంగ…హా సరే అయ్యా నేను సీతా కు కూడా చెప్తాను అమ్మగారికి ఈ విషయం చెప్పొద్దు అని అంటూ సరే అయ్య మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పాడు …..